27.7 C
Hyderabad
Sunday, April 19, 2026

8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

నిర్మల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిర్మల్ మండలంలోని లక్ష్మణ్ చందాలోని ఓ గ్రామనికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.. శనివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మేన సాగర్(36) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి చిన్నారిపై  లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.

బీసీ.ఎస్సీ.ఎస్టీలకు.అండగా కాంగ్రెస్ పార్టీ

బీసీ.ఎస్సీ.ఎస్టీలకు.అండగా కాంగ్రెస్ పార్టీ

నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి కి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి కి, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ బంజారా సోదరులు. మండల కేంద్రంలోని బంజర భవనం యందు ముఖ్యమంత్రి.కి ఎమ్మెల్యే.కి పాలాభిషేకం చేయడం జరిగింది సంవత్సరకాలం ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ ల హామీలలో చాలావరకు హామీలను నెరవేర్చి ప్రజల గొంతు కలకై ప్రజల కొరకు చెప్పిన వాగ్దానం తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం బంజారా సోదరులకు వెన్నంటూ ఉండి అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తూ రైతుల రుణమాఫీ.రైతులకు 500 బోనస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ పథకం 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక మంచి పథకాలను ప్రజలకు అందిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి కి, సిరికొండ మండల బంజారా సోదరులు నిజామాబాద్ రూరల్ బంజర సోదరులు వెన్నంటి ఉండి రుణపడి ఉంటారని సిరికొండ మండలం నుండి బంజర నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ నాయక్, జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, జిల్లా ఎస్టీ సెల్ నాయకులు సంతోష్ నాయక్, మాజీ జడ్పిటిసి మాన్సింగ్ నాయక్, రూరల్ యువజన విభాగం కార్యదర్శి భూపతి నాయక్, నిజామాబాద్ రూరల్ సీనియర్ నాయకులు భూక్యా సంతోష్ నాయక్, నిజామాబాద్ రూరల్ యువ నాయకులు జయరాం నాయక్. మరియు ఇతర బంజారా నాయకులు పాల్గొన్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని చెబుతూ హర్షించడం జరిగింది సంవత్సరకాలం పూర్తిచేసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి. ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బంజర సోదరులు అనేకమంది పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో తెలంగాణ 

అభివృద్ధి పథంలో తెలంగాణ 

-తెలంగాణ కల సోనియా వల్లే సాకారం –

సోనియా ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి

-రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: అసాధ్యం అనుకున్న తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేవలం సోనియా గాంధీ దృఢ నిశ్చయం, త్యాగ నిరతి వల్లే సాధ్యమయ్యిందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ అమూల్యమైన పాత్రను ప్రతిబింబిస్తూ సీనియర్ జర్నలిస్ట్  పురుషోత్తం నారగౌని  రాసిన “మదర్ ఆఫ్ ది సాయిల్” పుస్తకాన్ని  పొన్నం ప్రభాకర్ ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి  పొన్నం మాట్లాడుతూ సోనియా గాంధీని “తెలంగాణ దేవత” “తెలంగాణ కోసం ఆమె చూపిన సంకల్పం, పట్టుదల అనన్యమైనవి.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు సోనియా గాంధీ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ప్రతి పోరాటంలో మన ఆవేదన, ఆశల కోసం సోనియా గాంధీ అందించిన మద్దతు వెలకట్టలేనిదని, ఉద్యమ సమయంలో ఎదురైన సవాళ్లను, ప్రజల ఆవేదనను, పార్టీగా తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, పొన్నం ప్రభాకర్ ఉద్యమ కాలంలో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. “తెలంగాణ ప్రజల ఆశయాలను సాకారం చేయడానికి సోనియా గాంధీ చూపించిన పట్టుదల తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీ త్యాగం మరియు సోనియా గాంధీ నాయకత్వంవల్లే రాష్ట్ర కల సాకారం అయ్యిందన్నారు “తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని ఎప్పటికీ మరచిపోలేము. సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే అధికారం కోల్పోయినా వెనక్కి తగ్గలేదు,” అని ఆయన అన్నారు. అలాగే సోనియా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. “సోనియమ్మ కలల రాష్ట్రాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారతపై దృష్టిపెట్టి సోనియా ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు,” అని పొన్నం ప్రభాకర్ అన్నారు. రచయిత సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని తన “మదర్ ఆఫ్ ది సాయిల్” పుస్తకం గురించి మాట్లాడుతూ, ఇది సోనియా గాంధీకి మాత్రమే కాకుండా, కోట్లాది మంది తెలంగాణ ప్రజల కలలు, ఆశయాలకు అంకితమని చెప్పారు. ఈ పుస్తకానికి పరిశోధనతో పాటు సున్నితమైన రచనా శైలి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

గజ్వేల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

-రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి..

-తీవ్ర ధ్రిగ్బాంతికి గురైన మంత్రి పొన్నం ప్రభాకర్

గజ్వేల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: గజ్వేల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్ లు మరణించడం తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు, గాడిచర్ల పల్లి గ్రామాలకు చెందిన వెంకటేశ్, పరందాములు దౌల్తాబాద్, రాయాపోల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం గజ్వేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్ లు మరణించడం తీవ్ర ధ్రిగ్బాంతి కి గురి చేసిందని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంత చిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయింది వారికి ఆ దేవుడి ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబాలకు ప్రభుత్యం అండగా ఉంతుందని మంత్రి తెలిపారు.

ప్రజాపాలనకు నవ వసంతం.

ప్రజాపాలనకు నవ వసంతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్దికి పక్కా ప్రణాళిక

కార్మిక.. ధార్మిక క్షేత్రాలు.. మధ్య మానేరు నిర్వాసితులఫై ప్రత్యేక శ్రద్ధ

ఆరు గ్యారంటీల కింద రూ. 500 కోట్ల లబ్ది రూ.381 కోట్ల రుణమాఫీ

రాజన్న సిరిసిల్ల జిల్లా, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాలు అమలు చేసి రికార్డు సృష్టించింది. జిల్లా సమగ్రాభివృద్దికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. రాజన్న భక్తులకు వేగంగా దర్శనం.. వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసింది. సిరిసిల్ల మర నేత కార్మికుల ముప్పై ఏండ్ల కల సాకారం చేసే పనులకు శ్రీకారం చుట్టింది. నేత కార్మికులు స్వయం సమృద్ది సాదించేందుకు నిధులు మంజూరు చేసి, చేతి నిండా పనిని అందిస్తూ ఆదుకుంటున్నది. రైతు రుణ మాఫీ, మహా లక్ష్మి పథకం కింద ఉచిత బస్సు, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ కు ఇప్పటిదాకా దాదాపు రూ.500 కోట్ల లబ్ది చేకూరింది.

రూ. 381 కోట్ల రుణ మాఫీ.. రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజాప్రభుత్వం సుసాధ్యం చేసింది. జిల్లాలో మూడు విడుతలలో 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 46 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. మహిళా మణులకు అభయహస్తం.. మహాలక్ష్మీ గ్యారెంటీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సాకర్యం అమలు చేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 61 కోట్ల 60 లక్షల రూపాయల విలువ గల 1 కోటి 64 లక్షల 56 వేల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. మహిళలు ఉత్సాహ వంతంగా తమ విధి నిర్వహణకు, రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాలు, పర్యాటక స్థలాలకు, బంధువులు, స్నేహితుల ఇండ్లకు ప్రయాణం చేస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలో ఇప్పటి వరకు 93 వేల 104 మంది కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 7 కోట్ల 35 లక్షల 39 వేల రూపాయల సబ్సిడీ సొమ్ము జమచేశాం. రాష్ట్రంలోని పేదలకు, వెనుకబడిన వర్గాల ప్రజల గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. పథకం క్రింద మార్చి 1, 2024  నుంచి ఆగస్టు 10, 2024 వరకు 8 లక్షల 41 వేల 643 జీరో బిల్లులు జారీచేయడం జరిగింది. ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 37 కోట్ల 50 లక్షల రూపాయలను గృహజ్యోతి క్రింద చెల్లించడం జరిగింది. మధ్య మానేరు నిర్వాసితులకు మేలు.. సొంత ఇండ్లు ఉండాలనేది ప్రతి సామాన్యుడి జీవిత కల. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఇండ్లులేని అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.5 లక్షలు,  ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో  3 వేల 500  ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దాదాపు రూ. 236 కోట్ల విలువైన 4,696 ఇందిరమ్మ ఇండ్లు మధ్య మానేరు నిర్వాసితులు, వేములవాడ నియోజకవర్గానికి మంజూరు చేశారు. రాజన్న ఆలయ అభివృద్దికి శ్రీకారం.. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తులకు సులభంగా వేగంగా దర్శనం కల్పించేందుకు, వేములవాడ మూలవాగు మీదుగా రాజన్న ఆలయానికి చేరుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రూ.127 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో పెండింగ్ పనుల్లో వేగం పెరిగి త్వరలో పట్టణ వాసులు, భక్తులకు అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్ సమస్య దూరం కానుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రీతి పాత్రమైన మొక్కు అయిన కోడెలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటి ఇబ్బందులు దూరం చేస్తున్నది. వాటికి నిలువ నీడ కల్పించేందుకు షెడ్లు దాదాపు రూ.66 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చాం. రూ. 43 లక్షలతో సీసీ ఫ్లోరింగ్, రూ.18 లక్షలతో డ్రైనేజీ, జాతర గ్రౌండ్ వద్ద ఉన్న గోశాలలో రూ. 50 లక్షలతో షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశాం. రూ. 35 కోట్ల అంచనాలతో అన్నదాన సత్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

నెరవేరిన నేతన్నల మూడు దశాబ్దాల కల.. 

సిరిసిల్లలోని నేతన్నలకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. సమగ్ర శిక్ష  కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం క్లాత్ ఉత్పత్తి చేసే ఆర్డర్లను సిరిసిల్లలోని వస్ర పరిశ్రమకు అందజేసింది. జిల్లాలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు రెండు యూనిఫాంల చొప్పున పంపిణీ చేసింది. దాదాపు రూ. 28 కోట్ల 84 లక్షల విలువైన క్లాత్ ఆర్డర్లను సిరిసిల్ల నేత పరిశ్రమకు అందజేసింది. బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్ల బకాయిలు రూపాయలు 379 కోట్లు సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెల్లించడం జరిగింది. అలాగే 66 లక్షల మీటర్ల ఆర్వీఎం క్లాత్ ఆర్డర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సిరిసిల్ల నేత కార్మికుల మూడు దశాబ్దాల కల నెరవేరనుంది. రూ.50 కోట్లతో వేములవాడలో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. 90 శాతం క్రెడిట్ ఫై నేత కార్మికులకు యార్న్ అందజేసి, టేస్కో ఆధ్యర్యంలో సరుకు సేకరించనున్నారు. త్వరలో హైదరాబాదులోని హోల్ సేల్ క్లాత్ డీలర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. 11,698 మంది కార్మికులకు త్రిఫ్ట్ కింద రూ.36 కోట్లు, నేతన్నకు 43 మంది రూ.5 లక్షల చొప్పున పంపిణి చేశారు. యారన్ సబ్సిడీ కింద రూ.37 కోట్లు చెల్లించారు.

455 మందికి ప్రమోషన్లు.. 260 మందికి కొలువులు

ప్రజా ప్రభుత్వం సర్కార్ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఖాళీగా పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. ఐటీఐలను అడ్వాన్స్డ్ సెంటర్లుగా అభివృద్ది చేస్తున్నది. జిల్లాలోని 510 ప్రభుత్వ పాఠశాలల్లో 45 వేల 97 మంది విద్యార్థులు చదువుతున్నారు. 7 మోడల్ పాఠశాలలు, 13 కస్తుర్భాగాంధీ విద్యాలయాలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గాను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద 283 పాఠశాలలను ఎంపిక చేసి త్రాగు నీరు, మేజర్, మైనర్ రిపేర్స్, టాయిలెట్ల మరమ్మతులు చేయించడం జరిగింది. ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కింద ఈ ఏడాది 4 వేల 384 మంది విద్యార్థులు చేరడం జరిగింది. అలాగే దాదాపు 136 మంది స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, బాషా పండితులు, పీఈటీల పోస్ట్ లు భర్తీ చేసి, నియామక పత్రాలు అందజేశారు. అలాగే 455 మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించారు. 124 మందిని గ్రూప్ -4 కింద ఉద్యోగాలు సాదించారు.

సాగుకు ఊపిరి పెండింగ్ సాగు నీటి ప్రాజెక్ట్ ల ప్రత్యేక దృష్టి..

జిల్లాలోని పెండింగ్ సాగు నీటి ప్రాజెక్ట్ ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 9 రూ.1 వేయి 180 కోట్లతో  ఇప్పటి దాకా 81 శాతం పూర్తి చేశారు. మిగితా పని పూర్తి చేసేందుకు రూ.340 కోట్లు కేటాయించారు. ఈ పనులు పూర్తి అయితే సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండల్లాలోని 56 వేల ఎకరాలకు, వేములవాడ నియోజక వర్గంలోని కోనరావుపేట మండలంలోని 30 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 10..

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 10 పనులు రూ.2400 కోట్లతో 90 శాతం పూర్తి చేశారు. మిగితా పనులు పూర్తి చేసేందుకు రూ.134 కోట్లు కేటాయించారు. మానకొండూర్ నియోజక వర్గంలోని ఇల్లంతకుంట మండలానికి 15 వేల ఎకరాలు సాగులోకి రానుంది. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 11 పనులు రూ. 2 వేల400 కోట్లతో 75 శాతం పూర్తి చేశారు. మరో రూ. 152 కోట్లతో పనులు పూర్తి చేయనుండగా, సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలంలోని 32 వేల ఎకరాలు నూతనంగా, 22 వేల ఎకరాల, 10 వేల ఎకరాలు బోయినపల్లి మండలంలో ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 12..

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 12 పనులు రూ. 3వేల200 కోట్లతో 94 శాతం పూర్తి చేశారు. మరో రూ. 50 కోట్లతో పనులు పూర్తి చేయనుండగా, సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట, ముస్తాబాద్ మండల్లాలో 22 వేల ఎకరాలు నూతనంగా సాగులోకి రానుంది.

100 శాతం సర్వే పూర్తి..

భవిష్యత్తు ప్రణాళికల రచన.. ఏ వర్గం ప్రజలు ఎందరు ఉన్నారు? వారి స్థితిగతులు తెలుసుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1531 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1,92,432 ఇండ్లు సర్వే పూర్తి చేశారు. ఆన్లైన్ లో డేటా ఎంట్రీ కూడా యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

ప్రజా పాలన కేంద్రాలు 

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రతి మంగళ, శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు. అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, ఆయా శాఖల అధికారులు హాజరై విజ్ఞప్తులు తీసుకుంటున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక సేవా కేంద్రం ఏర్పాటు చేసి, రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాము.

400 మందికి కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్లు

కల్లు గీత కార్మికులు చెట్టు నుంచి పడి ప్రమాదాల బారిన పడకుండా ఐఐటీ హైదరాబాద్ అభివృద్ది చేసిన కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్ కార్మికులందరికి ఉచితంగా అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 400 మందికి కిట్లు పంపిణి చేశారు.

మత్స్య శాఖ

2024-25 సంవత్సరానికి గానూ జిల్లాలోని వివిధ మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 440 చెరువుల్లో 70.58 లక్షల చేప పిల్లలను 100 శాతం సబ్సిడీపై లక్ష్యానికి గాను 49.46 లక్షల పిల్లలను నీటిలో విడుదల చేశారు. పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.18 కోట్లు.. జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖకు పలు రోడ్స్ నిర్మాణానికి రూ. 18 కోట్ల సీసీఆర్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రహదారుల సమస్యలకు పరిష్కారం దొరికింది. వేములవాడ నియోజకవర్గంలోని మారుపాకలో రూ.35 లక్షలు, కోనరావుపేటలో రూ.1.65 కోట్లు, కొలనూర్ నుంచి రామన్నపేట దాకా రోడ్ & బ్రిడ్జి నిర్మాణానికి రూ. 1.90 కోట్లు, సుద్దాల క్రాస్ రోడ్ నుంచి మంగళ్ళపల్లికి బీటీ రోడ్ నిర్మాణానికి రూ.1.30కోట్లు, మల్కపేటలో సీసీ రోడ్ నిర్మాణానికి రూ.90 లక్షలు, చందుర్తి మండలం సనుగులలో రోడ్ నిర్మాణానికి రూ. కోటి, మూడపల్లిలో నిర్మాణానికి రూ.90 లక్షలు, రుద్రంగి నుంచి కొచ్చగుట్ట తండా( అంబేద్కర్ స్టేటస్ నుంచి ఇందిరాచౌక్ వయా హనుమాన్ టెంపుల్) దాకా రూ.1.50 కోట్లు, రుద్రంగి నుంచి రామకిష్టాపూర్ దాకా రోడ్ నిర్మాణానికి రూ. 62 లక్షలు, గంభీరావుపేట మండలం గోరంటాల నుంచి రత్నగిరిపల్లి దాకా నిర్మాణానికి రూ. 65 లక్షలు, తంగళ్ళపల్లి మండలంలో పద్మనగర్ నుంచి మండేపల్లి నాగుల ఎల్లమ్మ ఆలయం దాకా రూ.2.25 కోట్లు, ఆర్ అండ్ రోడ్ నుంచి వృద్దుల ఆశ్రమం దాకా రూ.60 లక్షలు, వీర్నపల్లి మండలం మద్దిమల్లి నుంచి లోద్ది వయా కాశి తండా దాకా రోడ్ నిర్మాణానికి రూ. 1.14 కోట్లు,  తంగళ్ళపల్లి మండలంలో ఇందిరానగర్ అంకుషాపూర్ దాకా రూ. 36 లక్షలు, బోయినపల్లి మండలం రామన్నపేట్ నుంచి లక్ష్మిపూర్ దాకా రూ.3 కోట్లు మంజూరు చేసింది. 

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించేందుకు…

రూ.5 కోట్ల వ్యయంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు 24 మందికి ఉద్యోగాలు

ఆర్ధిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో రూ.2.50 కోట్ల విలువైన భూమి రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం కేటాయించింది. రూ.2.50 కోట్ల తో ఐఓసీఎల్ యాజమాన్యం మంజూరు చేసి బంక్ నిర్మాణాన్ని సిరిసిల్లలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట పూర్తి చేసింది. పెట్రోల్, డీజిల్ సరుకు కొనుగోలుకు రూ.20 లక్షలు జిల్లా అధికార యంత్రాoగం గ్యారంటీగా కేటాయించింది. పెట్రోల్ బంక్ సమీపంలోని దాదాపు 24 మంది దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలకు ఉపాధి దొరుకుతుంది. బంక్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్, మానకొండూర్, చొప్పదండి శాసన సభ్యులు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ కలిసి ప్రారంబించారు.

ఇందిరా మహిళా శక్తి..

ఆడబిడ్డలను కోటీశ్వరులు గా చేయడమే లక్ష్యంగా మహిళలను మహారాణులను చేయడం కోసం “ఇందిరా మహిళా శక్తి”  పేరుతో పథకానికి ప్రజా పభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న 63 లక్షల మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రూపొందించి, వచ్చే 5 సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్ల రుణాలు అందేలా చర్యలు తీసుకుంటుంది.. మహిళా సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్కూల్ యూనిఫారం కుట్టు కూలీని 50 నుంచి 75 రూపాయలకు పెంచింది. ఇప్పటిదాకా మూడు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం, ఇల్లంతకుంట, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రూ. 3 లక్షల బ్యాంక్ రుణం అందజేసి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాలతో 12 రకాల వివిధ వ్యాపార, వాణిజ్య యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. 

ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 7 వేల 959 స్వశక్తి సంఘాలకు 533 కోట్ల 83 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 2 వేయి 729 సంఘాలకు రూ. 346 కోట్ల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది. స్త్రీనిధి ద్వారా 2024-25 సంవత్సరంనకు రూ. 58 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.24  కోట్ల 50 లక్షల బ్యాంక్ రుణాలు మంజూరు చేయడం జరిగింది. మహిళా శక్తి లో భాగంగా ఎంటర్ పైజేస్ ద్వారా 5123 యూనిట్లు లక్ష్యం కాగా 3351 యూనిట్లు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ లో 600 యూనిట్లు లక్ష్యం కాగా 366 యూనిట్లు,  పౌల్ట్రీ మథర్ యూనిట్  లో 12 యూనిట్లు లక్ష్యం కాగా 12 యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ లో 120 యూనిట్లు లక్ష్యం కాగా 25 యూనిట్లు, మిల్క్ పార్లర్ లో 1 యూనిట్లు లక్ష్యం కాగా 2 యూనిట్లు, క్యాంటిన్ లో 4 యూనిట్లు లక్ష్యం కాగా 3 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన జిల్లాలో 96 వేల జాబ్ కార్డులను జారీ చేసి ఉపాధి కల్పించడం జరిగింది.

రూ.83 కోట్ల పత్తి కొనుగోలు

జిల్లాలో సీసీఐ ఆద్వర్యంలో మొత్తం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మొత్తం 5,792 మంది రైతుల నుంచి 1,11,215 క్వింటాల్ల పత్తిని కొనుగోలు చేసి, రూ. 83 కోట్లను చెల్లించింది. రూ.414 కోట్ల విలువైన ధాన్యం సేకరణ.. 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. ఇప్పటిదాకా 33,691 మంది రైతుల నుంచి 1,98,000 టన్నుల దొడ్డు, సన్న రకం ధాన్యం సేకరించారు. 5,500 టన్నుల సన్న రకం ధాన్యం సేకరించి క్వింటాలుకు రూ. 500 బోనస్ కింద మొత్తం రూ.27.88 లక్షలు చెల్లించారు.

రేపటి సభకు భారీగా తరలిరండి.

రేపటి సభకు భారీగా తరలిరండి.

కాంగ్రెస్ నాయకులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: ప్రజాపాలన విజయోత్సవాల లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సచివాలయంలో తెలంగాణ తల్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉందని ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ లతో జూమ్ సమావేశంలో మాట్లాడుతూ ఏడాదిలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, మెజారిటీ ప్రజలు సంతృప్తి గా ఉన్నారని ఏడాది పాలనపై ప్రభుత్వం చేసిన సభలకి ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారని అన్నారు. రేపు ముగింపు ఉత్సవాలలో భాగంగా సచివాలయం వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని, ఆ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ తల్లికి ఘన నీరాజనం

తెలంగాణ తల్లికి ఘన నీరాజనం

మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిశానిర్దేశం తో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రదర్శించింది. ‘జయ జయహే తెలంగాణ – జననీ జయకేతనం’ అంటూ తెలంగాణ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటూ హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం 25 మెట్రో స్టేషన్లలో కొత్తగా రూపొందించిన ‘తెలంగాణ తల్లి’ చిత్రాలను ఏర్పాటు చేసినట్టు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో స్టేషన్ల పరిథిలో జోరుగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. మెట్రో రైల్ రెండవ దశ ముఖ్య అంశాలను తెలియబరిచేలా స్టేషన్ల కాన్ కోర్స్ లు, ప్లాట్ ఫామ్ లపైన స్టాండీలను ఏర్పాటు చేశామని, ప్రధాన మార్గాలలో మెట్రో పిల్లర్లకు హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ఈ సంవత్సరం ప్రభుత్వ విజయాలను, మెట్రో సాధిస్తున్న ప్రగతిని వివరించామని ఎన్వీఎస్ వెల్లడించారు. అందమైన విద్యుద్దీపాల అలంకరణతో ముఖ్యమైన మెట్రో మార్గాలు ప్రజలను విశేషంగా అలరిస్తున్నాయి. సంవత్సర పాలన విజయాలను ఘనంగా ప్రతిబింబించేలా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ, నేను సైతం అంటూ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటోంది.

లోక కళ్యాణం కోసం అమ్మవారికి పూజలు

లోక కళ్యాణం కోసం అమ్మవారికి పూజలు

విజయవాడ, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: అమ్మలగన్న అమ్మ అశీస్సులు తోడై  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలని,  అన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. శక్తిస్వరూపిణి, సర్వలోకాలకు ఆదిదేవత అయిన దుర్గామాతను శరణు వేడుతూ ఆదివారం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తో కలసి  అమ్మకు ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా నంద రామకృష్ణ మాట్లాడుతూ కష్టకాలంలో అమ్మను శరణు వేడితే, అన్నింటికీ పరిష్కారాలు లభిస్తాయని, లోక కళ్యాణం కోసం అమ్మవారిని పూజించడం మన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయం అన్నారు. గత పాలకుల వైఫల్యాలు రాష్ట్రానికి పెనుశాపంగా మారి, రాష్ట్రం మరింత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న తరుణంలో, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ముదవహమన్నారు. ప్రజలందరి విశ్వాసం, మద్దతుతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దగలదని ఆశ భావం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ,  ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని  తీర్చిదిద్ది, రాష్ట్ర ప్రజల పట్ల తనకున్న  నిబద్ధతను చిత్తశుద్ధిని చాటుకోగలదన్నారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అమ్మవారిని పూజించడం ద్వారా, ప్రకృతి సమతుల్యత, శాంతి, మరియు సర్వమానవుల శ్రేయస్సు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతుందని తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి పూజ ద్వారా సంపద, శాంతి, మరియు సుఖసంతోషాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ లభించాలని తన ఆకాంక్షను వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంగా ఆవిర్భవించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చుతూ ముందుకు సాగుతోందని, ఈ ఐదేళ్లు రాష్ట్రానికి స్వర్ణ యుగంలాగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు పేరేపి ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరాం ప్రసాద్, వల్లూరు కిరణ్, సాయి జ్యోతి, మహేందర్ రెడ్డి, బీసీ సెల్ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

-కొండగట్టుకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి

హైదరాబాద్, యధార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: పల్నాడు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చెట్టును ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాల య్యాయి. దీనిపై స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్య లు చేపట్టారు. బాధితులను చికిత్స నిమిత్తం పిడుగు రాళ్ల ఆసుపత్రికి తరలించారు. మృతులు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు తుళ్లూరి సురేష్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు అని తెలిపారు. శనివారం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారని వివరించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నా రు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

5వ రోజు ఘనంగా ఉపవాస ప్రార్థనలు

5వ రోజు ఘనంగా ఉపవాస ప్రార్థనలు

క్రైస్తవ ఉపవాస పండగలకు హాజరైన డాక్టర్ చెంగల జోసెఫ్

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో క్రిస్మస్ పండగ ముందు జరుగు ఉపవాస ప్రార్థనలు కూడికలు ఐదవ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డాక్టర్ చెంగల జోసెఫ్ హాజరయ్యారు. ఆయా గ్రామాల క్రైస్తవ సోదరులు, సోదరీమణులు ఆయా సంఘాల పాస్టర్లు మైలారం సంఘ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రార్థన కూడికలు మైలారం పాస్టర్ డాక్టర్ చెంగల జోసెఫ్ సమక్షంలో జరుగుతున్నాయని అని గ్రామస్థులు తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...