39.2 C
Hyderabad
Sunday, April 19, 2026

నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తాం.

నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తాం.

* గౌరవెల్లి భూనిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం 

* అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

* రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే నిరుపేదలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాల పై దరఖాస్తులను స్వీకరించి రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే ఎమ్మెల్యేగా ఎంపికై పార్టీ ఆదేశాలతో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టానని ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ లాగే నేను మీ వాడినే మీకు ఏ సమస్య ఎదురైనా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరించే బాధ్యత నాదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు గ్యారెంటీలు  అమలు చేశామని డిసెంబర్ 28 నుండి ప్రజా పాలన కార్యక్రమంలో ద్వారా ప్రభుత్వ గ్యారంటీ లపై దరఖాస్తులను స్వీకరిస్తున్నాము నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినా కూడా ప్రజలకు మంచి చేయాలని దృఢ నిశ్చయంతో  ప్రభుత్వం ఉందని ప్రభుత్వం వచ్చిన నెల రోజులలోనే  420 అని విమర్శించడం తగదని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అవసరమైన రిపేర్లు పూర్తి చేసి అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే హుస్నాబాద్ మున్సిపాలిటిని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం సిడిఎంఏ అధికారుల బృందం నిన్ననే హుస్నాబాద్ కు వచ్చి పరిశీలించిందని అన్నారు. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగు నీరు అందించడంలో మాజీ ముఖ్యమంత్రి విఫలమయరని అందుకే కెసిఆర్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించాలని కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో అదే చేస్తుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ ఆర్డీఓ బెన్ షాలేం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ఏసీపీ సతీష్ మున్సిపల్ కమిషనర్ స్థానిక కౌన్సిలర్ పద్మ ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు.

బాధితుని కుటుంబానికి 2 లక్షల చెక్కు పంపిణీ

బాధితుని కుటుంబానికి 2 లక్షల చెక్కు పంపిణీ

యదార్థవాది, సిద్దిపేట:

ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏదన్నా అనుకోని సంఘటాన జరిగినప్పుడు కుటుంబానికి డబ్బుల పరంగా సహకారం ఉంటుందని యూనియన్ బ్యాంకు రీజినల్ మేనేజర్ ఈ వికాస్ రాజ్ సూచించారు. సిద్దిపేట లోని ముస్తాబద్ చౌరస్తా లో ఉన్న యూనియన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ కోటగిరి శ్రీనివాస్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. కేవలం 450 రూపాయలతో ఆయన చేయించిన ఇన్సూరెన్స్ వల్ల ఆయన అకౌంట్ కి నామిని అయిన ఆయన భార్య చంద్రకళ కు బుధవారం 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకాలు జీవితంలోనూ.. జీవితం తర్వాత కూడా కుటుంబాలకు తోడుగా ఉంటాయన్నారు. కేవలం 20 రూపాయలతో సురక్ష యోజనలో 2లక్షల రూపాయలు పొందవచ్చన్నారు. కేవలం రెండు రోజుల్లో ఇనురెన్సు క్లైమ్ అవుతుండని బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవాళ్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ హెచ్ రాఘవ్, సర్కిల్ మేనేజర్ ప్రదీప్ కుమార్,బ్రాంచ్ మేనేజర్ భారత్ సోనామాన్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రమాదకరం

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రమాదకరం

* ఓట్ల కోసమే “అయోధ్య” రామాలయాన్ని వాడుకుంటున్న మోదీ

* ఎన్నికల కమిషన్ పైన రాజకీయ ఓత్తిడి ఎక్కువైంది

* అందరికీ వడదెబ్బ తగిలితే మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు దెబ్బ

*  సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

రాబోయే లోక్ స‌భ‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ‘అయోధ్య’ రామాలయ అంశాన్ని ప్రధాని మోడీ ఆయుధంగా  ఉపయోగించు కుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. దేశంలో సెంటిమెంట్ వాతావరణం సృష్టించి అయోధ్య రామాలయ దేవాలయం ప్రారంభించి ఓట్లు దండుకునే కార్యక్రమంగా మారుస్తున్నారని తెలిపారు. లోకసభ ఎన్నికల కోసం సిపిఐ శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం కావాలని అందరికీ వడదెబ్బ తగిలితే మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు దెబ్బ తగిలి కవిత కోసం బిజెపితో రాజీపడ్డారని విమర్శించారు. హైదరాబాద్ మగ్ధూంభవన్  రెండు రజుల పాటు జరిగే సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.కె.సాబీర్ పాషా అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో నారాయణతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు జాతీయ కార్యవర్గ  సభ్యులు చాడ వెంకట్ రెడ్డి  హాజరయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనర్సింహ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమావేశం కొద్ది సేపు మౌనం పాటించి నివాళ్లు అర్పించింది.  అనంతరం నారాయణ జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రమాదకారిగా మారిందని సంస్థాగత వ్యవస్థలను నియంత్రిస్తోందని దేశ వ్యాప్తంగా కేంద్రంలోని బిజెపి పాలన పట్ల అన్ని వర్గాలూ వ్యతిరేకంగా ఉన్నాయని ‘ఇండియా’ కూటమికి అనుకూల వాతావరణం ఉన్నదని ఈ విషయాన్ని బిజెపి ఆర్ మేథావులు కూడా గుర్తించారని అందుకే ‘ఇండియా’ అనే పదం వినిపించకుండా ఉండేలా రాజ్యాంగంలోని ఇండియా పదానికి బదులుగా భారత్ పేరును చేర్చారని అన్నారు. ఎన్నికల కమిషన్ పైన అన్ని రాజకీయ ఓత్తిడి మరింత పెరిగిందనితెలిపారు. అద్వానీ గ్రాఫ్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయనను అయోధ్య ప్రారంభోత్సవానికి రానివ్వడం లేదని ఉద్దేశపూర్వకంగా నాటకీయ పరిణామాలతోనే పార్లమెంట్ దాడి జరిగిందని విమర్శించారు. దేశానికి గుండెకాయలాంటి పార్లమెంట్ దాడిజ రిగితే ఇక దేశ పరిస్థితి ఏమిటని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని నారాయణ నిలదీశారు. ఒక వేళ నిజమైన బాంబు తీసుకొచ్చి ప్రధాని మీద వేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపైన ప్రధాని ఒక ప్రకటన కూడా చేయలేకపోయారని మండిపడ్డారు. 

వైఎస్ షర్మిల ఎపిలోని కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అదే జరిగితే వైసిపి నుండి కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఏపీ సిఎం జగన్ టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ ముగ్గురూ భయబ్రాంతులకు గురై మోడీతోనే కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ కన్ను తెరిస్తే ఎక్కడ జైలులోఉండాల్సి వస్తుందోనని  సిఎం జగన్ ప్రతిపక్షనేత బాబు భయపడుతున్నారని విమర్శించారు.  

సిపిఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్ ఫిబ్రవరి 2,3వ తేదీలలో జరగనున్నట్టు నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని కొత్తగూడెం ఎంఎల్ స్థానాన్ని సిపిఐ గెలుచుకోవడం పట్ల వివిధ రాష్ట్రా ల నుండి తనకు ఫోన్లు  చేసి అభినంధిస్తున్నారని వారు ఎంతో సంతోషపడుతున్నారన్నారు. ప్రజా సమస్యల ప్రస్తావన అంశంలో  శాసనసభలో కమ్యూనిస్టు సభ్యుల గొంతు  మిగతా సభ్యులకంటే  ఎంత భిన్నంగా ఉంటుందో ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు.  సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ ప్రధాని మోడీకి ప్రజల కంటే ఎవిఎం యంత్రాలపైన నమ్మకం ఎక్కువగా ఉన్నదని అందుకే మరోసారి తామే అధికారంలోనికి వస్తామని ధీమాగా ఉన్నారన్నారు. పారదర్శకంగా వ్యవహారించాల్సిన ఎన్నికల సంఘం కేంద్రంలోని బిజెపికి చెంచగా మారిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినమూడు చట్టాలు అధ్వాన్నంగా మారాయని దుయ్యబట్టారు. లాటిన్ అమెరికాలో కూడా లెఫ్ట్ సభ్యులే గెలుస్తున్నారన్నారు. కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ సమావేశంలో కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలది

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలది

* మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విజయవంతం అయింది

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)పై రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు మహాలక్ష్మి పథకం అమలు తీరు ప్రభుత్వ ఆర్థిక సహాయం తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిని అధికారులను అభినందించారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు సిబ్బందికి రావాల్సిన బకాయిలు సంస్థ అప్పులు పీఎఫ్ సీసీఎస్ ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన సంస్థ దృష్టి పెట్టి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా రోజు వారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజల సంస్థ దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని టికెట్ ఆదాయంపైనే కాకుండా లాజిస్టిక్స్ కమర్షియల్ తదితర టికేటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని అన్నారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి  రామకృష్ణా రావు టీ ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఉప ఓఎస్డీ కృష్ణ భాస్కర్ టీఎస్ఆర్టీసీ ఈడీలు ముని శేఖర్ కృష్ణ కాంత్ ఫైనాన్స్ అడ్వజర్ విజయ పుష్ప సీఎంఈ రఘునాథరావు సీటీఎం జీవన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

ఆంధ్రలో ఎలక్షన్ కోడ్?

ఆంధ్రలో ఎలక్షన్ కోడ్?

* ఫిబ్రవరి 2న కోడ్ మార్చి 6న ఎన్నికలు

* రాష్ట్రంలో 3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు

అమరావతి యదార్థవాది ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 

2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. ఆంధ్రలో విమర్శలు ప్రతి విమర్శలు మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారుచేసింది. 

తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది ఓ వైపు ఈవీఎం ల మీద అవగాహన కల్పిస్తూ మరో వైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలెట్టింది ఇక తాజాగా ఏపీలో వున్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది.

ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు వున్నట్లు తెలుస్తుంది

ఇక ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది వుండగా, మహిళలు 1,86,04,742 మంది వున్నారని తెలుస్తుంది, ఇక థర్డ్ జెండర్ ఓటర్స్ 3,761 మంది వున్నారని ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది.ఇక రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు వుండగా అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో వున్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ లను ఓడించాలి.

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ లను ఓడించాలి.

*ఆ రెండు పార్టీలకు తెలంగాణపై ప్రేమ లేదు

*ప్రజలకిచ్చిన హామీలపై కాంగ్రెస్ వెనుకడుగు 

*కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీష్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలు బిజెపి కాంగ్రెస్ పట్టవని కెసిఆర్ కు రైతుల మీద ఉన్న ప్రేమ కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. 4వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా అని నిలదీశారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ అని 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తుంటే తొందరెందుకు అని కాంగ్రెస్ నేతలు ఏం చెప్పారు అదే తాము అడుగుతున్నామని అన్నారు. మంగళవారం దుబ్బాకలో టిఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం రాలేదని నిరాశ పడవద్దు అని ఇది మనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదని తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీ రామ రక్ష లాంటిదని ఎన్నో విజయాలు అపజయాలు మనకు తెలుసు బి ఆర్ ఎస్ లేకుంటే తెలంగాణ లేదని కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి ఒకటి కాదు రెండు కాదు వందల హామీలు ఇచ్చారని అన్నారు. మనమందరం ప్రజలతో కలిసి మెలిసి ఉందామని తెలుసు తెలియకో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుందామని భవిష్యత్తు మనదే కార్యకర్తలు అధైర్య పడవద్దని త్వరలో కచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారని ఇప్పటికే ప్రజల్లో ఆలోచన మొదలైందని రెడ్డి జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్ష పట్టదని అన్నారు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. 

వెలికట్ట గ్రామ ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ

వెలికట్ట గ్రామ ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ

కొండపాక యదార్థవాధి

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలైన ఆరు గ్యారెంటిలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను  ప్రజాపాలన పేరిట సమగ్ర సమాచార సేకరణలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విధితమే. దీనిలో భాగంగా మంగళవారం మండల పరిదిలోని వెలికట్ట గ్రామపంచాయితీ ఆవరణలో అధికారులు ప్రజలనుండి  దరఖాస్థులు స్వీకరించారు ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ అమ్ముల రమేష్ పక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు ఎంపిటిసి చింతల సాయి బాబా వార్డ్ సభ్యులు అధికారులు డి ఎల్ పి ఓ వేదవతి ఎంపీడీవో రాంరెడ్డి ఈజీఎస్ ఏపీఓ సుధాకర్ ఎలక్ట్రిసిటీ ఏఈ సత్యం పిఆర్ఏ తిరుపతిరెడ్డి మండల స్పెషల్ ఆఫీసర్ అమీనా బేగం ఏపీఎం శ్రీనివాస్ టి ఏ శ్రీనివాస్ గ్రామ సెక్రెటరీ నర్సింలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసరి లింగారావు పెరుగు అంజయ్య కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మెరుగు ప్రభాస్ గ్రామ అధ్యక్షుడు పెరుగు తిరుపతి వార్డ్ మెంబర్లు దొమ్మాట మహేష్ బొంతల కిషన్ శ్రీనివాస్ కాంగ్రెస్ మండల సీనియర్ నాయకుడు బూర్గుల నరేందర్ ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు త్రినేష్ యాదవ్ గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆశ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు

జిల్లాను అభివృద్ధి పదములో నిలుపుదాం: కలెక్టర్ రాజర్షి షా

జిల్లాను అభివృద్ధి పదములో నిలుపుదాం: కలెక్టర్ రాజర్షి షా

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

జిల్లా అధికార యంత్రాంగమంతా   సమిష్టిగా పనిచేసి జిల్లాను  అన్ని రంగాలలో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు  రమేష్  వెంకటేశ్వర్లు అదనపు జిల్లా ఎస్పీ మహేంధర్ డి ఆర్ ఓ పద్మశ్రీ  జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బందితో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల  కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం అంకితభావంతో సమిష్టిగా కృషిచేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్  జిల్లా టి ఎన్ జి ఓ అధ్యక్షులు నరేంధర్  జిల్లా కలెక్టర్ ను కలిసి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి  డి ఆర్ డి ఓ  శ్రీనివాస్ డి ఎఫ్ ఓ రవి ప్రసాద్  జిల్లా  మైన్స్ & జియాలజీ  శాఖ  సహాయ సంచాలకులు  జయరాజ్ జిల్లా  షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి  విజయలక్ష్మి  జిల్లా సంక్షేమాధికారిణి  బ్రహ్మాజీ ఎక్ససైజ్  సూపరింటెండెంట్  రజాక్ జిల్లా  సివిల్ సప్లై  మేనేజర్ హరిబాబు డి సి ఎస్ ఓ  బ్రహ్మరావు  పట్టణాభివృద్ధి అధికారిణి  ఇందిర ఆర్ డి ఓ జయచంద్ర రెడ్డి మునిసిపల్  కమిషనర్లు, జానకిరామ్ సాగర్  వెంకట గోపాల్  వివిధ శాఖల అధికారులు టి ఎన్ జి ఓస్  కార్యదర్శులు సంబంధిత అధికారులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి.

ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాపాలనను సందర్శించిన జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సరోజన. మండలంలోని పందిళ్ళ కుచన పల్లి హుస్నాబాద్ పట్టణంలోని బీజే కాలనీ పాత ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్లలో సందర్శించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో అధికారులు ప్రతి ఒక్కరి డాటా ఎంట్రీ చేయాలని ఇందుకు అంగన్వాడీలను ఆశా కార్యకర్తలను సమన్వయం చేసుకొని దర్యాప్తు పూర్తిచేయాలని అన్నారు. అలాగే సమయపాలన పాటించి దరఖాస్తుదారులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని వారికి సూచించారు. ఈ ప్రజా పాలన కార్యక్రమంలో ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. వీరి వెంట అంగన్వాడి, వార్డ్ ఆఫీసర్లు ఆశ మండల అధికారులు పాల్గొన్నారు.

భారతరత్నకు జేజేలు!

భారతరత్నకు జేజేలు!

*నేటితో పురస్కారంలకు అర్ధ చేంచరి..

*2019 తర్వాత ఎవరికీ ఇవ్వలేదు..!

*రెండు సార్లు రద్దు..

*ఇద్దరు విదేశీయులు..

యదార్థవాది ప్రతినిధి 

అదిగో.. భారతరత్న.. దేశంలోనే అత్యున్నత పురస్కారం..అందుకున్న వారికి.. ఓ పెద్ద నమస్కారం..!

ఏదో ఒక రంగంలో విశిష్ట సేవకు ఇచ్చే గౌరవం.. పద్మశ్రీ.. పద్మభూషణ్.. పద్మవిభూషణ్.. ఈ మూడింటినీ మించి మరో శిఖరం..

ఈ పురస్కారం…!

ఇంతటి అవార్డు చుట్టూ లేకపోలేదు వివాదాలు. రాజకీయం చేస్తున్నారని.. ఓటు బ్యాంకుగానూ మార్చేస్తున్నారని అయినా ఈ పురస్కారం.

మహోన్నతమే…!

ఇప్పటికి అందుకున్నది నలభై ఎనిమిది మంది. ఇద్దరు గాంధీలున్నా. సరిహద్దు గాంధీ కూడా చేరినా. మహాత్ముడు లేడెందుకో. జాతిపితకు రాలేదు కదా భారతరత్న. నోబుల్

ఆయనకు అంతకు మించి ప్రజాహృదయాల్లో స్థానం అంత ఉన్నతమైనది మహాత్ముని ప్రస్థానం..!

రాజాజీ బోణీ..

అప్పుడప్పుడు మారినా బాణీ భారతరత్న ఎప్పుడూ గొప్పదే అందుకునే వారికి అంతులేని యశస్సు భారతజాతి మొక్కుతుంది

వంచి శిరస్సు..!

ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (సరిహద్దు గాంధీ) నెల్సన్ మండేలా

*జీవించి ఉండగా వందేళ్ల వయసులో అవార్డు అందుకున్న కేశవ కర్వే (వందేళ్ల వయసులో) ఆయన కోసం అవార్డు ప్రదానోత్సవం బొంబాయిలో జరిగింది. 1958లో

*అతి పిన్న వయస్కుడు ఏకైక క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ (40 ఏళ్ల వయసులో)

*నేతాజీకి ప్రకటించిన అవార్డు సాంకేతిక కారణాల వల్ల రద్దయింది..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...