39.2 C
Hyderabad
Sunday, April 19, 2026

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: జిల్లా కలెక్టర్ 

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: జిల్లా కలెక్టర్ 

జగిత్యాల యదార్థవాది ప్రతినిధి 

ఆరు గ్యారెంటీల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రతీ ఇంటికి  ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని, ప్రతీ ఇంటికి ఒకటే దరఖాస్తు సమర్పించాలని  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా  అన్నారు. మంగళవారం జగిత్యాల గ్రామీణ మండలంలోని  హస్నాబాద్, మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, కోరుట్ల పట్టణ పరిధిలోని  ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా లబ్దిదారుల నుండి దరఖాస్తు ఫారంను స్వీకరిస్తున్న పద్దతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తదుపరి డిసెంబర్ 9 న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద వైద్య ఖర్చులకు 10 లక్షల వరకు పెంచడం జరిగిందని మిగతా 5 గ్యారెంటీలకు గత నెల 28 నుండి ఈ నెల 6 వరకు గ్రామాలు పట్టణాల్లోని అర్హులైన ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి ప్రభుత్వమే ఉచితంగా గ్రామ పంచాయతి మండల, మున్సిపల్ అధికారుల ద్వారా సరఫరా చేయడం జరుగుతున్నదని తెలిపారు. అట్టి దరఖాస్తు ఫారానికి దరఖాస్తు దారులు రేషన్ కార్డు అధార్ కార్డ్  జిరాక్స్ లు మాత్రమే జత చేసి అట్టి ఫారాన్ని పూర్తిగా నింపి కేటాయించబడిన కౌంటర్లలో సమర్పించాలని వివరించారు. గ్రామాలు, పట్టణాలు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలోనే కాకుండా ఈ నెల 6 వరకు స్థానిక పంచాయతి కార్యదర్శులకు, మున్సిపల్ అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇచ్చిన దరఖాస్తుకు రశీదు పొందాలని దరఖాస్తు దారులకు తెలిపారు. ఈ అంశాలకు సంబంధించిన దరఖాస్తులే కాకుండా రేషన్ కార్డు భూ సమస్యలు ఇతర ఎలాంటి సమస్యలైన దరఖాస్తు రాసి ప్రత్యేక కౌంటర్లలో అందజేయవచ్చని అన్నారు. ఈ  ధరఖా స్తులన్నింటిని ఆన్ లైన్ లో పొందుపరిచి అర్హులైన లబ్దిదారులకు వంద రోజుల్లో లబ్ది చేకూరనున్నట్లు తెలిపారు. చిట్ట చివరి అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందించడానికి ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ఇప్పటికే గ్రామలు, పట్టణాల వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 190 టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల 85 వేల హౌజ్ హోల్డ్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 1లక్ష లక్ష 35 వేల 500 అప్లికేషన్లు పంపిణి  చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అధికారులు, సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలని దరఖాస్తు దారుడు ఇచ్చిన ధరఖాస్తునకు రశీదు అందజేయాలని అన్నారు.  ఆయా ప్రాంతాలలో పరిశీలించిన కేంద్రాలలో ఆర్దిఓ రాజేశ్వర్ డి.పి.ఓ దేవరాజ్ మైనింగ్ సహాయ సంచాలకులు విజయ్ కుమార్ రాథోడ్ ఆర్ అండ్ బి ఈ.ఈ. శ్రీనివాస్ ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రత్యేక అధికారులు ఆయా మండలాల ఎం.పి.డి.ఓలు తదితరులు పాల్గొన్నారు. 

ఘనంగా నర్సారెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా నర్సారెడ్డి జన్మదిన వేడుకలు

కొండపాక యదార్థవాది

మండల పరిధిలోని దుద్దెడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి నూరుద్దీన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి జన్మదినం సందర్భంగా స్వయంభూ శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివాలయం ప్రాంగణం ఆవరణలో కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తదని ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తు అర్హత ఉన్నవారందరికి పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు  అందుతాయని అన్నారు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండని బీఆర్‌ఎస్‌ అనుకుంటోంది. తొమ్మిదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వని ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం లాక్కుంది. ప్రజా పాలన దరఖాస్తులకు సంబంధించి ప్రతీ ఊరిలో కౌంటర్‌ ఉంది జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పంజా అఖిల్ బుడలా రాజు బూరుగుల రాజు, గాజులపాటి కార్తీక్, మిద్దె సురేష్, పంజా కుమార్ గాజులపాటి రాజు బూర్గుల కనకరావు మగ్ధుం కుసుoబ సతీష్ చిట్యాల నర్సిములు బూరుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మేనమామను హత్య చేసిన అల్లుడు

మేనమామను హత్య చేసిన అల్లుడు

మెదక్ యదార్థవాది ప్రతినిధి

మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది మేనమామను అల్లుడు కొడవలితో హత్య చేసి నా ఘటన ఆదివారం రాత్రి జరిగింది మెదక్ పట్టణంలోని రాంనగర్ చెందిన మంగలి ప్రభాకర్ 44 సంవత్సరాలు భార్య విజయ విడిచి వెళ్లిపోయింది. చెల్లెలు యశోద, అల్లుడు ఏసు ఒకే చోట ఉంటున్నారు. ఆవారం రాత్రి ఒక విందుకు కలిసి వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన ప్రభాకర్ ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది దీంతో అల్లుడు ఏసు కు ప్రభాకర్ కు మధ్య గొడవ జరగడంతో ఆగ్రహించిన మేనల్లుడు ఏసు ఇంట్లో ఉన్న కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్లూస్ టీం తో పరిశీలించగా  ఏసు వద్ద జాగిలాలు నిలిచాయి. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావలసి ఉంది.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ న్యూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బానోతు హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ దానితోపాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే హుస్నాబాద్ లో ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలని తెలంగాణ వస్తే తమ బ్రతుకులు మారతాయని అనుకుంటే కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల బతుకులు అగాంచేసిందని నిజాన్ని రాస్తే జర్నలిస్టుల గొంతు నొక్కారని ఎల్లవేళలా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరవేసే ఈ వృత్తిలో అందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయమే చేసిందని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకుంటుందని ఆశాభావంతో ఉన్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మాగోడు ప్రభుత్వానికి తెలిపి మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కె రవీందర్, ఉపాధ్యక్షులు అక్రమ్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి టాకూర్ నర్సింగ్ మాటూరు గోపి పచిమట్ల శివ వేణు జగదీశ్ పెరుమాండ్ల భరత్ అనిల్ పున్న శంకర్ టీనా రవి ముతోజు శంకర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి: ఎస్ పి అఖిల్

జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి: ఎస్ పి అఖిల్

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి

జిల్లాలో వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పాల్గొన్న జిల్లా పోలీస్ సూపర్ డెంట్ అఖిల్ మహాజన్.. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొని వీధులలలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అనంతరం జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి మీడియా ప్రతినిధులకు  జిల్లా పోలీస్ శాఖ తరువున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలకు మరింత చేరువగా పని చేస్తామని నూతన సంవత్సరంలో ప్రజలందరూ  సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటు పోలీస్ శాఖ ఎప్పుడూ మీ సేవలో ఉంటుందని పేర్కొన్నారు. 

జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా జిల్లాలో విస్తృత వాహన ,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పోలీస్ పెట్రోలింగ్ పార్టీలతో నిరంతరం నిఘా, బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది.ఎక్కడైనా న్యూసెన్స్ జరిగితే డయల్ 100 కాల్ చేయాలని తెలియజేయాలని సూచించారు. పోలీసు వారి నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు..

జిల్లా ప్రజలకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: జిల్లా కలెక్టర్

జిల్లా ప్రజలకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: జిల్లా కలెక్టర్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

జిల్లాలోని ప్రజలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రజలు ఆశించిన అన్ని రంగాల్లో విజయం సాధించి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని అలాగే జిల్లాలోని కవులు కళాకారులు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయంగా రానించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్రీక ప్రకటనలో పేర్కొన్నారు.

మరో కొత్త పథకం శ్రీకారం 

మరో కొత్త పథకం శ్రీకారం 

తెలంగాణలో సామాజిక భద్రతా..

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

రాష్ట్రంలో రవాణా రవాణాయేతర ఆటో డ్రైవర్లు హోంగార్డులు వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఐదు లక్షల సామాజిక భద్రతా పథకం అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రమాద బీమా ప్రీమియం మొత్తం ఖర్చు రూ. 5,00,000/- ఈ పథకం కింద కవర్ చేయబడిన లబ్ధిదారునికి ప్రమాద బీమా రాష్ట్ర ప్రభుత్వంచే చెల్లించబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్‌ఫారమ్ కార్మికులకు రూ.5,00.000/- ప్రమాద మరణ బీమాతో “రవాణా రవాణాయేతర ఆటో డ్రైవర్లు హోంగార్డులు వర్కింగ్ జర్నలిస్ట్‌ల కోసం సామాజిక భద్రతా పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది..

కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి 

కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి 

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

వికసిత్ భారత్ సంకల్పయాత్ర కేంద్ర ప్రభుత్వం చేపట్టినకేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకై వికసిద్భారత్ సంకల్ప యాత్ర  కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని స్థానిక గ్రామపంచాయతీ ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో  వికసిత భారత్ ప్రోగ్రాం నోడల్ అధికారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వెంకట్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన లో ప్రతి వ్యక్తి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు వయసు రిత్యా ప్రీమియం చెల్లించినట్లయితే 60 వ సంవత్సరం నుండి పెన్షన్ లభిస్తుందని ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన పథకంలో సంవత్సరానికి 436 చెల్లించినట్లయితే ఏ కారణం చేతనైనా వ్యక్తి మరణించిన  వారి యొక్క నామినీకి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది అలాగే ప్రధానమంత్రి సురక్ష పథకంలో సంవత్సరానికి రూ. 20 చెల్లించినట్లయితే ఎలాంటి ఆక్సిడెంట్ రూపంలో అయినా మరణించినట్లయితే వారి నామినేకి రెండు లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది అని ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఖాతా తీసుకొని ఇన్సూరెన్స్ పొందాలని సూచించారు అలాగే ఆరోగ్య శాఖ నుండి ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహణ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్య పరిశ్రమ ఐకెపి ఆరోగ్యశ్రీ టీబీ అగ్రికల్చర్ అధికారులు సిబ్బంది పంచాయతీ కార్యదర్శి దేవేందర్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళ శ్రీనివాస్ రాంచరణ్ రెడ్డి సాగర్ రావు తిరుపతి సాగర్ హరి కిషన్ గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రతీ పేద వారికి సంక్షేమ పథకాలు: జిల్లా కలెక్టర్ ప్రశాంత్

ప్రతీ పేద వారికి సంక్షేమ పథకాలు: జిల్లా  కలెక్టర్ ప్రశాంత్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

ప్రతీ పేద వారికి పథకాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కుకునూర్ పల్లి మండలం కొనాయుపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్న  గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించి ప్రజలతో మాట్లాడి సరిపడా దరఖాస్తులను అధికారులు అందిస్తున్నారా దరఖాస్తుల రిషిప్ట్ లు ఇస్తున్నారా అని అడిగి ప్రజాపాలన కార్యక్రమం ప్రజలకు ఒక మంచి అవకాశం ప్రతీ పేద వారికి పథకాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని అన్నారు. ప్రజలకు కావాల్సిన  దరఖాస్తులను అధికారులే ఉచితంగా అందిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా నేరుగా గ్రామపంచాయతీలో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులను పూరించి అధికారులకు అందించాలని అన్నారు. జనవరి 6వ తేదీ వరకు గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులను అందించేందుకు అవకాశం ఉందని ప్రజలకు తెలిపారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజాపాలన గ్యారంటీల ఫ్లెక్సీ కనపడేలా కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఒకరోజు ముందుగానే దరఖాస్తులను ప్రజలకు అందజేయ్యాలని  ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డిఓ బన్సీలాల్ మండల ప్రత్యేక అధికారి జిల్లా యువజన మరియు క్రీడ శాఖ అధికారి నాగేందర్ కుకునూరుపల్లి తహసిల్దార్ మల్లికార్జున్ సర్పంచ్ వసంత తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.

పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సిద్ధిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అమ్మన చంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్య నిర్వాహక సమావేశం నిర్వహించారు. సిద్దిపేట పట్టణ ప్రెస్ క్లబ్ లో శనివారం జిల్లాలోని 11 మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా కార్యవర్గము హాజరైయ్యారు. సంఘం అధ్యక్షులు అమ్మన చంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టి ఎస్ జీ అర్ ఈ ఏ) సమస్యల పట్ల ఏ విధంగా పోరాడుతుందో వివరించారు. పెండింగ్ లో ఉన్న మూడు విడతల కరువు భృతి(డి అర్) వెంటనే విడుదల చేయాలన్నారు. నగదు రహిత చికిత్స(ఇ ఏచ్ ఎస్)విధి విధానాలను రూపొందించి వెంటనే అమలు చేయాలని ప్రతి నెల 1వ తేదీనే  పెన్షన్లు చెల్లించాలని తదితర ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా మండల యూనిట్ల సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తాననీ ఎల్ల వేళల అందుబాటులో యుండి సమస్యల సాధనకు కృషిచేస్తానన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ రాజిరెడ్డి కోశాధికారి యన్ బాలయ్య జే. సత్యం తదితులున్నారు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...