36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

తుమ్మలతో రైతు ప్రతినిధుల సమావేశం

తుమ్మలతో రైతు ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

హైదరాబాద్ లో మంగళవారం  సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను రైతు ప్రతినిధులు వ్యవసాయ కార్యాలయంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతు బంధు అమలు ధరణి పోర్టల్ సమస్యలు రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ రుణమాఫీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం కల్తీ విత్తనాలు ఎరువులను ఏ విధంగా అరికట్టాలి సేంద్రియ ఎరువులు బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు డ్రిప్ చిరు ధాన్యాల సాగు తో పాటు ప్రాసెసింగ్ మామిడి తదితర పండ్ల  ప్రాసెసింగ్  మద్దతుధరలు ఆయిల్ పామ్ సాగు- ప్రాసెసింగ్ శీతల గిడ్డంగులు ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. భూసార పరీక్షలు ఆధారంగా పంటల సాగు మీద దృష్టి సారించడం ద్వారా రసాయన ఎరువులు వాడకం గణనీయంగా తగ్గే అవకాశముంది. పర్యవసానం గా భూసార పరిరక్షణ కు అవసరం అయిన  రీతిలో నేల భౌతిక రసాయన గుణాలు మెరుగు పడుతుంది అని రైతులు అనుభవాలను మంత్రికి వివరించారు. మల్టీ లేయర్ వ్యవసాయం ద్వారా ఒక స్థిరమైన ఆదాయం సంవత్సరం పొడవునా లభించే అవకాశం ఉందని ఆ పద్దతులను ప్రవేశ పెట్టాలని మంత్రిని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రాలు భూసార పరీక్షలు బహుళ అంతస్తుల వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు  అవగాహన తో పాటు ఆచరించటం లో భాగస్వామ్యం అందుకునేలా చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మంత్రికి తెలిపారు. మార్కెట్లో రైతులకు అన్యాయం జరుగకుండా మద్దతు ధర కనీసం దొరికేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ బాధ్యతలను నిజాయితీ గా నిర్వహించేలా చేయాలని, అదేవిధంగా పంటల ఉత్పత్తుల అదనపు విలువ చేకూరేలా ప్రాసెసింగ్ అవసరమని శీతల గిడ్డంగులు వసతి  అవసర మైన రీతిలో కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అన్ని అంశాలను సావధానంగా వినటమే కాకుండా ఒక రైతు గా తన అనుభవాలను కూడా ప్రతినిధులతో పంచుకున్నారు. నిరంతరం మనం అందరం కలిసి అన్ని అంశాల గురించి చర్చల ద్వారాఉమ్మడి అవగాహన తో  ముందుకు సాగుదాం అని రైతు ప్రతినిధుల బృందంతో తెలిపారు. జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి ఖమ్మం జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు తెలంగాణ కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి భూముల సమస్యలపై న్యాయ సలహాదారు ప్రొఫెసర్ సునీల్ చేతన సొసైటీ అధ్యక్షులు ప్రొఫెసర్ డి. నరసింహ రెడ్డి రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వర రావు వ్యవసాయ శాస్త్రవేత్త ఆల్టస్ జానయ్య ఈ సమావేశంలో పాల్గొని ఈ అంశాలపై చర్చించారు.

విశాఖలో హిందీ భాషపై ఉచిత శిక్షణ తరగతులు.

విశాఖలో హిందీ భాషపై ఉచిత శిక్షణ తరగతులు.

విశాఖపట్నం యదార్థవాది ప్రతినిధి

అంతర్జాతీయ హిందీ భాష దినోత్సవం జనవరి 10ను పురస్కరించుకొని హిమజ్యోతి మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సులభ శైలిలో హిందీ భాషలో మాట్లాడే విధంగా ఆన్లైన్లో మూడు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కే.హిమశ్రీ తెలియజేశారు. ప్రతి విద్యార్థి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ తరగతులు జనవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. వివరములకు కొసం 9010314089 నెంబర్ లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. కోర్సు పూర్తి చేసిన వారికి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.

ప్రజల ఆకాంక్ష మేరకే అధికారులు కృషి చేయాలి: జడ్పీ చైర్ పర్సన్

ప్రజల ఆకాంక్ష మేరకే అధికారులు కృషి చేయాలి: జడ్పీ చైర్ పర్సన్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం  మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శాసనమండలి సభ్యులు వంటేరు యాదవరెడ్డి దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి జెడ్పిటిసిలు ఎంపీపీలు జడ్పీ కో ఆప్షన్ సభ్యులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం హార్టికల్చర్ పశుసంవర్ధక శాఖ విద్యా వైద్య ఆరోగ్యo ఆయుష్ ఎన్ఆర్ఈజీఎస్ బీసీ సంక్షేమం ఎస్సీ కార్పొరేషన్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్ బి నేషనల్ హైవే విద్యుత్ స్త్రీ శిశు దివ్యంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సివిల్ సప్లై శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిని జిల్లా అధికారులు సభకు వివరించగా ఆయా మండలాల్లో జరుగుతున్న పనుల జాప్యం కొత్త పనుల అవసరాలను సంబంధిత జడ్పిటిసిలు ఎంపిటిసిలు సభా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు అధికారులు నడుచుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లాలో చేపట్టిన వివిధ నిర్మాణ పనులు పథకాలను కొనసాగించాలని  కమిటీ సభ్యుల కోరిక మేరకు తీర్మానం చేసినట్టు ఆమె తెలిపారు.

మెదక్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

మెదక్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

* విజేతలకు రూ 10 వేల బహుమతి

* మైనం పల్లి శివాణి

మెదక్ యదార్థవాది ప్రతినిధి

సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే సతీమణి మైనం పల్లి  శివాణి అధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 న మెదక్ పట్టణం లోని సిద్దార్థ స్కూల్ లో ముగ్గుల పోటీలు మహిళకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగుతాయి. పోటీలో గెలుపొందిన మొదటి విజేతకు రూ 10 వేలు, ద్వితీయ బహుమతి రూ 7500,  ఉత్తమ ముగ్గులు వేసిన మారో ముగ్గురికి 5 వేల చొప్పున అందించనున్నట్టు వెల్లడించారు.. వీటితో పాటు పోటీలో పాల్గొన్న మహిళలకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందిస్తున్నట్టు తెలిపారు. పోటీలో పాల్గొనే మహిళలు ఎవరి రంగులు, వస్తువులు వారే తెచ్చుకోవాలి నిర్వాహకులు సూచించిన నిబంధనలు పాటించాలి తెలిపారు. ఇతర వివరాలకు 9908047659 భవాని, 9491674731 అనిత లను సంప్రదించాలని ఆమె తెలిపారు.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. అనురాధ

సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. అనురాధ

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట్ నూతన పోలీస్ కమిషనర్ గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బి. అనురాధ ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు ఎస్ మల్లారెడ్డి ఏ ఆర్ అడిషనల్ డీసీపీలు రామ్ చందర్రావు సుభాష్ చంద్రబోస్ సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి గజ్వేల్ ఏసిపి రమేష్ హుస్నాబాద్ ఏసిపి సతీష్ ఎస్బి ఏసిపి రవీందర్ రాజు ట్రాఫిక్ ఏసిపి ప్రసన్నకుమార్ సిఐలు ఎస్ఐలు ఏఓ యాదమ్మ కమిషనర్ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు నేరాలను అరికట్టేందుకు చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాకు రావడం  ఆనందంగా ఉందని నేర నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకై  అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఫ్రెండ్లీ పోలీస్ గా మెదులుతామని ఆమె అన్నారు.

సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే: జిల్లా ఎస్పీ అఖిల్.

సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే: జిల్లా ఎస్పీ అఖిల్.

గ్రీవెన్స్ డే లో 12 ఫిర్యాదులు స్వీకరణ.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి 

ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా నేడు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులను బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. 

భూ తగాదాలు ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ  తెలిపారు. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటుగా ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి పాల్గొన్నారు.

ఆరు నెలల శిక్షణ నిమిత్తం జిల్లాకు ట్రైనీ ఐపీఎస్.

ఆరు నెలల శిక్షణ నిమిత్తం జిల్లాకు ట్రైనీ ఐపీఎస్.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి 

శిక్షణలో భాగంగా 2022 బ్యాచ్ రాహుల్ రెడ్డిని సిరిసిల్ల జిల్లాకు ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం ఆరు నెలల రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు రిపోర్ట్ చేశారు. 

2022 బ్యాచ్ తెలంగాణకు చెందిన రాహుల్ రెడ్డి బి.టెక్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ కు ఎంపికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు నెలల పాటు వివిధ విభాగాల్లో ప్రాక్టికల్ శిక్షణ  పొందనున్నారు.

ఆరు గ్యారంటీలకై నిపుణుల కమిటీని వేయాలి.

ఆరు గ్యారంటీలకై నిపుణుల కమిటీని వేయాలి.

* తాత్కాలిక పథకాలతో రాష్ట్ర ఖజానాను దివాలా తియించవద్దు.

* లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వమే విడుదల చేసిన శ్వేత పత్రం ద్వారా తేటతెల్లం కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో జరగ వలసిన అభివృద్ధి అర్హులైన వారికి అందవలసిన సంక్షేమ పథకాల హామీల అమలు మధ్య సమతూకం సాధించాల్సి న గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని లోక్ సత్తాపార్టీ భావిస్తోందని ఇందుకుగాను ప్రభుత్వం వెంటనే ఆర్థిక సామాజిక రంగ నిపుణుల కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని లోక్ సత్తపార్టి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు డిమాండ్  చేశారు. 2014-15 లో బడ్జెట్ రుణ భారం సుమారు 72 వేల కోట్లు కాగా ప్రస్తుతం రాష్ట్ర వార్షిక రెవెన్యూలో 34 శాతం డబ్బులు అప్పులు చెల్లించటానికే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అప్పుల్లో ప్రభుత్వం విధిగా చెల్లించాల్సిన అవసరం లేనివి పక్కన బెట్టి బడ్జెట్ అప్పులు బడ్జెట్ బయట రుణాలు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సుమారు 40వేల కోట్లను లెక్కిస్తే ప్రస్తుతం రాష్ట్ర రుణ భారం 5,50,000 కోట్లుగా తేలింది అని ఆయన అన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో అప్పుల నిష్పత్తి 39 శాతానికి చేరడం రోజు వారీ ఖర్చులకు సైతం రిజర్వు బ్యాంక్ నుంచి ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ రుణం తీసుకుని అధిక వడ్డీ చెల్లించాల్సి రావడం దురదృష్ట కర పరిణామమని తుమ్మనపల్లి అన్నారు. అప్పులు చేసి తాత్కాలిక పథకాలు రాష్ట్ర ఖజానాను దివాలా తీయించే పనులను ప్రభుత్వం చేపట్టవద్దని ఆయన కోరారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపేట రవీందర్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస వర్మ, కార్యదర్శి మల్లాది కిషోర్ వంశీ ప్రసాద్ మాచవరం శ్రీధర్ రావు యం. ఫనిధర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో శాంతిభద్రతల సంరక్షణకై కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ 

జిల్లాలో శాంతిభద్రతల సంరక్షణకై కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ 

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా పోలిస్ కమిషనర్ గా బాద్యతలు చేపట్టిన 2017 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన డాక్టర్ బి.అనురాధ బాద్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె ఇదివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ డిసిపిగా విధులు నిర్వర్తిస్తు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల  మేరకు బదిలిపై సిద్దిపేట కమిషనర్ గా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల సంరక్షణకై  కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ కు సూచించారు. ఇది వరకు కమిషనర్ ఆప్ పోలిస్ గా పనిచేసిన ఎన్.శ్వేత బదిలీపై హైదరాబాద్ సిసిఎస్ డిసిపిగా వెళ్లారు.

అష్టాదశ శక్తిపీఠ కేంద్రంలో ఘనంగా మండల పూజోత్సవాలు

అష్టాదశ శక్తిపీఠ కేంద్రంలో ఘనంగా మండల పూజోత్సవాలు

కొండపాక యదార్థవాది

కొండపాక శివారులో గల అష్టాదశ శక్తిపీఠ శ్రీ ఉమా రామలింగేశ్వర సహిత సుబ్రమణ్య స్వామి ఆలయ ధ్వజ శిఖర మహోత్సవములు జరుగుతున్నాయి శనివారం మొదలైన పూజ కార్యక్రమాలు శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ అభినఉద్ధాండ విద్యా శంకర భారతి స్వామి వారు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి పీఠము శ్రీ మాధవానంద సరస్వతి ఉభయుల సంపూర్ణ అనుగ్రహం చేత ట్రస్ట్ చైర్మన్ కెవి రమణ చారి ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృత నామ సంవత్సర మార్గశిర మాసము బహుల దశమి మరియు ఏకాదశి శనివారం నిమిషములకు దీపారాధన గోపూజ గణపతి పూజ పుణ్యవచనం మాతృక దీక్షాధారణ అఖండ దీపస్తాపనము చండీ పారాయణం కలశస్థాపనములు దేవతా పూజలు అష్టోత్తర  దేవత ఆవాహనములు హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగములు జరిగాయి. తదుపరి ఆదివారం ఉదయం రుద్రహోమం పంచసూక్త హోమములు మూల మంత్ర హోమములు బలిహరణ పూర్ణాహుతి స్వామి వారి ఎదుర్కోలు తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు  కళ్యాణం మహోత్సవములు జరపబడతాయని తెలిపారు. అనంతరం కళ్యాణ మహోత్సవ ఆశీర్వాదములు అన్నసమారాధన తీర్థప్రసాదాల వితరణ గావించబడునని ఇట్టి కార్యక్రమానికి భక్త మహాశయులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవత అనుగ్రహం పొందగలరని ట్రస్ట్ ఫౌండర్ కమిటీ సభ్యులు తెలిపారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...