29.7 C
Hyderabad
Sunday, April 19, 2026

ఘనంగా సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు

* కేక్ కట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు
* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన తల్లి

ఖమ్మం, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదినోత్సవాన్ని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ కట్ చేశారు. అనంతరం పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఏర్పాటు చేశారని తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా తల్లి పాత్ర పోషించారని గుర్తు చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ సోనియాకు తెలంగాణ అంటే ప్రత్యేక అభిమానమని, అంతకుమించిన అనుబంధమని అన్నారు. ఆవిడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ పార్టీ నాయకులు, శ్రేణులంతా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నాయకులు మిక్కిలినేని నరేందర్, మందడపు మనోహర్, తాళ్లూరి రాము, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, ఉమ్మినేని కృష్ణ, లింగాల రవికుమార్, ఎయిర్టెల్ నరసింహారావు, మక్కా శేఖర్ గౌడ్, బోడ శ్రావణ్, భానోత్ ఉత్తేజ్ నాయక్, సురేష్ నాయక్, సైదులు, గురుమూర్తి, మాజీద్, అంజనీ కుమార్, బచ్చలకూరి నాగరాజు, పార్వతి రెడ్డి, శ్రీకళా రెడ్డి, హారిక నాయుడు, జిల్లా సాంస్కృతిక విభాగ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

చెన్నమనేని పిటీషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు

చెన్నమనేని పిటీషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు

సిరిసిల్ల, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: కోర్టును తప్పుదోవ పట్టించినందుకు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. సుదీర్ఘ కాలంగా కొట్లాడుతున్న కేసులో గెలుపొందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..15 ఏండ్లుగా చెన్నమనేని రమేష్ చేస్తున్న మోసాలను బయటపెడ్తున్నారు. 

దశాబ్దన్నర కాలంగా చెన్నమనేని రమేష్ ప్రభుత్వాన్ని, కోర్టును, వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడని ఆది శ్రీనివాస్ అన్నారు..

చెన్నమనేని పిటీషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..15 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది..

విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని, ఇందుకు చెన్నమనేని రమేష్ కు 30 లక్షల జరిమానా విధించిన హైకోర్టు.. ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు, 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేని రమేష్ కు హైకోర్టు ఆదేశం..

ఆది శ్రీనివాస్ తరఫున సీనియర్ అడ్వకేట్లు రవి కిరణ్ రావు, రోహిత్ వాదించారు..

డీజిల్ను దొంగల్ని పట్టుకున్న పోలీసులు

డీజిల్ను దొంగల్ని పట్టుకున్న పోలీసులు

నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ధపల్లి గ్రామం మరియు డిచ్పల్లి ఖిల్లా వద్దగల సెల్ టవర్ల యొక్క జనరేటర్ ల నుండి డీజిల్ ని దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు డిచ్ పల్లి పోలీసులు తెలిపారు. ఇందల్వాయి మండలానికి చెందిన తిరుమన్పల్లి గ్రామస్థులు మహమ్మద్ సమీర్, కలిగొట్ సాకలి కార్తీక్, వీరిద్దరూ మరొక మైనర్ తో కలిసి డిచ్ పల్లి మండలం, ఇందల్వాయి మండలం, జక్రాన్పల్లి మండలం, సదాశివ నగర్ మండలం ఇతర చుట్టు పక్కల మండలాలలో గల సెల్ టవర్ల యొక్క జనరేటర్ల నుండి డీజిల్ ను దొంగతనం చేసి బయట వేరే వ్యక్తులకు అమ్ముకునేవారని నిర్దారించారు. వీరు ఇప్పటి వరకు నాలుగు మండలాలలో కలిపి అందాజ 900 లీటర్ల వరకు డీజిల్ ను దొంగిలించినారు. ఇట్టి నేరస్తులను కోర్టు యందు హాజరు పరచగా, గౌరవ కోర్టు  నేరస్తులను రిమాండ్ కు తరలించనైనదని డిచ్ పల్లి ఎస్సై తెలిపారు.

ఘనంగా మల్లన్న జాతర వేడుకలు

ఘనంగా మల్లన్న జాతర వేడుకలు

నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో దమ్మన్నపేట్ గ్రామంలో మల్లన్న జాతర యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం వారు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని మల్లన్న గుడికి డప్పు వాయిద్యాలతో చేరుకున్నారు. మల్లన్న కి పూజలు నిర్వహించారు. పూలమాలలు వేసి నైవేద్యాలు అన్నప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దమన్న పేట గ్రామ ప్రజలు భక్తులు యాదవ సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.

పట్టణంలో వ్యక్తి దారుణ హత్య

పట్టణంలో వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని మిర్చి కంపౌండ్ లో ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన యూసుఫ్ (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు యూసుఫ్ తోపాటు. మరో ఇద్దరు ఓ ట్రాన్స్ పోర్టు కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి నిద్రించారు. ఆ ముగ్గురిలో యూసుఫ్ దారుణ హత్యకు గురి కాగా.. మిగతా ఇద్దరు వ్యక్తులు ఉదయం నుంచి అక్కడ కనిపించలేదు. యూసుఫ్ తో పాటు అక్కడ పడుకున్న ఇద్దరు వ్యక్తులే..యూసుఫ్ గొంతుకోసి హత్య చేసారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ పోర్టు యజమాని పోలీసులకు సమాచారం అందించగా.. వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి, ఎస్సై మొగులయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. యూసుఫ్ తోపాటు నిద్రించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సమస్యల సాధన కొరకై చలో హైదరాబాద్

సమస్యల సాధన కొరకై చలో హైదరాబాద్

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: ఆశా వర్కర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూర్జహాన్ మాట్లాడుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు రెస్టు లేకుండా అనేక కార్యక్రమాల్లో ఆశా వర్కర్లు పాల్గొంటున్నారని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తమవంతుగా సేవలు అందిస్తున్నారని వాళ్ళు చేసే సేవకు తగిన ఫలితం దక్కకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి. అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఆశ వర్కర్లకు తగిన న్యాయం చేసి తీర్మానం చేయాలని  నూర్జహాన్ పిలుపునిచ్చారు.

బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: జల్సాల కోసం బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ ఎస్ట్రైచ్ రఘుపతి ఆదివారం తెలిపారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన ప్రశాంత్ (28) జల్సాల కోసం నగరంలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకోనీ విచరించగా బైకు చోరీల నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకుని, రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. కేసును చేదించిన ఏఎస్ఐ షకీల్, కానిస్టేబుల్ గంగారం, ఉన్నతాధికారులు అభినందించారు.

భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో రాష్ట్రస్థాయి పురస్కారం

భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో రాష్ట్రస్థాయి పురస్కారం

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: భగవద్గీత జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించబడిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో సూర్యాపేటకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో బహుమతులు గెలుచుకున్నారని దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమార్ తెలిపారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదివారం హైదరాబాద్ రామాంతాపూర్ అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో  జరిగిన రాష్ట్ర స్థాయి  పోటీలో నవోదయ పాఠశాలకు చెందిన మహ్మద్ ఆయేషా ఫాతిమా, గైగుళ్ళ హేమశ్రీ విజయం సాధించారాని తెలిపారు. గత వారం సూర్యాపేటలో ఐక్య వేదిక  ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో గెలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపగా అక్కడ విజేతలుగా నిలిచారాని తెలిపారు.  విద్యార్థులకు వారి తల్లితండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి వారు హృదయపూర్వకంగా అభినందనలుతెలియజేశారు.

ప్రభుత్వాన్ని, పార్టీని పటిష్టం చేద్దాం

ప్రభుత్వాన్ని, పార్టీని పటిష్టం చేద్దాం

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8:

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తూ, ఏడాదిలోనే ప్రజల మెప్పు పొందుతున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని యువజన కాంగ్రెస్ బలోపేతం చేయాలని టిపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్, షాద్ నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు పులిమామిడి రాజేష్ గౌడ్ నేతృత్వంలో యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల శ్రీనాథ్, టౌన్ అధ్యక్షుడు సాయి వంశీ యూత్ కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందనీ షాద్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పులిమామిడి రాజేష్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యువజన కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రజలు జనరంజక పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ సేవకులుగా నిలిచిపోవాలని అన్నారు. కష్టపడ్డ వారికి పార్టీ గుర్తిస్తుందని పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం యువత ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని వారికి ప్రత్యేక ప్రాధాన్యత పార్టీ ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ.. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగిందని, యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా ఆయనను కలుసుకుందామని తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాజేష్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీ గౌడ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, నవీన్ అజయ్, రాహుల్, ప్రవీణ్ కుమార్, లడ్డు సాయి, శీను వేణు కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

డిసెంబర్ 16న గడ్కోల్ లో

డిసెంబర్ 16న గడ్కోల్ లో

-ఎల్లన్న స్మారక సభను జయప్రదం చేయండి

నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు పిట్ల ఎల్లన్న 34వ స్మారక సభను గడ్కోల్ గ్రామంలో 2024 డిసెంబర్ 16న నిర్వహిస్తున్నామని న్యూ డెమోక్రసీ సబ్ కార్యదర్శి బాలయ్య  ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి  మార్క్స్ తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలోని రేకులపల్లిలో పత్రిక సమావేశం నిర్వహించారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. పేదింటిలోపుట్టిన ఎల్లన్న, శ్రమజీవుల రాజ్యం కోసం రైతు కూలీ సంఘం నాయకుడిగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని వారు తెలిపారు. 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో పాలకులు మారిన ప్రజల బతుకులు మారడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం విఫలం చెందిందని వారు అన్నారు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోడు భూములకు పట్టాలను ఇవ్వాలని, రుణమాఫీ మిగిలిన వారందరికీ యుద్ధ ప్రాతిపదికను జమ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సమాజ మార్పు కోసం పోరాటమే ఎల్లన్నకు నిజమైన నివాళులు అన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు గంగాధర్.లక్ష్మణ్.దాసు.భూమయ్య. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...