కల్హేర్ మండలం నాగదర్ శివారులో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. నిన్న రాత్రి గ్రామ సమీపానికి రెండు కిలోమీటర్ల దూరంలో లేగా దూడను చంపి తిన్నది. పంట పొలాలు చేతికి రావడంతో కుప్పల దగ్గర రైతులు రాత్రి పూటా కూడా ఉండాల్సి వస్తుంది. దీంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు, అధికారులు రక్షించాలని కోరుతున్నారు.