29.7 C
Hyderabad
Sunday, April 19, 2026

మాకు రాజ్యాధికారం కావాలి.

మాకు రాజ్యాధికారం కావాలి.

-సంచార జాతులకు రాజ్యాంగంలో రిజర్వేషన్ కావాలి

-పాలక పక్షం, ప్రతిపక్షం మా జాతి బిడ్డ గంగాధర్ కు అవకాశం ఇయ్యాలి

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘము అధ్వర్యంలో  సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు ఆగుళ్ల శంకర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ తిపిరిశెట్టి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్ పాల్గోన్నారు.ఈ సందర్బంగా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తిపిరిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో సంచార జాతులకు రాజకీయ అవకాశం లేకుండా పోయిందని, రాజ్యాంగంలో సంచార జాతులకు రిజర్వేషన్స్ లేక మా జాతులకు అన్యాయం జరుగుతుందని, అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలక పక్షం, ప్రతిపక్షం మాకు రాజ్యాధికారం లో భాగంగా మా కులానికి ఎమ్మెల్సీ పదవి కానీ, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఆయన అన్నారు. నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సంచర జాతి బిడ్డ మధనం గంగాధర్ ను ఈసారి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని, సంచార సామజిక వర్గాల నుండి విద్యా వేత్త మధనం గంగాధర్ తన ఉద్యోగ జీవితం త్యాగం చేసి ప్రజా సేవ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి అధికార పార్టీ సపోర్ట్ చేయాలనీ సంచార జాతుల సంఘం ప్రభుత్వాన్ని కోరారు.. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతి కులాలు బిసిల్లో 52, ఎస్సి ల్లో 10, ఎస్టీ ల్లో 4 కులాలు ఉన్నాయన్నారు. ఇవి జనాభా ప్రకారం బిసిల్లో 12శాతం, ఎస్సీ లలో 20శాతం, ఎస్టీ ల్లో 10శాతం ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రములో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న సందర్బంగా మా సంచార జాతి బిడ్డలను మొదటి ప్రాధాన్యత ఓటుతో మధనం గంగాధర్ ను గెలిపించుకుందామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆగుళ్ల శంకర్, బోయ రాములు, అరె రాములు దొమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆంజనేయులు మొండిబండ, తాళ్ల స్వామి కార్యదర్శి, దొమ్మర, గోత్రాల, వీర బద్రియ, మొండిబండ, మందుల, గంగిరెద్దుల కులాల నాయకులు పాల్గొన్నారు.

జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చి రైతులను వ్యాపారవేత్తలుగా చేద్దాం 

జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చి రైతులను వ్యాపారవేత్తలుగా చేద్దాం 

-సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి 

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: 

సిద్దిపేట జిల్లా రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయ పెంపుదల, వ్యవస్థాపక మార్కెట్ అనుసంధానాలలో సహాయం అందించి జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చి రైతులను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు కృషికల్ప ఫౌండేషన్ కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి పేర్కొన్నారు. సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సంయుక్తంగా క్రిషికల్ప జిల్లా యంత్రాంగం సహకారంతో  కలెక్టరేట్ లో నిర్వహించిన “అగ్రిసినర్జీ 2024” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన 20+ అగ్రిటెక్ స్టార్టప్‌ల ప్రదర్శన తిలకించారు. రైతులు, ఎఫ్‌పిఓ సీఈవోలు, డైరెక్టర్లు, విద్యార్థులతో సంభాశించారు. నూతన వ్యవసాయ, ఉద్యాన పరిష్కారాల ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్యానెల్ చర్చలు, విజయ గాథలు మరియు మార్కెట్ లింకేజీ మార్గదర్శనల పై చర్చించి రైతులకు ఎఫ్ పీఓ ల ద్వారా మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన ధరకు అమ్ముకునేందుకు ఎఫ్పిఓ(ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ )ల ద్వారా కృషికల్ప ఫౌండేషన్ సహకరిస్తుందని అన్నారు. ఎఫ్ పిఓ ల ద్వారా ఫెస్టిసైడ్లను అందించి వాటి  వినియోగం మార్కెట్ లో ఎక్కవ డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించి ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు, సాగుబడిలో అధునాతన సాంకేతిక పద్ధతుల వినియోగం తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించి రైతులను వారి ఉత్పత్తులను అమ్ముకోవడంలో వ్యాపారవేత్తలుగా మార్చడానికి కృషికల్ప ఫౌండేషన్ ద్వారా కృషి జరుగుతుందని అన్నారు. జిల్లాలోని అక్కన్నపేట మండలంలో ప్రహర్ష, ప్రసిద్ధ ఎఫ్ పిఓ ల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నదని అన్నారు. ఇలాంటి అదునాతన పద్దతులు జిల్లాలోని రైతులకు ప్రయోజనకరంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదర్శ రైతులు, ఎఫ్ పిఓలు, విద్యార్థులు ఇలాంటి వాటిపై స్పష్టమైన అవగాహనను పెంపొందించుకోవాలని అన్నారు. దాంతో పాటు రైతులు ఆసక్తిని కనబరిచి బృందంగా ఏర్పడి ఎఫ్.పి.ఓ. లుగా ఏర్పడాలని ఎఫ్ పిఓ ల కొరకు జిల్లాలోని వంటిమామిడి వ్యవసాయ ఉత్పత్తుల కలెక్షన్ సెంటర్ ఏర్పాటుకు కృషికల్ప ఫౌండేషన్ పరిశీలించాలని,  జిల్లాలో గల ప్రహర్ష, ప్రసిద్ధ ఎఫ్.పి.ఓ.ల ద్వారా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి సుముఖంగా ఉన్న  ఇలా అగ్రి కంపెనీతో ఎం.ఓ.యు.లను కుదిర్చారు. అనంతరం వివిధ సంస్థలు రైతులకు అందించే అవకాశాలను గురించి వివరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, కృషికల్ప ఫౌండేషన్ సిఈఓ సిఎం.పాటిల్, నాబార్డ్ డిడియం నిఖిల్, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు వ్యవసాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు..

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9:

ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పట్టణ కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు అంజద్ ఆలి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ లు  మాట్లాడుతూ  సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని రెండు సార్లు త్యాగం చేశారని, దేశ సమగ్రత, సమైక్యతల కోసం, పార్టీ పటిష్టత కోసం  పనిచేశారని అన్నారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ దెబ్బతింటుందని తెలిసి కూడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ  అమరుల త్యాగాలకు చలించి పోయిన సోనియా గాంధీ, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి, ఆత్మగౌరవ ఉద్యమాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రములో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్ లు  పోలగాని  బాలు గౌడ్,ఎలిమినేటి అభినయ్, వేములకొండ పద్మ, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, చెంచల శ్రీనివాస్, నిఖిల్, రావుల రాంబాబు, గండూరి రమేష్, నాగుల వాసు, ఆలేటిమాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

వంగరామయ్యపల్లి లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

వంగరామయ్యపల్లి లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో పార్టీ నష్టపోతుందని తెలిసినా.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తన పుట్టినరోజు సందర్భంగా 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజును సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని వంగ రామయ్య పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మండల పార్టీ అధ్యక్షులు బంకచందు ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటం ముందు గిరిజన మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు  అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 19న ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు

ఈనెల 19న ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ లో భాగంగా సిద్దిపేట జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ పర్యవేక్షనలో ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల19 న ఉంటాయిని ఇంచార్జి డి వై ఎస్ ఓ జయదేవ్ ఆర్యా, సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ సోమవారం తెలిపారు. ఫుట్బాల్ పై ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, అలాగే 10వ తరగతి నకల్ కాపీ తీసుకొని రావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులకు వారం రోజుల పాటు ప్రత్యేక కోచింగ్ ఇవ్వబడుతుందని, వారం రోజుల క్యాంప్ తర్వాత ఈ నెల 27 న హైదరాబాద్ లోని జింఖానా స్టేడియం లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటిల్లో పాల్గొంటారని తెలిపారు.

సమయపాలన పాటిద్దాం.. ప్రజల నుండి వినతుల స్వీకరిద్దాం 

సమయపాలన పాటిద్దాం.. ప్రజల నుండి వినతుల స్వీకరిద్దాం 

-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు సమయపాలనకు ప్రాధాన్యత నివ్వాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణిలో సంబంధిత డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు సంబంధిత ఇతర శాఖల అధికారులతో  కలిసి వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన ప్రజల నుండి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని అధికారులందరూ ప్రజావాణి రోజున 10-15 నిమిషాలకల్లా హాజరు కావాలని తెలిపారు.  డబల్ బెడ్ రూమ్ ఇండ్లు-06, ధరణి- 23, పింఛన్లు-02, ఇతర సమస్యలు-22 మొత్తం 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును మీ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, మీ పరిధి కాని సమస్యలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలన్నారు. 

సాంకేతిక నైపుణ్యతను అంది పుచ్చుకోవాలి

సాంకేతిక నైపుణ్యతను అంది పుచ్చుకోవాలి

-రాష్ట మంత్రి సీతక్క

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: వెంగళరావు నగర్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థను సందర్శించిన మంత్రి సీతక్క. ఈ సంద్భంగా మంత్రి సీతక్కకు ఆప్యాయంగా స్వాగతం పలికిన విద్యార్థులు.. విద్యార్థినిలతో మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్న అనంతరం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినుల కేరింతల నడుమ వారితో  కలిసి కేక్ కట్ చేసి విద్యార్థినులకు కేక్ తినిపించిన సీతక్క.. మంత్రి సీతక్క ఆప్యాయత, అనురాగాన్ని చూసి సంతోష పడ్డ విద్యార్థులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదని, నేను కూడా హాస్టల్లోనే ఉండి చదువుకున్నానని, హాస్టల్లో ఎంతోమంది స్నేహితులు ఉంటారు వారితో రకరకాల ఐడియాస్ ను, సంతోషాన్ని, బాధని పంచుకోవచ్చు.. ఒకరికొకరు చేయూతగా నిలవచ్చు.. భవిష్యత్తును కూడా ప్లాన్ చేసుకోవచ్చని అన్నారు. రాష్ట ప్రభుత్వం అందించే  అవకాశాలను వినియోగించుకుని ఉన్నత స్థానంలోకి రావాలని ఆకాంక్షించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక నైపుణ్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రోత్సహిస్తోందని, స్కిల్ యూనివర్సిటీ ని ఇప్పటికే ప్రారంభించుకున్నామని, జాబ్ మార్కెట్ కు అనుగుణంగా ఉపాధి రంగాన్ని ఎంచుకోవాలి.. లక్ష్యాన్ని తోటి ఈరోజు నుంచే అడుగులు వేయడం ప్రారంభించి లక్ష సాధనలో విజయం సాధిస్తారని మంత్రి సీతక్క అన్నారు. వెంగళరావు నగర్ లోని ప్రభుత్వ శిశువిహార్ ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క.

దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి

దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి

-రేపు సమీకృత కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి ప్రారంభం

-మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: జిల్లాలో ఉన్న దివ్యాంగుల కొరకు ప్రతినెల రెండవ మంగళవారం ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి  జిల్లా కలెక్టర్ దివ్యాంగుల ప్రత్యేక  ప్రజావాణిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగుల కొరకు ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండి  వెంటనే ప్రజావాణిపై అధికారులతో సంప్రదించి  నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.. ప్రతినెల రెండో మంగళవారం ప్రజావాణి ఏర్పాటు చేయాలని సంబంధిత గ్రామీణ అభివృద్ధి, జిల్లా స్త్రీ శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ,సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి ఉంటుందన్నారు. సంబంధిత సంక్షేమ శాఖ అధికారి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి జిల్లా స్త్రీ శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఎల్ డి ఎం, ఆర్టీసీ డిఎం, మెప్మా పీడీ సంబంధిత శాఖల అధికారులు హాజరుకావాలని కలెక్టర్ సందర్భంగా ఆదేశించారు..

మానవ సంభధాలును దెబ్బతీస్తున్న చరవాణిని..

మానవ సంభధాలును దెబ్బతీస్తున్న చరవాణిని..

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9:

పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చారవాణి, ( సేల్ పోన్ ) సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు..

ఈ రోజుల్లో మానవ సంబంధాలు దెబ్బతినడానికి అధునాతనమైన చరవాణిలే.. ప్రధాన కారణమని ఓ సర్వేలో తేలింది..

73శాతం పేరెంట్స్, 69శాతం పిల్లలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.

తల్లిదండ్రులు వదిలి ఉండలేని వారు 76శాతం ఉంటే, పిల్లలను వదిలి ఉండలేని వారు 71శాతం ఉన్నారు.

తల్లిదండ్రులు చరవాణిని తగ్గించి ఆదర్శంగా నిలవకుండా, అర్థవంతమైన బంధాలను ఏర్పరచుకోనే విషయంలో తమ పిల్లల సామర్థ్యాల పై ఆందోళనగా ఉన్నట్టు సర్వే తేల్చడం గమనార్హం.

74 లో డిగ్రీ చేసిన పూర్వ విద్యార్థులతో 50 ఏండ్ల  స్వర్ణోత్సవాల వేడుకలు 

74 లో డిగ్రీ చేసిన పూర్వ విద్యార్థులతో 50 ఏండ్ల  స్వర్ణోత్సవాల వేడుకలు 

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1974లో డిగ్రీ పూర్తి చేసి యాబై  సంవత్సరాలు పూర్తయినందున కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించే తల పెట్టామని స్వర్ణోత్సవ సంబరాల వేదిక కమిటీ సభ్యులు హరిశ్చంద్ర తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు అమ్మన చంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడుతూ ఈనెల 20న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియం ఈ సంవత్సరం సంబరాలకు వేదిక కానుందని, ఈ స్వర్ణోత్సవం సంబరాలు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన కొనసాగుతాయని, 1974లో డిగ్రీ పూర్తి చేసిన అన్ని బ్యాచ్ ల, గ్రూపుల విద్యార్థులు ఈ స్వర్ణోత్సవ సంబరాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 1974లో సిద్దిపేటలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకున్నారని ఇప్పుడు ఎక్కడ ఉన్న సంబరాలలో పాల్గొనాలన్నారు. పూర్వ విద్యార్థులకు అధ్యాపకులకు ఈ సందర్భంగా సన్మానం చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం కమిటీ సభ్యులను నేరుగా కానీ, ఫోన్ ద్వారా 9618195145 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...