తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అందరూ ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆదివారం హుస్నాబాద్ నియోజక వర్గం లోని రాష్టం లోని క్రైస్తవ సోదరులకు మంత్రి పొన్నం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు కృపతో క్రిస్మస్ పండుగ నుంచి 2024లో ప్రజలందరూ ఆనందంగా సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. మంచి మనసుతో పాలకులు అధికారులు ప్రజలకు సేవలు అందించాలి అని మంచి సమాజం కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు.
దుద్దెడ గ్రామంలో ఉషోదయ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదానశిభీరాన్ని ఎర్పాటు చేశారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి మహదేవ్ ప్రారంభించి స్వయంగా రక్త దానం చేసి రక్తదానం చేసిన 50 మందిని అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేస్తే నలుగురికి సహాయం చేసిన వారు అవుతారని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఉషోదయ యూత్ ముందుకు వచ్చి రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని గ్రామంలో యువత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన తలసీమియా సికిల్ సెల్ సొసైటీ సహకారం అందించగా దుద్దెడ జెడ్పి హైస్కూల్ ఆవరణలో జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని ఎర్పాటు. యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుముల రవి మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని అలాంటి చిన్నారులకు తమ వంతు సహాయంగా ఈ శిబిరం నిర్వహించామన్నారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిల్ యాదవ్ మాజీ ఎంపీపీ అనంతుల పద్మ నరేందర్ సిద్దిపేట కపిల్ చిట్ ఫండ్స్ మేనేజర్ వెంకటరెడ్డి రక్తదానం చేశారు. రక్తదాతలకు ఉషోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు చిలుముల రవి తాడూరు చక్రవర్తి సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు వార్డ్ మెంబర్ పోతుగంటి నాగరాజు మాజీ వార్డ్ మెంబర్ చిట్యాల నరసింహులు లక్మి దంపతులు ఉషోదయ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
*స్వామి వార్లను దర్శించున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
*ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు
*మెదక్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే ఆలయాలు కిటకిట
*పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన శ్రీ మాధవానంద సరస్వతి స్వామి
మెదక్ యదార్థవాది ప్రతినిధి
ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ఆలయాలు దేదీప్యమానంగా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కట్టారు.
జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ముక్కోటి ఏకాదశి పర్యదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణాలు భక్తి పారవశ్యమయ్యాయి. గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో ఆలయ అర్చకులు శ్రీ భాష్యం మధుసూదన్ చార్యులు, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నరేంద్ర చార్యులు ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి.
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం శ్రీ వెంకటేశ్వరాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించారు.
ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి
మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని దేవుడిని వేడుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలోని స్వామి వారికి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భజన బృందం ఆలపించిన భజన కీర్తనలు రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర ద్వారం తలుపులు తెరవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యారు భక్తులు పెద్ద ఎత్తున సాయంత్రం లక్ష పుష్పార్చన సేవ భజన సంగీత విభావరి వేద ఆశీర్వాదం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ కౌన్సిలర్లు గాయిత్రి కల్యాణి యశోద ఆర్కే శ్రీను ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్ సభ్యులు నందిని శ్రీను పురుషోత్తం సకిలం శ్రీనివాస్ బద్రినాథ్ నగరం మల్లేశం దేవేందర్ రెడ్డి రాందేవ్ వేద పండితులు రంగాచార్యులు లింగమూర్తి శర్మ వైద్య శ్రీనివాస్ శర్మ, శేషాచారి కృష్ణ మూర్తి భాను శర్మ ప్రసాదశర్మ కృష్ణ రావు భక్తులు పాల్గొన్నారు.
క్రిస్టమస్ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని నిరుపేద క్రైస్తవులకు శనివారం హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మి గార్డెన్ లో బట్టలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పేద క్రైస్తవులకు బట్టలను పంపిణీ చేసి మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాయకుడిని కాదు ఒక సేవకుడిగా పనిచేస్తా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ తప్పకుండా అన్ని మతాలను మా ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తూందని ప్రజాస్వామ్య ప్రజాపాలన ఇనుప కంచెలను ప్రగతి భవనంలో తొలగించి ప్రజలకు వేదికగా మార్చడం అటువంటి పాలన అంశం గ్రామాల దాక రాభోతుందని అన్నారు. హుస్నాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తే మీ సేవకునిగా బాధ్యతను తీసుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చెసి ఇవాళ 23 తారీకు 16 రోజులైంది హుస్నాబాద్ లో మోడల్ స్కూల్లో సమస్యకు వెంటనే స్పందించాను ప్రియాంక గాంధీ మెడికల్ కళశాల ఏర్పాటు ఆర్టిఏ కార్యాలయంలో యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ అందించే విదంగా ట్రాక్ ఇతరత్రా అవసరాల కోసం భవనానికి స్థలాలను అన్వేషణ చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం 10 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యాన్ని అందించామని గౌరవెల్లి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ సమస్య తప్పకుండా పరిష్కారించి ఆదుకుంటామని అన్నారు. క్రైస్తవులకు సంబందించి హక్కులు విషయాలలో ఎవరికి ఎలాంటి భంగం కలగకుండా ఒక ప్రతినిధిగా రాజకీయ హోదా అనేది ప్రజలకు సెవచెసే విధంగా నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చుదిద్దుతా ప్రశంస పోందే విధంగా పాలన కొనసాగిస్తానని అన్నారు.
అందరికీ క్రీస్టమస్ శుభాకాంక్షలు మీ ప్రేమకు ధన్యవాదాలు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు బట్టల పంపిణీ కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరుపుతున్నాం అన్నారు. ఈ సమావేశంలో క్రైస్తవ మతాది పెద్దలు ఆర్డీఓ బెన్ షాలం జెడ్పీటీసీలు ఎంపిపిలు ఇతర ప్రజాప్రతినిధులు అదికారులు తదితరులు పాల్గొన్నారు
దేశంలో బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామ్యశక్తులను ఏకం చేయడంలో సీపీఐ ప్రధాన పాత్ర వహిస్తది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతాం.
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడవెంకటరెడ్డి.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
రాబోయే ఎంపీ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించడానికి ఇండియా కూటమి తో పాటు బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన భూమిక పోషిస్తదని బీజేపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా శాయశక్తులా పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని లస్థానిక అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో సీపీఐ తో పొత్తు పెట్టుకున్న తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని,మిగతా 4 రాష్ట్రాల్లో పొత్తు ఉంటే అక్కడ కూడా అధికారం వచ్చేమో అని ఆయన అన్నారు.. రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి అన్ని వామపక్ష, ప్రజాస్వామిక పార్టీ లు, ప్రజాతంత్ర శక్తులు ఏకం అయ్యి బీజేపీని చిత్తుగా ఓడిస్తామని,ఆ పాత్ర సీపీఐగా తీసుకుంటామని మాట్లాడారు..అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పోటీ చేయడానికి కార్యకర్తలను సన్నద్ధం చేస్తామని ఆయన తెలిపారు..ఈ నెల 26 జరిగే సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్,కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి,సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్,ఆదరి శ్రీనివాస్, నియోజకవర్గం నాయకులు అందే స్వామి, బొయిని అశోక్, కొయ్యడ సృజన్ కుమార్, చిగురుమామిడి, అక్కన్నపెట,ఎల్కతుర్తి మండలాల సిపిఐ కార్యదర్శులు నాగేల్లి లక్ష్మారెడ్డి, కొమ్ముల భాస్కర్,ఉట్కురి రాములు,ప్రజా సంఘాల నాయకులు కనుకుట్ల శంకర్,జనగాం రాజు కుమార్,జెరిపోతుల జనార్దన్, గూడెం లక్ష్మి, గూడ పద్మ,పిల్లి రజినీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు లోని వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు సుందరగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వైకుంఠ ద్వారం గుండా మంత్రి పాన్నం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలన లో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందక పింఛన్లు రాక ఉద్యోగాలు లేక కష్టాలు పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా భగవంతుడు బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజక వర్గ అభివృద్ధి తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీ లను నెరవేర్చి ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
ఆసియా ఖండంలోని మెదక్ చర్చ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
పన్నెండు వేల మంది కార్మికులు పది సంవత్సరాలు కష్టపడి దినిని 1924 లో పూర్తిచేశారు.
యదార్థవాది ప్రత్యేక కథనం
కరుణామయుడి దివ్య కోవెల ,నమ్మిన బక్తులకు అండగా వుంటూ తమను ఆసియా ఖండంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాని నిలుపుకున్న చర్చ్ మన మెదక్ చర్చ్ కరునమయుని జన్మను పురస్కరించుకొని క్రిస్మస్ సందర్బంగా ప్రత్యేకతను సంతరించుకుని విదేశాలనుండి సైతం పర్యాటకులను ఆకర్షిస్తున్న మెదక్ చర్చ్ పై ప్రత్యేక కథనం
మెదక్ జిల్లా లో గల దక్షిణ బారత సంఘం చే నిర్వహించబడుతున్న చారిత్రాత్మక కట్టడం, దాదాపు 100 సంవత్సరాల నటి కట్టడనికి నాటి నిర్మాణ శైలికి అద్దంపడుతుంది, లండన్ కు చెందిన పస్నేట్ అనే మత గురువు మెదక్ ప్రాంతానికి వచ్చిన సమయంలో మెతుకు సీమా అంత కరువు,కాటకాలతో అనారోగ్యలతో ఆకలితో వుండగా తన వంతు సహాయం చేయడానికి ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు చర్చి నిర్మాణం కోసం నాడు పనికీ ఆహార పథకం లాంటిదానిని ప్రవేశపెట్టి ఈ నిర్మాణంలో అందరిని పలుపంచుకునేల చేసాడు 1914 లో ప్రారంభమైన ఈ చుచ్ దాదాపు పన్నెండు వేల మంది కార్మికులు పది సంవత్సరాలు కష్టపడి దినిని 1924 లో పూర్తిచేశారు. మెదక్ పట్టణంలోని ఈ సుప్రసిద్ధ చర్చ్ అతిసుందర కట్టడంగా పేరుగాంచింది అత్యద్బుతమయిన నిర్మాణ శైలి దిని సొంతం ఆసియా ఖండంలోనే ఉన్నతమైనధిగా గుర్తింపు పొందిన ఈ కేథడ్రాల్ చర్చ్యురఫ్ గోతిక్ శైలిలో నిర్మితమయినది ఇటాలి దేశస్థులతో పటు బారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు కళాకారులూ చర్చి నిర్మాణం పనుల్లో పాలుపంచుకున్నారు 200 అడుగుల పొడవు 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ చర్చ్ కి 175 అడుగుల ఎత్తున్న శికారం ప్రత్యేక ఆకర్షణ పూర్తిగా రాళ్ళూ దంగుసున్నం వినియోగించి 10 సంవత్సరాల పటు నిర్మించిన ఈ చర్చ్ లో ప్రతి అడుగు ఒక కళఖండం పిల్లర్లు, భీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమయిన ప్రార్థన మందిరాన్ని శికరాన్ని నిర్మించడం నటి పనితనానికి అడ్డం పడుతుంది ఈ చర్చ్ కు వున్నా మరో ప్రత్యేకత చర్చ్ లోపల వున్నా రంగు అద్దాలు ఈ అద్దాల పై ఏసు క్రీస్తు కు సంబంధించిన జనన వృత్తాంతం మొదలు కొని అయన సిలువ అయ్యేంతవరకు తిరిగి లేచెంత వరకు జరిగిన సంఘటనలు ముద్రించారు అంతేకాక కేవలం సూర్య కిరణాలూ ప్రసరించినప్పుడు మాత్రమే ఆ అద్దాల పై ఈ చిత్రాలు ఏర్పడటం గమనార్హం మిగిలిన సమయాలలో ఎంత ప్రయత్నించిన ఇవి కనపడవు ఒకేసారి దాదాపు 5 వేల మంది ప్రార్ధన చేసుకునే అవకాశం ఈ మందిరంలో వుంది క్రిస్మస్ లాంటి ప్రత్యేక సందర్బాలలో మన రాష్టం నుండే కాకా వివిధ ప్రాంతాల నుండి జనాలు భారిగాబ్ తరలి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా కనీసం 5 నుండి 8 లక్షల మంది రావచ్చునని చర్చ్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ మహాదేవాలయానికి జీవం పోసిన పస్నేట్ పది సంవత్సరాలు కష్టపడి దినిని నిర్మించారు ఇక్కడికి వచ్చిన బక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి కోర్కెలను తీరుస్తూ ఆ ప్రభువు కృపతో చల్లగా ఉంటారని ఆ చర్చ్ పాస్టర్ తెలిపారు.
తమకు ఇక్కడికి రావడంవల్ల ఎంతో ప్రశాంత చేకురిందని ఇది ఒక దేవలయమే కాక పురాతన చారిత్రక కట్టడం ఇక్కడి నిర్మాణం ఎంతో బావుందని ఇటువంటి ప్రాంతాన్ని సందర్శించడం తమకు ఎంతో ఉల్లాసాన్ని అందించిందని అక్కడికి వచ్చిన బక్తులు చెబుతున్నారు.
ఈ క్రిస్మస్ రోజున ఈ చర్చ్ ను సందర్శించుకునే సంఖ్యా మరింత అధికంగా వుంటుంది క్రిస్మస్ రోజు ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక ఆరాధన కార్యక్రమం మొదలు కొని సాయంత్రం 8 గంటల వరకు ఆశిర్వాద ప్రవచనం వుంటుంది ఇక్కడి వచ్చిన వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి చర్చ్ నిర్వాహకులు సిద్ధం చేసారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తులు అధికంగా వస్తారు కాబట్టి ప్రస్తుతం కరుణ విజుపిస్తున్న సందర్భంగా జనాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అలాగే చర్చికి వచ్చే భక్తులకు అందరికీ తగిన సౌకర్యాలు తాత్కాలిక గుడారాలు మరుగుదొడ్లు లాంటివి ఏర్పాట్లు చేయడం జరిగినది ఈ సంవత్సరం సుమారు ఆరు వందల మంది పోలీసుల సిబ్బందితో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మెదక్ జిల్లా మండలం బొల్లారం గ్రామంలో ఉన్నటువంటి పిడిస్ నిల్వచేసే గోదాములలో సుమారు 2,900 కింటల్లా బియ్యం ముక్కి పోయి పురుగులు పట్టి ఎందుకు పనికి రాకుండా పోయాయి సెప్టెంబర్ లో జరిగిన బదిలీలలో జిల్లాకు డిఎంగా వచ్చిన హరికృష్ణ ఈయన జిల్లా గోదాములలో నిలువంచిన బియ్యం పై తనిఖీ చేశారు. ఈ గోదాములలో ఉంచిన బియ్యం 2020 సంవత్సరం నాటిదని పూర్తిగా పాడైపోయినట్లు గుర్తించారు వీటిని నిలువ ఉంచారు. ఈ బియ్యాన్ని తినడానికి కూడా పనికిరాని రాదని ల్యాబ్ లో నివేదిక వచ్చిందని తెలియ వచ్చింది. వీటి విలువ సుమారు 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.. గోదాములలో నిలువ ఉంచే బియ్యం పై 15 రోజులకు ఒకసారి మలత యాన్ అనే మందు పిచికారి చేయాలి అలాగే మూడు నెలలకు అమోనియం ఫాస్పేట్ ఒకసారి పిచికారి చేయాల్సి ఉంటుంది. కానీ గతంలో చేసినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది కింద బియ్యం ముక్కిపోయి పురుగు పట్టి ఎందుకు పనికి రాకుండా పోయింది. కానీ ఇప్పుడు వచ్చిన అధికారులు ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ఆలోచనలో పడ్డారు. పూర్తి వివరాలను డిఎం త్వరలో తెలుపుతానని అన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశంl కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలానికి సంబంధించిన ఇరు పార్టీల సర్పంచులు ఎంపీటీసీలు మండల జడ్పిటిసి సభ్యులు పాల్గొని గ్రామాల్లో ఉన్న సమస్యలని పెండింగ్లో ఉన్న పనులని పెండింగ్లో ఉండి రావాల్సిన బిల్లుల గురించి సమావేశం ద్వారా ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ పెండింగ్ బిల్లులు వచ్చే విధంగా కృషి చేస్తానని అలాగె నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.