30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్విహారయాత్ర కు సర్వం సిద్ధం.. పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం...

విహారయాత్ర కు సర్వం సిద్ధం.. పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం…

ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రాలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. కొంతకాలంగా పాపికొండల యాత్ర నిలిచిపోయింది. అయితే తే.గీ గోదావరి నదిలో బోటు షికారు చేయాలనుకునే పర్యాటకులకు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆదివారం నుండి ఇ బోర్డ్ ప్రారంభం కానుంది. టూరిజం పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ హరి కిరణ్ సమావేశం నిర్వహించారు. బోటు ఆపరేటర్లు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ రూట్ ఆపరేటర్లు పాటించాల్సిందే నిబంధనలు కలెక్టర్ వివరించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా.. శనివారం ట్రయల్ రన్ చేశారు. యాత్రకు పేరంటలపల్లి నుండి స్థానిక లాంచీలు ఆదివారం నుండి బయలుదేరి వెళ్లనున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందురద మాతృశ్రీ గండి పోచమ్మ టెంపుల్ నుండి విహార యాత్ర కు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలపై విశ్వాసం పెంపొందించే దిశగా డ్రై రం ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. పర్యాటకుల భద్రత, భరోసా కల్పించాలని అధికారులకు ఆదేశించారు. నిబంధనలు పాటిస్తూ, పరిమితికి మించి బోటు లో ఎక్కించుకో కూడదని.. బోట్లో ఎల్లప్పుడు లైవ్ జాకెట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు పాటించండి బోటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. అలాగే లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు.
కుచ్చు లూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ యాత్ర ప్రారంభం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్