31.2 C
Hyderabad
Sunday, April 19, 2026

ఆణిముత్యం..వరుకోలు.. “జాతీయ సేవా రత్న” పురస్కారానికి ఎంపిక.

ఆణిముత్యం..వరుకోలు.. “జాతీయ సేవా రత్న” పురస్కారానికి ఎంపిక.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం, రామనిపట్ల గ్రామానికి చెందిన

విద్యావేత్త ప్రముఖ న్యాయవాది మాజీ సర్పంచ్ (భర్త), ప్రముఖ సంఘ సేవకులు వరుకోలు రాజలింగం “జాతీయ సేవ రత్న-2024” పురస్కారానికి ఎంపికయ్యారు. 

హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ (B.S.A.) జాతీయ అవార్డు కమిటి ప్రకటించింది. ఈ అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్  చైర్మన్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ వెల్లడించి ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్ లోని కార్యాలయంలో అందజేశారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కవులు కళాకారులు రచయితలు స్వచ్ఛంద సంస్థలు ప్రముఖ సంఘ సేవకులకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. 

వచ్చేనెల 11న బహుజన రైటర్స్ ఏడవ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్లో ఈ సేవారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో వరుకోలు రాజలింగంకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ,తమిళనాడు కేరళ కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు 600కు పైగా ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్కు హాజరవుతున్నారని తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎంత గొప్పగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవకు మారుపేరుగా వరుకోలు 

రాజలింగం చెప్పవచ్చుని అన్నారు.

ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నాయని ముఖ్యంగా విద్యార్థులకు ఆపదలో ఉన్నవారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికే కాకుండా రక్తదానం సేంద్రీయ వ్యవసాయం రైతులకు న్యాయసలహాలు  తదితర ఎన్నో అంశాల్లో తన సేవానిరతిని వరుకోలు రాజలింగం చాటుకున్నారు.

నిరుపేదలు ఎందరికో చదువుతో పాటు వారిని ప్రయోజకులుగా చేస్తూ అంతేకాక తన శ్రీమతిని  సర్పంచ్ గా గెలిపించుకొని ఆమె పేరిట కూడా తాను ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టరని పత్రిక ప్రకటనలు తెలిపారు.

ఫోక్సో కేసులో నిందుతునికి సంవత్సరం జైలు శిక్ష

ఫోక్సో కేసులో నిందుతునికి సంవత్సరం జైలు శిక్ష

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందుతునికి ఒక సంవత్సరం జైలు శిక్ష తో పాటు 1100 జరిమాన విధించింది కోర్టు హుస్నాబాద్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బోయిని వంశీ (19) 2019 లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 16 సంవత్సరాల బాలికను స్కూలుకు వెళ్లి వచ్చే క్రమంలో గత కొన్ని రోజుల నుండి పై నేరస్తుడు ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని మానసికంగా శారీరకంగా హింసించినాడని సదరు బాలిక దరఖాస్తు ఇవ్వగా అప్పటి ఎస్ఐ సుధాకర్, కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. అనంతరం నెరస్తున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. ఎస్ఐ శ్రీధర్ కేసు పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ వేయడంతో సిద్దిపేట 1 st ఏడీజే పోక్సో కోర్టులో కేసు విచారణ జరిగుతున్నది. శుక్రవారం 1 st అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫోక్సో కోర్టు జడ్జి ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్తుని పై నేరం రుజువైన నందున పై నేరస్తునికి 1 సంవత్సరం జైలు శిక్ష తో పాటు 1100/- రూపాయల జరిమానా విధించారు.నేరస్థునికి జైలు శిక్ష పడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ లింగం, తన వాదనలు వినిపించారు, ఎస్ఐ మహేష్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ శివ ప్రసాద్ కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ రాజమల్లు కీలక పాత్ర వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు విధులు నిర్వహించే అధికారులను సిబ్బందిని అభినందించారు.

ఉరికెళ్తున్నారా… జాగ్రత్త..

ఉరికెళ్తున్నారా… జాగ్రత్త..

* అనుమానస్పద వ్యక్తులతో జాగ్రత్త.

* దగ్గరలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి ఉరెళ్ళలి.

* సోషల్ మీడియాలో మీ లొకేషన్ ట్రావెల్స్ పెట్టద్దు.

* సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

సంక్రాతి పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు బంధువుల ఇండ్లకు విహార యాత్రలకు వెళ్లే వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి ఊరెళ్ళాలని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసుల సలహాలు సూచనలు తప్పకుండా పాటించి దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు వెండి ఆభరణాలు డబ్బులు బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోంవలని సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం సెక్యూరిటీ అలారం మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిదని తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వాలని అన్నారు. ఇంట్లో స్వీయ రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలి ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటి పరిసరాలను లైవ్/ ప్రత్యేక్షంగా చూసుకొవచ్చు సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. మీ గ్రామం పట్టణం కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని డయల్ 100కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 కాల్ చేయలని అన్నారు.

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది:  పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది:  పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి

రామగుండం యదార్థవాది ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో పదోన్నతులు పొందిన సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) వారి కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి  ప్రతి ఒక్కరూ శ్రమించాలని మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చుని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ సబ్ ఇన్స్పెక్టర్ లుగా పదోన్నతి పొందిన 08 మంది హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన 10 మంది కానిస్టేబుల్ గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందిన 19 మంది రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.

అసెంబ్లీలో ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ.

అసెంబ్లీలో ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ.

హైదరాబాద్ యదార్థవాద్ ప్రతినిధి

దేశంలో కమ్యూనిస్టుల అవసరం చాలా ఉన్నదని బిజెపి మినహా అందరూ భావిస్తున్నారన్నారని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ అధ్యక్షుడు ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కూనంనేని సాంబశివరావు ఒక మంచి సాంబశివరావు మంచి ఎడిటర్ అని మంచి కమ్యూనికేటర్ అని అన్నారు. ప్రజలతోనే జీవించాలని కలివిడిగా ఉండాలన్న భావన ఒక్కో వ్యక్తికి ఒక రకంగా ఉంటుందని కూనంనేని సాంబశివరావులో ఎక్కువగా ఉంటుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుపై  సీనియర్  జర్నలిస్టు షేక్ హసీన రచించిన “అసెంబ్లీలో ఒకే ఒక్కడు” పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ మగ్ధూం భవన్ గురువారం జరిగింది. సిపిఐ మాల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య సభాధ్యక్షతన జరిగిన సభలో పుస్తకాన్ని  కె.శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సభకు సిపిఐ కార్యదర్శి శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి సిఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ కేంద్రం డైరక్టర్ డి.కృష్ణకుమారి తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రేంపావని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ ప్రవక్త సుదర్శన్ ప్రధాని మోడీ తమకు శత్రువు కమ్యూనిస్టులేనని చెప్పారనిగుర్తు చేశారు. ఒక పార్టీ నుండి మరో పార్టీకి ఎవ్వరూ వెళ్లినా ప్రజలు పట్టించుకోలేదని కమ్యూనిస్టులు మారితేనే ఇబ్బందులు వస్తాయని అందరికీ అనిపిస్తోందన్నారు. ఒక పార్టీ నుండి ఇతర పార్టీలకు వెళ్లి తిరిగి తాము ఇది వరకు ఉన్న పార్టీలను తిట్టే వారిని ప్రజలు మన్నిస్తున్నారని, కానీ కమ్యూనిస్టులను మన్నించడం లేదని వివరించారు. ప్రస్తుత  బిజెపి అసలు బిజెపి కాదనే భావన ఆర్ బాగా వచ్చిందని బిజెపి భావాలకు కట్టుబడని వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని వివరించారు. నాయకులు చెబుతున్న అంశాలు వారి మాటలు కింది స్థాయిలోని ప్రజలకు చదువు రాని వారికి కూడా చేరాలని అప్పుడే ఆ సందేశాలు ప్రజలకు చేరుతాయన్నారు. “అసెంబ్లీలో ఒకే ఒక్కడు” పుస్తక రచయిత షేక్ హసీనను పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు ప్రొత్సహించి సహకరించిన డి.కృష్ణకుమారిని శ్రీనివాస్ రెడ్డి అభినంధించారు. ఒక వ్యక్తి గురించి పుస్తకాన్ని రాసే సమయంలో రచయితకు స్వేచ్ఛ ఉంటుందని అదే సమయంలో ఆ వ్యక్తికి సంబంధించి తప్పులు దొర్లితే వాటిని సవరించే హక్కు కూడా ఆ వ్యక్తికి ఉంటుందని వివరించారు. కవి రచయితలకు మనిషికి సమాజం నుండే ఆలోచనలు వస్తాయని రాజుల కాలంలో ఆస్తాన కవులు రాజుల గురించి మాత్రమే రచనలు చేసే వారని గుర్తు చేశారు.  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల చరిత్రను త్యాగాలు చేసిన వ్యక్తుల చరిత్ర పట్ల పుస్తకాలు రాయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పుస్తకాలు రాసే క్రమంలో కంటెంట్ అంశాల వారిగా ప్రాధాన్యత పాటించాలని సూచించారు. పుస్తకాన్ని రచించినందుకు షేక్ హసీనను ఆయన అభినందించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకే కమ్యూనిస్టుల గొంతు అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ తీవ్ర ఒత్తిడి ఉంటుందని ఒకే ఎంఎల్ కావడంతో అన్ని రంగాలు అనేక సమస్యలను శాసనసభలో ప్రస్తావించాల్సి ఉంటుందని ఇందులో కూనంనేని సాంబశివరావు సఫలీకృతం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సిఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ కేంద్రం డైరక్టర్ డి.కృష్ణకుమారి మాట్లాడుతూ స్వాతంత్య్రం నుండి ఇప్పటి వరకు చరిత్ర మరుగుణపడిన మహిళల చరిత్రను ‘రెడ్ స్వాన్ పబ్లిషర్స్ వేదిక’ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి పుస్తకాన్ని తీసుకొస్తామని తెలిపారు. మార్చి చివరి నాటికి ఒక పుస్తకాన్ని తీసుకురానున్నట్టు వివరించారు. పుస్తక రచయిత హసీన మాట్లాడుతూ జీవితాలను త్యాగం చేసి నిత్యం ప్రజల పక్షాన నిలడుతున్న పార్టీ సిపిఐ అని కొనియాడారు. అందరి పక్షాన శాసనసభలో ఒకే ఒక్కరుగా కూనంనేని సాంబశివరావు ఉన్నారన్నారు.

స్వచ్ఛ పట్టణంగా హుస్నాబాద్.

స్వచ్ఛ పట్టణంగా హుస్నాబాద్.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి:

హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ -2023 లో భాగంగా భారతదేశంలోని అన్ని పట్టణాలతో పోటీ పడగా దక్షిణ భారతదేశంలోని పదిహేను వేల నుండి ఇరువైఅయిదు వేల లోపు జనాభా గల పట్టణాల్లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ “స్వచ్ఛ పట్టణం” 3 వ  స్థానం ఎంపిక కావడం పట్ల రవాణా బీసీ  సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ లో మూడోసారి ఎంపిక కావడం గమనర్హం అని మంత్రి కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో స్వచ్ఛ పట్టణంగా ఎంపిక కావడంలో భాగస్వామ్యం అయిన  మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కో అప్షన్ సభ్యులు అధికారులను మంత్రి  అభినందిస్తూ భవిష్యత్ లో హుస్నాబాద్ మున్సిపాలిటీ మరెన్నో అవార్డులు సాధించాలని రాష్ట్రస్థాయిలో పేరు రావాలని ఆకాంక్షించారు.

భారత రాజ్యాంగలో సోషలిస్టు నిబంధనలు అమలుకై: హైకోర్టులో కేసు

భారత రాజ్యాంగలో సోషలిస్టు నిబంధనలు అమలుకై: హైకోర్టులో కేసు

అమరావతి యదార్థవాది ప్రతినిధి

భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న సోషలిస్టు నిబంధనను తక్షణమే అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాది తోట సంగమేశ్వర రావు కేసు దాఖలు చేశారు.భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు కావస్తున్న సోషలిస్టు నిబంధన రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చబడి ఇప్పటికీ అమలుకు నోచుకోని  సోషలిస్టు నిబంధనములు అమలు చేస్తే భారత దేశంలోని వనరులన్నీ జాతీయం చేయడంతో దేశంలో దారిద్రం నిరుద్యోగం వంటి రుగ్మతలు తొలగిపోతాయని ఆర్థికంగా అసమానతలు తొలగిపోయి సమానత్వ స్థితి రావడం ద్వారా మౌలిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆ విధంగా ఉత్తమ సమాజం రూపుదిద్దుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మండల ఫోటోగ్రాఫర్ ఎన్నికలు.

మండల ఫోటోగ్రాఫర్ ఎన్నికలు.

గజ్వేల్ యాదర్తవాది ప్రతినిధి 

కొండపాక మండల పరిధిలోని ఫోటోగ్రాఫర్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులుగా బ్రహ్మచారి ఉపాధ్యక్షులుగా నర్సింలు ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ కోశాధికారిగా కృష్ణ సలహాదారులుగా సంజీవ్ సురేందర్ కిషన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ  తోటి ఫోటోగ్రాఫర్స్ కష్ట సుఖాలలో తోడు నిలుస్తూ మండలంలోని అందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంగం సభ్యులు వెంకటేశం లక్ష్మణ్ రవి సంపత్ స్వామి పరమేశ్వర్ సతీష్ విష్ణు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరో పారాటానికి  సిద్దం కావాలి: గుర్రాల శ్రీనివాస్ 

మరో పారాటానికి  సిద్దం కావాలి: గుర్రాల శ్రీనివాస్ 

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (మాదిగ దండోరా) రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న  నాయకత్వంలో మరో పారాటానికి సిద్దం కావాలని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ పిలుపు నిచ్చారు.సిద్దిపేట జిల్లా కమిటి ఎన్నికల సమావేశం గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్  అధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అద్యక్ష కార్యవర్గాని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ సాధించే వరకు డప్పు చెప్పు పెన్షన్ మాదిగ పారిశుద్య కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలని యుద్ధానికి సిద్దం చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో చైతన్యం చేస్తూ ముందుకు వెళ్ళాలని పిలుపు నిచ్చారు. ఎస్సి వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు పెట్టడమా? రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడమా ప్రధాని మంత్రి నరేంద్ర మోడి తెల్చాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లాలలో మాదిగల సమగ్ర అభివృద్ది ప్రధాన లక్ష్యంగా సంఘం పని చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు రెండు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 3 లోక్ సభ స్థానాలు ఒక ర్యాసభ సీటు ఇవ్వాలని ఎమ్మెల్సీ నామినేట్ పోస్టులు పదవులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్  నగరంలో మాదిగల భవవానికి ఒక ఎకరం స్థలం కేటాయించి కోటి రూపాయల బడ్జెట్ విడుదల చేయలని కోరారు. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ కు ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి మాదిగలకు న్యాయం చేయలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్చి ముత్యాల భూపాల్ సిద్దని రాజమల్లయ్య మాదిగ రాష్ట్ర కార్యదర్శి బొంబాయి వెంకట్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తూర్పుంటి రాజేష్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మంగని శ్రీనివాసు రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా అద్యక్షలు లింగాల కృష్ణ మాదిగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బయ్యారం రాజు  దండోరా రాష్ట్ర సీనియర్ నాయకులు గుండి సంజీవులు సాయిలు దండు నర్సింలు రమేష్ కాసర్ల నర్సింలు లింగాల స్వామి కనకరాజు కర్ణకర్ మహేష్ స్వామి నర్సింలు కొమ్ము చిన్న రాజమ్మ సామణలు ఎడ్ల ప్రశాంత్ కొంపల్లి రాజు  తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి: ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి: ప్రభుత్వ విప్ అడ్లూరి

జగిత్యాల యదార్థవాది ప్రతినిధి

స్వాతంత్ర్య సమరయోధులు వడ్డే ఓబన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని  భావితరాల వారికి ఆయన పోరాట ప్రతిమలు తెలియజేయాలని ధర్మపురి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం వడ్డే ఓబన్న 217 వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వడ్డే ఓబన్న జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మొట్టమొదటి సారిగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 1807 జనవరి 11 న కర్నూల్ లో జన్మించిన ఆయన పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని 10 వేల మందితో సైన్యం ఏర్పాటు చేసుకొని  బ్రిటీష్ సైన్యంతో పోరాడిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు. ఒడ్డెర కులస్తులకోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని రాష్ట్రంలో నివసిస్తున్న ఒడ్డెర కులస్తుల కష్ట సుఖాలు పరిశీలించి వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వార సహకారం అందజేసేందుకు కృషి చేస్తానని అన్నారు. 

ఒడ్డెర కుటుంబాల్లోని భార్యాభర్తలు కష్టపడి జీవితం సాగించేవారని  ఒద్దేరాలను ఎస్టి జాబితాలో చేర్పించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తిసుకువస్తానని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారంటీల పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. పేదల సంక్షేమం జిల్లా సమగ్రాభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో చరిత్ర సృష్టించిన ఓబన్న చరిత్రను ప్రతీ ఒక్కరు  తెలుసుకోవాలని స్వేచ్చ సమానత్వం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు.

జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని గొప్పవారిని స్మరించుకొని స్పూర్తిగా తీసుకోవాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిసి బంధు పథకాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. 

అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ మహోన్నతులు స్వాతంత్ర్య సమరయోధులు జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని వడ్డెర ఓబన్న జయంతి వేడుకను మొట్ట మొదటి సారిగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వడ్దేరులు కష్టపడేతత్వం ఉందని వారు స్వతంత్ర జీవులని ఓర్పు ఎక్కువగా ఉంటుందని ఆనాటి ఉద్యమకారుల చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. 

ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగిలయ్య మాట్లాడుతూ కర్నూల్ జిల్లాలో పుటిన ఓబన్న ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని శిస్తుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని అన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన రాయి కొట్టడం ఒడ్డెర కులస్తుల జీవనోపాధి కష్టార్జితంతోనే జీవనం సాగిస్తారని అన్నారు. కార్యక్రమంలో బి.సి. సంక్షేమ అధికారి సాయిబాబా మున్సిపల్ ఇంచార్జీ చైర్మన్ గోలి శ్రీనివాస్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ బి.సి. ఒడ్డెర కుల సంఘాల నాయకులు కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...