31.2 C
Hyderabad
Sunday, April 19, 2026

రైతన్నలను సాగునీరు అందించాలి: మడుపు భూంరెడ్డి

రైతన్నలను సాగునీరు అందించాలి: మడుపు భూంరెడ్డి

గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి 

తపస్ పల్లి రిజర్వాయర్ నుండి కొండపాక మండలంలోని రైతులకు నిరంధించాలని తెలంగాణ హోసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూం రెడ్డి అన్నారు. బుదవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలో నేడు ఇంకా వరి నాట్లు పూర్తి కాకముందే  చెరువుల్లో నీరు సగానికి పైగా ఇంకిపోవవంతో బయపడిన రైతులు భూం రెడ్డిని కలిసి పరిస్థితులు వివరించగా రైతులను వెంటబెట్టుకుని తిమ్మారెడ్డిపల్లి వద్ద తపాస్ పల్లి డీ 4 కెనాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యాసంగి పంట చేతికి రావాలంటే వెంటనే  కాల్వలు మరమ్మతులు చేసి చెరువులు నింపాలని, దేశానికి రైతు వెన్నుముక కాబట్టి రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునేలా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన తపాస్ పల్లి రిజర్వాయర్ నుండి  కొండపాక మండలం లోని పదకొండు గ్రామాలకు డీ 4 కెనాల్ ద్వారా సాగు నీరంధించేందుకు గాను 2011 సంవత్సరం లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి కొమురవెల్లి మండలం ఐనాపూర్ కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి మీదుగా కెనాల్ నిర్మించిన విషయం తెలిసిందే. రాష్ట విభజన తరువాత 2014 లో గెలిచిన బీఆరెస్ ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా నిలిచిందని సాగు నీరు అందించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు అహర్నిశలు కస్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని మరో కొనసీమగా మర్చరని భూంరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భూంరెడ్డి తో పాటు వెలికట్ట గ్రామ మాజీ సర్పంచ్ గొడుగు యాదగిరి సిరసనగాండ్ల  బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లికార్జున్ మర్పడ్గ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య తిమ్మారెడ్డిపల్లి ఆత్మ కమిటీ డైరెక్టర్ సున్నం భాస్కర్ వార్డ్ సభ్యులు కనకసేన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాల  రైతులు పాల్గొన్నారు.

త్వరలో దేవ దేవుని ఆలయ నిర్మాణం: మంత్రి పొన్నం 

త్వరలో దేవ దేవుని ఆలయ నిర్మాణం: మంత్రి పొన్నం 

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి:

తిరుమలలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నీ కలిసి తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవంగా భావించే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్మించాలని చైర్మన్ భూమన కరుణాకర్ కు మంత్రి వినతి పత్రం అందజేశారు. ఆలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తామని స్వామివారి కృపా కటాక్షాలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందాలని ఆ దేవదేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ భూమన మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

18న గజ్వెల్ కృతజ్ఞతాసమావేశం

18న గజ్వెల్ కృతజ్ఞతాసమావేశం

గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి 

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నుండి మూడోసారి శాసనసభ్యునిగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా సాధించిన సందర్బంగా నియోజక వర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞత సమావేశం ఈ నెల18న గజ్వెల్ శోభా గార్డెన్ లో సమావేశం ఎర్పాటు జరుతున్నయని కొండపాక మండల బీఅర్ఎస్ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి రైతుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మన ప్రియతమా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపేందుకు వీలుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈ సమావేశానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆరెస్ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొంటారని ఆయన అన్నారు.

సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కేంద్ర మంత్రి

సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కేంద్ర మంత్రి

హైదరాబాద్ యదార్థవాది జనవరి 16: 

హైదరాబాద్ బోరబండ అంబేడ్కర్ నగర్ లో మంగళవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ప్రధానమంత్రి స్వనిధి కింద అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఇవి వారి సమగ్ర అభివృద్ధికి సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. కేంద్రం  అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర పథకాలు చేరువ చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు మొదలు పెట్టాం అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ తో పాటు ప్రభుత్వ పథకాలు పై ప్రచురించిన బ్రోచర్లను కేంద్ర మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పీఎం జీవన జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన పీఎం కిసాన్ పీఎం అటల్ పెన్షన్ యోజన ముద్ర యోజన తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని బొరబండ బస్తీ వాసులు వీక్షించారు. ముందుగా వైద్య శిబిరంతో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్ సామాజిక బీమా పథకాల జారీ చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వివిధ పథకాలతో లబ్దిపొందిన పలువురు తమ అనుభవాలు పంచుకున్నారు. స్వయం సహాయక సంఘాలు సభ్యులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు వాలంటీర్లు బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మీ ఇంట్లో ఒకడిగా ఉంటా.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా..

మీ ఇంట్లో ఒకడిగా ఉంటా.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా..

ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ యదార్థవాది ప్రతినిధి

సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం సనుగుల దేవుని తండా గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇటీవల మరణించిన దేవుని తండా సర్పంచ్ భూక్య పంతులు నాయక్ గంగాధర రామస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గా ఎన్నికై తొలిసారి  సనుగుల గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన చందుర్తి మండల ప్రజలతో పాటు సనుగుల దేవుని తండా గ్రామాల ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటానని మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విప్ గా మరో మెట్టేక్కించారని ఎన్నికల ప్రచారంలో మీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మీ ఇంట్లో ఒకడిగా ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని  అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలులో భాగంగా మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని రాజీవ్ ఆరోగ్య శ్రీపథకం కింద పది లక్షల వరకు అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ ఇనప చక్రాలతో తారు రోడ్డు పైకి వస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్ పి

ట్రాక్టర్ ఇనప చక్రాలతో తారు రోడ్డు పైకి వస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్ పి

మెదక్  యదార్థవాది ప్రతినిధి 

ట్రాక్టర్‌ లకు ఇనప చక్రాలతో తారు రోడ్లు సిమెంట్ రోడ్లపై నడిపడంతో రోడ్లు చెడిపోతున్నాయి ఇకపై రోడ్లపైకి ఇనప చక్రాలతో వస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి అన్నారు. ప్రభుత్వం ఎంతో వ్యయంతో ప్రజలకు మెరిగైన సుఖవంతమైన ప్రయాణం కోసం రోడ్లను ఏర్పాటు చేసిందని కొందరు ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పని చేయడానికి ఇనప చక్రాలను ఉపయోగిస్తారు. వీటితో రోడ్లపై రావడం వల్ల రోడ్లు ద్వంసం అవడంతో  ద్విచక్రవాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పనుల వాడాలి తప్ప రోడ్డుపైకి వస్తె ట్రాక్టర్ యజమానులపై మోటారు వాహన చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పత్రిక ప్రకటనలో తెలిపారు. 

పదిలో ప్రథమ స్థానం లో ఉందాం: ఎమ్మెల్యే హరీష్

పదిలో ప్రథమ స్థానం లో ఉందాం: ఎమ్మెల్యే హరీష్

సిద్దిపేట నియోజకవర్గంలో వంద శాతం ఫలితాలు సాదించేల సమిష్టి కృషి చేద్దం.

తల్లితండ్రులు మనోదైర్యంన్ని.. విద్యార్థులకు ఇవ్వాలి.

పడి మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలి.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట నియోజకవర్గంలో పది ఫలితాల్లో ప్రథమ స్థానం లో నిలిచేల కల్సి కట్టుగా పని చేయాలి అని మాజీ మంత్రి  ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు మంగళవారం నియోజకవర్గం విద్యాధికారులు ప్రభుత్వ పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు మోడల్ స్కూల్స్ కస్తూర్బ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ లతో టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పది పరీక్ష  ఫలితాల్లో గత స్ఫూర్తి కొనసాగించి సిద్దిపేట నియోజకవర్గం పదవ తరగతి ఫలితాల్లో నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా సమిష్టి కృషి చేయాలి ఎప్పటిలాగా పదవ తరగతి పరీక్ష ఫలితాల ఫై ద్రుష్టి పెట్టాలని సూచించారు. సిద్దిపేటకు ఉన్న ప్రతిష్టను కొనసాగింపుగా ఇప్పటికే సెలబస్ పూర్తి అయి ప్రత్యేక తరగతులు మొదలు కావచ్చని  ప్రభుత్వ పాఠశాల లు అంటే పెద పిల్లలు ఎక్కువ గా ఉంటారు ఈ సమయం లో  విద్యార్థిని విద్యార్థులకు ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. నేటి నుంచే పది ఫలితాల ఫై ప్రణాళిక తయారు చేసుకోని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ రోజు నుంచి రెండు నెలలు తల్లితండ్రులు మనోదైర్యంన్ని పిల్లలకు ఇవ్వాలన్నారు. పది మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు భాధ్యత తీసుకొవలి త్వరలో ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతానని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ నోడల్ అధికారి రామస్వామి ఎం ఈ వో లు శ్రీనివాస్ రెడ్డి యాదవ రెడ్డి దేశి రెడ్డి లు ఉన్నారు.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన: మంత్రి

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన: మంత్రి

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రవాణా  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకతీతంగా పాడి పంటలతో రైతన్నలంతా సమృద్ధి వర్షాలతో సుఖ సంతోషాలతొ ఉండాలని వీరభద్ర స్వామిని కోరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు ప్రధానం 

విజేతలకు బహుమతులు ప్రధానం 

గజ్వేల్ యాదర్తవాది ప్రతినిధి 

కొండపాక మండల పరిధిలోని వెలికట్ట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గూడ మల్లారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్బంగా అయన కుటుంబ సభ్యులు ఉమ్మడి వెలికట్ట గ్రామనికి చెందిన క్రీడాకారులతో మొన్న  క్రికెట్ పోటీ శనివారం మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకు ఆదివారం గ్రామ పంచాయితీ వద్ద బహుమతులు అందజేశారు. దీనిలో భాగంగా క్రికెట్ లో మెరుగు భాను టీం కు మొదటి బహుమతి రవీందర్ నగర్ మూడోజు సాయి తేజ టీం కు ద్వితీయ బహుమతి వెలికట్ట వారియర్స్ టీం కు తృతీయ అందజేశారు. ముగ్గుల పోటీలో గెలిచిన దొబ్బ నవనీత కు మొదటి బహుమతి శివానికి రెండో బహుమతి ఎర్రబోయిన అశ్వినికి తృతీయ బహుమతి అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మల్లారెడ్డి భార్య సరోజనమ్మ  కుమారులు నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి లు  మాట్లాడుతూ మనం ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా పుట్టినరో ఊరును కన్నవాళ్ళను మరిచిపోవద్దని ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నాగాని ఎన్ని దేశాలు తిరుగుతున్నాగాని పుట్టి పెరిగిన గడ్డను గుర్తు చేసుకుంటూ సమాజానికి తనవంతు సహాయం చేస్తూ ముందుకు సాగలానే ఉద్దేశం తోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాని అన్నారు. మా నాన్న మాకు ఇంత తొందరగా దూరం అవడం బాధగా ఉన్నా ఆయన ఆశయ సాధనలో భాగంగా మాకు సాధ్యమైనంతవరకు ఇతరులకు ఏదో ఒకరకముగా ప్రోత్సహిస్తూ సహాయ సహకారులు అందించాలనే ఉద్దేశం తో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించామని ఇలాంటి  మరెన్నో సేవలు చేయడానికి  మా తండ్రి నేర్పిన బాటలో మేము సిద్ధంగా ఉన్నామన్నాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు నిరంతర ప్రక్రియ అంటూ ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఈ క్రీడా పోటీలు ఇంత బాగా జరగడానికి ఎంతో కృషి చేసిన ఆర్గనైజర్లు విజ్జగిరి ప్రభాకర్ దొబ్బ రాజు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు కార్యక్రమనికి హాజరు అయినా వక్తలు మాట్లాడుతూ మల్లారెడ్డి సర్ గ్రామానికి చేసిన సహాయ సహకారులు గుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలకే కాదు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒకరకముగా మంచి విషయాలు చెప్తూ జీవితం లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే సూచనలు ఇస్తుండేవారని గుర్తు చేసుకున్నారు.  ఈ కార్యక్రమం లో వెలికట్ట సర్పంచ్ అమ్ముల రమేష్,  పాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు , ఎంపిటిసి చింతల సాయి బాబా,రవీందర్ నగర్ విశ్వనాథ పల్లి సర్పంచ్ వాసరి లింగారావు వార్డ్ మెంబర్లు స్వప్న పురుషోత్తం పటేల్ కోడెల గిరి రేషన్ డీలర్ బాపూరావు చకినాల శ్యామ్ కుమార్ నాంపల్లి యాదగిరి వెలికట్ట ప్రధానో ప్రదానోపాధ్యాడు జగన్నాదరెడ్డి స్కూల్ యజమాన్య కమిటీ ఛైర్మెన్ రాజు సిపిఎం బాలనర్సయ్య పెరుగు స్వామి పెరుగు అంజయ్య కొమురయ్య  మహమ్మద్ ప్రభాస్ వంశీ  ఏఎన్ఎం  నాగమణి ప్రజలు పాల్గొన్నారు

ప్రజలు సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలి: మంత్రి పొన్నం

ప్రజలు సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలి: మంత్రి పొన్నం

వేములవాడ యదార్థవాది ప్రతినిధి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
పూర్ణ కుంభం తో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు
అనంతరం మంత్రి పొన్నం కు వేదమంత్రోచరణలతో ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భోగ భాగ్యాల భోగి పండుగ సంబరాలు పంచె సంక్రాంతి రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి సంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు మంత్రి వెంట ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...