ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: మెదక్ జిల్లా భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. శుక్రవారం పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు కౌన్సిలర్లు, కో కన్వీనర్ కృష్ణ గౌడ్, నాయకులు కలసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, అసమానతలు, వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ సృష్టికర్త, న్యాయ కోవిదుడు, రాజ్యాంగం ద్వారా దేశానికి దశ, దిశ చూపిన మహానుభావుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వంజరి, జయరాజ్, ఆర్కే, శ్రీనివాస్ భీమరి కిషోర్,మాజీ కౌన్సిలర్లు సోహెల్, పట్టణ కోకన్వీనర్.జుబేర్ అహ్మద్, నాయకులు మహమ్మద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.