టి హెచ్ ఆర్ అడ్వాన్స్ గిఫ్ట్…!!
-పది విద్యార్థుల కు కెసిఆర్ డిజిటల్ కేంటెంట్
-సాంకేతిక పరిజ్ఞానం తో మేధస్సు కు పదును
-స్కూల్ లో స్పెషల్ స్టడీ, ఇక ఇంట్లో డిజిటల్ స్టడీ..
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాగ సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శం గా నిలుస్తుంది.. అదే స్ఫూర్తి తో విద్యారంగం లో అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచింది.. నేటి యువతరం డిజిటల్ , మొబైల్ వైపు విశృంఖలంగ విస్తరిస్తోంది.. ఆదిశగా మాజీ మంత్రి హరీష్ రావు గత సంవత్సరం ఫలితాలను రెట్టింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత సంవత్సరం నుండి డిజిటల్ కంటెంట్ రూపం లో జిల్లా లోని పదవ తరగతి విద్యార్థుల కు బుక్స్ పంపిణి చేశారు. అదే స్ఫూర్తి తో ఈ సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గం లోని పదవ తరగతి విద్యార్థుల కు హరీష్ రావు ఇవ్వనున్నారు. ఒక వైపు ఉత్తరం మరో వైపు పాఠశాల లో ప్రత్యేక తరగతులు వీటితో పాటు సరికొత్త కార్యక్రమానికి హరీష్ స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక తరగతులతో పాఠశాల లో చదువుతే.. ఇంట్లో ఉండి చదివేల వారి మేధస్సు ఇంక పదును పడేలా ” డీజిటల్ స్టడీ ” అనే వినూత్న కార్యక్రమానికి గత రెండు సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టారు . త్వరలో నియోజకవర్గం లోని అన్ని ప్రభుత్వ పాఠశాల లో చదివే 2500 మంది విద్యార్థుల కు అందజేయనున్నారు. సిద్దిపేట జిల్లా పదవ తరగతి ఫలితాల్లో గత ఐదు సంవత్సారాలుగా రాష్ట్రంలో నే అగ్రస్థానం లో నిలిచింది అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానం లో నిలిచేల గత నెల నుండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసారు. విద్యార్థుల తల్లీ తండ్రులకు నేరుగా ఉత్తరం వ్రాయడం తో పాటు వారి ని ఇంటి వద్ద చదివించెల తల్లి తండ్రుల్లో మరియు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేల కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.
” కెసిఆర్ డిజిటల్ కంటెంట్.. టి హెచ్ ఆర్ గిఫ్ట్ “..
– డిజిటల్ కంటెంట్ గత రెండు సంవత్సరాల మెరుగైన ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా డిజిటల్ కేంటెంట్ ఇచ్చి వారు స్కూల్ నుండి వెళ్ళాక ఇంట్లో కూడా అర్థం కానీ పాఠాలు చదివేల హరీష్ రావు ఈ కార్యక్రమం చేపట్టారు. గత రెండు సంవత్సరాలనుండి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.. కెసిఆర్ డిజిటల్ కేంటెంట్… టి హెచ్ ఆర్ గిఫ్ట్ తో… పది విద్యార్థుల కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అడ్వాన్స్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.. కొద్దీ రోజుల్లోనే ఆల్ఫాహారం ప్రారంభం కానుంది. అదే పంథాలో వారిలో మరింత మేధస్సు పదును పెట్టాలి పదవ తరగతి వారి భవితకు ఎంతో పునాది అని ఆ దిశగా పై చదవులకు ఈ పదవ తరగతి స్పూర్తి కావాలని వారు పాఠశాల లోనే కాదు ఇంటి వద్ద కూడా చదువు కొనే ఒక కొత్త కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపారు.