24.7 C
Hyderabad
Sunday, April 19, 2026

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ఇంచార్జ్ సిపి సింధు శర్మ..!

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ఇంచార్జ్ సిపి సింధు శర్మ..!

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 5: నిజామాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు మొదట ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఇన్చార్జి సిపి. సింధు శర్మ సిపి మాట్లాడుతూ ఎవరైనా అధికారులు లంచం అడిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఫిర్యాదు అవినీతి నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్.ఏసిపి రాజా వెంకట్ రెడ్డి. ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్. ఇన్స్పెక్టర్ నాగేష్. సిహెచ్ శ్రీనివాస్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిరస్మరణీయం ఘంటసాల గానామృతం

చిరస్మరణీయం ఘంటసాల గానామృతం

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 5: శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతి కళావేదిక ఆధ్వర్యంలో అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 102 వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డివో ఆర్. వేణుమాధవ్ ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు. కళావేదిక అధ్యక్ష, కార్యదర్శులు జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు, సామాజికవేత్త, గాయకులు, ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ విశ్రాంత అవార్డు గ్రహీత గుండా రమేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రథమ బహుమతి గోపనబోయిన వెంకటేశ్వర్లు రూ.4000 రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ వేణుమాధవ్ ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు, సామాజికవేత్త, గాయకులు, ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ విశ్రాంత అవార్డు గ్రహీత గుండా రమేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రథమ బహుమతి గోపనబోయిన వెంకటేశ్వర్లు రూ.4000 హుజూర్నగర్, ద్వితీయ బహుమతి వై. రేణు దీక్షిత మహబూబాబాద్, తృతీయ బహుమతి జి ఉపేంద్ర చారి సూర్యాపేట, ప్రత్యేక ప్రశంసా బహుమతి పందిరి సత్యం కుక్కడం వారికి నగదు బహుమతులుగా ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో వేణుమాధవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాటి మధుర గాయకుడు, తెలుగు సినీ ప్రపంచ సంగీత దర్శకునిగా ప్రజలను తన గానామృతంతో ఉత్తేజపరిచిన పద్మశ్రీ ఘంటసాల అందరి హృదయాలలో చిరస్మరణీయుడని ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జ్ఞాన సరస్వతి కళావేదిక కమిటీ అభినందనీయమని అన్నారు. మరొక గౌరవ అతిధి మనం వికాస వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ కళ, కళ కోసం కాదు సమాజం కోసమని ఇలాంటి అద్భుత కార్యక్రమాలు నిర్వహించిన రసజ్ఞులు గుండా రమేష్, బుర్రి వెంకటేశ్వర్లు వారి కార్యవర్గాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా గండూరి శంకర్, యామా ప్రభాకర్, కర్నాటి సురేందర్ నాగవల్లి ప్రభాకర్ కల్లూరు నాగయ్య, బి రాధాకృష్ణారెడ్డి, చకిలం కవిత, దేవులపల్లి ప్రశాంతి, హమీద్ ఖాన్, తదితరులు హాజరైనారు.

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

యదార్థవాది సూర్యాపేట ప్రతినిధి, డిసెంబర్ 05: అనంతగిరి మండల యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కర్మేలు ప్రార్థన మందిరము నందు పాస్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ పాస్టర్ రాజేష్ అధ్యక్షతన ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిషప్ దుర్గం ప్రభాకర్ బైబిల్ సందేశకులుగా, పాస్టర్ ప్రశాంత్ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య క్రీస్తు యొక్క ప్రేమను దయలత్వాన్ని అవాలంభించాకోవాలని అన్నారు. అయన మానవాలి కి చేసిన ప్రాణ త్యాగాన్ని వివరించారు. అనంతరం కేక్ కట్ చేసి వచ్చిన భక్తులకు అందచేశారు . పాస్టర్ రాజేష్ పాల్గొన్న భక్తులందరికీ ప్రేమవిందును పాస్టర్ రాజేష్ ఇచ్చి గౌరవించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షలు జి ఆర్ అబ్రహం, కోఆర్డినేటర్ యమ్ సుందర్ రావు, అనంతగిరి మండల ప్రెసిడెంట్ డానియల్ నాయక్, కోదాడ మండల ప్రెసిడెంట్ శాంతవర్ధన్, ఏసురత్నం, అనంతగిరి మండల కమిటీ సభ్యులు శామ్యూల్ ఆనంద్ రావిపాల్ , హరిగోమ్స్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

వ్యర్థ పదార్థాలతో విద్యుత్తి పై విద్యార్థులకు అవగాహణ 

వ్యర్థ పదార్థాలతో విద్యుత్తి పై విద్యార్థులకు అవగాహణ 

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, 5 డిసెంబర్ 2024: స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8 ,9 తరగతులు విద్యార్థులకు చెత్త ద్వారా విద్యుత్తును ఎలా తయారు చేస్తారు అనే దానిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాల సరూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదువుతున్న ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు జోహార్ నగర్ లోని డంపింగ్ యార్డ్ వద్ద చెత్తను వేరు చేసి దాని ద్వారా విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారనే దానిపై సుమారు 200 మంది విద్యార్థులను మూడు బస్సుల ద్వారా తీసుకువెళ్లి అక్కడ ఉన్న సిబ్బంది అధికారుల ద్వారా వారికి పూర్తి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ పై  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాల మేరకు ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఒక్క విద్య పైనే కాకుండా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహనతో పాటు వివిధ ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు విద్యుత్తు ఎలా తయారవుతుంది ఒక్క నీటి ద్వారానే కాకుండా రోడ్డుపై పడి వేసిన చిత్త ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే కొంతమేరకైనా ఉపయోగపడుతుంది అన్నారు చిన్ననాటి నుండి ప్రతి విషయాన్ని తెలుసుకొని విద్యార్థి ముందుకెళ్తే సమాజంలో మంచిగా గుర్తింపు ఉంటుందన్నారు ఇటీవల రోడ్డు నిర్మాణంలో సిమెంటు కంకర ఇసుక ఎలా వేస్తే రోడ్డు నిర్మాణం జరుగుతుందనే దానిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు గత మూడు రోజులుగా అనేక కార్యక్రమాలను డివిజన్ పరిధిలో చేపడుతున్నట్లు తెలిపారు.

గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం

గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం

* సర్పంచ్ అమ్ముల రమేష్. 

కొండపాక యదార్థవాది

కొండపాక మండల పరిధిలోని వెలికట్టలో గ్రామపాలకవర్గ చివరి సమావేశాన్ని శనివారం సర్పంచ్ అమ్ముల రమేష్ ఆధ్వర్యంలో లో నిర్వహించుకున్నారు. ముఖ్య అతిధులుగా డిపివో దేవకీ ఎంపిడిఓ రాంరెడ్డి ఎంపివో వీరరాజు పాల్గొన్నారు  ఈ  సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలం లో గ్రామ సమస్యల పరిష్కారం కోసం నాకు చేదోడు వాదోడు గా ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న అధికారులకు వార్డ్ మెంబెర్లకు ఉప సర్పంచ్ ఎంపిటిసిలకు ముఖ్యంగా గ్రామ ప్రజలకు గత బీఆరెస్ ప్రభుత్వానికి  ప్రత్యేక ధన్యవధాలు తెలిపారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి నాయకునికి ప్రతి పదవికి ఒక నిర్థిష్టమైన సమయం లో విరమణ అనేది తప్పని సరి కాబట్టి పదవిలో ఉన్నన్ని రోజులు సాధ్యమైంతవరకు ప్రజలకు సేవ చేయడం వల్లవచ్చే ఆత్మ సంతృప్తి చెప్పలేనిది అన్నారు. అభివృద్ధి లో భాగంగా చాలా పనులు చేసుకున్నాం అయినా గాని పూర్తి కానీ పనులు ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయన్నారు. అభివృద్ధి దిశగా ప్రయాణించడం లో ఒకదాని తరువాత ఒకటి గా  కొత్త కొత్త అవసరాలు సమస్యలు ఎదురు అవుతూనే ఉంటాయి కాబట్టి అన్నిటిని పరిష్కరించె ప్రయత్నం చేశామన్నారు. అనంతరం స్థానిక ఎంపిటిసి మండల ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు చింతల సాయి బాబా మాట్లాడుతూ ఎంపిటిసి ఎన్నికల్లో నా గెలుపుకు సహకరించిన సర్పంచ్ వార్డ్ మెంబర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి వరకు కలిసి పనిచేసినందుకు చాలా సంతోషం గా ఉందన్నారు భవిషత్తులో కూడా మన అందరం ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షింస్తు అందరికి శుభాభినందనలు తెలిపారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కార్తీక నరేందర్ రెడ్డి వార్డ్ సభ్యులు స్వప్న పురుషోత్తం పటేల్ చంద్రశేఖర్ దొమ్మాట మహేష్ అమ్ముల కిషన్ నూకల ఉమా నర్సిములు కోడెల గిరి సెక్రటరీ నర్సిములు కారోబార్ విజయ్ గ్రామపంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో: జిల్లా కలెక్టర్ 

పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో: జిల్లా కలెక్టర్ 

మెదక్ యదార్థవాది ప్రతినిధి

జిల్లా విద్యాశాఖ అధికారులలు విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ రాజర్షిషా. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాచవరంలో మెదక్ జిల్లా కలెక్టర్  రాజర్షిషా జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో పదికి పది మార్కులతో జిల్లా ప్రధమ స్థానంలో ఉండాలని అందుకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయులు పని చేయాలని ఇందుకు అనుగుణంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఈ రెండు నెలల కాలంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లల భవిష్యత్తు ఈ పదవ తరగతి పరీక్షల్లో ఉపాధ్యాయుల బాధ్యత కన్నా తల్లిదండ్రుల బాధ్యత కూడా ముఖ్యమే కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అదేమీ బ్రహ్మవిద్య కాదని మనం చేసే ప్రయత్నమే విజయలు సాధిస్తామని కలెక్టర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి  మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యేక తరగతులను గ్రాండ్ టెస్ట్ లను సద్వినియోగపరుచుకోవాలని విద్యార్థులను పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి  నీలకంఠం మాచవరం సర్పంచ్ సంధ్యారాణిఉపాధ్యాయ బృందం పదవ తరగతి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

జర్నలిస్టుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నరసరావుపేట యదార్థవాది ప్రతినిది 

జర్నలిస్టుల ఐక్యత సంక్షేమం భరోసా కల్పించేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు స్పష్టం చేశారు. గురువారం నరసరావుపేట పట్టణంలోని ఎల్.బి. మార్కెట్ వద్ద గల పిల్లి నాగన్న సత్రం నందు పల్నాడు జిల్లా కన్వీనర్ పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం యొక్క ప్రత్యేకత విధి విధానాలు కర్తవ్యాలపై చర్చించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి హాజరైన జర్నలిస్టుల మధ్య ప్రశాంత వాతావరణంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. 

ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కమిటీ

తెలుగు సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులుగా పేరేచర్ల శ్రీనివాస్ కార్యదర్శిగా జి.ప్రేమ్ సాగర్ కోశాధికారిగా ఎన్.వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులుగా పిల్లి యజ్ఞ నారాయణ క్రియాశీలక కార్యదర్శిగా హనుమంతా చారి ఉపాధ్యక్షులుగా కె.నాగేశ్వర రావు జి.సుందర రాజు పల్నాడు హనుమంతరావు సంయుక్త కార్యదర్సులుగా ఎమ్.సునీల్ కుమార్ సూదేపల్లి కోటేశ్వర రావు ప్రచార కార్యదర్శిగా జి.సాంబశివ రావు గౌరవ సలహాదారులుగా ఎన్.రాంప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా ఆర్.వెంకటేశ్వర్లు నాయక్ బి.హనుమంతరావు షేక్ వలి టి.వెంకటేష్ సుధీర్ బాబు లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు మాట్లాడుతూ కార్యవర్గ సమావేశం నందు పల్నాడు జిల్లా లోని అన్ని ప్రాంతాల నుండి వివిధ మీడియా ఛానెల్స్  వార్తా పత్రికలలోను పనిచేయుచున్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు సంఘ ఆశయాలకు పాటుపడుతూ జర్నలిస్టులకు అండగా వుంటూ సహాయసహకారాలు అందించాలని సూచించారు.

కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపి

కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపీ

* ప్రజల మద్దతు బీఅర్ఎస్ పార్టికే ఉంది. 

* కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు ఒకటిగా పని చేశాయి.

* ఆరు గ్యారంటీలు అమలు చేయలేక బెదిరింపులకు దిగుతున్న కాంగ్రెస్

* పోలీస్ స్టేషన్ కొత్త కాదు, ఉద్యమం కొత్త కాదు, పోరాటం కొత్త కాదు.

* సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి 

గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని మాజీ ఎఫ్ డీ సి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కేసీఅర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయని  కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని అయినా కూడా ప్రతి కార్యకర్త ఎంతో అద్భుతంగా పని చేసి కేసీఅర్  గెలుపు కోసం కృషి చేశారు. కేసీఆర్ పై 154 మంది నామినేషన్లు వేశారు  విత్ డ్రా తర్వాత 47 మంది మిగలగా నాలుగు ఈ వి ఏం మిషన్ల ఏర్పాటుతో కొందరు తికమక పడ్డారని అయినా 45 వేల మెజారిటీతో మూడోసారి గెలుపు అందించారు. గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని అన్నారు. డిసెంబర్ 9 న రుణమాఫీ 4 వేలకు పించన్లు, కరెంట్ బిల్లు కట్టొద్దు రైతు బంధు పెంచుతాం వడ్లకు 500 బోనస్, నిరుద్యోగ భృతి అన్నరు ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నరని ఆయన విమర్శించారు. బిజెపి దేశంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి పప్పం గడుపుకోవాలని చూస్తోంది ఇందుకు నిదర్శనమే అయోధ్య రామయ్యను ఎత్తుకున్నారు. ఈ దేశం ఆదానీ అంబానీ చేతుల్లో ఉందని ఆదాని అవినీతి వెనుక ప్రధాని మోదీ ఉన్నడని ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని రాహుల్ గాంధీ అంటడు సాయంత్రం రేవంత్ ఆదాని కలిసి హగ్ ఇచుకుంటరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటరు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయ అందనుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ 17సీట్లను గెలిచి ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు అన్నారు. అంతకు ముందు నియోజక వర్గ నాయకులు మాట్లాడుతూ సీట్లు తగ్గుతాయి కానీ మన పార్టీ ఏ గెలుస్తుంది అనుకున్నాం కానీ ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది అని గమనించలేక పోయాం అన్నారు ప్రజల్లో వచ్చిన ఈ మార్పుకు కొంతమంది నాయకులే అని మనం ఇప్పటికైనా గుర్తించి సరైన విధంగా మన పార్టీ నాయకుల్లో మార్పు రావాలని కిందిస్తాయి నాయకుని తో పాటు జెనాల సమస్యలు గుర్తించి వాటికి అనుగుణంగా గల్లీ స్థాయి నాయకులకు గుర్తింపు వచ్చేలా కొన్ని పద్ధతులు తీసుకురావలన్నారు ప్రతిదీ ఆన్ లైన్ విధానం లో నడుస్తున్నందున స్థానిక సర్పంచ్ కూడా మన పార్టీ పథకాల అమలులో తగిన గుర్తింపు కానీ అవసరం గాని లేకపోవడం తో కూడా మన పార్టీకి కొన్ని నష్టాలను చవి చూసింది అన్నారు . గత మన ప్రభుత్వం చేసిన అనేకమైన మంచి పనులు చాలామట్టుకు అధికారుల చేతులమీదుగా కొనసాగినందున జవాబు దారి తనం లోపించి మన కోసం మనం గట్టిగ చెప్పుకోలేని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేసారు నాయకులు. ఇప్పటికైనా అందరిని కలుపుకుపోయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని బీఆరెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్య నాయకులతో పాటు అందరూ కష్టపడాలన్నారు. ఆలా కాకుండా కష్టపడేది ఒకరు పదవులు అనుభవించేది ఒకరు అన్న చందంగా వెళ్తే అది మన అందరికి చాలా నష్టం అని బల్లగుద్ది మరి అసహనం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమ్ రెడ్డి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ నియోజకవర్గ జడ్పిటిసి ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన ఒక మెట్టు దిగుతా: ఎమ్మెల్యే హరీష్

ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన ఒక మెట్టు దిగుతా: ఎమ్మెల్యే హరీష్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

రంగనాయక సాగర్ లోకి నీటి విడుదలతో మంత్రి ఉత్తమ్ కుమార్  కు రైతుల పక్షాన ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ అనంతగిరి రిజర్వాయర్ నుండి పంటకు రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు లెక ఆందోళన లో ఉన్న రైతుల పడుతున్న బాధను చూసి రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి స్వయంగా వినతి పత్రం అందించనని అందుకు అనుగుణంగా గురువారం అదికారులు రిజర్వాయర్ నుండి 3 రోజుల పాటు రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేస్తాన్నారని దీనితో యాసంగి పంటకు త్వరలో కాలువల ద్వారా నీళ్లు అందనున్నాయన్నారు. అప్పుడైన ఇప్పుడైనా పదవి ఉన్న లేకున్నా ప్రభుత్వంలో ఉన్న లేక పోయిన ప్రజలకు ఏ కష్టం వచ్చింది అంటే ప్రజల పక్షాన ఒక మెట్టు దిగుతానని ఆయన అన్నారు.

రైతులకు సాగునీరు విడుదల 

రైతులకు సాగునీరు విడుదల 

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

అనంతసాగర్ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ లోకి ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 18, 19, 20 తేదీలలో అనంతసాగర్ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ లోకి ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేయడం  జరుగుతుందని ఆయన అన్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి పంపింగ్ చేసిన నీటిని యాసంగి పంట కాలానికి రైతులు పంట నష్టపోకుండా పంటలు పండించుకునేందుకు ఈనెల 20న రంగనాయక సాగర్ నుండి కాల్వల ద్వారా చెరువులకు పంట పొలాలకు సాగునీరు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పత్రిక ప్రకటనలో తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...