34.2 C
Hyderabad
Monday, April 13, 2026

మాభూమిని కబ్జాదారుల నుండి కాపాడండి 

మాభూమిని కబ్జాదారుల నుండి కాపాడండి 

-భూమికి సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారు

-రెవెన్యూ, ఎస్.ఆర్.ఎస్.పి అధికారులు తమకు న్యాయం చేయాలి

ఆర్మూర్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండల పరిధిలోని నికల్పూరు గ్రామ శివారులో పోచంపాడు బ్యాక్ వాటర్ లో ముంపుకు గురైన 12 కులాలు 40 కుటుంబాలకు చెందిన 399/1 సర్వే నంబర్ పురాతన భూమిని ఆ ఊరికి సంబంధం లేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ధరణిని అడ్డం పెట్టుకొని కబ్జా చేయడమే కాకుండా కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చి తమ భూమిని కబ్జా చేశాడని  గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులు ట్రాక్టర్ సహాయంతో భూమిని చదును చేయడానికి ప్రయత్నం చేయగా భూమికి సంబంధించిన 40 కుటుంబాలకు చెందిన వ్యక్తులు అడ్డుకోవడం జరిగింది. వివరాలలోకి వెళితే పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తమ గ్రామం ముంపునకు గురవుతుందని అధికారులు తమ ఊరిని వదిలిపెట్టి వేరేచోటకు వెళ్లాలని సూచించడంతో తమ భూమిని అక్కడే వదిలేసి వేరే ప్రాంతానికి వలస వెళ్లడం జరిగిందని, మేము వదిలి వచ్చిన భూమికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం కూడా రావడం జరిగిందని, ఈ భూమిపై కన్నేసిన వెంకటేశ్వర్ అనే వ్యక్తి గత ప్రభుత్వంలో ధరణి సహాయంతో పట్టా చేయించుకుని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి భూమిని చదును చేస్తున్నాడని ఆ భూమికి సంబంధించిన వ్యక్తులు ఏంటని ప్రశ్నిస్తే తమకు కోర్టు నుండి పర్మిషన్ ఉందని చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ భూమిలోనే గ్రామానికి సంబంధించిన పశువులు పడుకోవడానికి వదిలేసామని అలాంటి భూమిని కబ్జా చేస్తే తమ పశువులు ఎక్కడ ఉండాలో అధికారులే తెలపాలని కోరారు. అక్రమంగా ధరణినీ అడ్డం పెట్టుకొని తమ భూములను  పట్టా  చేసుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరుకున్నారు.

రౌడీ మోహన్ బాబు దగ్గర నుండి పద్మశ్రీ ని వెనక్కి తీసుకోవాలి

రౌడీ మోహన్ బాబు దగ్గర నుండి పద్మశ్రీ ని వెనక్కి తీసుకోవాలి

-మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి.

-పత్రిక, పాత్రికేయుల స్వేచ్ఛను కాపాడాలి

-టియుడబ్ల్యూజే అధ్యక్షులు రంగాచారి డిమాండ్ 

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: మోహన్ బాబు ఇంటి వద్ద మీడియా పాత్రికేయులపై మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా టీయుడబ్ల్యూజే – ఇజేయూ అధ్యక్షులు రంగాచారి తెలిపారు. మంగళవారం  జరిగిన దాడిని మీడియా మీదనే జరిగిన దాడిగానే భావించడం జరుగుతుంది అని అన్నారు. జర్నలిస్టుల పై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేటలో  ప్రెస్ క్లబ్ నుంచి పాత బస్టాండ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఓ ఛానెల్ కు చెందిన మీడియా ప్రతినిధి పై  మోహన్ బాబు దాడి  హత్యాయత్నం చేయడానికే ప్రయత్నించినట్లు వారు పేర్కొన్నారు. మోహన్ బాబు సినిమాలోనే విలన్ కాదు నిజ జీవితంలో కూడా విలన్ అని మండి పడ్డారు. ఇది అప్రజాస్వానిక చర్య, పత్రిక స్వేచ్ఛని అరించడమేనని రంగాచారి అన్నారు. మొహన్ బాబు ఆ రౌడీయిజం ప్రదర్శించారన్నారు. వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాన్ని వాళ్లే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుని ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకొని వాళ్ళే బయట పెట్టుకున్నారని తెలిపారు. ఆ సందర్భంలో మీడియా తప్పకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లడం సహజమని, నిజంగా ఆయనకు ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే మా పరిష్కారం చేసుకుంటాం మీరు కొంచెం మాకు సహకరించండి అని అడగొచ్చన్నారు. కానీ ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల ద్వారా మోహన్ బాబు పాత్రికేయుల మీద దాడి చేయడం, వీడియో గ్రాఫర్ మీద దాడి చేయడం కెమెరాలను ధ్వంసం చేయడం ఇది పూర్తిగా పత్రిక, మీడియా మీద జరిగినటువంటి దాడిగానే భావిస్తున్నామన్నారు. ఆయన మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిఅరెస్ట్ చేయాలన్నారు.  ప్రభుత్వంలో ఉండే పెద్దలు కావచ్చు, పోలీసులు కావచ్చు ఇట్లా జరిగినప్పుడు తాత్కాలికంగా నాలుగైదు రోజులు హడావిడి చేయడం తర్వాత వదిలేయడం జరుగుతుందని, ప్రజాస్వామ్యాన్ని పత్రిక స్వేచ్ఛను కాపాడాలని, చట్టాన్ని పరిరక్షించాలన్నారు. మోహన్ బాబును  ఖచ్చితంగా జైల్లో పెట్టాలని, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తేనే ఇలాంటి చర్యలు ఆగిపోతయాన్నారు. పాత్రికేయుడు

రంజిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, దాదాపు పది నుంచి 15 లక్షలు వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని, మోహన్ బాబుకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా నేతలు ఫయాజ్ ఆకుల పాండు, నాయిని సంజీవరెడ్డి, చిటుకుల మైసారెడ్డి, రమణారావు, పాతర్ల వెంకటేశం,  రంగధాం పల్లి శ్రీనివాస్ గౌడ్, రఘునందస్వామి, మజ్జు,  దాస శ్రీనివాస్, సాజిద్, సుజిత్ రెడ్డి, రాజు, ఐత శ్రీనివాస్, గందే నాగరాజు, రాజబాబు, శివతేజ, మహేష్, జనార్దన్,  ఇంద్ర శేఖర్, సాయి, మురళీ తదితరులు పాల్గొన్నారు.

మోహన్ బాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

మోహన్ బాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

-టి యు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: వార్తల కవరేజ్ కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై అకారణంగా దాడి చేసి గాయపరిచి అసభ్య పదజాలంతో దూషించిన సినీ నటుడు మంచు మోహన్ బాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అనుబంధం) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం  జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగ బంటు కృష్ణ మాట్లాడుతు వృత్తి బాధ్యతగా కవరేజ్ కి వెళ్లిన మీడియా ప్రతినిధులను దూషించి దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ఒక సీనియర్ నటుడుగా పద్మశ్రీ అవార్డు పొందిన నటుడు మోహన్ బాబు ప్రతి విషయంలో ఓర్పు వహించాలని ఆయన అన్నారు.  కుటుంబంలోనే పరస్పర వివాదాలను పరిష్కరించుకోలేక బయటకు వచ్చారని, అలాంటప్పుడు ఒక సెలబ్రిటీ విషయంలో ఏమి జరుగుతుందని ఆదుర్దా సమాజానికి తెలియజెప్పే బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు. సమన్వయ లోపంతో కుటుంబ విషయాలను బహిర్గతం చేసుకున్న మోహన్ బాబు మరింత దుందుడుకుగా వ్యవహరించి కవరేజ్ కి వచ్చిన టీవీ9 ప్రతినిధి రంజిత్ తో పాటు ఎన్టీవీ, ఈటీవీ ప్రతినిధులపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి తలవొంపులు తెచ్చే విషయాల పట్ల మోహన్ బాబు ఓర్పుతో వ్యవహరించాల్సి ఉండేదని తెలిపారు.  ఈ విషయంలో సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రజలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వృత్తి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పట్ల దాడులు జరిగితే సంబంధిత వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  టి యు డబ్ల్యూ జే ఐజేయు సూర్యాపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున్ రెబ్బ విజయకుమార్ లు మాట్లాడారు. ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో  విలేకరులు తండు వెంకటేష్,  మధు, వేణుమాధవ్, జనార్ధన చారి, పాషా, పల్లె మణి బాబు, రామచంద్ర రాజు, వెంకటేష్, విక్రం, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

ఆవుల రాజన్న రాజకీయం అంతా ఇంత కాదయా…!!!

ఆవుల రాజన్న రాజకీయం అంతా ఇంత కాదయా…!!!

*కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గంలో అంతరించిపోతున్న తరుణంలో

*తనకు సాటి ఎవరు లేరని కాంగ్రెస్ పార్టీ కి ప్రాణం పోసిన మహనీయుడు

*కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి కరుణామయులుగా భావించి 

*కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న ఆదర్శ దైవమూర్తుడు – ఆవుల రాజిరెడ్డి

నర్సాపూర్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్11:

మెదక్ జిల్లా మాసాయిపేట మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయవేత అందరి మన్ననలు కోరే ప్రదాత ఆవుల రాజిరెడ్డితెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి సందర్భంలో పదవుల కోసం స్వార్థపర నాయకులు సంపాదించుకున్నటువంటి అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం పార్టీల ఫిరాయింపులు చేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటే కండలు కోసుకున్నటువంటి బడా నాయకులు కూడా తమ స్వార్థాల కోసం కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నాయకులు అధికారపార్టీలో చేరితే తాము సంపాదించుకున్నటువంటి అక్రమ ఆస్తులకు ఎవరు అడ్డుపడరని ఉద్దేశంతోనే సొంత పార్టీని విడనాడి స్వార్ధపర రాజకీయం కోసం పార్టీ ఫిరాయింపులు చేసిన కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు తాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటి నుండి తన కర్తవ్యం ప్రజాసేవ కోసం తాను పాటుబడి ఉంటానని ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో నేనున్నాను అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలుషితం లేనటువంటి అసలు సిసలైన కార్యకర్తలు ఉన్నారని తమ స్వార్ధ పర రాజకీయం కోసం పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి వారిని పట్టించుకోకుండా పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త వెంట ఉంటూ పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం కార్యకర్తలను అదో గోషగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఉద్దేశంతోనే నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అంటేనే కనుమరుగవుతున్న సందర్భంలో ఆపద్బాంధవుడు ఆదర్శ మహనీయుడు ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకొని అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను వెంట పెట్టుకొని నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి మండలంలోని గ్రామ గ్రామాన తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో సత్తా చూపాలని ఉద్దేశంతోనే నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తాను తీసుకున్నాఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు గతంలో ఎంత అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసింది అని నర్సాపూర్ నియోజకవర్గంలోని పల్లె పల్లె నా గల్లి గల్లి లో కార్యకర్తల సహకారంతో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో తెలియజెప్పినటువంటి ఘనులు ఆవుల రాజ్ రెడ్డి ఏ నని చెప్పుకోవచ్చు నేటికి కూడా కాంగ్రెస్ పార్టీలో మచ్చలేని మహనీయుడు ఆపదలోని నేను ఉన్నాను అందరి వాడిని అందరితో కలిసిమెలిసి ఉంటానని అధికారం ముఖ్యం కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను అనేనినాదంతోనే అందరి కార్యకర్తల నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల సహకార సలహాలతో అందరి బహమాకారాలతో మునుముందు కూడా ఇలాగేనే ఉంటూ అందరినీ ఆదరిస్తూ ప్రజాసేవ కోసమే నేను నా కుటుంబం సదా మీ సేవలోని ఉంటామని ఆయన కొన్ని సందర్భాలలో తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినా తర్వాత మూడోసారి జరిగినటువంటి ఎన్నికలలో తాను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫునుండి ఎమ్మెల్యేగా పోటీలో నిలబడి అతికొద్ది ఓట్ల ఆధిపత్యంతో ఓటమి పాలను చవిచూసిన ఓటమికి మెట్టు తదుపరి గెలుపుకు సగటుగా భావించి రానున్న రోజుల్లో రారాజులుగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతనం కృషి చేయడం కోసం తాను ముందు వరసలోనే ఉంటానని తనకు పదవులు ముఖ్యం కాదు ప్రజల శ్రేయస్సు బాగుకోసం తాను ప్రజల్లోనే నిత్యం తిరుగుతూ ప్రజా సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి కూడా వెనుకాడనని మాసాయిపేట గ్రామానికి గతంలో తన తండ్రి సర్పంచ్ గా పరిపాలన చేసినప్పుడు మాసాయిపేట గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేపట్టారని తాను కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి ఎవరికి ఎటువంటి ఆపదలు ఉన్న తాను వారి యొక్క ఆపద ఇబ్బందులను తీర్చడానికి తన వంతు సహాయం చేస్తానని రక్షతో రక్షత అనే నినాదా అక్షరాలను నిజం చేయగలరని సంకల్పంతో అభివృద్ధి దశలోనే ప్రయాణిస్తాన్ని ఎవరు ఎటువంటి ఆరోపణలు తనపై చేసిన కూడా ఎదుర్కొనే శక్తి ధైర్యం మనస్తత్వం తనలో ఉందని తాను రాజకీయపరంగా ప్రజాసేవ కోసం వెనుకాడే సందర్భాలను చవిచూడనని మహా మనిషికి ఉండేది ధైర్యం తెలివితేటలు అవి తనకు ఉన్నాయని తాను ఎల్లవేళలా ప్రజా శ్రేయస్సు కోసమే తన పోరాటమని పలు సందర్భంగా తెలియజేశారు తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజా శ్రేయస్సు తన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎదిగి నేడు ఇలాంటి స్థానంలో ఉన్నాను అంటే అది మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యం అని చెప్పుకోవచ్చు నర్సాపూర్ నియోజకవర్గ ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ తరపు నుండి నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో తనకృషి చేస్తానని పలు సందర్భాలలో తెలియజేశారు.

విద్యార్థులకు నాణ్యమన బోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమన బోజనం అందించాలి

సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: విద్యార్థులకు నాణ్యమైన బోజనం అందించాలని అదనపు కలెక్టర్ ‌నగేష్ అన్నారు. బుధవారం మెదక్  మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని  విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనం,  వంటగది, స్టోర్ రూమ్, డార్మెటరీ రూములు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముకాముఖి అయ్యారు. విద్యార్థులు  చదువులో బాగా రాణించాలని మంచి మార్కులు సాధించి ఉన్నతస్థాయికి వెళ్ళాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పరిశుభ్రత పాటించాలనీ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వార్డెన్ ను ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇన్చార్జి ప్రిన్సిపల్ పద్మావతి సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా సమైఖ్య క్రిస్మస్

ఘనంగా సమైఖ్య క్రిస్మస్

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: జిల్లా కేంద్రంలోని మన్నా చర్చ్ బిషప్ డా. సాల్మాన్ రాజు నివాసం లో సూర్యాపేట పాస్టర్స్ పెలోషిఫ్ సలహాదారులు బిషప్ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో సూర్యాపేట సమైఖ్య క్రిస్మస్ సందర్బంగా కేక్ కట్ చేసి స్విట్స్ పంచిపెట్టున్నారు. అనంతరం బిషప్ సాల్మాన్ రాజు  పట్టణ నియోజకవర్గ ప్రముఖ దైవజనులందరికి పూల బొకే, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా రెవ. డా. యం. ప్రభుదాసు (బాప్టిస్ట్ చర్చ్) మాట్లాడుతూ సంస్థలు, సంఘ పెలోషిఫ్ ల బేధములు లేకుండా సమిష్టి తో జిల్లా వ్యాప్తంగా క్రీస్తూ ప్రేమను చాటలని, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలన్నారు. ఈ కార్యక్రమం లో రెవ. డా శాంసంగ్ మామిడి, రెవ. డా జాన్ మార్కు, రెవ. బి. జవహర్ పాల్, బిషప్ దుర్గం ప్రభాకర్, బ్రదర్ యం. ప్రభుదాస్, రెవ. ఇంజమూరి గాబ్రియేల్, రెవ. మిట్టగడుపుల హాజర్య, బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు,రెవ. జి. బాలాజీ నాయక్,రెవ. జి. బాబురావు, రెవ. డా. ధరవత్ లాకు నాయక్, రెవ. డా పంది మార్కు, పాస్టర్ యం రూబెన్ తదితరులు పాల్గొన్నారు.

మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలి

మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలి

-టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: కవరేజ్ కు వెళ్లిన ఈటీవీ, టీవీ5, టీవీ9, టీవీ ఛానళ్ల ప్రతినిధులపై దాడికి పాల్పడిన మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ సినీ నటుడు మంచు మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేసి..తక్షణమే అరెస్ట్ చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు ఎ.శంకర్ దయాళ్ చారి అన్నారు.. బుధవారం మెదక్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినియర్ నటుడు మోహన్ బాబు సినిమాలలో చేసిన విలన్ పాత్ర నిజా జితంలో కూడా పాత్రికేయుల మిద మంగళవారం దాడి చేయడం చూశామని, గతంలో సినిమా నటి సాక్షి శివానంద్, సీనియర్ నటి జయంతిలపై మోహన్ బాబు చేసిన దాడులు, పెట్టిన హింసలు ఇప్పటికి అనేక మందికి గుర్తు వున్నాయన్నారు.. ఒక సినిమా నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా, రాజకీయ వేత్తగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా, రియల్ ఎస్టేట్ ఓనర్ గా, నిజజీవితంలో ఎన్ని పాత్రలు వేసినా తన క్రిమినల్ బుద్ధిని ఏనాడు వదిలి పెట్ట లేదని అన్నారు. నిజాలను భరించే శక్తిలేక  టీ.వీ.9 ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు వీరావేశంగా దాడి చేయడం అర్థం అవుతుందన్నారు. మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. సంతోష్ కుమార్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, ఐజెయూ మాజీ సభ్యులు ఫరూక్ హుస్సేన్, నాయకులు మురళీధర్ గుప్తా, శ్రీధర్,గోవర్ధన్ రెడ్డి, అల్లాడి శేఖర్, శ్రీనివాస్, ఆంజనేయులు, కృష్ణమూర్తి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా థియేటర్ కు సంబంధం లేదటా.!

సినిమా థియేటర్ కు సంబంధం లేదటా.!

ప్రీమియర్ షో డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారటా.!

ప్రభుత్వానిదే బాధ్యత.. అంటున్న సంధ్య థియేటర్ యజమాని..

గత 5న పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే..

పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. 

అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం అని థియేటర్ యజమాని తెలిపారు.

పరిపాలన మార్చుకుంటేనే కాంగ్రెస్ కు మనుగడ

పరిపాలన మార్చుకుంటేనే కాంగ్రెస్ కు మనుగడ

-ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కొంత మెరుగు            

-మెరుగుపడినా మరింత మార్పు కోరుతున్న ప్రజలు

-గత బిఆర్ఎస్ విదానాల వల్లే.. మార్పు కోరిన ప్రజలు

-టియుడబ్ల్యుజె రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, ప్రజా సంఘాల నేతలు

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిది డిసెంబర్10:  రాష్టంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనా పద్ధతులు మార్చుకుంటేనే మనుగడ సాధ్యమవుతుందని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం విధానాల వల్ల  ప్రజలు మార్పు కోరుకున్నారని,  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో కొంత మెరుగు పడినా మరింత మార్పును ప్రజలు కోరుతున్నారని వారు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై పెద్ద తేడా ఆగుపించడం లేదని, మేధావులు, ప్రజా సంఘాల నేతలు అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అధ్యక్షతన  ప్రజల ఆకాంక్షలు- ఏడాది ప్రభుత్వ పాలన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓయు జర్నలిజం విశ్రాంత ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన కొంత బాగానే ఉన్నప్పటికీ లగచర్ల, జైనూర్ ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విదంగా ఉన్నాయని విమర్శించారు. మత కలహాలు సృష్టించే ప్రమాదం ఉందని ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు. హాస్టల్స్, గురుకులాలలో విద్యార్థుల మరణాలను పూర్తిగా నిరోధించాలని, పాలనలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు. ప్రజా గాయకుడు గేయ రచయిత మాష్టార్టీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గ పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారితోనే మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. పోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం లక్ష కోట్ల నిందితులకు ఎప్పుడు శిక్షలు పడతాయో తెలయదని ప్రస్తుతం  దాని ఊసే లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వేరు కాదని ఒక్కటేనని ధ్వజమెత్తారు. 9 మంది కళాకారులకు 300 గజాల స్థలం కోటి రూపాయలు నగదు ఇస్తానని సిఎం ప్రకటించారని, అయితే లబ్దిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేసారో సియం ప్రకటించాలని ఆయన కోరారు. ప్రజల తిరుగుబాటుతోనే అధికార మార్పు వచ్చిందని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి గొయ్యిని వారే తవ్వుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల నిఘా వేదిక రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డాక్టర్ వి.వి.రావు మాట్లాడుతూ కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడస్తుందని ఆరోపించారు. నేటి రాజకీయాలలో అంతర్గత ప్రజా స్వామ్యం లేదని, చాకలి ఐలమ్మను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థలతోనే ప్రజా స్వామ్యం బలపడుతుందని అన్నారు. సామాజిక విశ్లేషకురాలు సజయ మాట్లాడుతూ ఉచిత బస్సు పేరుతో ఆర్టీసి పురుష సిబ్బంది  మహిళలను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. మహిళలపై హింస పెరుగుతుందని, దీనిని పూర్తిగా నివారించాలని ఆమె డిమాండ్ చేశారు. సామాజిక విశ్లేషకులు డాక్టర్ పి .వినయ్ కుమార్ మాట్లాడుతూ. పదేళ్ల గత ప్రభుత్వ పాలనలో ప్రజలను పట్టించు కోలేదని ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆయన కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో లోక్ సత్తా తెలుగు రాష్ట్రాల కో. ఆర్డినేటర్ బండారు రామ్మోహన్ రావు, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యకుడు శ్రీనివాస్ రెడ్డి, కోవా సంస్థ అధ్యక్షుడు మజర్ హుస్సేన్, సామాజిక విశ్లేషకులు ముస్తాన్ మాలిక్, విశ్రాంత డీసీపీ ఆర్.ఎస్.ఎన్.బద్రినాధ్, టియుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, కార్యదర్శి వరకాల యాదగిరి, కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, హెచ్ యుజే అధ్యక్షుడు సిగ శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి ఏ.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇండ్లు కిరాయికి ఇస్తే పూర్తి సమాచారం తీసుకోవాలి

ఇండ్లు కిరాయికి ఇస్తే పూర్తి సమాచారం తీసుకోవాలి

-కార్డెన్ అండ్ సర్చ్ లో పాల్గొన్న సూర్యాపేట డిఎస్పీ రవి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: జిల్లా కేంద్రం 60 ఫీట్ల రోడ్డులో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించి, సామాజిక అంశాలపై పోలీసు కళాబృందంచే అవగాహన కార్యక్రమాన్ని డిఎస్పి రవి ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, రూరల్ సీఐ రాజశేఖర్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  పట్టణ కేంద్రం నందు గల 60 ఫీట్ల రోడ్డు విద్యానగర్ ప్రాంతాల్లో  పట్టణ పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది అన్నారు. అనుమతి పత్రాలు లేనటువంటి 52 ద్విచక్ర వాహనాలను, మూడు ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మహిళలకు మెరుగైన భద్రత రక్షణ కల్పించడంలో భాగంగానే ఈరోజు ఆకస్మికంగా కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరిగినదని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత, దొంగతనాల నివారణ, సీసీ కెమెరాలు ఏర్పాటు, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత మొదలగు అంశాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. వాహనదారులు వాహనాలకు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. గుర్తింపు లేని వారికి అనుమానితులకి కొత్త వ్యక్తులకు ఇండ్లు కిరాయికి ఇవ్వవద్దు అని కోరారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...