27.2 C
Hyderabad
Sunday, April 19, 2026

భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలి: రెడ్ ఫ్లాగ్ డిమాండ్.

భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలి: రెడ్ ఫ్లాగ్ డిమాండ్.

మచిలీపట్నం యదార్థవాది ప్రతినిధి 

రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని యంయల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఏదుట రెడ్ ఫ్లాగ్ జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నీతిఆయోగ్ ఆమోదించిన భూహక్కుల చట్టాన్ని ఏపి ప్రభుత్వం చట్టంగా తీసుకురావటాన్ని రెడ్ ఫ్లాగ్ తీవ్రంగా ఖండిస్తుందని కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకే ఈ చట్టమని జిల్లా కమిటీ కార్యదర్శి మేడక చోనాష్ మండిపడ్డారు. పేదల భూములు చుట్టూ పరిధిలోకి రాకుండా చేసి కోర్టులకు అతీతంగా ప్రభుత్వ ఆధీనంలోని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే చట్టమని చోనాష్ ధ్వజమెత్తారు. తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని  లేదంటే రాబోయే రోజుల్లో అన్ని ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాజుల అనిల్ కుమార్ బత్తిన ఇంద్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త బస్సులను ప్రారంభించిన: మంత్రి పొన్నం

కొత్త బస్సులను ప్రారంభించిన: మంత్రి పొన్నం

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కొత్తగా వచ్చిన 80 బస్సులు (30 ఎక్స్ప్రెస్. 30 రాజధాని ఏసీ 20 లహరి స్లీపర్ సీటర్లు) లను శనివారం రవాణా బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

హైదరాబాద్ లోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో 80 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం సంస్థ ఎండీ సజ్జనార్ అధికారులతో కలిసి  ప్రారంభించారు. 

త్వరలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు  అందుబాటులోకి రాబోతున్నన్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వీటిలో రాజదాని హైదరాబాద్ కు 500 జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు వివరించారు.

నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి: అదనపు ఎస్.పి 

నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి: అదనపు ఎస్.పి 

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్  ఎస్.మహేందర్ అన్నారు. మెదక్ జిల్లా నూతన పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన  మాట్లాడుతూ సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.  డిసెంబర్‌ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జిల్లా పరిధిలో స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ క్రైమ్‌ షీ టీమ్స్‌తో పాటు పెట్రోలింగ్‌ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిమని ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి వుంటుందని ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరీటీ సిబ్బంది ఎర్పాటు చేసుకోవాల్సి వుంటుందని వేడుకలు జరిగే సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇండ్ల వారికి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రధానంగా వేడుకల వేళ యువకలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి అవుతారని  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని వేగంగా వాహనాలు నడపడం రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని అలాగే గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందని పై అంక్షలను ఎవరైన అతిక్రమించిన ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 కి కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెం 871265888 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి  వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని పత్రిక ప్రటకనలో తెలిపారు.

పి ఆర్ టి యు నూతన కార్యవర్గం ఏర్పాటు.

పి ఆర్ టి యు నూతన కార్యవర్గం ఏర్పాటు.

ప్రభుత్వ పాఠశాలలా బలోపేతనికి కృషి చేస్తా..

పి ఆర్ టి యు నూతన అద్యక్షులు కెవిఎన్ రెడ్డి.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట పి ఆర్ టి యు భవన్ లో శనివారం చేర్యాల మండల పి ఆర్ టి యు ఉపాధ్యాయుల ఎన్నికలు జరిగాయి. చేర్యాల మండల అధ్యక్షులుగా కె వెంకట నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఏ శ్రీనివాసరావు లను ఏకగ్రీవంగా  ఎన్నికోవడంతో ఈ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కూర రఘువత్తం రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ సమక్షంలో నూతన కార్యవర్గం  ప్రమాణస్వీకారం చేశారు. ఈ సదర్భంగా రఘువత్తం రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వము దృష్టికి తెచ్చి పరిష్కరిస్తానని అన్నారు. నూతనంగా ఎన్నికైన అద్యక్షులు వెంకట నరసింహారెడ్డి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపి మాట్లడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ఉపాద్యాయుల సంక్షేమం కృషి చేస్తానని బాధ్యతాయుతంగా సంఘ టీచర్ల ఉన్నతికి పెద్దల సూచనలతో ముందుకు వెళ్తానని తోటి ఉపాధ్యాయులు నాపై పెద్ద బాధ్యత పెట్టారని వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉపాధ్యాయుల సమస్యలు  నెర వెర్చేందుకు కృషి చేస్తానని వెన్నంటి ఉండి సమస్యలు పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూరు సభ్యులు నాయకులు పిఆర్టియు చేర్యాల నాయకులు ఇతర సంఘ బాధ్యులు మన జిల్లా అధ్యక్షులు మల్లు శశిధర శర్మ ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి జిల్లా బాధ్యులు పాల్గొన్నారు..

సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం: జిల్లా అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం: జిల్లా అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

మంథని యదార్థవాది ప్రతినిధి 

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ  కార్యక్రమం సజావుగా జరుగుతున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అన్నారు. శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ మంథని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి మునిసిపల్ పరిధిలోని మూడవ వార్డు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ముందస్తుగా ప్రజా పాలన కార్యక్రమం ఉద్దేశించి వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం రెండు లక్షల 25 వేల 838 కుటుంబాలు ఉన్నాయని గ్రామ మునిసిపల్ వార్డులలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంమని, ప్రజా పాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రజలు దళారులను సంప్రదించకుండా ముందస్తుగానే ప్రజలకు దరఖాస్తులను అందజేస్తున్నామని దరఖాస్తులను ఇంటి వద్దనే నింపుకొని గ్రామ వార్డు  సభలకు వచ్చి కౌంటర్లలో అందజేసి రసీదు పొందాలని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గ్రామ వార్డు సభ మొదలైనప్పటి నుండి జనవరి 6 వరకు ఉంటుందని వార్డు, గ్రామ సభల్లో తమ దరఖాస్తులను అందజేయని వారు జనవరి 6 వరకు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్ విద్యుత్ శాఖ ఏ.ఈ. మల్లయ్య ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు అంగన్వాడి ఆశా కార్యకర్తలు రెవెన్యూ మునిసిపల్ అధికారులు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలి: ఎమ్మెల్యే రోహిత్

జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలి: ఎమ్మెల్యే రోహిత్

రెవెన్యూ అటవీశాఖ ఎక్సైజ్ శాఖ మైనింగ్ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష..

అటవీ భూముల ఆక్రమణలు నిర్మూలించాలి..

ప్రైవేటు పరిశ్రమలు ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకంలో స్థానికులకే అవకాశం కల్పించాలి..

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు..

మెదక్ యదార్థవాది ప్రతినిది

జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మెదక్ నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ అటవీశాఖ ఎక్సైజ్ శాఖ మైనింగ్ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు జిల్లాలోని చాలా పట్టణాలు గ్రామాలలో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారారని ఇక మీదట యువత అలా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన అవసరం ఉందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలైన అల్ఫాజోలం గంజాయి డ్రగ్స్ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. జిల్లాలోని అన్ని చెక్పోస్టుల వద్ద ఎక్సైజ్ పోలీస్ అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి గట్టి నిగాను ఏర్పాటు చేసి అక్రమ రవాణా జరగకుండా చూడాలని అన్నారు. అటవీ భూములు ఆక్రమణ కాకుండా అటవీశాఖ రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా పనిచేయాలని జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా మైనింగ్ రెవెన్యూ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని పరిశ్రమలు ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో స్థానిక యువకులకే ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జయరాజు డి ఎఫ్ ఓ రవిప్రసాద్ మెదక్ ఆర్ డి ఓ అంబదాస్ రాజేశ్వర్ నియోజకవర్గ పరిధిలోని అటవీశాఖ రెవెన్యూ శాఖ ఎక్సైజ్ శాఖ అధికారులు తాసిల్దారులు పాల్గొన్నారు.

గ్రామ దేవతలతో సుఖ సంతోషాలు: ఎమ్మెల్యే చింత

గ్రామ దేవతలతో సుఖ సంతోషాలు: ఎమ్మెల్యే చింత

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిధి

సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో పోచమ్మ తల్లి మందిరం పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందిర నిర్మాణాలు మానసిక ఉల్లాసానికి ప్రతితి  మందిరాల లొ పూజలు భజనలు జరుగుతూ ఉంటే ఎల్లప్పుడూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఇట్టి కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించినందుకు ఎంతో సంతోషిస్తున్నానని మద్దికుంట గ్రామ ప్రజలు నాపై చూపిన ఆదరాభిమానాలు నేను ఎన్నటికీ మర్చిపోలేనని గ్రామ ప్రజలను భక్తులనుదేశించి అన్నారు ఈ పోచమ్మ తల్లి దీవెనలతో గ్రామ ప్రజలు నియోజకవర్గ ప్రజలు కూడా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సమీనా అంజుమ్ ఎంపీపీ తొంట యాదమ్మ కిష్టయ్య సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుధీర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద గొల్ల ఆంజనేయులు అరి పొద్దీన్ ఎంపిటిసి అల్లం లలిత సర్పంచ్ అశోక్ సొసైటీ ఉపాధ్యక్షులు  పాండు నాయక్ డైరెక్టర్ విట్టల్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ అరిఫ్ మాజీ ఎంపిటిసి శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు మరకల రాజు సురేష్ గ్రామ శాఖ అధ్యక్షులు పాషా గ్రామ పెద్దలు యాదయ్య తుల్జారెడ్డి హరీష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా కలెక్టర్ శరత్

సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా కలెక్టర్ శరత్

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిధి 

ప్రజల వద్దకు పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రజా పాలనలో అర్హులకు సంక్షేమ ఫలాలను అందించాలనే లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సదాశిపేట మండలం  ఆరూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి కలెక్టర్ శరత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ప్రవేశపెట్టి అభయ హస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు జనవరి 6 వరకు  ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని గృహలక్ష్మి రైతు భరోసా చేయూత గృహ జ్యోతి ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలలో ఎవరికి ఏది అవసరం ఉందో దానికి  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏదేని కారణం వల్ల గ్రామ సభలో దరఖాస్తు చేసుకోలేని వారు జనవరి 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయవచ్చని ప్రతి దరఖాస్తుతో పాటు ఆధార్ రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాలన్నారు దరఖాస్తులో లేని అంశాలకు సంబంధించి ఏవేని దరఖాస్తులు ఉన్నట్లయితే ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశామని అట్టి దరఖాస్తులను అందులో ఇవ్వాలని  అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగు

తుందని కలెక్టర్ పేర్కొన్నారు. 

కలెక్టర్ మహిళలను బస్సులలో  ప్రయాణం చేస్తున్నారా? 

డబ్బులు తీసుకుంటున్నారా? డబ్బులు లేకుండా టికెట్ ఇస్తున్నారా అని  అడుగగా టికెట్ ఇస్తున్నారు కానీ డబ్బులు తీసుకోవడం లేదని ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు నవ్వుతూ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొందరు మహిళల  నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను  అందజేశారు అనంతరం ఆయా కౌంటర్లు అన్నింటిని తిరిగి కౌంటర్లలో సిబ్బంది  పనితీరును రిజిస్టర్లను దరఖాస్తులను పరిశీలించారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి సదాశివపేట ఎంపీడీఓ పూజ తహసిల్దార్ సంబంధిత అధికారులు గ్రామ సర్పంచ్ మధు లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు సంక్షేమం ఫలాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం: మంత్రి పొన్నం

ప్రజలకు సంక్షేమం ఫలాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం: మంత్రి పొన్నం

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా పాలన కార్యక్రమం పై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నేల28 నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులు కాదు సంపద సృష్టించామని స్వేద పత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌధ పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ దారులకు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ఐదో తేది లోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి శివయ్య కేడం లింగమూర్తి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ కౌన్సిలర్ భూక్య సరోజన మంజులా రెడ్డి వల్లపు రాజు ఎండి హసన్, మైదం శెట్టి వీరన్న పెరుమాండ్ల నర్సాగౌడ్ బంక చందు వెన్న రాజు రజిత జైపాల్ రెడ్డి ఎంపీపీ గీకు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలన తో సమస్యలు పరిష్కారం

ప్రజా పాలన తో సమస్యలు పరిష్కారం

* రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు  6 గ్యారంటీలకు అర్హులే..

* ప్రతి మండలానికి ఇంటర్ నేషనల్ స్కూల్ కోరకు స్థల సేకరణ చేపట్టాలి..

* ప్రభుత్వ భూముల వివరాలు సేకరణ చేయాలి..

* జిల్లా అదనపు కలెక్టర్ రమేష్..

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అదనపు జిల్లా కలెక్టర్ రమేష్  ఈ నెల 28 నుంచి  ప్రారంభం కాబోయే  ప్రజా పాలన  కార్యక్రమము పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనతో ప్రజల సమస్యలు పరిష్కారం దొరుకుతుందని జిల్లా యంత్రాంగం ప్రజా పాలన నిర్వహణ కు సిద్దంగా ఉందన్నారని ప్రజలు ప్రజా పాలనను ఉపయోగించుకొని సమస్యలు పరిష్కారిoచుకోవలని ప్రజా పాలన దరఖాస్తు ఎలాంటి రుసుము లేదని ప్రతి 100 మందికి  ఒక కౌంటర్ ఏర్పాటు చేయనున్నామని ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలని రేషన్ కార్డు కలిగి వున్నా ప్రతి ఒక్కరు  6 గ్యారంటీలకు అర్హులేనని తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రతి మండలము లో ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం 10 ఎకరాల స్టల పరిశీలనకు  ప్రభుత్వం  ఆదేశించిందని అన్నారు. అమరవీరులకుటుంబాలు 250 గజాల ఇంటి స్థలం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రజాపాలనలో వచ్చిన ధరఖాస్తులన్నీ ఆన్లైన్ చేస్తామని అన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...