38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

రాష్ట్రంలో 53 బార్లకు వేలం

రాష్ట్రంలో 53 బార్లకు వేలం

అమరావతి, యదార్థవాది ప్రతినిధి:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్‌శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

 నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ.

 ఈ నెల 22వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు.

23న దరఖాస్తులను పరిశీలిస్తారు… 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ వేలం నిర్వహిస్తారు.

 ఎంపికైన వారికి అదే రోజు అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు.

సమస్యల సుడిగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం

సమస్యల సుడిగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం

*అవినీతి అక్రమాలతో కాంగ్రెస్ పాలన పతనం
*రేవంత్ ది పూటకో మాట రోజుకు డైవర్షన్
-వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 16:
స్కామ్లు, స్కీములు, అవనితి, అక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. గజ్వేల్ లో సోమవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి పూటకో మాట మార్చుతూ రోజుకు డైవర్షన్ అనుసరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలన్నీ సగానికి పరిమితం చేస్తూ ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని, రుణమాఫీకి సగం నిధులను కేటాయించి సగం మంది రైతులను నట్టేట ముంచిందన్నారు. గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు లేక పారిశుద్ధ్యం ఇతర నిత్యవసర పనులకు ఆటంకం ఏర్పడినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో 67 లక్షలు మంది రైతులకు 49 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయవలసి ఉండగా రూ 20 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని మరో 29 వేల కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉందని తద్వారా సగం మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. పెట్టుబడి సహాయం ఇంకా ఊసేయలేదని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ 2500 ఇస్తామని ఇంకా అమలుకు నోచుకోలేదని, వృద్ధులకు, ఒంటరి మహిళలకు రూ 4000 పెన్షన్ పెంచుతామని ఇప్పటివరకు పెంచలేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. గురుకులాల్లో సరైన ఆహారం అందించకపోవడంతో పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో మృతి చెందడం, అనేకమంది విద్యార్థులు అస్వస్థత గురవడం దారుణం అన్నారు. రేవంత్ సర్కార్ లక్షల కోట్ల అప్పుచేసి ప్రజల నెత్తిన రుణభారం పెంచుతుందన్నారు. పత్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నామ్కే వాస్తే ప్రారంభించి రైతులను సమస్యలకు సుడిగుండంలో నెట్టిందన్నారు. బోనస్ ధాన్యముకు బోనస్ సరిగా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఫైలు కదలాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందేనని అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పరిపాలన మరోసారి చరిత్రలో నిలుస్తుంది అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు ప్రజల పనుల కోసం కమిషన్ లు నొక్కుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకోసారి ఢిల్లీకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

అక్షర ఫౌండేషన్ కార్యవర్గం ఎన్నిక

అక్షర ఫౌండేషన్ కార్యవర్గం ఎన్నిక

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 15:

అక్షర ఫౌండేషన్ సూర్యాపేట కార్యవర్గం 2025 ఎన్నికలు అక్షర ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులుగా ఉప్పు నాగయ్య’ ప్రధాన కార్యదర్శిగా రుద్రంగి కాళిదాసు, కోశాధికారిగా యాస శృతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి తెలిపారు. అక్షర ఫౌండేషన్ 2008 సంవత్సరంలో స్థాపించామని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గం ఎన్నికలు ఉంటాయని, ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. మా అక్షర ఫౌండేషన్ విద్య,వైద్య, క్రీడా, సాంస్కృతిక,సామాజిక, పర్యావరణ రంగాలలో సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశంలో నరాల తిరుమలరెడ్డి, నెల్లుట్ల పాపయ్య, వై.సుభాష్ చంద్రబోస్, వీర్లపాటి వెంకన్న, సోల్లేటి ఉపేంద్ర చారి, షేక్ నజీర్ బాషా, మడూరి హనుమాచారి, కె సైదులు ధరావత్ లకుపతి, ధరావత్ వీరాసింగ్, రాచకొండ నాగయ్య, మద్ది వినయ్ రెడ్డి షేక్ యూసఫ్, అనుమల వెంకటేశ్వర్లు మొదలగువారు పాల్గొన్నారు.

ఘనంగా సహస్ర గళ గీతార్చన

ఘనంగా సహస్ర గళ గీతార్చన

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి,  డిసెంబర్ 15: గీతా జయంతిని పురస్కరించుకుని దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  ఆదివారం స్థానిక రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు వెయ్యి మంది భక్తులచే సామూహిక గీతా పారాయణం సహస్ర గళ గీతార్చన ఘనంగా జరిగింది. గత సోమవారం నుండి శనివారం వరకు వివిధ దేవాలయాల్లో సామూహిక భగవద్గీత పారాయణాలు నిర్వహిస్తూ ముగింపుగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి అనుగ్రహ భాషణ మిస్తూ సర్వమానవాళికి దిశా నిర్దేశం చేస్తూ మానవజాతి సర్వతోముఖాభివృద్ధికి కులమతాలతో సంబంధం లేకుండా ప్రబోధించిన గొప్ప తత్వ గ్రంథమే భగవద్గీత అన్నారు అంతటి పరమోత్కృష్టమైన భగవద్గీతను ప్రతి ఒక్కరూ విధిగా ఇంట్లో ఉంచుకొని అధ్యయనం చేయవలసిందిగా కోరారు. ఐక్యవేదిక అధ్యక్షులు నల్లాన్ చక్రవర్తుల  వేణుగోపాలాచార్యులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించబడి, దేవనాథ జీయర్ స్వామి వారిచే సామూహిక గీతా పారాయణం జరిగింది అనంతరం జిల్లా స్థాయిలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక కన్వీనర్లు నాగవల్లి ప్రభాకర్ పర్వతం శ్రీధర్ కుమార్, ముఖ్య అతిధి కర్నాటి రవి, బ్రహ్మ దేవర సోమయ్య మురళీధరాచార్యులు రామానుజాచార్యులు నాగవల్లి దశరథ గట్ల సోమయ్య, గుండా రమేష్, దేవులపల్లి ప్రశాంతి, అండాల్డ్ గోష్టి సభ్యులు గోవింద మాల భక్తులు వివిధ దేవాలయాల బాధ్యులు సుమారు 1200 మంది భక్తులు ఈ సామూహిక గీతా పారాయణంలో పాల్గొన్నారు.

స్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలి 

స్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలి 

సూర్యాపేట యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 15: స్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలను ఆదుకోవాలని పిసిసి నాయకులు సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి తెలిపారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బేబీ మూన్ స్కూల్ లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సహకారంతో  ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజలకు జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించుకుండే ఆర్థిక స్తోమత ఉండదని,ఒక రక్త పరీక్ష చేయించాలన్న సుమారు 200 రూపాయలు ఖర్చు వస్తుందని, ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లయితే ప్రజలు  ఎక్కువగా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాదు యశోద ఆసుపత్రికి చెందిన 13 మంది వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ నందు బిపి, సుగర్, ఇసిజి, కార్డియాలజి, బోన్ స్కానింగ్ , స్త్రీలకు సంబంధించిన వ్యాధి పరీక్షలు  పేదలకు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. గతంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన సతీమణి వరూధిని దేవి జ్ఞాపకార్థం జిల్లాలో పెద్ద ఎత్తున  కంటి పరిక్షలు నిర్వహించి, కంటి ఆపరేషన్ లను ఉచితంగా నిర్వహించారని అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిటెక్  మూడో సంవత్సరం చదువుతున్న  పేద విద్యార్ది మందడి రోహిత కు లాప్ టాప్ ను అందజేశారు. హెల్త్ క్యాంప్ కు సహాయంగా స్ధానిక వ్యాపారి యామా ప్రభాకర్ 15 వేల రూపాయల మందులను ఉచితంగా అందివ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ ఆలి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, కరీమ్ బేగ్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, కోదాడ ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంపటి వెంకటేశ్వరరావు, రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, అధ్యక్షులు గోదాల రంగారెడ్డి, ఉపాధ్యక్షులు సునీల్ రెడ్డి, కోశాధికారి చిలుముల శ్రీనివాస రెడ్డి, సభ్యులు కట్కూరి చంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి, సైదిరెడ్డి, వెన్న వెంకటరెడ్డి, దండ వెంకటరెడ్డి, కాకి మల్లారెడ్డి, సూరం అనిల్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలో 108  సేవలు ప్రారంభం

మండల కేంద్రంలో 108  సేవలు ప్రారంభం

వెల్దుర్తి/మాసాయిపేట, యదార్థవాది, డిసెంబర్ 15: మెదక్ జిల్లా నూతనంగా ఏర్పాటు అయినటువంటి మాసాయిపేట మండలానికి నూతన 108 అంబులెన్స్ వాహనము కేటాయించిన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వైద్య శాఖ మంత్రి  దామోదర రాజానర్సింహా నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సంక్షేమం ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ అంతరించు సమయంలో పార్టీ బరువు బాధ్యతలు ఒంటెద్దు భుజాన పై వేసుకొని కాంగ్రెస్ పార్టీ నీ కాపాడుకునే దయంగా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మెలిసి ఉంటూ గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడిన నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజి రెడ్డికి కలుపుగోలుగా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఇదే స్ఫూర్తి తో అతి తొందరలో మరి ఇయొక్క మండలాన్ని నూతన కార్యాలయాలతో సకల సౌకర్యాలతో కూడినటువంటి ఎంపీడీవో తాసిల్దార్ కార్యాలయం ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రి పోలీస్ స్టేషన్  ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పి వాటిని ప్రజలకు వీలైంత తొందరలో మండల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో మండల ఏర్పాటు నిర్లక్ష్యం జరిగిందని కేవలం రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అధికారాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం వేలాలని ఉద్దేశంతోనే మాసాయిపేట మండలాన్ని రెవెన్యూ మండలంగా కేటాయించారని ఆ రెవెన్యూ మండలం కూడా నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చొరవతోనే రెవెన్యూ మండలంగా ఏర్పాటు అయిందని, తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరిగినటువంటి ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే నేడు మాసాయి పేట మండలం సకల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కావడానికి ఆవుల రాజిరెడ్డి ముఖ్య కారకుడని అతని అడుగుజాడల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఏకమై కాంగ్రెస్ పార్టీ ప్రజపాలనను ఏర్పాటు చేసుకొని అన్ని రంగాలలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ముందుకు సాగాలని మాసాయిపేట మండలంలో ఆవుల రాజిరెడ్డి జన్మించడం మండల ప్రజలకి గర్వకారణమని అతను మునుముందు ఎన్నో మాసాయిపేట మండలానికి అభివృద్ధి పనులను తీసుకురావాలని మాసాయిపేట మండలం చిన్నది అయినా కూడా అభివృద్ధిలో జిల్లాలో ప్రధమ స్థానం వచ్చేలా ఆయన వెంట ఉంటూ మాసాయిపేట మండల ప్రజలు సహకరించాలని నేను కోరుకుంటున్నానని మాసాయిపేట మండల ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న అతని దృష్టికి తీసుకువెళ్తే సునాశంగా పరిష్కరించి మన సమస్యలను తీర్చగల మహానుభావుడని ఆయన అన్నారు

ఇమాంపేట స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణం

ఇమాంపేట స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణం

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్,14: ఇమాంపేట  కస్తూర్బా గాంధీ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల లో  స్ప్రెడ్ ఇండియా మరియు సువెన్ ఫార్మా సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటి  ద్వారా  7లక్షల రూపాయల వ్యయంతో  ప్రహారీ గోడ, ప్లే గ్రౌండ్ నిర్మాణానికి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శనివారం  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్ప్రెడ్ ఇండియా ద్వారా ఇమాంపేట కస్తూరిబా పాఠశాల విద్యార్దినులకు తమ స్వంత ఖర్చులతో పది లక్షల రూపాయల వ్యయంతో  పరుపులను అందించామని అన్నారు. స్కూల్ బిల్డింగ్ ప్రహారీ గోడ, ప్లే గ్రౌండ్ నిర్మాణానికి సహకరించిన సువెన్ ఫార్మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.  పాఠశాల నందు అదనపు గదుల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ రూపొందించి, అనుమతి కోసం ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు షఫి వుల్లా, వెలుగు వెంకన్న, ఎడ్ల గంగా భవాని, నాయకులు ముదిరెడ్డి రమణా రెడ్డి, గట్టు శ్రీనివాస్,  జ్యోతి కరుణాకర్, రమేష్ నాయుడు,  డాక్టర్ రామ్మూర్తి యాదవ్, కుంచం అంజయ్య, ధర్మా నాయక్,  వల్దాసు దేవేందర్,  నిమ్మల వెంకన్న, ఫరూక్, బైరబోయిన శ్రీనివాస్,  విద్యాశాఖ అధికారి పూలన్, స్కూల్ స్పెషల్ ఆఫీసర్ నారాయణమ్మ, సువెన్ ఫార్మా ప్రతినిధులు పాల్గొన్నారు.

తల సేమియా కోసం రక్తదాన శిబిరం

తల సేమియా కోసం రక్తదాన శిబిరం

ఆర్మూర్, యదార్ధవాది ప్రతినిధి, డిసెంబర్ 14: నిజానాబాద్ జిల్లా ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గంగాదేవి యూత్ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో తల సేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొమ్ముల వినోద్ రెడ్డి, మంగళారపు భూమేష్ లు మాట్లాడుతూ చిన్నపిల్లల కోసం యువత ఎప్పుడు ముందుకు వచ్చి రక్తదానం చేసి వారి పానాలను కాపాడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట ప్రదీప్, కేకే వెంకట్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మేకల ప్రవీణ్, సాయి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా దొంగను పట్టుకున్న రవాణా శాఖ  పోలీసులు

మహిళా దొంగను పట్టుకున్న రవాణా శాఖ  పోలీసులు

ఆర్మూర్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆర్మూర్ బస్టాండ్ లో ఆర్మూర్ నుండి అనిత అనే మహిళ బిచ్కుంద వెళ్లడానికి బస్సు ఎక్కుతున్న క్రమంలో డొంకేశ్వర్ గ్రామానికి చెందిన భూమ అనే మహిళ అనిత యొక్క పర్సు, ఫోన్ దొంగిలించడం జరిగింది. దొంగతనాల విషయంలో అప్రమత్తంగా ఉన్న పోలీసులు చాకచక్యంగా దొంగతనం చేస్తున్న భూమా అనే మహిళను పట్టుకొని బాధితురాలికి దొంగిలించిన సొత్తును అందించడం జరిగింది. దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ ఎన్ .రాజశేఖర్, సిహెచ్ ప్రశాంత్ ని పలువురు అభినందించడం జరిగింది.

విద్యార్థుల శ్రేయస్సు కోసమే కాంగ్రస్ ప్రభుత్వం

విద్యార్థుల శ్రేయస్సు కోసమే కాంగ్రస్ ప్రభుత్వం

 -రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14:  విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా కామన్ డైట్ కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు  కొండ సురేఖ అన్నారు. శనివారం నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు.  ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి  మంత్రి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 80 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 21,680 మంది  అన్ని ప్రభుత్వ,సంక్షేమ,రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక ద్వారా ముందుకు పోతుంది అన్నారు. డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు ప్రారంభోత్సవం విద్యార్థుల నాణ్యమైన పౌష్టికాహారానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.. విద్యార్థులకు ప్రభుత్వపరంగా ఉచితంగా  యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు అందించామన్నారు.  విద్యార్థిని విద్యార్థులు, చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో నిలవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలను, 200 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందన్నారు. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా  విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. డైట్ చార్జీల గురించి వివరిస్తూ మూడో తరగతి నుండి ఏడవ తరగతి చదువుకునే విద్యార్థులకు 950 ఉన్న డైట్ చార్జీలను 1330కి పెంచడం జరిగిందన్నారు, 8వ తరగతి నుండి పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు 1160 ఉన్న డైట్ చార్జీలను 1540కి పెంపు చేయడం జరిగింది అన్నారు ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు చదువుకునే  విద్యార్థులకు 1500 రూపాయలు ఉన్న డైట్ చార్జీ ఇప్పుడు 2,100 పెంచడం జరిగిందన్నారు, కాస్మోటిక్ ఛార్జీల గురించి వివరిస్తూ 8వ తరగతి నుండి పదవ తరగతి చదువుకునే 11 సంవత్సరాల బాలికలకు 55 నుండి 175 రూపాయలు పెంపుదల చేసినట్లు వివరించారు, మూడో తరగతి నుండి ఏడవ తరగతి చదువుకునే బాలురకు హెయిర్ కటింగ్ చార్జీలు  62 రూపాయల నుండి150 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు, ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి చదువుకునే 11 సంవత్సరాలు దాటిన బాలురకు హెయిర్ కటింగ్ చార్జీలు  62 రూపాయల నుండి 200 రూపాయలు పెంచడం జరిగిందన్నారు . కాస్మోటిక్ డైట్ చార్జీల పెంపుతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం, కనపడిందని వివరించారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఇకనుండి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని, కొత్త డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలిస్తారని అన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...