36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

ప్రజా ఆరోగ్యనికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: ప్రభుత్వ విప్ ఆది 

ప్రజా ఆరోగ్యనికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: ప్రభుత్వ విప్ ఆది 

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి 

ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు 

అందించాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డును తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలు గురించి స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వైద్య రంగారనికి పెద్దపీట వేస్తుందని ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజా ఆరోగ్యనికి భరోసా కల్పిస్తూ ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచమని గుర్తు చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్యపాత్ర పోషించాలని ఎప్పటికప్పుడు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు.

జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సిద్దిపేట వాసి ఎంపిక.

జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సిద్దిపేట వాసి ఎంపిక.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

67వ జాతీయ స్థాయి పాఠశాలల క్రికెట్ పోటీలకు రోళ్ల ఋత్విక్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) కు ఎంపికైనట్లు  హైదరాబాద్ జిల్లా  కార్యదర్శి సోమశేఖర్ హైదరాబాద్ జిల్లా అండర్ -17 క్రికెట్ కోచ్ ప్రదీప్ తెలిపారు. సిద్దిపేట కు చెందిన ఋత్విక్ రోళ్ల గత డిసెంబర్‌లో గద్వాలలో హైదరాబాద్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా హైదరాబాద్ జిల్లా కెప్టెన్ గా వ్యవహారించాడు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఋత్విక్ ఈ నెల 16 నుంచి 23 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరగనున్న అండర్ -17 జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఋత్విక్ ను సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారులు అభినందించారు.

స్ఫూర్తిదాయకం వడ్డే ఓబన్న జీవితం: అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

స్ఫూర్తిదాయకం వడ్డే ఓబన్న జీవితం: అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

పెద్దపల్లి యదార్థవాది ప్రతినిధి 

మహనీయులు వడ్డే ఓబన్న జీవితం మనకు స్ఫూర్తిదాయకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ అన్నారు. గురువారం  అదనపు కలెక్టర్ లు జే.అరుణ శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా వడ్డే ఓబన్న నిర్వహించిన పాత్ర, ఆయన జీవిత చరిత్రను జిల్లా వెనుకబడి తరగతుల అధికారి చదివి వినిపించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మాట్లాడుతూ తొలితర స్వాతంత్ర్య సమరయోధుడైన వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అందించిన స్ఫూర్తిని మనమందరం స్మరించుకోవాలని తెలిపారు.

అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, వారి జీవితం మనందరికీ ఆదర్శమని వారి విలువలు సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం మనమంతా కృషి చేయాలని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని మహనీయులు చేసిన గొప్ప పనులను స్మరించుకోవడం వల్ల వారు అందించిన స్ఫూర్తి, విలువలు మనకు తెలుస్తాయని ఆయన పిలుపునిచ్చారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన సహచరుడిగా బ్రిటిష్ ఇండియా కంపెనీకి  వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని స్వార్థ ప్రయోజనాలతో బ్రతికే సమాజంలో ఆనాటి కాలంలోనే ఆయన నిస్వార్ధంగా మంచి విలువలను పాటిస్తూ దేశం కోసం పోరాటం చేశారని అన్నారు. వడ్డే ఓబన్న నిరంతరం కష్టపడే తత్వంతో జీవితాంతం చెడుపై పోరాటం చేస్తూ గడిపారని వారు చేసిన సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారు అందించిన విలువలు పాటించాలని మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల వారు అందించే విలువలు మనందరికీ మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జే.రంగారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్ వడ్డెర సంఘం జిల్లా వైస్ చైర్మన్ కుంట పోశెట్టి జిల్లా కార్యదర్శి వోళ్ళేపు బాలకృష్ణ పట్టణ ప్రెసిడెంట్ కొట్టే సమ్మయ్య ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు, వివిధ బి.సి సంఘ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి డాన్స్ పోటీలకు కెఎల్ యు విద్యార్ధిని ఎంపిక.

జాతీయ స్థాయి డాన్స్ పోటీలకు కెఎల్ యు విద్యార్ధిని ఎంపిక.

ఆంధ్రప్రదేశ్ యదార్థవాది ప్రతినిధి 

జాతీయ స్థాయి డాన్స్ పోటీలకు కెఎల్ యు విద్యార్ధిని శృతి సమన్వి కాకర్లపూడి ఎంపికయినట్లు కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ డీన్ డాక్టర్ సిహెచ్.హనుమంతరావు బుదవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. వర్శిటీలో లిబరల్ ఆర్ట్స్ కింద బిబిఎ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని శృతి సమన్వి కాకర్లపూడి సాక్ లోని  డాన్స్ క్లబ్‌లో క్రియాశీలక సభ్యురాలు అని ఆయన అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన 37వ సౌత్ జోన్ ఇంటర్-యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్ 2023-24లో క్లాసికల్ డ్యాన్స్‌  విబాగంలో ఆమె జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుందని అన్నారు. ఈ నేపద్యంలో ఆమె ఈ ఏడాది మార్చినెలలో లూథియానాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపియినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎపి తరుపున శృతి సమన్వి కాకర్లపూడి ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. ఈ సందర్బంగా శృతి సమన్వి కాకర్లపూడికి కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ అద్యాపకులు విద్యార్దులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వర్శిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారధివర్మ ప్రో వైస్ చాన్సులర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్ డాక్టర్ ఎన్.వెంకట్ రామ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు విద్యార్ది సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్.హనుమంతరావులు శృతి సమన్వి కాకర్లపూడిని అభినందించారు.

భౌగోళికంగా హుస్నాబాద్ మూడు జిల్లాలతో అనుబంధం ఉంది: మంత్రి పొన్నం

భౌగోళికంగా హుస్నాబాద్ మూడు జిల్లాలతో అనుబంధం ఉంది: మంత్రి పొన్నం

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

మంత్రి క్యాంప్ కార్యాలయంలో  హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లు ఎంపీడీవోలు ఎంఇఓలు అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించి నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధియే నా ప్రథమ ప్రాధాన్యతఅని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాలతో ఉన్నదున నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసిమెలిసి పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. ఈనెల 20న మరో సారి అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పనుల వివరాలపై సమీక్షిస్తానని అలోపు పూర్తి వివరాలను సేకరించాలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం 10 కోట్ల కేటాయించిందని వాటితో ప్రజలకు అత్యవసరమైన పనులను ప్రాధాన్యత ఇస్తూ పనిచేయాలని మంత్రి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల విధానాలు వేరువేరుగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారాన్ని కూడా అధికారులు సేకరించి అభివృద్ధికి ఉపయోగించాలి మన ఊరు మనబడి కార్యక్రమాల ద్వారా చేపట్టిన నిర్మాణ ప్రగతి వివరాలు అందించాలి తహసిల్దార్ లు వివాదాస్పద భూముల వివరాలు భూ రిజిస్ట్రేషన్ల వివరాలు అందించాలని రవాణా శాఖ అధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజలకు హుస్నాబాద్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డిఓ బెన్ సాలెం హనుమకొండ హుజురాబాద్ ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

గూడ మల్లారెడ్డి స్మారకార్ధం క్రీడలు.

గూడ మల్లారెడ్డి స్మారకార్ధం క్రీడలు.

గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి 

కొండపాక మండల పరిదిలోని వెలికట్ట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గూడ మల్లారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య గూడ సరోజనమ్మ కోడళ్ళు కుమారులు గూడ వనజాక్షి నరేందర్ రెడ్డి గూడ జ్యోతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం కోసం స్థానిక స్కూల్లో బుధవారం జ్యోతి ప్రజ్వాలన చేసారు. ఉమ్మడి వెలికట్ట గ్రామ స్థాయిలో నిర్వహించే ఈఆటల పోటిల్లో భాగంగా గురువారం రోజు క్రికెట్ పోటీ నిర్వహించి శనివారం స్త్రీలకు ముగ్గులపోటీలు  పెడతామని ఆర్గనైజర్లు విజ్జగిరి ప్రభాకర్ దొబ్బ రాజు తెలిపారు. కార్యక్రమంలో వెలికట్ట గ్రామ సర్పంచ్ అమ్ముల రమేష్ రవీంద్ర నగర్  విశ్వనాథపల్లి సర్పంచ్ వాసరి లింగారావు పిఎసిఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు పురుషోత్తం పటేల్ వార్డ్ సభ్యులు  కోడెల యాదగిరి నాంపల్లి యాదయ్య షాబద్దీన్ దత్తు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్నాథ్ రెడ్డి ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్ సింగపాక రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

యుద్ధనౌక గద్దర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం భట్టి

యుద్ధనౌక గద్దర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

సికింద్రాబాద్ వెంకటాపురం లోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న  ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి  వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నరు. భట్టి ని చూసి కంట తడి పెట్టుకొని భావోద్వేగానికి గురైన గద్దర్ భార్య విమలను ఓదార్చిన భట్టి  సందర్భంగా భట్టి మాట్లాడుతూ గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పరు.

పొడుస్తున్న పొద్దు తో.. నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని ఆహింసాయుతంగా నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దమ్మ అయిన సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్ర భాగాన నిలిచిన ప్రజా యుద్ధనౌక  తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య గుమ్మడి విమల కుమారుడు సూర్యం  కుమార్తె వెన్నెల లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు. భట్టి వెంట మల్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి  ఉన్నారు

బైకు దొంగను పట్టుకున్న పోలీసులు.

బైకు దొంగను పట్టుకున్న పోలీసులు.

మెదక్ యదార్థవాది ప్రతినిధి

మెదక్ పట్టణంలో పోలీసులు  వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి సిలిండర్ను బైక్ పై పెట్టుకుని వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని పట్టుకొని తమదైన శైలిలో ప్రశ్నిస్తే తాను మొత్తం నాలుగు బైక్ లు 24 సిలిండర్లను దొంగతనం చేశానని ఒప్పుకున్నాడని గతంలో కూడా దొంగతనాలు చేశాడని వ్యక్తి పేరు శ్రీకాంత్ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. 

అసత్య ప్రచారాలు మానుకోండి: మాజీ ఎమ్మెల్యే వొడితెల

అసత్య ప్రచారాలు మానుకోండి: మాజీ ఎమ్మెల్యే వొడితెల

* పార్లమెంట్ ఎన్నికలలో మా సత్తా ఏంటో చూపిస్తాం.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

మంత్రి పదవిలో ఉండి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని

మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ బాబు అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు అన్ననే లేడు అన్న కూతురు ఎక్కడినుండి వచ్చింది.. బోయినపల్లి అనే ఇంటి పేరు ఉంటే బంధువు అయినట్టేనా అని దుయ్యబట్టారు. ఇదివరకే మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారన్నారు. మంత్రి హోదాలో ఉండి పొన్నం సంబంధిత శాఖల నుండి పూర్తి వివరాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే మంత్రి పొన్నం పనిచేస్తున్నారని మరో సారి తప్పుడు ఆరోపణలు చేస్తే తాము కూడా మాటకు మాట సమాధానం చెప్పుతాంమని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మా సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. హుస్నాబాద్ అభివృద్ధి కెసిఆర్ ప్రభుత్వంలోనే జరిగిందని నియోజకవర్గములో ఇప్పటి వరకు ఎస్టీ రోడ్లు సీడీపీ నిధులు ఇతర అభివృద్ధి కోసం వచ్చిన నిధులన్నీ రద్దు చేయించారని తెలిపారు.

ప్రజల కోసమే పోలీసులు-ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం: జిల్లా ఎస్పీ అఖిల్

ప్రజల కోసమే పోలీసులు-ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం: జిల్లా ఎస్పీ అఖిల్

* యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించలి.

* యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి

మన జీవనశైలిలో చదువు ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవలని  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం వీర్నపల్లి మండల కేంద్రంలో మండల పరిధిలోని గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ లను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు.యువత చెడు మార్గాల వైపు మరలకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సంపాదించి తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా పోలీస్ శాఖ తరపున నిర్వహించడాం జరుగుతుందని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది అన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు.  క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి ప్రోత్సహిస్తామని ఎస్పీ అన్నారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారమైనా పోలీసులకు అందించాలని పోలీస్ లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ప్రజల భద్రతే మా భాద్యత అని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి సి.ఐ శశిధర్ రెడ్డి ఎస్.ఐ నవత ప్రజాప్రతినిధులు యువకులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...