24.7 C
Hyderabad
Sunday, April 19, 2026

ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: మెదక్ జిల్లా భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు  నిర్వహించారు. శుక్రవారం పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు  కౌన్సిలర్లు, కో కన్వీనర్ కృష్ణ గౌడ్, నాయకులు కలసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, అసమానతలు, వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్‌ అని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ సృష్టికర్త, న్యాయ కోవిదుడు, రాజ్యాంగం ద్వారా దేశానికి దశ, దిశ చూపిన మహానుభావుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వంజరి, జయరాజ్, ఆర్కే, శ్రీనివాస్ భీమరి కిషోర్,మాజీ కౌన్సిలర్లు సోహెల్, పట్టణ కోకన్వీనర్.జుబేర్ అహ్మద్, నాయకులు మహమ్మద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

పేదింటి వధువుకు పుస్తె మట్టెలు

పేదింటి వధువుకు పుస్తె మట్టెలు

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6:

అందించిన సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం మాజీ అధ్యక్షుడు కాముని రాజేశం శుక్రవారం సిద్దిపేట కేసీఆర్ నగర్ రెండు పడకల ఇండ్లు లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన కూరపాటి పుష్ప- బాలరాజు ఏకైక పుత్రిక రుచిత ( భార్గవి ) వివాహానికి సిద్దిపేట పద్మశాలి సమాజం మాజీ అధ్యక్షుడు కాముని రాజేశం కుటుంబ సభ్యులు పుస్తె మట్టెలను అందజేశారు. కాముని రాజేశం మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలోని నిరుపేదలకు సేవ చేయడంలో ఎంతో ఆనందంగా ఉంటుందని, సమాజంలో కొంత మంది అహనిషలు కష్టపడ్డ ఉన్నత వర్గంగా ఎదగలేక పోవచ్చు కానీ వారి ఆత్మాభిమానం ముందు మనం ఎంతిచ్చిన తక్కువే.. పేదవారికి సేవచేయంలో ఉన్న తృప్తి కోట్లు సంపాదించినరదని, నేను చేసిన సహాయం చాల చిన్నడాని కాముని రాజేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పద్మశాలి సమాజం మాజీ ఉపాధ్యక్షుడు ఇప్ప కాయల శ్రీహరి మామిడాల తిరుపతి కాముని నగేశ్ పాల్గొన్నారు.

సినిమాలకు బెనిఫిట్ షో అనుమతీ ఇవ్వం.!

సినిమాలకు బెనిఫిట్ షో అనుమతీ ఇవ్వం.!

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవ డానికి ఏపీ, తెలంగాణ, ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప-2’ కు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి. అయితే, హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవ డం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. నగరంలో బెని ఫిట్ షోలు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ లో కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చారు. దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39), ఆమె భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్, శాన్వికలు కూడా సినిమా చూసేందుకు వచ్చారు. బన్నీ వచ్చిన సమయంలో ఎవరూ ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది.. ఈ తొక్కిసలాటలో రేవతి, కుమారుడు శ్రీతేజ్ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీన్ని గమనించిన పోలీసులు ఆమెకు సీపీఆర్ చేసినా లాభం లేకపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. మహిళ మృతిపై ‘పుష్ప’ టీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించింది..

మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తెలంగాణ ఆవిష్కరణకు రావాలి.

మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు
తెలంగాణ ఆవిష్కరణకు రావాలి.

-మంత్రి కొన్నం ప్రభాకర్..

హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: హైదరాబాద్ లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్ లను ఆహ్వానిస్తున్నామని, మా ఆహ్వానాన్ని అంగీకరిస్తు రావాలని రవాణా, సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఈ నేల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కు ఆహ్వానించడానికి వారి సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాం..వాళ్ళు సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం ఇవ్వడం జరుగుతుందని, వారు ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని శుక్రవారం మంత్రి పత్రిక ప్రకటనలు తెలిపారు.

పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు

పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు

పెద్దపల్లి, యదార్థవాది ప్రతినిధి, 6: టాటా ఏసీ ఆటో ట్రాలీ వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 25 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు.. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరిఖని నుండి పిడియస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్సు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో, ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్సు సిబ్బంది అర్ధరాత్రి
సమయం లో గంగా నగర్ వద్ద గోదావరిఖని నుండి వస్తున్క టాటా ఏసీ ట్రాలీ నెంబర్ AP 15 TA 8728 లో అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటల్ల పిడిఎస్ రైస్ ని పట్టుకోరు.. నిందితుడు దర్శన్ తండ్రి రాము వయస్సు 21 కులం మాదిగ, ఆటో డ్రైవర్, ​​ఎన్టీఆర్ నగర్ మంచిర్యాల పట్టుకున్నారు.. తదుపరి విచారణ నిమిత్తం స్వాదినపరుచుకున్న 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, టాటా ఏసీ ట్రాలీ ఆటోను మరియు నిందితుడిని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు..

పార్టీలకతీతంగా కుటుంబ సర్వే లో పాల్గొనండి.

పార్టీలకతీతంగా కుటుంబ సర్వే లో పాల్గొనండి.

హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6:

రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనండి – పొన్నం ప్రభాకర్ రవాణా, బీసీ సంక్షేమ శాఖ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుంది..

రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న.. రాజకీయాలు లేవు గతంలో టిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని అందించాం..

ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు..

రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వే కు సహకరించాలి

రేపు మహిళల రిజర్వేషన్ల కరపత్రాల ఆవిష్కరణ

రేపు మహిళల రిజర్వేషన్ల కరపత్రాల ఆవిష్కరణ

ఖమ్మం, యదార్థ వాది ప్రతినిధి, డిసెంబర్ 5 : మహి మహిళా రిజర్వేషన్లు ముఖ్యంగా బహుజన మహిళల కర్తవ్యాలు అంశంపై రూపొందించిన కరపత్రాలకు గురువారం వీర నారీమణుల ఆశయ సాధన సమితి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భూక్య ఉపేంద్రబాయి, బి.జ్యోతిలు మాట్లాడారు. ఖమ్మం నగరంలోని భద్రాచలం దాసు కళాక్షేత్రంలో శుక్రవారం మహిళా రిజర్వేషన్లు, బహుజన మహిళల ర్తవ్యాలు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలిపారు. తొలుత స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి మయూరి సెంటర్, పాత బస్టాండ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా భక్త రామదాసు కలెక్షేత్రానికి చేరుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు జాన్ బి, త్రివేణి, కార్యదర్శి చందు, సహాయ కార్యదర్శి విజయ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులే పాటుపడాలి.

విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులే పాటుపడాలి.

సిద్ధిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 5:

సిద్దిపేట జిల్లా పట్టణంలోని కుషాల్ నగర్ ప్రాథమిక పాఠశాల మండల ప్రజా పరిషత్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి శోభా రామచంద్ర రెడ్డి , తన కుమారుడు కార్తీక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు చికెన్ బిర్యానీ రైస్ అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సరళ, ఉపాధ్యాయురాలు భవాని విద్యార్థుల పట్ల ఈ సహాయాన్ని వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులే పాటుపడాలని, విద్యతోనే పిల్లల ఎదుగుదల విద్యార్థుల అభివృద్ధికి, వారి ఆరోగ్యానికి ఇలాంటి ఆహార పంపిణీ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తితో మరింత మందిని విద్యార్థుల శ్రేయస్సు కోసం ముందుకు రావాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది..

రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది..

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి డిసెంబర్ 5:

ప్రజాపాలన – విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్బంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం

ఆరు గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసాం..

ఇది ఆర్టీసీని పునరుజ్జీవింప చేసింది.. ఇది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగును నింపే కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది…

గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ అయినా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న నేనైనా బాధ్యతాయుతంగా రవాణా కార్మికుల ఆకాంక్షలను గౌరవించాల్సిందే..

కానీ ఆనాడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పరామర్శించని పరిస్థితి.

ఈనాడు కీలకమైన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది.

11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.

ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా 5 నుంచి 7 వేలు ఆదా చేయగలుగుతున్నారు.

పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం

ప్రతీ నెలా ఒక కుటుంబానికి 10వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోంది.

రాష్ట్రంలో 25లక్షల 35 వేల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21కోట్లతో రైతు రుణమాఫీ చేసాం..

వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నాం..

1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది

దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు.. అందుకే రైతులు సన్నాలు పండించండి..

తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో, రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనాలకూ సన్నబియ్యం అందిస్తాం..

ఈ నేలలో పండిన పంటనే మన బిడ్డలకు అందిస్తాం.

బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పేకలిద్దాం..

నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టాం..

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా…

ఏ లక్ష్యం కోసం అమరుల ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం.

ఇందులో ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా..

నగరంలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖది కీలక పాత్ర..

కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు పంపాల్సిన బాధ్యత మీపై ఉంది..

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉంది.. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది.

రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతాం..

హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించండి..

నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చాల్సిన బాధ్యత మనపై ఉంది..

మూసీకి గోదావరిని అనుసంధానం చేసి మూసీని అభివృద్ధి చేస్తాం..

అవసరమైతే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పారదోలుతాం

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తాం..

గాడి తప్పిన పాలన..!

గాడి తప్పిన పాలన
-మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..!

నిజామాబాద్ రూరల్ యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 5: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయితుంది. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కబుర్లు చెబుతూ పబ్బం గడుపుతుంది కాంగ్రెస్ పార్టీ. నేడు రాష్ట్రంలో ప్రజా పాలన లేదు ఇది ముమ్మాటికి పోలీసుల పాలన నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మాజీమంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు వాళ్ళ ఇద్దరిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా ఖండించారు. నేడు రాష్ట్రంలో నాయకులను ప్రజలను అక్రమ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రేవంత్ రెడ్డి పాలనను గాడిలో పెడుతుండనుకుంటే.. గాడి తప్పుతుందని ఆయన అన్నారు…

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...