23.7 C
Hyderabad
Wednesday, July 2, 2025

మీడియా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతుంది

మీడియా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతుంది

-వాస్తవానికి దూరంగా న్యాయస్థానం స్పందన

-గత బీ ఆర్ ఎస్  ప్రభుత్వం వల్లే జర్నలిస్టులకు అన్యాయం

-తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 30 ; నల్గొండ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో ప్రెస్ క్లబ్ కార్యక్రమాలను కొనసాగించడానికి నల్గొండ ప్రెస్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా జర్నలిస్టులు ఎదురు చూస్తన్న ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు దిగ్భ్రాంతి కలిగించింది.. ఐఏఎస్, ఐపిఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమానంగా జర్నలిస్టులను చూడడం నివ్వెరపరిచిందన్నారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై కమిటీ రిపోర్ట్ అందజేసిందని, హెల్త్ కార్డులపై భీమా కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు..  

జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీపై సుప్రీం కోర్టు తీర్పు పై..

గత పదేళ్లుగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇళ్లస్థలాల సమస్యను కొలిక్కి తీసుకువస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ దేశంలో ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేల సరసన జర్నలిస్టులను చేరుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరినీ నివ్వెరపరిచింది. జర్నలిస్టులు ఏరకంగానే ఆ కోవలోకి వచ్చే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు అటువంటి వైఖరి తీసుకుంది అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఐపిఎస్, ఐఏఎస్ అలిండియా అధికారులకు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా ఒకే రీతిలో జీతబత్యాలు ఉంటాయి. అదే విధంగా పార్లమెంట్ సభ్యులకు దేశవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎన్నికైనా.. ఒకే రీతిలో వేతనాలు ఉంటాయి. అలాగే ఎమ్మెల్యేలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మేరకు అందరికీ ఒకే విధంగా వేతనాలు ఉంటాయి.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తులు అర్థం చేసుకోని అంశం ఒకటి ఉంది. ఈ దేశంలో జర్నలిస్టులు అందరికీ ఒకే విధంగా వేతనం అమలులో లేదు. జాతీయ స్థాయి పత్రికల్లో పనిచేసే వారికి, ప్రాంతీయ భాష పత్రికల్లో చేసే పాత్రికేయులకు, చిన్న, మద్య పత్రికల్లో పనిచేసే వారికి వేతన వ్యత్యాసం చాలా ఉంది. పాకిస్తాన్ కంటే ఆధ్వాన్నంగా భారతదేశంలో పాత్రికేయులకు వేతనాలు అమలు తీరు ఉంది. 15 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి అమలు జరపాలని ఇచ్చిన నోటిఫికేషన్.. కేవలం 22 శాతం జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్టులకు మాత్రమే అమలు కావడం సిగ్గుచేటైన విషయం. అమలు చేయాల్సిన ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. అమలును చూడాల్సిన అంశాలను న్యాయస్థానాలు చొరవ చూపడం లేదు. అటువంటి న్యాయస్థానాలు జర్నలిస్టులను అలిండియా అధికారులతో సమానంగా చూడడం బాధాకరం. వాస్తవదూరంగా ఈ తీర్పు ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం జవహార్ లాల్ హౌజింగ్ సొసైటీకో, తెలంగాణకో సంబంధించినది కాదు.. ఇది భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. జర్నలిస్టు మిత్రులు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. ఈ తీర్పును కచ్చితంగా వ్యతిరేకించాలి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదించాము. ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై అడ్వకేట్ జనరల్ తో చర్చలు జరుగుతున్నాయి. సుప్రీం తీర్పు వాస్తవాలను ప్రతిభింభించేది కాదు.. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ఇచ్చింది కాదని బావిస్తున్నాము. ఈ తీర్పు ఎంతవరకు వర్తిస్తుంది అనేదానిపైనా న్యాయనిపుణులతో చర్చిస్తున్నాము.  16, 17 ఏళ్ల తర్వాత ఒక చీఫ్ జస్టీస్ ఇచ్చిన తీర్పుపై మరో చీఫ్ జస్టీస్ తీర్పు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. సొసైటీపై తీర్పు వెలువడిన వెంటనే రెండు సంవత్సరాల క్రితమే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకే దీనిపై ప్రభుత్వం స్పందించింది. జర్నలిస్టులకు ఇళ్ల సమస్య మీద విశ్లేషించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది..

 అక్రిడిటేషన్ కార్డుల జారీ పై..

“గత ప్రభుత్వంలో రూపొందించిన నియమ నిబంధనలు న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయని రెండు పర్యాయాలు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ నిబంధనలు రాజ్యాంగానికి, భావ స్వేచ్ఛకు వ్యతిరేకమని హైకోర్టు చెప్పింది. ఆ నిబంధనలు రామచంద్రమూర్తి కమిటీ ఇచ్చిన సిఫార్సులకు భిన్నంగా ఉన్నాయి. భాషా ప్రాతిపదికన అక్రిడిటేషన్ ల జారీలో తారతమ్యాలు చూపవద్దని, చిన్న పత్రికల పేరుతో తగ్గించడం భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం అని కోర్టు వెల్లడించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవరించడానికి, ఉన్న సమస్యలను అర్థం చేసుకొని తాజా నిబంధనలు రూపొందించడానికి నెలన్నర కిందట ప్రభుత్వం స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆరు సార్లు సమావేశమై ఒక నివేదికను ప్రభుత్వానికి (కమిషనర్ కు) అందజేసింది. ప్రభుత్వం దానిని ఆమోదిస్తే జనవరిలో కొత్త కార్డుల జారీకి చర్యలు ప్రారంభమవుతాయి.

జర్నలిస్టులకు హెల్త్ కార్డుల జారీపై..

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హాయాంలో జర్నలిస్టులు కొంత మేర భరిస్తే మూడు వంతులు ప్రభుత్వం భరించి హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వం ఉద్యోగులకు, జర్నలిస్టులకు కలిపి ఒకటే జీవో విడుదల చేసింది. దాని ప్రకారం 700 కోట్ల పైన బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ప్రయివేటు కార్పోరేట్ ఆసుపత్రులు జర్నలిస్టులకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి మీడియా అకాడమీ తరుపున ఒక ప్రతిపాదన చేశాము. గతంలో జర్నలిస్టుల నుంచి కొంత చెల్లించే విధానాన్ని తీసుకవస్తే బావుంటుందని పరిశీలిస్తున్నాము. 75 వేల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కంపెనీలతో సంప్రదిస్తున్నాము. ప్రిమీయం చెల్లించిన రోజు నుంచే అన్ని చికిత్సలు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నాము. గతంలో వివరాలు పరిశీలిస్తే.. దాదాపు 40 శాతం కంటే తక్కువ మంది వినియోగించుకున్నట్లు గుర్తించాం. మంత్రి గారితో సంప్రదించాము. తుదిదశలో చర్చలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మా తెలిపారు. ఇక జర్నలిస్టులపై దాడులపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందించిన శ్రీనివాస్ రెడ్డి రోజురోజుకు మీడియా పై దాడులు పెరుగుతున్నాయంటే జర్నలిస్టుల నడుమ నెలకొన్న అనైక్యతే కారణమని అభిప్రాయపడ్డారు. మీడియా యాజమాన్యాల పాలసీల పేరుతో జర్నలిస్టులు సైతం అన్యాయాలను ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారని తెలిపారు. చాలా విషయాల్లో ప్రజలకు వాస్తవాలను సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నాయని.. అయితే అక్కడ కూడా కొన్ని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నమాట వాస్తవమని అన్నారు. మీడియా అనేది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల పరిధిలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం జర్నలిస్టులకు సంక్షేమం అందించడం వరకే పరిమితం అని తెలిపారు. అనంతరం మొదటిసారి ప్రెస్ క్లబ్ కు విచ్చేసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని ప్రెస్ క్లబ్ కార్యవర్గం శాలువతో సత్కరించి, జ్నాపికను అందజేశారు.

25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మెదక్, యదార్థవాది ప్రతినిధి: ఆదర్శ 1997 1999 బ్యాచ్ 25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు ఆదర్శ కాలేజ్ లెక్చరర్స్ మేనేజ్మెంట్ పాల్గొనడం జరిగింది.. పాల్గొని అప్పుడు చదువుకునే టప్పుడు చదువులు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండేవి. అంటూ ముచ్చడిచ్చుకోవడం, లేడీస్ అండ్ జెంట్స్ స్పీచ్ ఇస్తూ ఒక్కరి గురించి మాట్లాడారు. అలాగే అప్పటి మధుర జ్ఞాపకాలు అన్నిటిని గుర్తు చేసుకుంటూ.. ఆదర్శ కాలేజీ లోనే ఇదే మొదటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జకరుపుకోవడం ఇదే మొదటి సరి జరుపుకోవడం అని ఆదర్శ అప్పటి మేనెంజ్ మెంట్ రంగాచారి సింహ్మారెడ్డి నరేందర్ సార్ మిగితా లెక్షలర్ తెలియజేస్తూ ఈ బ్యాచ్ వాళ్ళు జరుపకోవడం అదృష్టం అన్నారు గురువులు మన పట్ల చదువుకునే చేదువుకొనేందుకు ఎంత కృషి చేశారు ఏ విధంగా ప్రయత్నించారని అంశాలను ముచ్చటించుకుంటూ 1997-1999 బ్యాచ్ మధుర మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 25 సంవత్సరాల పూర్వ సమ్మేళనాన్ని విజయవంతం  చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరు ఎంపీసీ. బైపిసి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

మహానేతకు ఘన నివాళి 

మహానేతకు ఘన నివాళి 

-ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.

మిర్యాలగూడ, యదార్ధవాది ప్రతినిధి, డిసెంబర్ 27 : దేశానికి ముందుచూపుతో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన  మహా వ్యక్తి  మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని  స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  అన్నారు. డా. మన్మోహన్ సింగ్  అకాల మరణానికి సంతాపం ప్రకటిస్తూ స్థానిక రాజీవ్ భవన్ లో  వారి చిత్ర పటానికి పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా నెహ్రూ  తర్వాత వరుస గా 10 ఏళ్లు ప్రధానిగా చేసిన ఘనత మన మన్మోహన్ సింగ్ దని, 1990 లో మన దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోతున్న సమయంలో ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ ఐ ఈ జూనియర్ కళాశాల లో

హెచ్ ఐ ఈ జూనియర్ కళాశాల లో

ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

నల్గొండ, యదార్ధవాది ప్రతినిధి, డిసెంబర్ 26 : వికారాబాద్ కేంద్రంగా నడుస్తున్న హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజీలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఎస్ఎస్సి చదువుతున్న విద్యార్థుల నుండి కోరారు . ఈ విద్యార్థులు డిసెంబర్ 15వ తారీఖు నుంచి 15 జనవరి 2025 వరకు ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని హెచ్ ఐ ఈ డైరెక్టర్ జావిద్ హూద్ తెలిపారు. గత 13 సంవత్సరాల నుండి నాణ్యమైన ప్రమాణాలతో, విద్యను అందిస్తున్నటువంటి అత్యుత్తమమైన విద్యాసంస్థ హెచ్ ఐ ఈ అని తెలియజేశారు. ఈ కళాశాలలో కుల మతాలకు అతీతంగా విద్యార్థులదరికీ ప్రవేశాలను ఆన్లైన్ పరీక్ష ద్వారా చేపడుతున్నామని జావిద్ హూద్ తెలిపారు. ఆన్లైన్ పరీక్షలు పాస్ అయిన విద్యార్థులను మెరిట్ ప్రకారము ఎంపీసీ , బై .పీసీ మరియు ఎం ఈ సి కోర్సులలో అడ్మిషన్లను కల్పించి ఉచిత వసతి, భోజన మరియు విద్యను అందిస్తున్నామని అన్నారు. ఇంటర్ విద్యతో సహా జె ఈ ఈ , మెయిన్స్ , నీట్ , ఈపసెట్ , ఐఐటీ ల కు ప్రత్యేక కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కాలేజీలో అడ్మిషన్ పొందడానికి ఆన్లైన్ రాత పరీక్షలో మెరిట్ పొందడంతో పాటు ఎస్ఎస్సి పరీక్షలో జీపిఏ 9.3 పాయింట్స్ పొందిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని డైరెక్టర్ తెలియజేశారు. ఆన్లైన్లో ఉచిత దరఖాస్తు మరియు పరీక్ష కోసం హెచ్ ఐ ఈ సంస్థ వారి వెబ్సైట్ www.hieset.in ను దర్శించవలసిందిగాఈ పేర్కొన్నారు. విద్యార్థుల కోసం క్రీడలు, వ్యక్తిత్వ వికాసం వంటి అదనపు సౌకర్యాలు హెచ్ ఐ ఈ క్యాంపస్ లో అందుబాటులో ఉంటాయని జావిద్ హూద్ తెలియజేశారు. మరింత సమాచారం కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జ్. నిరంజన్ అలీ ని సెల్ 9866556886.సంప్రదించాలని పత్రికా ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు సర్వం సిద్ధం

సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు సర్వం సిద్ధం

డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు జరగనున్న పోటీలు

ఏర్పాట్లు పూర్తి చేస్తున్న తెలంగాణ  స్పోర్ట్స్ అథారిటీ

తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో..

మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో..

 పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది

మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు

 గ్రామస్థాయి, మండల స్థాయి మరియు  జిల్లా స్థాయి పోటీలు పూర్తిచేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణం లో నిర్వహించుకోబోతున్నాం. ఇందులో పాల్గొంటున్న దాదాపు రెండు లక్షల మంది కి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోంది. ఈ క్రీడల్లో పాల్గొని క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. వివక్షతకు తావు లేకుండాపారా క్రీడాంశాలో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కపోటీలో మరో ప్రత్యేకత  ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ 2024 విజయవంతం చేయడంలో యావత్తు తెలంగాణ క్రీడా సంఘాలు, పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు  స్వచ్ఛంద సంస్థలు పలువురు క్రీడాభిమానులు పాలుపంచుకుంటున్నారు.

మేకపై చిరుత దాడి అనేది కట్టుకథ 

మేకపై చిరుత దాడి అనేది కట్టుకథ 

-సంఘటన స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు 

లేవు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్

యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 25 : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మాయాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతం లో గుట్ట వద్ద గొర్రెల మందపై పులి పిల్ల దాడి చేసి మేక పిల్లను గాయపరిచిందని  గ్రామానికి చెందిన గొర్ల కాపరి జింకల పోతన్న తెలిపారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామ శివారులో గల గుట్ట వద్ద పులి తన గొర్ల మందపై దాడి చేసిందని ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో గుట్టపై పులి అడుగుజాడల ఆన వాళ్లను వెతుకగా ఎక్కడ కూడా పులి ఆడవాళ్లు కనిపించలేదని తెలిపారు.  మేకపై దాడి చేసింది వేరే  జంతువు అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇకపైనుండి గొర్ల కాపరులు తమ గొర్లను అటవీ ప్రాంతంలోకి మేపడానికి తీసుకువెళ్లద్దని హెచ్చరించారు. అలాగే రైతుల కూడా తమ పంట పొలాల వద్ద పంటను రక్షించేందుకు విద్యుత్ తీగలను అమర్చవద్దని వాటి ద్వారా అడవి జంతువులు విద్యుత్ షాక్ తో మృతిచెందితే రైతుల పైన అటవిశాఖ యాక్ట్ కింద చర్యలు చేపడతామని తెలిపారు.

హోం మంత్రి అమిత్ షా బేషరతుగా  క్షమాపణ చెప్పాలి 

హోం మంత్రి అమిత్ షా బేషరతుగా  క్షమాపణ చెప్పాలి 

అంబేద్కర్ అవార్డు గ్రహీత ఇరుగు రాళ్ల శ్రీనివాస్

కమాన్ పూర్ యదార్థవాది డిసెంబర్ 21: పార్లమెంటులో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించే విధంగా ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా బేషరతుగా  క్షమాపణ చెప్పాలనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు గ్రహీత సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కేంద్ర కమిటీ సభ్యుడు కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన ఇరుగు రాళ్ల శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మధ్యన అంబేద్కర్ అనే పదం ఫ్యాషన్ అయిపోయిందంటూ హేళనగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. దేశ శాంతి భద్రతులకు  విఘాతం కలిగించే విధంగా ప్రసంగించినందుకు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంబేద్కర్ పై ఎటువంటి కామెంట్లు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని ఎంపీ పదవికి రాజీనామా చేయాలని లేనిపక్షంలో  అంబేద్కర్ వాదుల కోపాగ్నికి బలి అయితావు అని హెచ్చరించారు.

రామానుజన్ జయంతి వేడుకలు.

రామానుజన్ జయంతి వేడుకలు.

కమాన్ పూర్, యదార్థవాది డిసెంబర్ 21 :

కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఆపిల్ కిడ్స్ పాఠశాలలో గణిత మాంత్రికుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చదువువెంకటరెడ్డి రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు గణిత ప్రాజెక్టు వర్క్ చేసుకొని వివిధ గణితంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ చేసుకొని రావడం జరిగింది అనంతరం పాఠశాల లోగణిత బోధన చేస్తున్నటువంటి శ్రీమతి రాజమణి పాఠశాల కరస్పాండెంట్ మరియు ఉపాధ్యాయ బృందం శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల బృందం భూలక్ష్మి గౌతమి జేబా ఫౌజియ చామంతి రజిత పాల్గొన్నారు.

పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

బెల్లంపల్లి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 18: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కన్నాల బస్తీ లో తన ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నడని నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్సు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ లచ్చన్న పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను, నిర్వాహకుడు రవి ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 10,610/- రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లి 1 పట్టణ పోలీస్ కు తరలించారు.

వ్యవసాయ కార్మికులకు 12000 పథకాన్ని ప్రారంభించాలి

వ్యవసాయ కార్మికులకు 12000 పథకాన్ని ప్రారంభించాలి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 17: ఎన్నికల సందర్భంగా వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని ధర్మ బిక్షం భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం( బి కే ఎం యు అనుబంధం) జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశానికి హాజరైన మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా అట్టడుగున ఉన్న వ్యవసాయ కార్మికులకు సరైన సహకారం ప్రభుత్వ నుంచి అందాల్సిఉందని దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న వారు అనేకమంది వ్యవసాయ కార్మిక కుటుంబాలకు చెందిన వారేననిఅన్నారు. నేటికీ ఇండ్లు లేక సరైన వైద్యం లేక వారి పిల్లలకు సరైన విద్య అందక అవస్థలుపడుతున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో అసంఖ్యాకంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటిన వ్యవసాయ కార్మికులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ అందించాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 700 రూపాయల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందించాలని ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వ్యవసాయ కార్మికులకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని, ఇళ్ల స్థలము లేని వ్యవసాయ కార్మికులకు స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 12 వేల రూపాయలు రెండు దఫాలుగా కాకుండా ఒకే దఫాలో చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రేమిడాల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, గౌరవాధ్యక్షుడు ఎండి ఎక్బాల్, స్టాలిన్, జడ వెంకన్న పాల్గొన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...