28.7 C
Hyderabad
Tuesday, April 14, 2026

జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

మెదక్ గ్రూప్-2 పరీక్షకు16 కేంద్రాల్లో 5885 అభ్యర్థులు  

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, యదార్థవాది ప్రతినిధి. డిసెంబర్ 14: మెదక్ గ్రూప్-2 పరీక్షకు16 కేంద్రాల్లో 5885 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం, మెదక్ జిల్లాలో గ్రూప్ టు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు  చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, మెడికల్ కిట్, బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలను పర్యవేక్షించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. తరగతి గదుల్లోని బెంచీలపై అతికించిన హాల్ టికెట్ ల నంబర్ లను అత్యంత జాగ్రత్తగా, సక్రమంగా ఉండే విధంగా సరిచూసుకోవాలన్నారు. అలాగే బ్లాక్ బోర్డుపై అభ్యర్థుల సీటింగ్ వివరాలు, పరీక్ష కేంద్రాల ముందు సూచిక వివరాల వంటి అంశాలపై సంబంధిత అధికారులను సూచనలు చేశారు. అభ్యర్థులు తికమక పడకుండా పరీక్ష కేంద్రాన్ని సూచించే విధంగా ఫ్లెక్సీ, బ్యానర్ లను సరైన విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు నాలుగు పేపర్ల వారీగా ఈ పరీక్ష జరగనుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో మొత్తం (5855) మంది అభ్యర్థులు (16) పరీక్ష కేంద్రాల్లో ఈ గ్రూప్-2 పరీక్షకు హాజరుకానున్నట్లు వివరించారు. మెదక్ నియోజకవర్గంలో 11 పరీక్షా కేంద్రాలకు గాను 3,769 విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, నర్సాపూర్ నియోజకవర్గంలో 03 సెంటర్లకు గాను 1511 మంది, తూప్రాన్ లో 02 సెంటర్లకు గాను 575 మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పరీక్ష సమయానికి పోలీస్ సెక్యూరిటీ పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. అలాగే గ్రూప్-2కు హాజరయ్యే అభ్యర్థులందరికీ జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా గ్రూప్-2 హాల్ టికెట్ లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్షార్థులు హాల్ టికెట్ ను ఏ4 సైజ్ పేపర్ లో కలర్ ప్రింట్ తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ పై అభ్యర్థులు తమ తాజా పాస్ పోర్టు ఫోటోను అతికించాలన్నారు. డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ పై ఫోటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ తో మూడు పాస్ పోర్టు ఫోటోలతో పాటు వెబ్ సైట్ లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్ కు అందించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, అభరణాలు ధరించరాదని సూచించారు. మెహిందీ, తాత్కాలిక టాటూలను వేసుకోరాదని స్పష్టం చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్ ను, బ్లూ (లేదా) బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు.పరీక్ష సమయ పాలనకు సూచికగా ప్రతీ అర్థగంటకోసారి బెల్ మోగుతుందని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9908696575 టోల్ ఫ్రీ  నంబరులో సంప్రదించి, వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.

25న ఉపరాష్ట్రపతి పర్యటన

25న ఉపరాష్ట్రపతి పర్యటన

-ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: కృషి విజ్ఞాన కేంద్రం ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా  పరిపాలన అధికారి రాహుల్ రాజ్ శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్, తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. ఈనెల 25న మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి  రానున్నారని  విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలు వివరాలు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు

అర్బన్ పార్కును ఏకోటూరిజంలను ఏర్పాటు చేస్తాం

అర్బన్ పార్కును ఏకోటూరిజంలను ఏర్పాటు చేస్తాం

అటవి పర్యావరణ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ

వెల్దుర్తి /నర్సాపూర్, యదార్థవాది, డిసెంబర్ 14: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ సమీపంలో గల అర్బన్ పార్క్ నకు అటవీ  పర్యావరణం  దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ పర్యటించారు ఆమెను అర్బన్ పార్క్ వద్ద స్వాగతం పలికి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గురుస్వామి అశోక్ గౌడ్  మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించడం జరిగిందని నర్సాపూర్ అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని  ఏకో టూరిజం ఏర్పాటు చేస్తామని అర్బన్ పార్కులు పర్యాటకులు అధిక సంకలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు నరసాపూర్ నగర సమీపంలో ఉన్న అడుగులు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయని అర్బన్ పార్కులో పచ్చడి చెట్లు వాచ్ టవర్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేయడంలో పర్యాటకులు సందర్శిస్తూ మంచి వాతావరణంలోని ఆస్వాదిస్తారని ఇలాంటి వాతావరణాన్ని తాను సందర్శించడం ఎంతో సంతోషకరమని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం మంత్రిగారికి నర్సాపూర్ పురపాలక సంఘానికి గత ప్రభుత్వంలో మంజూరై నిధులు  టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 30.95 లక్షలు ఎస్ డి ఎఫ్ నిధులు 25 కోట్లు మంజూరు చేయుటకు అవసరమగు చర్యలు తీసుకొనుటకు గాను వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి  రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్గా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ డీఎఫ్ఓ జాజి ఆర్డీవో భూపాల్ రెడ్డి ఎమ్మార్వో శ్రీనివాసరావు కమిషనర్ రామకృష్ణారావు  ముఖ్య నాయకులు కార్యకర్తలు  మున్సిపల్ సిబ్బంది నర్సాపూర్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఒక దేశం, ఒకే ఎన్నికకు..టీడిపి పూర్తి  మద్దతు

ఒక దేశం, ఒకే ఎన్నికకు..టీడిపి పూర్తి  మద్దతు 

జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

అమరావతి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే జరుగుతాయని టీడిపి అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు.. శనివారం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ త్వరలో పార్లమెంటు ముందుకు తెస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక టిడిపి పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. భారతదేశంలో ఒకే రోజు అన్ని రాష్ట్రాల నుండి ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయాన్ని అందరూ ఏకీభవించాలని  టిడిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయని, ఎన్నికలు ఒకే రోజున నిర్వహించడం వల్ల అభ్యర్థులు, పార్టీలు సమగ్ర ప్రచారం చేయడానికి అవకాశాలు పెరుగుతాయని, జామిలి ఎన్నికతో ఆర్థిక ప్రయోజనం ఎన్నికల నిర్వహణకు ఖర్చులు కూడా తగ్గుతాయని, దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు జరగడం వల్ల, ప్రభుత్వం ముందు పడ్డ అంశాలపై చాలా ప్రభావవంతంగా పని చేయగతయని, అయితే, ఈ విధానం వల్ల వ్యతిరేకంగా పలువురు రాజకీయ పార్టీలు ఇతర వ్యక్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.. కాని మా పార్టీ విషయంలో మాత్రం ఓకే దేశం ఓకే ఎన్నికకు పూర్తి మద్దతిస్తున్నామని ఆయన తెలిపారు..

లోక్ అదాల‌త్ ద్వారా సత్వర న్యాయం

లోక్ అదాల‌త్ ద్వారా సత్వర న్యాయం

జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి..

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: సిద్దిపేట జిల్లా న్యాయస్థానంలో దేశ అత్యున్న‌త న్యాయ స్థానం ఆదేశాల మేర‌కు నిర్వ‌హిస్తున్న లోక్ అదాల‌త్ ల ద్వారా బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం ల‌భిస్తుంద‌నే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందని జిల్లా జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. శనివారం లోకదాలత్ నిర్వహించడం జరిగిందని, బాధితుల‌కు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం ప‌ని చేస్తోంద‌ని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ లోక్ అదాలత్ లో సివిల్, క్రిమినల్ కేసులు, భార్యభర్తల కేసులు, కుటుంబ తగాదాలు, మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు, బ్యాంకు, ఫైనాన్స్, చిట్ఫండ్ కేసులు  ఇతర కెసులలో ప్రజలు కక్షి దారులు తమ పెండింగ్ లో ఉన్న రాజీ చేసుకునే అవకాశం ఉన్న కేసులలో రాజీ కుదుర్చుకుని కేసులను సత్వరంగా రాజీ కుదుర్చుకోవాలని కోరారు, జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని అభ్యర్థించారు. లోక్ అదాలత్ లో ఎక్కువ మొత్తంలో కేసులను రాజీ కుదుర్చుకోవాలని కోరారు. ఈ లీగల్ సెల్ అథారిటీ సెక్రెటరీ స్వాతి రెడ్డి న్యాయమూర్తి, ఏసిపి మధు, లీగల్ సెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

మహిళపై చిరిత దాడి

మహిళపై చిరిత దాడి

అదిలాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14 : ఆదిలాబాద్ జిల్లా  బజార్హాత్నూర్ మండలం డెడ్రా  గ్రామంలో అర్క భూంబాయి అనే మహిళ పై చిరుత పులి దాడి చేసి గాయపర్చిన ఘటన పట్ల మంత్రి సురేఖ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. అటవీశాఖ పిసిసిఎఫ్ డోబ్రియాల్ తో ఫోన్ లా మాట్లాడి చిరుత దాడికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. మహారాష్ట్రకు సరిహద్దుగా వున్న ఈ గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం గ్రామం చివరకు వెళ్ళిన మహిళ పై చిరుత దాడి చేసినట్లు పిసిసిఎఫ్ మంత్రికి తెలిపారు. ఈ చిరుత మహారాష్ట్ర సరిహద్దు నుండి ఆదిలాబాద్ లోకి ప్రవేశించినట్లు తెలిపారు. పశువుల మంద మేత మేస్తున్న సమయంలో వాటి పై దాడి చేయబోయిన చిరుత, మహిళ కదలికలను గుర్తించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు పిసిసిఎఫ్ మంత్రి సురేఖ గారికి వివరించారు. గాయపడిన మహిళలను వెంటనే ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని డాక్టర్లు తెలిపినట్లు పిసిసిఎఫ్ మంత్రికి వివరించారు. ఇప్పటికే వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించినట్లు స్పష్టం చేశారు. చిరుత దాడి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, చిరుత కదలికల పై నిఘా పెట్టాలని మంత్రి సురేఖ పిసిసిఎఫ్ ను ఆదేశించారు.

లోక్ అదాల‌త్ ద్వారా స‌త్వ‌ర న్యాయం

లోక్ అదాల‌త్ ద్వారా స‌త్వ‌ర న్యాయం

జిల్లా కోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి

విశాఖపట్నం, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: దేశ అత్యున్న‌త న్యాయ స్థానం ఆదేశాల మేర‌కు నిర్వ‌హిస్తున్న లోక్ అదాల‌త్ ల ద్వారా బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం ల‌భిస్తుంద‌ని, ఇలాంటి వేదిక‌ల‌ను క‌క్షిదారులు త‌ప్ప‌క‌ సద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా కోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, నాల్గో అదనపు, సెషన్స్ జడ్జి ఎం. నాగేశ్వరరావు  పేర్కొన్నారు. బాధితుల‌కు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం ప‌ని చేస్తోంద‌ని గుర్తు చేశారు. జాతీయ లోక్ అదాల‌త్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం స్థానిక కోర్టు ప్రాంగ‌ణంలోని న్యాయ సేవాస‌ద‌న్ వ‌ద్ద శ‌నివారం జ‌రిగింది. జిల్లా కోర్టు ఇన్చార్జి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. రాజ్యాంగ ఫ‌లాలు అంద‌రికీ అందాల‌న్న‌దే న్యాయ వ్య‌వ‌స్థ అంతిమ‌ ల‌క్ష్యమ‌ని, ఆ దిశ‌గా న్యాయ‌మూర్తులు సేవ‌లందిస్తున్నార‌ని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితుల‌కు అండ‌గా నిలుస్తూ న్యాయ స‌హాయం అందిస్తోంద‌ని గుర్తు చేశారు. లోక్ అదాలత్ లాంటి వేదిక‌ల్లో పౌర శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి పరిధిలోని రాజీకాగలిగిన కేసులు, మోటారు ప్రమాదాల కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పరిష్కారానికి వ‌స్తాయ‌న్నారు. ప్రభుత్వ సంస్థలు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థ‌లు, కక్షిదారులు ఇలాంటి వేదిక‌లను సద్వినియోగం చేసుకోవాలని ఈ సంద‌ర్భంగా హిత‌వు ప‌లికారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఎం.వి. శేష‌మ్మ‌, శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ జి. వల్లభ నాయుడు, ఫ్యామిలీ కోర్టు జ‌డ్జి కె. రాధార‌త్నం, బార్ అసోసియేష‌న్ కార్యదర్శి డి. నరేష్ కుమార్, ఇత‌ర న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు, కోర్టు అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ పర్యటన

నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ పర్యటన

వెల్దుర్తి /మాసాయిపేట, యదార్థవాది, డిసెంబర్ 13:

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గంలో పర్యటించ నున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు కొండ సురేఖ  విచ్చేస్తున్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ  శనివారం ఉదయం 10:00 గంటలకు నర్సాపూర్ లోని అర్బన్ పార్క్ ను సందర్శిస్తారని, అనంతరం 12:00 గంటలకు హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాయ్స్ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని ఆవుల రాజిరెడ్డి  తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉదయం 9 గంటలకు అర్బన్ పార్క్ వద్దకు చేరుకోవాలని ఆయన పత్రిక ప్రకటనలో తెలిపారు.

గ్రూప్ 2 పరీక్షలకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు

గ్రూప్ 2 పరీక్షలకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు

-జిల్లా అదనపు ఎస్పి నాగేశ్వరరావు

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 13: గ్రూప్-2 రాత  పరీక్షకు జిల్లా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా అదనపు ఎస్పి నాగేశ్వరరావు అన్నారు. ఈ నేల 15, 16 న జరిగే గ్రూప్-2 రాత  పరీక్షకు సూర్యాపేట పట్టణంలో 30, కోదాడ పట్టణంలో 19, పరీక్ష కేంద్రాలు ఉన్నాయని ఈ కేంద్రాల వద్ద  163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలని, పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుంపులుగా చెరవద్దని ఆయన అన్నారు. గ్రూప్-2 రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని, అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లడానికి అనుమతి లేదని, పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద  తనిఖీలు నిర్వహించే పోలీసులకు సహకరించగలరని, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాలకు సమయానికి రావాలని, ఇబ్బంది పడకుండా ముందురోజే పరీక్షా కేంద్రాల పూర్తి అడ్రస్ ను పరిశీలించుకోవాలి.. సమయపాలన పాటించి ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్ష వ్రాయాలని ఆయన తెలిపారు.

నీతి సూర్యుడు ప్రార్ధన మందిరంలో సెమీ క్రిస్మస్

నీతి సూర్యుడు ప్రార్ధన మందిరంలో సెమీ క్రిస్మస్

50 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణి 

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:

ఆత్మకూర్ ( యస్ ) మండల కేంద్రం ఏపూర్ గ్రామం లో నీతి సూర్యుడు ప్రార్ధన మందిరం వ్యవస్థాపకులు రెవ డా పంది మార్కు దీవెనమ్మ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు రెవ. డా. పి. జాన్ మార్కు, బిషప్ దుర్గం ప్రభాకర్, రజ్జి డేవిడు లు పాల్గొని క్రీస్తూ బోధనలు ప్రవచనాలు తెలిపారు. అనంతరం వారికీ సన్మానం చేసి వారి చేతుల మీదుగా 50 మంది పేద వితంతు వృద్ధ మహిళ లకు దుప్పట్లు పంపినీ చేసి 200 మంది క్రైస్తవ భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ యడవెల్లి అబ్రాహాము, రెవ. చెట్టుపల్లి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...