34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

తెలంగాణ తల్లి రూపం మార్చడం పై నిరసన

తెలంగాణ తల్లి రూపం మార్చడం పై నిరసన

బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: తెలంగాణ తల్లి రూపం మార్చడం పై  ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు  జిల్లా బిఆర్ ఎస్ పార్టీ  నాయకులు  గండూరి క్ర్రపాకర్ ఆధ్వర్యంలో ఎంజి రోడ్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాకాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పదేళ్ల పాటు ప్రజల చే తల్లిగా పూజలు అందుకున్న తెలంగాణ తల్లి రూపం మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చిందని అన్నారు. ఎక్కడైనా తల్లి రూపం మారుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర పండుగ  బతుకమ్మ ను లేకుండా నూతన విగ్రహం రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు  భిక్షం, శోభ, శారద, నాగమ్మ, స్వాతి, వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, గోపగాని పాపయ్య, తండు కృష్ణ, పోతు సాగర్, లతీఫ్, పొన్నాల ముత్తా రెడ్డి, కుక్కడపు రాములు, అనిల్, జ్యోతుల రూపేష్, మేకల‌ప్రశాంత్, ఉల్లి రామాచారి, సిద్దిరాల భూపతి కుమార్, సందీప్, కోసల శ్రీనివాస్, పెప్సి శివన్న, కళ్యాణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్నారు

రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ 

రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ 

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.    మంగళవారం కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల లో సమావేశం నిర్వహించి రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పై చర్చించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 491 గ్రామ పంచాయతీలలోని వార్డులలో 4350  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పోలింగ్ కేంద్రాల జాబితాను గ్రామ పంచాయతీలలో   ప్రధర్చించడం జరిగిందని అన్నారు. ఈ రోజు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు గానే ఈ నెల 12 వతేదీన గురువారం మండల కేంద్రాలలో ఎంపిడిఓ లు మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారని ఓటర్ల సౌకర్యం కోసం గ్రామపంచాయతీ వార్డులలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేస్తే అవుసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, జెడ్పి సిఇఓ రమేష్, డిఎల్పిఓ మల్లికార్జున్, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్  ఇమాముద్దీన్, గియాశుద్దీన్, బిఆర్ఎస్ మోహన్ లాల్, బీజేపీ విభీషన్ రెడ్డి, బిఎస్పీ వెంకట్, తిరుపతి, రాజు, ఏఐఎంఐఎం ఎండి మునీర్, సిపీఐ రవికుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ సతీష్ కుమార్, పున్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మినీ స్టేడియంలో సిఎం కప్ -2024 ప్రారంభించిన మంత్రి 

మినీ స్టేడియంలో సిఎం కప్ -2024 ప్రారంభించిన మంత్రి 

హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో సిఎం కప్ -2024 ప్రారంభోత్సవ కార్యక్రానికి హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా సిఎం కప్ లో భాగంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ వర్సెస్  పోతారం కబడ్డీ మ్యాచ్ తిలకించారు. కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత, సింగిల్ విండో చైర్మన్ శివయ్య , కౌన్సిలర్లు , హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక  చందు ,ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంఈవో ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

గ్రామీణ స్థితిగతులను అధ్యయనం 

గ్రామీణ స్థితిగతులను అధ్యయనం 

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10:

గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా లయోలా అకాడమీ సికింద్రాబాద్ కి చెందిన బిఎస్సి వ్యవసాయ డిగ్రీ కోర్సు విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ విధానాలు స్థితిగతులను  తెలుసుకొని గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ(పిఆర్ఎ) ద్వారా అధ్యయనం చేసినట్లు కెవికె గడ్డిపల్లి ప్రోగ్రామ్ అసిస్టెంట్, రావే ఇన్చార్జి ఆకుల నరేష్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు కుసుమవారి గూడెంలో మంగళవారం నిర్వహించిన గ్రామీణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ విద్యార్థులు గ్రామ పటం ద్వారా గ్రామంలోని మౌలిక సదుపాయాలు, సాగు భూమి విస్తీర్ణం, నీటి పారుదల, నేల రకాలు, వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఈ సదస్సులో వివరించారు. ఈ సంధర్భంగా విద్యార్దులు గ్రామంలో రైతులు ఎక్కువగా వరి పంటనే పండిస్తున్నారని, ఓకే పంట పండించడం వలన చీడపీడలు ఎక్కువ అవుతున్నాయని రైతులకు తెలిపారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి నరేష్ వివరించారు. రైతులు సరైన అవగాహన లేక రసాయన ఎరువులు వాడుతున్నారని తెలిపారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం, ఇతర పంట సాగు గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో  సామాజికవేత్త గంగా లింగారెడ్డి, రైతులు జిన్న చంద్రారెడ్డి, ఇరగదిoడ్ల సైదులు, వెన్న మధుసూదన్ రెడ్డి, జూలకంటి నాగేందర్ రెడ్డి, కుర్రి నాగయ్య, కుర్రి శేఖర్, పోతురాజు సాగర్,జిన్న ప్రభాకర్ రెడ్డి, వల్లపట్ల నాగయ్య, వల్లపట్ల ఉపేందర్, ఇరగదిoడ్ల యాదగిరి తదితర పాల్గొన్నారు.

ఆంధ్రలో మారో సినీ స్టార్ కు మంత్రి పదవి.!

ఆంధ్రలో మారో సినీ స్టార్ కు మంత్రి పదవి.!

-దృవీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 

అమరావతి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10:

ఆంద్రప్రదేశ్  రాష్ట్రంలో మరో సినీహీరో కు మంత్రి పదవి దక్కింది.. ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్‌లో చోటు దక్కింది.. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.. 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా.. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా ఆ ఒక్క స్థానం జనసేన నుంచే భర్తీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చంద్రబాబు మంగళవారం పత్రిక  ప్రకటనలో తెలిపారు. నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్‌లో చోటు..

14న దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మ భవనం ప్రారంభం

14న దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మ భవనం ప్రారంభం 

-ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10:

ఈనెల 14న నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ వద్ద దొడ్డి కొమరయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పై డా, బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవన ప్రారంభోత్సవానికి దాదాపు 30 వేల మంది సభలో పాల్గొననున్నారని,  ఇందుకు సంబంధించి జన సమీకరణ చేయాలని కురుమ సంఘం ప్రతినిధులకు ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వారికి కావాల్సిన వాహనాలను ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు సభ స్థల పరిశీలన తదితర వాటిని జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. కురుమ సంఘం భవనానికి విద్యుత్ కనెక్షన్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ కనెక్షన్స్ కి సంబంధించిన పేమెంట్ ను జిల్లా కలెక్టర్ చెల్లించాలని సూచించారు. సభ డయస్, బరికేడింగ్, లైటింగ్, జనరేటర్, పార్కింగ్ తదితర వాటిపై ఆర్ అండ్ బి అధికారులకు సూచనలు చేశారు. స్టేజి డెకరేషన్ బ్యూటిఫికేషన్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తదితర వాటిపై సూచించారు. ఎల్ఈడి స్క్రీన్, బద్రత తో వచ్చేటువంటి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలిసులకు ఆదేశించారు. పవర్ సప్లై, సైట్ లెవెలింగ్ విప్ రూట్, పార్కింగ్, మెడికల్ క్యాంపు, అంబులెన్స్,సైనింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని, తాత్కాలిక మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని నర్సింగి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అన్ని విభాగాలను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం బీసీ సంక్షేమ శాఖ  సెక్రటరీ శ్రీధర్ ,  హెచ్ఎండిఎ కమిషనర్ సర్పరాజ్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి ,జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఐ అండ్ పిఆర్ కమిషనర్ హరీష్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

వయనాడ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గెలవడం చారిత్రక అవసరం

వయనాడ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గెలవడం చారిత్రక అవసరం

న్యూఢిల్లీ, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయిన తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క.. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీకి వివరించారు..వయనాడ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క..

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్ల మృతి కలిచి వేసింది

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్ల మృతి కలిచి వేసింది

-రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజులు

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: ఇటీవల రోడ్డు ప్రమాదం లో  కానిస్టేబుళ్ల మృతి పట్ల సిద్దిపేట జిల్లా  రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ వద్ద కానిస్టేబుళ్ల మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలీస్ రాజులు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా లో రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి నవీన్, వెంకట్  పరందాములు  మరణించడం బాధాకరమన్నారు. పోలీస్ ఉద్యోగం పట్ల ప్రేమతో కానిస్టేబుళ్లుగా విధులను నిర్వర్తించడం లో పోలీస్ డిపార్ట్ మెంట్ విలువలకు కట్టుబడి పని చేసారని అన్నారు. వారికి ఎంతో సర్వీస్ ఉంది. కానీ విధి వారిని రోడ్డు ప్రమాదంలో కాటేసిందని అవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ సంఘం నాయకులు వీరారెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటాద్రి, మల్లయ్య, చంద్రయ్య, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కృష్ణ కన్నుమూత.!

మాజీ ముఖ్యమంత్రి కృష్ణ కన్నుమూత.!

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: 

కర్ణాటక మాజీ సీఎం కేంద్రం మాజీ ఎస్ ఎం కృష్ణ (90) కన్నుమూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వస విడిచారు  కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్ 1993-94 లో కర్ణాటక మొదటి డిప్యుటీ సీఎం 1999 నుంచి 2004 వరకు సీఎం 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ 2009 నుంచి 2012 వరకు విదేశంగ మంత్రి గా పనిచేశారు

కాల్వలోకి కారు.. ముగ్గురు మృతి..!

కాల్వలోకి కారు.. ముగ్గురు మృతి..!

అమరావతి, యదార్థవాది ప్రతినిధి డిసెంబర్ 10: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది, పి గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద అదుపుతప్పి కారు కాలువలో దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు వదిలారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నేలపూడి విజయ్ కుమార్  అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో విశాఖఫట్నం నుంచి పి గన్నవరంలోని పోతవరం వెళ్తున్న క్రమంలో ఊడి మూడి శివారులోని చింతావారి పేట గ్రామ సమీపంలోకి రాగానే పొగ మంచుతో రోడ్డు కనిపించక కారు అదుపుతప్పి కాలువ లోకి దుసుకెళ్ళినట్లు తెలుస్తుంది..

ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భర్త బ్రతికి బయటపడ్డాడు, అయితే ప్రమాద సమయంలో విజయ భాస్కర్ భార్య ఉమా, కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు సమాచారం. 

గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...