35.2 C
Hyderabad
Saturday, April 18, 2026

ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ యోగ చేయండి 

ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ యోగ చేయండి 

వెల్దుర్తి /మాసాయిపేట, యదార్థవాది, డిసెంబర్ 13:

అందరికీ యోగా విద్య అందించాలని బాబా రాందేవ్ గురూజీ లక్ష్యంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలోని పతాంజలి యోగ సమితి ని ఏర్పాటు చేశామని శుక్రవారం నాడు వెల్దుర్తి మండల కేంద్రానికి మహిళా అధ్యక్షురాలు ముక్తాబాయ్ ఆధ్వర్యయానా యోగ కార్యక్రమం లో యోగా గురుజి మెదక్ జిల్లా శివంపేట మండలం పిలుట్ల గ్రామానికి చెందిన బాసంపల్లి సురేందర్ గౌడ్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెస్ ఫ్యాక్టరీలో చార్జి మెన్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సురేందర్ గౌడ్ పతాంజలి యోగ ఫిర్ భారతస్థాభిమన్ యోగా శిక్షక్ బాబా రాందేవ్ గురూజీ స్థాపించిన సంస్థలు శిక్షణ పొంది హరిద్వార్లో శిక్షణ పూర్తి చేసుకొని సంగారెడ్డి జిల్లాకు చెందిన నారాయణ గురుజి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉచితంగా యోగా శిక్షణలో ఇస్తున్నామని తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోయారని అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడ దాని సంకల్పంతో యోగా శిక్షణ పొందాలని ఐదు సంవత్సరాల పాటు శిక్షణ పొందిన ఆయన ప్రస్తుతం యోగా గురుజిగా జిల్లా వ్యాప్తంగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని అందరు యోగ చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని యోగ అందరికీ అలవాటుగా మారితే ఆరోగ్యవంతమైన సమాజం అవుతుందని అందరికీ అభిప్రాయం చేస్తూ చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు యోగా చేయడంలో ఒత్తిడి నుండి దూరం కావడానికి యోగ సాధన ఫలిస్తుందని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు రసాయనిక క్రిమిఖారా సంహార నీకి సంబంధించినటువంటి భోజనం చేయడం వల్లనే చిన్నతరం పెద్దతరం లేకుండా గుండెపోటు రక్తపోటు క్యాన్సర్ పక్షవాతం ఇలాంటి అనారోగ్య రోగాల పాలు కాకుండా మన మన శరీర దురత్వాన్ని కాపాడుకునే వారిని అవుతామని ఆయన తెలియజేశారు 150 మంది విద్యార్థులకు వెల్దుర్తిలో యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు శిక్షణలు ప్రస్తుతం ఇస్తున్నామని ఆయన తెలియజేశారు.

మాజీ మంత్రి, కేటీఆర్ ను విచారించేందుకు..గవర్నర్ అమోదం.!

మాజీ మంత్రి, కేటీఆర్ ను విచారించేందుకు..గవర్నర్ అమోదం.!

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 13:

తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. ఫార్ములా ఈ-కారు రేసులో అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌ వ‌ర్మ ఆమోదం తెలిపారు. దీంతో అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) ఆయ‌న‌ను విచారించేందుకు స‌న్న‌ద్ధం అవుతోంది. 

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్ వేదిక‌గా గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో ఫార్ములా ఈ-కారు రేస్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఫార్ములా ఈ-కారు రేసు నిధుల కేటాయింపుల‌లో భారీ అవినీతి జ‌రిగిన‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. 

దీంతో ఈ కేసులో ఇప్ప‌టికే ఉన్న‌ ఇద్ద‌రు పుర‌పాల‌క శాఖ అధికారుల‌తో పాటు అప్ప‌ట్లో రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు న‌మోదు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఏసీబీ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. 

దీనిపై స్పందించిన ప్ర‌భుత్వం ఇద్ద‌రు అధికారుల‌పై విచార‌ణ‌కు అనుమ‌తించింది. అలాగే ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న కేటీఆర్‌పై కేసు న‌మోదు కోసం అనుమ‌తి ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరింది. దీనిపై న్యాయ స‌ల‌హా మేర‌కు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ కేటీఆర్‌ను విచారించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు

హీరో అల్లు అర్జున్ అరెస్ట్.!

హీరో అల్లు అర్జున్ అరెస్ట్.!

ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ చేసిన చిక్కడపల్లి పోలీసులు

ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్రోడ్లో పుష్ప టు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కి సలాటలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంఘటన విధితమే. 

ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్యా థియేటర్ యజమాని మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే

శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు.

త్వరలో గ్రామాల్లోనూ ‘అన్న క్యాంటీన్లు’!

త్వరలో గ్రామాల్లోనూ ‘అన్న క్యాంటీన్లు’!

అమరావతి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 13: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనుంది.. ఆంధ్రలో నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే సదుద్దేశంతో అప్పటి టీడీపీ ప్రభత్వం అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిసిన విషయమే.. కూటమి అధికారంలోకి రాగానే 199 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. రాష్ట్రంలో  ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 63 చోట్ల వీటిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. జనసాంద్రత ఎక్కువగా, 40 అడుగుల రోడ్డు సదుపాయం ఉండే ప్రాంతాలను అన్వేషించాలని కూటమి ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

విగ్రహ ప్రతిష్ట మహోత్సవము

విగ్రహ ప్రతిష్ట మహోత్సవము

శ్రీ జగదాంబ దేవి, శ్రీ సేవాలాల్ మహారాజ్, శ్రీ రామారావు మహారాజ్

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, ప్రతినిధి, డిసెంబర్ 12: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గంగారం తాండాలో శ్రీ జగదాంబ దేవి, శ్రీ సేవాలాల్ మహారాజ్, శ్రీ రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు స్వస్తి శ్రీ క్రొది నామ సంవత్సరం మార్గశిర శు” త్రయోదశి తేది:13-12-2024 ప్రారంభమై శు” పౌర్ణమి తేది: 15-12-2024 ఆదివారం వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ అద్వితీయ మహోన్నత కార్యక్రమాన్ని అధిక మొత్తంలో భక్తులు హాజరై విజయవంతం చేయవలసిందిగా గంగారం తాండ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరుపున  కోరారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..మండల విద్యాధికారి 

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..

-విద్యార్థులకు అభినందనలు తెలిపిన మండల విద్యాధకారి ఉపాధ్యాయులు

చేర్యాల, యదార్థవాది డిసెంబర్ 12:

మద్దూరు మండలంలో నిర్వహించిన సీఎం కప్పు క్రీడా పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేబర్తి విద్యార్థిని విద్యార్థులు వివిధ క్రీడలలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులను మద్దూరు మండల విద్యాధికారి వరదరాజు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు చంద్ర భాను అభినందించారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని ఇందుకు విద్యాలయాలలోని క్రీడలకు బీజం పడుతుందని తెలిపారు. అనంతరం మండలంలో నిర్వహించిన క్రీడలలో పురుషుల విభాగంలో వాలీబాల్ ప్రథమ స్థానాన్ని గెలుపొందారు అదేవిధంగా కోకోలొ  ద్వితీయ స్థానం మహిళా విభాగం కోకోలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు. అట్టి విద్యార్థులను జిల్లాలో జరిగే సీఎం కప్పు పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని భవిష్యత్తులో బాగుగా చదువుకుంటూ మంచి క్రీడాకారులుగా రూపుదిద్దుకోవాలని ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు శిరీష సంపత్ చంద్రారెడ్డి రవి మల్లేశం శ్రీనివాస్ రెడ్డి నరసింహులు  ప్రశాంత్ కవిత మొదలగు వారు పాల్గొన్నారు విద్యార్థులు కార్తీక్ దుర్గాప్రసాద్ సాత్విక్ రోహిత్ రెడ్డి మల్లికార్జున్ నందకిషోర్ రమేష్ రుచిత నిహారిక భార్గవి మంగ జోష్ణ మొదలగు వారిని అందరూ అభినందించారు

మేల్ శాంతి రవి ని సన్మానించిన అయ్యప్ప దీక్ష స్వాములు 

మేల్ శాంతి రవి ని సన్మానించిన అయ్యప్ప దీక్ష స్వాములు 

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12

ప్రముఖ మేల్ శాంతి అవుటపల్లి రవి స్వామిని అయ్యప్ప మాలధారణ స్వాములు ఘనంగా సన్మానించారు. కేరళ సాంప్రదాయ పద్ధతిలో తాంత్రిక పూజలు నిర్వహించడంలో ఆయన ప్రసిద్ధిగాంచారు.రంగు ముత్యం రాజు గురు స్వామి నివాసం లో జరిగిన పూజ కార్యక్రమం లో పలువురు గురు స్వాములు, అయ్యప్ప దీక్ష స్వాములు ఘనంగా సన్మనించారు. ఈ సాసందర్బంగా అయన మాట్లాడుతూ  అయ్యప్ప మాలధారణ తీసుకున్న స్వాములు దీక్ష నియమాలు పాటిస్తూ హైందవ దర్మం కాపాడేందుకు కృషి చేయాలన్నారు. దీక్ష తీసుకున్న ప్రతి స్వామిలో మార్పు రావాలని అప్పుడే అ దీక్ష కు సర్దకత చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో సీనియర్ గురు స్వాములు వంకాయలపాటి శంకర్ స్వామి, భూపతి శ్రీనివాస్స్వామి, లక్ష్మణ్ స్వామి, జి శ్రీను స్వామి, ముంతా శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్, మాలి లింగారెడ్డి, తుడి మధు, వెన్నె మధుకర్ రెడ్డి, అఖిల్, నాగయ్య, అశోక్, రవి చౌదరి రెడ్డి,జీవన్, రంగు స్వాతి, సాయి ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

సీఎం కప్పు 2024 క్రీడా పోటీలు ముగింపు. 

సీఎం కప్పు 2024 క్రీడా పోటీలు ముగింపు. 

-గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం 

 వెల్దుర్తి/మాసాయిపేట్, యదార్థవాది, డిసెంబర్ 12

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనంతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన సుపరిచితంగా పరిపాలించిందని ఉద్దేశంతోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు సురక్షిత ఆరోగ్యవంతంగా ఉండాలని ఉద్దేశంతోనే మండల కేంద్రాలలో సీఎం కప్ 2024 కార్యక్రమం ద్వారా క్రీడా పోటీలను నిర్వహించాలని అనే ఆదేశాల మేరకు వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గత మంగళవారం నుండి గురువారం వరకు నిర్వహించినటువంటి క్రీడా పోటీలలో గెలుపొందిన జట్లకు గురువారం  బహుమతులను ప్రదానోత్సవం చేసిన ప్రజా నాయకులు అధికారులు కబడి ప్రథమ స్థానంలో వెల్దుర్తి గ్రామం రెండవ స్థానంలో కుక్నూర్ గ్రామం కైవసం చేసుకున్నాయి వాలీబాల్ మొదటి స్థానం మానేపల్లి రెండవ స్థానం కుకునూరు గ్రామాలు గెలుచుకున్నాయి కోకో క్రీడలో మొదటి స్థానం వెల్దుర్తి రెండవ స్థానం కుక్కునూరు కైవసం చేసుకున్నాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ అంగడిపేట సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ నాలా చెరువు కిష్టగౌడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పాఠశాల సిబ్బంది ఎంపీడీవో ఉమాదేవి లు బహుమతులను అందజేశారు.

యువత స్వయం కృషి తో ఎదగాలి

యువత స్వయం కృషి తో ఎదగాలి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:

యువత స్వయం కృషి తో ఎదగాలని, వ్యాపారంగంలో రాణించాలని సూర్యాపేట డిఎస్పి రవి అన్నారు.  గురువారం  విద్యానగర్ బ్లూసి చౌరస్తా లో సుబ్బమ్మ పికిల్స్ సంప్రదాయ పచ్చళ్లు, పొడులు స్వచ్చమైన నెయ్యి విక్రయాల షోరూం  ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ కు చెందిన యువకులు సింగపంగ శ్రవణ్, వంటెపాక రవి వర్మలు నల్గొండ పట్టణంలో పికిల్స్ వ్యాపారం ప్రారంభించి, తమ మూడవ బ్రాంచ్ ను సూర్యాపేట లో ఏర్పాటు చేయడం పట్ల  అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుకాణ యజమానులు సింగపంగ శ్రవణ్, వంటెపాక రవి వర్మలు మాట్లాడుతూ తాము 2021 లో నల్గొండ లో సుబ్బమ్మ పికిల్స్, కారంపొడుల మొదటి బ్రాంచ్ ప్రారంభించి, రెండవ బ్రాంచ్ కూడ నల్గొండ లో మరియు తమ మూడవ బ్రాంచ్ సూర్యాపేట విద్యానగర్ నందు ప్రారంభించినట్లు చెప్పారు. తమ వద్ద నాణ్యమైన, రుచిగల  రోటి పచ్చళ్లు, నెయ్యి, కారం పొడులు,   కొబ్బరి పొడి, చిట్ల పొడి, కరివేపాకు కారం, అప్పడాలు,  లభిస్తాయని తెలిపారు. చికెన్, గోంగూర చికెన్, మటన్ గోంగూర మటన్, చేపలు, రొయ్యల పచ్చళ్లు తమ ప్రత్యేకత అన్నారు. తాము వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన పచ్చళ్లను వినియోగదారులకు అందుబాటు ధరలో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విహెచ్ పి జిల్లా అధ్యక్షులు  కారింగుల ఉపేందర్, పసునూరి దినేష్ బాబు, విజయ కృష్ణ, సందీప్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించిన.. విరాహత్ అలీ

జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించిన.. విరాహత్ అలీ

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:

సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో తలకు బలమైన గాయం తగిలి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీ.వి 9 జర్నలిస్ట్ రంజిత్ ను గురువారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన రంజిత్ ను పలకరించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రంజిత్ తలపై మోహన్ బాబు లోగో బాదడంతో తగిలిన బలమైన గాయం చూసి విరాహత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తమ సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని, నిందితుడికి చట్టపరంగా శిక్ష పడేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని భరోసా ఇస్తూ, రంజిత్ కు ఆయన ధైర్యాన్ని అందించారు. విరాహత్ తో పాటు టీయుడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, హెచ్.యూ.జే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ లు రంజిత్ ను పరామర్శించారు.

బాధిత జర్నలిస్టుకు మనోధైర్యాన్ని అందించిన టీ. వి9 ప్రతినిధి బృందం

మోహన్ బాబు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ ను టీ.వి9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళి కృష్ణ, అవుట్ పుట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డియస్ లు పరామర్శించి,  ఆందోళన చెందవద్దని తాము అన్ని విధాలా అండగా ఉంటామని మనో ధైర్యాన్ని అందించారు. పరామర్శించిన వారిలో క్రైం బ్యూరో చీఫ్ విజయ్ సాతా, కో-ఆర్డినేటర్ ధర్మారెడ్డి, క్రైం రిపోర్టర్ ప్రణీత తదితరులు ఉన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...