27.7 C
Hyderabad
Sunday, April 19, 2026

యువజన కాంగ్రెస్ ఎన్నికలలో దామన్న ప్యానెల్ ఘన విజయం

యువజన కాంగ్రెస్ ఎన్నికలలో దామన్న ప్యానెల్ ఘన విజయం

సూర్యాపేట యదార్థవాది జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 7: యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గా ఎలిమినేటి అభినయ్, సూర్యాపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గా కరీమ్ బేగ్, పట్టణ అధ్యక్షులు గా బొడ్డు సాయి కృష్ణ ఘన విజయం సాధించారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో మాజీ మంత్రి, నియోజకవర్గం ఇంఛార్జ్రాంరెడ్డి దామోదర్ రెడ్డి బలపరచిన ప్యానెల్ ఘన విజయం సాధించిందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్లు అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గా ఎలిమినేటి అభినయ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బేగ్ జావేద్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు సాయి ఎన్నికయ్యారని తెలిపారు. అన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ఆగస్టు, సెప్టెంబరు నెలలో ఆన్ లైన్ లో నిర్వహించగా దామన్న ప్యానల్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఓట్లు వేసి గెలిపించారని వారు అన్నారు. యూత్ కాంగ్రెస్ ను 1960 లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నెలకొల్పారని, మొదట సంజయ్ గాంధీ, తరువాత రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కు నాయకత్వం వహించి, దేశ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ను విస్తరించారని వారు అన్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి యువజన కాంగ్రెస్ నుంచి కోశాధికారిగా పనిచేసి రెండుసార్లు మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గా పోటీ చేసిన ఎలిమినేటి అభినయ్ ఘన విజయం సాధించడానికి సహకరించిన రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీమంత్రి వర్యులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ,రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, తాజా మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ *బైరు శైలేందేర్ గౌడ్లకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నాగుల వాసు, సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, కౌన్సిలర్ గండూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నల్లెడ మాధవ రెడ్డి, మండల అధ్యక్షులుగా సూర్యాపేట దంతాల నరేష్, చివ్వెంల సమీర్, పెన్ పహాడ్ భూక్యా శివనాయక్, ఆత్మకూరు మల్లె పాక అనిల్, జిల్లా కార్యదర్శులుగా చెరకు మణికంఠ, కోడి కుమార స్వామి, బాణాల పవన్, ఉపాధ్యక్షులు గా నారాయణ శ్రావ్య రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు గా మీసాల దేవేందర్, జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎండి అక్రం విజయం సాధించారు.

ఆర్ కే ఎల్ కే కళాశాలలో అలరించిన పుడ్ ఫెస్టివల్ 

ఆర్ కే ఎల్ కే కళాశాలలో అలరించిన పుడ్ ఫెస్టివల్

75 రకాల ఆహార పదార్థాలతో ప్రదర్శన నిర్వహించిన బీఈడీ విద్యార్థులు

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 7: జిల్లా కేంద్రంలోని ఆర్ కె ఎల్ కె బి ఈ డి కళాశాలలో విద్యార్థులు ఆహార మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు సుమారు 75 రకాల ఆహార తినుబండారాలను ఆహార మహోత్సవంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అంగిరేకుల రాజశ్రీ, కరస్పాండెంట్ నాగార్జున లు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ ఫుడ్ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందన్నారు. కళాశాల విద్యార్థులంతా తమ ఇంటిలోని వస్తువులతో తయారు చేసిన రక రకాల ఆహార పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని అన్నారు. తమకు తెలిసిన విధంగా చాలా చక్కగా అన్ని రకాల ఆహార పదార్థాలను తయారుచేసి ఆహార మహోత్సవం విజయవంతానికి కృషి చేసిన విద్యార్థులను కళాశాల సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రజిని, సిబ్బంది విజయ్, జానయ్య, త్యాగరాజు, సతీష్, లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, నరసయ్య తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

వాహనాలకు నంబర్ ప్లేట్ తొలగిస్తే కఠిన చర్యలు తప్పవు

వాహనాలకు నంబర్ ప్లేట్ తొలగిస్తే కఠిన చర్యలు తప్పవు

– సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి

సిరిసిల్ల, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 7: వాహనాలకు నంబర్ ప్లేట్ తొలగించిన, ఏర్పడకుండా సగం నంబర్లు తొలగించిన కేసులు తప్పవు సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి అన్నారు. వాహనాలకు నంబర్లు తొలగించిన, ఏర్పడకుండా మార్ఫింగ్ చేసిన చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సమయంలో నంబర్ ప్లేట్ కనపడకుండా తొలగించబడిన వాహనదారునిపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగంటలకు ముస్తాబాద్ ఎస్.ఐ తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా మహేంద్ర బొల్లెర్రో వాహనం యొక్క నెంబర్ ప్లేట్ ను ఏర్పడకుంగా రెండు అక్షరాలను తీసేసి నా వాహనం వస్తుండగా పోలీస్ వారు అట్టి వాహనంను ఆపగా దాని డ్రైవర్ కొంచెం దూరంలో పోలీస్ వారిని చూసి ఆపి వాహనంను అక్కడే వదిలి పెట్టి పారిపోగా
ఎస్.ఐ అట్టి వాహనం తనిఖీ చేసి సెజ్ చేయగా, వాహన నెంబర్ ప్లేట్ ను ఏర్పడకుండా అక్షరాలు తీసేసి నడుపుతు పారిపోయిన డ్రైవర్ పై చీటింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నాము అని తెలిపారు. వాహనదారులకు ముఖ్య గమనిక జిల్లాలో నెంబర్ లేకుండా కానీ నంబర్ ప్లేట్ ఏర్పడకుండా ఏదైనా అడ్డుపెట్టిన, సగం నంబర్లు తొలగించి వాహనం నడిపితే చీటింగ్ కెసులు నమోదు చేయడం జరుగుతుందని సిరిసిల్ల రురల్ సి.ఐ మొగిలి ఒక ప్రకటనలో తెలిపారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైంది

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైంది

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 7: ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. శనివారం ఆయన మాట్లాడుతూ నేటిక ప్రజా పాలన లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైందని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహచర మంత్రులు శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు అధికారులు, కార్యకర్తల సంతృప్తిగా ప్రజాసేవ చేశాం
ఈ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది.. రెండు లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్,అక్క చెల్లలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం తో పాటు సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాల భర్తీ చేశామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా గురుకులాల్లో ఉన్న భాధలు తీర్చడానికి 40 శాతం కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచామని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం.. భవిష్యత్ నాలుగేళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం.. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పని చేస్తమని, మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు . ప్రజలు మరింత సహకరించాలని పొన్నం ప్రభాకర్ పత్రిక ప్రకటనలో తెలిపారు..

జీతభత్యం పెంపు పై హర్షం వ్యక్తం చేసినా నల్గొండ జిల్లా హోంగార్డ్

జీతభత్యం పెంపు పై హర్షం వ్యక్తం చేసినా నల్గొండ జిల్లా హోంగార్డ్

నల్లగొండ, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 7: హోంగార్డుల సేవలను గుర్తించి రోజువారీ జీతం, ఇతర అలవెన్స్ల పెంపు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి చిత్ర పాటనికి పాలాభిషేకం చేసిన హోమ్ గార్డ్ సిబ్బంది.. శనివారం నల్లగొండ జిల్లా హోమ్ గార్డ్ సిబ్బంది తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బందికి డిసెంబర్ 6 న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి ఏనముల రేవంత్ రెడ్డి హోంగార్డు సేవలను గుర్తించి రోజువారి జీతం, ఇతర అలవెన్స్లు పెంపుపై నల్లగొండ జిల్లా హోంగార్డ్ సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హోంగార్డు సిబ్బంది మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా విధినిర్వాహణలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణ కొరకు క్రమశిక్షణగా తమకు అప్పగించిన విధులు నిర్వర్తిస్తూ బాధ్యతాయుతమైన సేవలను అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సేవలను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ సంక్షేమం కొరకు సిబ్బందికి ప్రకటించిన రేవంత్ రెడ్డి.. హోమ్ గార్డుల దినభత్యం ఇప్పుడున్న అందిస్తున్న రూ. 921/- నుండి రూ. 1000/- కు పెంచారు. హోమ్ గార్డ్స్ విక్లి పరేడ్ అలవెన్స్ నెలకు రూ. 100/- నుండి రూ. 200/- కు పెంచారు.హోమ్ గార్డ్స్ లో పనిచేస్తూ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ఏక్సిడెంట్ మరణం చెందినా రూ. 5 లక్షల ప్రకటించడం శుభపరినమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్.ఐ శ్రీను, హోం గార్డు సిబ్బంది సలీం, సైదులు, విజయ్, యాదగిరి, కరుణాకర్, హరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 68వ వర్ధంతి.

న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 68వ వర్ధంతి.

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: న్యాయవాదుల సంఘం సిద్దిపేట ఆధ్వర్యంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షాడగొండ జనార్ధన రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పాటు స్వతంత్రం సిద్ధించిన పాకిస్తాన్ ఇప్పటికీ ఆర్థిక రాజకీయ సామాజిక అస్థిరతగా ఉందని, కానీ భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్ల స్థిరత్వంగా ప్రభుత్వాలు, ప్రజలు, శాంతియుతంగా జీవిస్తున్నామంటే అది అంబేడ్కర్ ఆలోచనవల్లే అన్నారు, మనగలుగుతున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కాంతారావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ముదిరాజ్, కోశాధికారి కర్రోళ్ల బాబు, మహిళా రిప్రెసెంటేటివ్ కే.సూర్యకళ సీనియర్ న్యాయవాదులు చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ నాయిని బాలయ్య, తుంగ కనకయ్య, ఏ.బాపూరావు, ఆత్మ రాములు, మల్లికార్జున్, ఆదినారాయణ యాదవ్, కమాలుద్దీన్, బాబు, సాగర్, మహిళా న్యాయవాదులు లావణ్య,అనురాధ తదితర న్యాయవాదులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

రాష్ట్రంలో స్వర్ణకార ఫెడరేషన్ ను ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలో స్వర్ణకార ఫెడరేషన్ ను ఏర్పాటు చేయాలి

సూర్యాపేట యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారుల సంక్షేమానికి స్వర్ణకార ఫెడరేషనన్ ఏర్పాటు చేసి స్వర్ణకారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు తొగిటి మురళి అన్నారు. ఆంద్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణు మాధవ్ శుక్రవారం జిల్లా కేంద్రానికి రావడంతో ఆయనను ఘనంగా సన్మానించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భాగమైన స్వర్ణకార, వృత్తి కళాకారులు నేడు ఉపాధి కరువై వృత్తి ని వదలలేక ఇతర పనులు చేయలేక అప్పుల బాదతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బ్యాంకు లోన్ ద్వారా బంగారు బిస్కట్లను స్వర్ణకారులకు అందిస్తున్నారని, అలాగే స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారుల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లుగా మన రాష్ట్రంలో కూడా స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారుల నారాయణ్ దాసు రామాచారి, జిల్లా ఉపాధ్యక్షులు అనుముల బ్రహ్మచారి, రాగి శ్రీనివాసచారి, అనుముల గోవిందచారి, భాస్కరాచారి, రహీం, రమేష్, తంగేళ్లపల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

పారిశుధ్య కార్మికుల సమక్షంలో కుమార్తె పుట్టినరోజు వేడుకలు

పారిశుధ్య కార్మికుల సమక్షంలో కుమార్తె పుట్టినరోజు వేడుకలు

కార్మికులతో కలసి సహపంక్తి భోజనం చేసిన కుటుంబం

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: సెలెబ్రిటీలు, విఐపి లు, రాజకీయ నాయకుల సమక్షంలో పుట్టిన రోజును ఎంత ఆడంబరంగా జరుపుకుంటే అంత గొప్ప అని భావిస్తున్న నేటి సమాజంలో వినూత్న ఆలోచన చేసిన ఆ దంపతులు తమ కుమార్తె పుట్టిన రోజు వేడుకలను పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పారిశుధ్య కార్మికులతో కలసి కేక్ కట్ చేయించి, సహపంక్తి భోజనాలు చేయడంతో పాటు వారికి శాలువా తో సత్కరించారు జిల్లా కేంద్రంలోని మిని ట్యాంక్ బండ్ సమీపంలోని రజిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నిర్వాహకురాలు ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్. శుక్రవారం వారి కుమార్తె ఐతబోయిన శరణ్య 15వ జన్మదిన వేడుకలను పారిశుధ్య కార్మికులతో కలసి వారు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నిత్యం మన మంచి కోసం మన ఆరోగ్య పరిరక్షణ కోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా మన కుటుంబ సభ్యులే, మన బందువులే వారితో కలసి కుమార్తె శరణ్యతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఇంటిలో పారిశుధ్య కార్మికులతో కలసి సహపంక్తి భోజనాలు చేసి పారిశుధ్య కార్మికుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమని ఇలా ఎవరు పిలవలేదని, ఇంటికి పిలిచి తమతో పాటు కలిసి భోజనం చేసిన రాంబాబు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా పట్టణంలో పారిశుధ్ధ్య నివారణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులతో కలసి తమ కుమార్తె శరణ్య పుట్టిన రోజు వేడుకలు జరిపిన ఐతబోయిన రజిత రాంబాబుగౌడ్ దంపతులను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు.

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ

సూర్యాపేట యదార్థవాది జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 6: భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మేడి కృష్ణ మాదిగ మాట్లాడుతూ దళిత జాతి హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, భారతిజాతి బాగుకోసం భారత రాజ్యాంగాన్ని రచించి, ప్రజాస్వామ్య దేశంగా మనదేశాన్ని సర్వోన్నతంగా నిలపడానికి అహర్నిశలు కృషిచేసిన అక్షరయోధుడు అంబేద్కర్ అని ఆ మహనీయుని సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తిప్పర్తి గంగరాజు, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు పిడమర్తి ఉమేష్, ఎంఎస్పి అధికార ప్రతినిధి పిడమర్తి శీను, గ్రామ అధ్యక్షులు పిడమర్తి రాములు, పొట్ట పెంచల వెంకన్న, పొట్ట పెంజర రాంబాబు, కోట వెంకన్న రమేష్ చింటూ తదితరులు పాల్గొన్నారు.

మత్స్యావతారంలో పిల్లలమర్రి చెన్నకేశవ స్వామి

మత్స్యావతారంలో పిల్లలమర్రి చెన్నకేశవ స్వామి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: సూర్యాపేట జిల్లా పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి పూజలు చేశారు. శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో కొలువుదీరిన లక్ష్మీనాధునికి ప్రతి శుక్రవారం విశేష పుష్పాలంకరణ ఫలాలంకరణ సేవా కార్యక్రమాలు జరుగుతాయని ప్రతినెల శుక్లపక్ష ఏకాదశి నాడు స్వామివారి మాస కల్యాణము, ప్రతి నెల రెండో శనివారం సాయంత్రం ఏడు గంటలకు సహస్రదీపాలంకరణ సహిత ఊంజల్ (ఉయ్యాల) సేవ నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ చైర్మన్ గూగంటి రాజాబాబు రెడ్డి మాట్లాడుతూ పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి చెన్నకేశవ స్వామివారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 16వ తేదీన ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రారంభం అవుతున్నాయని అన్నారు. ఒన్ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా భక్తిశ్రద్ధలతో పాల్గొని నెలరోజుల పాటు జరిగే ధనుర్మాసం వత మహోత్సవాలను ఘనంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కందగట్ల రాంబాబు మంగపండ్ల మల్లికార్జున్ చెరుకుపల్లి క్రిష్టయ్య చెరుకుపల్లి సైదమ్మ మల్లయ్య తూటిపల్లి జానయ్య గంపల శంకర్ అంకంభిక్షం మహిళా భక్తులు ముడుంభై సారిక,గూకంటి స్వరూప,గవ్వ విజయలక్ష్మి, సువర్ణ,అహల్య తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...