35.2 C
Hyderabad
Saturday, April 18, 2026

మరో మారు పెద్దల సభకు చిరంజీవి.!

మరో మారు పెద్దల సభకు చిరంజీవి.!

న్యూడిల్లీ, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:

ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలు రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్నాయి..

జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు పూరించాలి..

అయితే ఇందులో ఒక స్థానానికి మెగాస్టార్ చిరంజీవి పేరు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

ప్రముఖ నటుడు చిరంజీవి మరో మారు పెట్టెల సభ కు వెళుతున్నట్లు సమాచారం..

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2004 ఎన్నికలలో పోటీ చేసి..అతికొద్ది కాలంలోనే పార్టీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి రాజ్యసభకు వెళ్లి యుపిఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి అనుభవించారు..

గ్రూప్-2 పరీక్షకు 16 కేంద్రాల్లో 5855 మంది అభ్యర్థులు

గ్రూప్-2 పరీక్షకు 16 కేంద్రాల్లో 5855 మంది అభ్యర్థులు

జిల్లాలో గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12: జిల్లాలో గ్రూప్ – 2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో, అడిషనల్ ఎస్పీ మహేందర్ , డిఆర్ఓ భుజంగరావు, మెదక్ ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, ప్రిన్సిపల్ హుస్సేన్ లతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్* గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై చీఫ్ సూపరింటెండెంట్ లు, ఐడెంటిఫికేషన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, డిపార్టుమెంటల్ అధికారులు, లోకల్, జాయింట్ రూట్ అధికారులు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ లతో సమన్వయ సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ (783) గ్రూప్-2 పోస్టులకు గాను నాలుగు పేపర్ల వారీగా ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ – 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ – 2 పరీక్ష, అలాగే 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ – 3 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ – 4 పరీక్ష జరగనుందని తెలిపారు. జిల్లాలో మొత్తం (5,855) మంది అభ్యర్థులు (16) పరీక్ష కేంద్రాల్లో ఈ గ్రూప్-2 పరీక్షకు హాజరుకానున్నట్లు వివరించారు. మెదక్-11, నర్సాపూర్ -03,అలాగే చీఫ్ సూపరింటెండెంట్ లు (16), డిపార్ట్మెంటల్ అధికారులు (16), అబ్జర్వర్ లు (16), ఫ్లయింగ్ స్క్వాడ్ లు (5), బయోమెట్రిక్ అధికారులు (44), ఐడెంటిఫికేషన్ అధికారులు (58), ఐదు  రూట్లలో 05 లోకల్, జాయింట్ రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. వంద శాతం బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష హాల్లో పరీక్ష ప్రారంభానికి ముందే ఓఎంఆర్ షీట్ పై ఇన్విజిలేటర్ లు పరీక్షార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఓఎంఆర్ షీట్ లో అత్యంత జాగ్రత్తగా అభ్యర్థులు వారి వివరాలను కేటాయించిన ఆయా బ్లాకుల్లో తప్పులు లేకుండా నమోదు చేసేలా చూడాలని తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను అనుమతించరాదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాలను సంబంధిత అధికారులు సందర్శించి, మౌలిక వసతులను కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా జరగాలని, ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్, సిబ్బంది అందుబాటులో ఉండాలని, పరీక్ష పేపర్లు, ఓఎంఆర్ షీట్ లను పకడ్బందీగా, తగిన జాగ్రత్త చర్యల నడుమ తప్పనిసరిగా ఎస్కార్ట్ తో ప్రభుత్వ వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమయానుకూలంగా వ్యవహరించాలన్నారు. ఇన్విజిలేటర్ లతో సమావేశాలను ఏర్పాటు చేయాలని, సెంటర్ లలో సీసీ కెమెరాల పని తీరును సరిచూసుకోవాలని, అభ్యర్థుల హాల్ టికెట్, గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడీ కార్డును సరిగా చూడాలని, నిర్దేశించిన రూట్ లలో మాత్రమే ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ పత్రాలను తీసుకొని వెళ్ళాలని, పోలీసు బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ లు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, రూట్ అధికారులు, అబ్జర్వర్ లు, ఐడెంటిఫికేషన్ అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్ మాట్లాడుతూ పరీక్ష సమయానికి బీ. ఎన్. ఎస్ -160 (భారతీయ న్యాయ సమితి) సెక్షన్ అమల్లో ఉంటుందని, పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు.

అభ్యర్థులకు జిల్లా అదనపు కలెక్టర్ కీలక సూచనలు

అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా గ్రూప్-2 హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్షార్థులు హాల్ టికెట్ ను ఏ4 సైజ్ పేపర్ లో కలర్ ప్రింట్ తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ పై అభ్యర్థులు తమ తాజా పాస్ పోర్టు ఫోటోను అతికించాలన్నారు. డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ పై ఫోటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ తో మూడు పాస్ పోర్టు ఫోటోలతో పాటు వెబ్ సైట్ లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్ కు అందించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, అభరణాలు ధరించరాదని సూచించారు. పరీక్షార్థులు మెహిందీ, తాత్కాలిక టాటూలను వేసుకోరాదని స్పష్టం చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్ ను, బ్లూ (లేదా) బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు.  పరీక్ష సమయ పాలనకు సూచికగా ప్రతీ అర్థగంటకోసారి బెల్ మోగుతుందని తెలిపారు. అదే విధంగా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు బయోమెట్రిక్ విధానంపై అధికారులు, ఇన్విజిలేటర్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9908696575 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించి, వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో టీజీపీఎస్సీ రూట్ ఆఫీసర్, స్పెషల్ అబ్జర్వర్  శ్రీధర్ , డిపిఓ యాదయ్య,, ఇంటర్మీడియట్ ఆఫీసర్ మాధవి, మెప్మా పీడీ ఇందిరా, డిడి ట్రైబల్ వెల్ఫేర్ నీలిమ,పోలీసు శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

త్వరలో మహిళలకు ఎలక్ట్రానిక్ ఆటోలు.!

త్వరలో మహిళలకు ఎలక్ట్రానిక్ ఆటోలు.!

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12: తెలంగాణలోని మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. మహి ళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులువేస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుంది. మహిళలు తమ కాళ్లమీద తాము నిలబడేం దుకు ఎంతైన ఖర్చు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల కోసం మరో సరికొత్త స్కీమును ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్రప్రభుత్వం..మరో అంశంపై ఫోకస్ పెట్టింది.  ఓ వైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూ నే.. మహిళల ఆర్థిక స్వావ లంబనకు సహక రించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఆటోలను కొను గోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకా రాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మహిళల కోసం కొత్త స్కీము రూపకల్పనపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పించే ఓ సంస్థ ఆశాఖ ఉన్నతాధికారులను ఈమధ్యే కలిసింది. కాగా ఆటోల కొనుగోలుకు అయ్యే ఖర్చులో సగం ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు సర్కార్ పరిశీలి స్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లగా సానుకూ లంగా స్పందించారని సమాచారం. సాధార ణంగానే ఆటో డ్రైవింగ్ కొంత కష్టంగానే ఉంటుంది. అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు అరుదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరుగుతోంది. మన తెలంగాణ రాష్ట్రంలో జహీరబాద్ లో ఎలక్ట్రిక్ ఆటోల ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. డీజిల్, సీఎన్జీతో నడిచే ఆటోలతో పోల్చితే ఎలక్ట్రిక్ ఆటోలను నడపడం చాలా తేలిక అని అంటున్నారు నిపుణులు. దీంతో ఆ కంపెనీ ఇప్పటికే కొంతమంది మహిళలకు కూకట్ పల్లిలో డ్రైవింగ్ నేర్పిస్తోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఈ పథకం ప్రారంభించేందుకు స్త్రీ, సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు కేసులకు విముక్తి.!

ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు కేసులకు విముక్తి.!

-మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ ఉద్యోగుల సర్వీసు కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురువారం ఆయన కార్మికుల, ఉద్యోగుల ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య సభ్యులుగా ఈ త్రిసభ్య కమిటీ పనిచేయనుందని, రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ లో విధుల్లో ఉన్న ఉద్యోగుల్లో గతంలో సర్వీస్ రిమూవల్ కేసులు నమోదైన వాటిపై  ఈ కమిటీ పరిశీలించనుందని, ఇప్పటికే ప్రజావాణి లో ఆర్టీసీ కి సంబందించిన సర్వీస్ రిమువల్, తదితర కేసుల విషయమై ఫిర్యాదులను ఈ త్రిసభ్య కమిటీ పిలిచి రివ్యూ చేయనుందని, ఈ త్రిసభ్య కమిటీ కేసులో ఉన్న మెరిట్స్ ను బట్టి ఆర్టీసీ యాజమాన్యానికి రికమెండ్ చేయనుందని మంత్రి పొన్నం తెలిపారు.

తృప్తిలో తప్పిన ప్రమాదం.!

తృప్తిలో తప్పిన ప్రమాదం.!

షాద్ నగర్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:

బ్రేకులు ఫెయిల్ అయి విద్యార్థుల ఆటోకు ప్రమాదం.. వాహనదారులు స్పందించడంతో తప్పిన ప్రమాదం జరిగింది..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి  విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయి, రోడ్డు కిందకు వెళ్లి రెండు స్తంభాల మధ్య ఇరుక్కున్న ఆటో..

పెద్దగా అరవడంతో గమనించి వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించిన వాహనదారులు..

ప్రమాదంలో విద్యార్థులు ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న తల్లిదండ్రులు..

పశువులకు గర్భ కోశ నివారణ క్యాంపు 

పశువులకు గర్భ కోశ నివారణ క్యాంపు 

వెల్దుర్తి పశు వైద్య అధికారిని రేఖ రసజ్ఞ 

వెల్దుర్తి మాసాయిపేట యదార్థవాది డిసెంబర్ 12: ఉచిత ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహణ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేపల్లి గ్రామంలో ఉచితంగా పశువులకు గర్భకోశ నివారణకు సంబంధించి ( ఫెర్టిలిటీ ) క్యాంపు ని మండల పాశువైద్యాధికారి రేఖ రసజ్ఞ ప్రారంభించారు. ఈ కార్యక్రమమును ఉద్దేశించి మండల పశువైద్య అధికారిని రేఖారాసజ్ఞ మాట్లాడుతూ  గోజాతి  గీత జాతి పశువులలో గర్భకోశ వ్యాధులకు సంబంధించి వైద్యం అందించడం జరిగిందని. పశువులకు చూడి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని.ఈ వ్యాధులు రావడం వలన చూలు నిలబడక, ఎదకు రాకపోవడం,  తిరిగి పొర్లడం, వంటి సమస్యల గురించి రైతు సోదరులకు వివరించి అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు. రైతులకు ఉన్నటువంటి పశువులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తమ సిబ్బంది దృష్టికి తీసుకువస్తే సకాలంలో మీ వద్దకు వచ్చి మా సిబ్బంది పశువులకు వైద్యం చేయడం జరుగుతుందని మీకు మేము మా పశు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటామని ఆమె తెలియజేశారు మండల వ్యాప్తంగా మొత్తం ఈ ఫెర్టిలిటీ క్యాంపులో  120 పశువులు కు వైద్యం అందించడం జరిగిందని. ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో వి ఎల్ వో ఫజల్, గోపాల్ మిత్ర సూపర్వైజర్  సత్యనారాయణ, గోపాల మిత్రులు నవీన్, రమేష్,భాస్కర్, పశు వైద్య సిబ్బంది వెంకట్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రేవంత్ కు జర గుర్తు జేయుండ్రి..!!

రేవంత్ కు జర గుర్తు జేయుండ్రి..!!

-సీఎంకి పొద్దుగాల చాయి ఇచ్చేవారు ఆయన హామీలను గుర్తు చేయండి

-అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతాం

-సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య న్యాయమంది

-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం

-మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో పాల్గొని, వారికి సంఘీభావం ప్రకటించిన సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని, కెసిఆర్ ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా.. రేవంత్ రెడ్డి కి ఇంకా నెల కాలేదా.. మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం, నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మూడు కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి వాళ్ళను కూడా మోసం చేసిండని, బాండ్ పేపర్ల మీద రాసి హామీల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి.. రైతులకు 15000 రైతు భరోసా, 4000 ఆసరా, 2500 మహిళలకు ఇస్తామన్నాడు.. అన్ని వర్గాలను మోసం చేసిండు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ ఆక్ట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు..? వరంగల్ ఏకశిలా పార్కు ముందు ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు సెప్టెంబర్ 13 నాడు హామీ ఇచ్చావు కదా.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానన్నావు కదా ఇంతవరకు చేయలేదు ఎందుకని,నువ్వు చెప్పిన మాటలే కదా.. నువ్వు ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేస్తివి.. అసెంబ్లీ ముట్టడి చేస్తే అరెస్టు చేసి మహిళల అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టావు కదా.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఘనంగా చెప్పి, నువ్వు ఇచ్చిన హామీ నీకు గుర్తు చేస్తే అరెస్టు చేస్తావు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజా పాలన అంటే.? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని, నీ ఏడాది పాలనలో నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని అంటే కేసు పెట్టావు..రుణమాఫీ ఎగబెట్టినవ్, రైతు భరోసా  ఎగపెట్టినవ్, 4000 ఆసరా పెన్షన్లు ఎగబెట్టినవ్, మహిళలకు 2500 ఎగ్గొట్టినవ్, నువ్వు ఇచ్చిన అన్ని హామీలు ఎగ్గొట్టినవు కాబట్టి నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్ననని అన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా..నువ్వు ఒక కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డే.. విద్యా వలంటీర్లను పూర్తిగా తొలగించారు.. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని, ఒక గంట కాదు నాలుగు గంటలు ఎక్స్ట్రా పని చేద్దాం, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడిద్దాం. బీ ఆర్ ఎస్ ను గెలిపించుకుందామని అన్నారు. ఈనెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తామని, సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.

సింగరేణి కాపర్ వైర్ దొంగలను పట్టుకున్న పోలీసులు 

సింగరేణి కాపర్ వైర్ దొంగలను పట్టుకున్న పోలీసులు 

పెద్దపల్లి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: అక్రమంగా సింగరేణి కాపర్ వైర్ దొంగిలించి రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొన్న పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడికే 2 ఇంక్లైన్ మైన్ పరిధిలో ఉన్న సింగరేణి కి సంబంధించిన కాపర్ వైర్ ని దొంగిలించి అక్రమంగా హైదరాబాద్కు రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు  పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గోదావరిఖని అడ్డగుంటపల్లి వద్ద  అనుమాన స్పదంగా వస్తున్న ఒక మహేంద్ర ట్రాలీ ని ఆపి తనిఖి నిర్వహించగా అందులో 65 కిలోల కాపర్ వైర్ ను గుర్తించడం జరిగింది. డ్రైవర్ను అందులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు దొంతుల శ్రీనివాస్, ముత్యాల ఐలయ్య డ్రైవర్ అని తెలిపి రెండు రోజుల క్రితం 2 ఇంక్లైన్ గోదావరిఖని మైన్ నుండి దొంగలు తనం చేసి దొంతుల శ్రీనివాస్ స్క్రాప్ దుకాణంలో ఉంచి ఈరోజు ఉదయం సమయంలో అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్నామని తెలుపడం జరిగింది. వెంటనే నిందితులిద్దరిని మరియు ట్రాలీ ని, అందులో ఉన్న కాపర్ వైర్ సాధించేసుకొని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ వారికి అప్పగించారు.

పిల్లలమర్రిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

పిల్లలమర్రిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11

మున్సిపల్‌ పరిధిలోని పిల్లలమర్రి ఎరకేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప పడి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గణపతి, సుబ్రమణ్య స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామికి రంగురంగుల పండ్లు, పూలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించిన 18 మెట్లపై కర్పూరం జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కడారి వెంకన్న గురు స్వామి నిర్వహించిన పూజలో నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన ఈద సంజీవ ఆధ్వర్యంలో పాటలుపాడుతూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు, పిల్లలమర్రి దీక్షాస్వాములు, భక్తులు పాల్గొన్నారు.

గ్రామీణ నేపథ్యంలో పల్లె నా పల్లె పాట చిత్రీకరణ అభినందనీయం 

గ్రామీణ నేపథ్యంలో పల్లె నా పల్లె పాట చిత్రీకరణ అభినందనీయం 

పేటలో సందడి చేసిన సినీతార అయేషా పాటిల్ 

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, 

గ్రామీణ ప్రాంత స్థితిగతులను అక్కడి వాతావరణాన్ని చక్కగా పాట రూపంలో పల్లె నా పల్లె పాట చిత్రీకరించి ఆవిష్కరించడం అభినందనీయమని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. కలియుగంలో పట్నం, హరిహర వీరమల్లు చిత్రాల ఫేమ్ సినీనటి ఆయేషా పాటిల్ తో కలసి పల్లె నా పల్లె పాట ను బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. పల్లె నా పల్లె పాట చాలా బాగుందని పాటలో చిన్నారుల నటన అద్భుతంగా ఆకట్టుకుందన్నారు.  పాటకు సంబంధించిన లిరిక్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్షన్ అంత చక్కగా కుదిరిందని పల్లె వాతావరణం లో ఆ స్నేహాన్ని ఆనాటి స్థితిగతులను వివరిస్తూ చక్కగా పాఠ చిత్రీకరించారని కొనియాడారు. పల్లె నా పల్లె పాటను ప్రతి ఒక్కరు వీక్షించాలని కోరారు. అనంతరం సినీ తార ఆయేషా పాటిల్ చిన్నారులు ప్రజలతో కలసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. తాను గతంలో చేసిన చిత్రాలు ప్రస్తుతం చేయబోతున్న చిత్రాల విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్,  పాట డైరెక్టర్ జెర్రిపోతుల రవి, నటీనటులు సుమలత, సుమశ్రీ, స్వప్నశ్రీ, ఎడిటింగ్ రామ్ రెడ్డి, గానం ఇమ్మడి అశోక్,  మ్యూజిక్ బొబ్బిలి సురేష్,  రమేష్, బెజగం ఫని, బజ్జూరి శ్రీనివాస్, వీరభద్రం, కుక్కడపు బిక్షం, కళ్యాణ్, సందీప్,  ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...