తెలంగాణ మెట్టమొదటి మహిళా సిఎస్ గా శాంతి కుమారి
హైదరాబాద్: 11 యదార్థవాది ప్రతినిది
తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం నియమించారు. సిఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు…ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేసి. మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, మిల్క్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపనిచేశారు. నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా, ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శాంతికుమారి సేవలందించారు.