మరోమారు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ
గడువు పొడిగింపు: జిల్లా కలెక్టర్
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
*58, 59 క్రింద భూ క్రమబద్ధీకరణకు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.
అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న పేదప్రజల ఇల్లు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ 30 వరకు మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పట్రిక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇల్లు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు 2014 జూన్ 02 కటాఫ్ తేదీ ఉండగా దానిని 2020 జూన్ 02 కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 17వ తారీఖున ఉత్తర్వుల సంఖ్య 29ను జారీ చేసి నూతనంగా భూ క్రమబద్దికరణకు దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించిందని మీ సేవా ద్వారా ఏప్రిల్ 30 లోపు ఎలక్ట్రిసిటీ బిల్లు రిసిప్ట్ ఇంటి పన్ను రసీదు ఇతర సంబంధిత పాత్రలతో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.