29.2 C
Hyderabad
Sunday, April 19, 2026

మతాలకతీతంగా క్రిస్మస్‌ వేడుకలు.

మతాలకతీతంగా క్రిస్మస్‌ వేడుకలు.

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

మెదక్ ప్రధాన తపాలా  కార్యాలయంలో మంగళవారం మతాలకతీతంగా క్రిస్మస్‌ కేక్ కట్ చేసిన తపాలా శాఖ ఉద్యోగులు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ ఏసు ప్రభువు అహింస శాంతి సమసమాజ స్థాపన కొరకు చూపిన మార్గం అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్  శ్రీహరి అడిషనల్ సూపరింటెండెంట్ పోస్టల్ సిబ్బంది నరేష్ మానస తదితరులు పాల్గొన్నారు.

మెదక్ లో డ్రగ్స్ ముఠా తిరుగుతోందా.!

మెదక్ లో డ్రగ్స్ ముఠా తిరుగుతోందా.!

మత్తులో ఊగుతున్న యువత.!

పట్టి పట్టనట్టు పోలీస్ అధికారుల వైనం.!

మెదక్ యదార్థవాది ప్రతినిధి

నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ జిల్లాలో యువతను మత్తులో ముంచడానికి కొన్ని ముఠాలు జిల్లాలో తిరుగుతున్నట్లు సమాచారం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలను రాష్ట్రంలో నిర్మూలించడానికి శాయశక్తులు కృషి చేస్తున్న అక్కడక్కడ కొన్ని ముఠా సభ్యులు నీరు గారుస్తున్నరు..

ఇందుకు నిదర్శనం ఇటీవల మెదక్ పట్టణంలో సుమారు పది నుండి పదిహేను కిలోల వరకు నిషేధిత అల్పజోలం డ్రగ్ పట్టు పడ్డట్లు తెలుస్తోంది. ఏమైనా కానీ ఇప్పటికైనా అధికారులు డ్రగ్స్ రహిత జిల్లాగా చూడాలని మెదక్ జిల్లాలో ప్రతి ఒక్కరి ఆశ..

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా!

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా!

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు సమాచారం ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ వాయిదా పడింది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు అయితే ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయటంతో తెలంగాణలో గ్రూప్-2, 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేశారు అయితే గ్రూప్ -2 ఎగ్జామ్ డేట్ రీ షెడ్యూల్ చేస్తారా లేక కొత్త పోస్టులను చేర్చి రీ వైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది ఇప్పటి వరకు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రివ్యూ చేసింది గ్రూప్- 2 ఎగ్జామ్స్ పై తెలంగాణ సర్కార్ స్పష్టత కాలేదు అయితే ఇప్పటికి ఎన్నిసార్లు పరీక్షను వాయిదా వేస్తారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పలుమార్లు ఎక్సామ్ వాయిదా పడటంతో పలువురు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు.

జిల్లాలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

జిల్లాలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.

ఎల్లలు దాటి వెల్లువలా తరలివచ్చిన భక్తజన సందోహం.

భక్తిప్రపత్తులతో మార్మోగిన ప్రార్థనలు.

మెదక్ యదార్థవాది ప్రతినిది

మెదక్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు భక్తులతో కిక్కిరిసిన కరుణామయుని సన్నిధి..
ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, వేలాది మంది భక్తులు. కరుణామయుని కోవెల కిక్కిరిసిపోయింది. సోమవారం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి రాష్ట్రాలు జిల్లాలు దాటి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు సందర్శకులు ఏసయ్య దీవెనల కోసం బారులు తీరారు కిస్మస్ సందర్భంగా తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ పద్మారావు భక్తులకు వాక్యోపదేశం చేశారు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును భూమిపైకి పంపించిన రోజే క్రిస్మస్ అని క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ పండుగ అని తెలిపారు. క్రీస్తు రాక ఈ లోకానికి శుభసూచకమని ఆకాశంలో తోకచుక్క ఉద్భవించగానే ఈ విశ్వానికి వెలుగులా మన జీవితాలు మార్చడానికి వచ్చిన దేవుడే ఏసుప్రభు అని ప్రభువైన యేసు ఈలోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ఆచార్యకర్త ఆలోచన కర్త గల దేవుడు అని ఈ సమాజానికి అధిపతి అని అన్నారు. అహింస శాంతి ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుందని మానవత్వమే ప్రభువు అభిమతమని అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు శాంతి కరుణ ప్రేమప్రభువు బోధనలన్నారు వాటి స్థాపన కై దైవ కుమారుడిగా ఏసయ్య భూమి మీదకు వచ్చారని తెలిపారు. ప్రజలకు క్రైస్తవులకు మహా దేవాలయానికి విచ్చేసిన భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

పేదింటి ఆడబిడ్డ పెళ్లి కీ ఆర్ధిక సహాయం.

పేదింటి ఆడబిడ్డ పెళ్లి కీ ఆర్ధిక సహాయం.

కొండపాక యదార్థవాది

దుద్దెడ గ్రామానికి చెందిన కూటిగంటి రేణుక వెంకటేష్ గౌడ్ ల కూతురు మానస వివాహం ఈనెల 29వ ఉండడం తో దుద్దెడ గ్రామ ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పంజాల శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఆడబిడ్డ పెళ్లికి అండగా చిరుసాయంగా 10000 రూపాయలు అందించాడు. పేదింటి కుటుంబాలకు సంబందించిన ఇలాంటి అవసరాలకు కొండంత అండగా ఉంటున్న పంజాల శ్రీనివాస్ గౌడ్ ను బారాస మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఎండి మొహినుద్దీన్ మిద్దె శివకుమార్ మిద్దె రమేష్ అభినందించారు. ఈ ఆర్థిక సహాయాన్ని అందించిన శ్రీనివాస్ గౌడ్ కు మానస తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

పేదలను ఆదుకోవడం సంతృప్తినిస్తోంది: మెంగర్తి సుధాకర్

పేదలను ఆదుకోవడం సంతృప్తినిస్తోంది: మెంగర్తి సుధాకర్

వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన మంజీరా సేవాసమితి..

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

మెదక్ జిల్లా రామయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో క్రిస్టమస్ పండుగ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేసిన మంజీరా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మెంగర్తి సుధాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుకతోనే అనాధలుగా ఉండరు 

కొన్ని సందర్భాలలో వారి వ్యక్తిగత జీవితాలలో ముడిపడి ఉందని ఇందుకు మనము చేసే సేవ మానవతా దృక్పథంతో  భగవంతుడు మనకు ఇచ్చిన దాంట్లో కొంత పేదలకు సేవ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అయితే గత పది సంవత్సరాలుగా సుమారు 100 మంది నిరుపేద మహిళలకు పుస్తె మట్టెలు పంపిణీ చేయడంమే కాకుండా నిరుపేదలకు బియ్యం దుస్తులు ఇవ్వడం జరుగుతుందని అలాగే కొన్ని స్కూళ్లలో ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని చేయడంతో పాటు సేవా కార్యక్రమాన్ని అలపర్చుకున్నానని ఆయన అన్నారు.

కుల వివక్షకు మూలం మనుధర్మమే.

కుల వివక్షకు మూలం మనుధర్మమే.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

భిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో కుల వివక్షకు సామాజిక అసమానతలకు మనుధర్మ శాస్త్రవే మూల కారణమని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. 

భారతదేశ వెనుకబాటు తనానికి మనుస్మృతియే ప్రధాన కారణమని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిఘటించి డిసెంబర్ 25న మనుస్మృతిని దహనం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మనుస్మృతి దహన కార్యక్రమాన్ని చేపట్టారు. 

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ మనువు చెప్పిన సూత్రాలన్నీ పేద ప్రజలను, మహిళలను తీవ్రంగా అవమానించే లాగా ఉన్నాయని అన్నారు. అందుకే ప్రజలందరూ మనుధర్మాన్ని వీడి, ప్రజాస్వామిక ఆలోచన విధానంతో ముందుకు సాగాలని అన్నారు. సర్వ సమానత్వం సాధించాలంటే భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కావాలని అదొక్కటే మనందరికీ శరణ్యమని అన్నారు. అనంతరం మనుస్మృతిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేడం లింగమూర్తి, ముక్కెర సంపత్ కుమార్, బంక చందు, వెన్న రాజు, ఎనగందుల శంకర్, గొర్ల ఐలేష్ యాదవ్, భూక్య సరోజన, పోతుగంటి బాలయ్య, గుగులోతు రాజు నాయక్, పొన్నాల వినోద్ కుమార్, గాలి పెళ్లి శ్రీనివాస్, భువనగిరి రజిత, కొండ్ర రమాదేవి, బోయిని కమల, జేరుపోతుల సంజీవ్ బోయిని రాజ మల్లయ్య లావుడ్యా బిక్య నాయక్ బెజ్జంకి బాబు తుమ్మ రాజారాం రుద్రారపు శరత్ బాబు బోయిని కొమురయ్య బత్తుల రవి రామగిరి కుమారస్వామి బండారి అజిత్ సావుల మధు బదనపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు

ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం!

ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం!

యదార్థవాది ప్రతినిధి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీ లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఉద్ధేశ్యంతో మొదలు పెట్టిన కార్యక్రమాన్ని కొందరు అధికారులు నీరుగారుస్తూనారు. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు.ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్తున్న టీఎస్ 34టీఏ 5189 బస్సులో కండక్టర్ గండీడ్ జానంపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టిక్కెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు ఈ తతంగం అంతా ఫోన్లో చిత్రీకరించాడు.

కొత్త బస్సులు వచ్చేస్తున్నాయి. 

కొత్త బస్సులు వచ్చేస్తున్నాయి. 

యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్ 

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను ఆర్టీసీ తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

“ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా  కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. 

అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540 తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం. అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్  తెలిపారు.

కమనీయం అప్పన్న కల్యాణం.

కమనీయం అప్పన్న కల్యాణం.

శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారి దేవస్థానం..

సింహాచలం (విశాఖపట్నం) యదార్థవాది ప్రతినిధి 

శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా  ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో  మండ పంలో అధిష్టింపజేశారు.  పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...