26.7 C
Hyderabad
Monday, April 20, 2026

మహిళలకు ఉచిత బస్సు రవాణా రద్దు చేయాలి.

మహిళలకు ఉచిత బస్సు రవాణా రద్దు చేయాలి.

కొండపాక యదార్థవాది

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిన మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఎర్పడింది అంటూ దుద్దెడలో ఆటో కార్మికులు ర్యాలీ తీశారు. దుద్దెడ మెయిన్ రోడ్  నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపారు మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు ఎక్కువగా ఆటో ఎక్కుతారని ఇపుడు ఉచిత బస్సుసౌకర్యం కల్పించడంతో మా ఆటోలను తిప్పుకోలేక పోతున్నామని ఈ పరిస్థితుల్లో  రోజుకు  రెండు వందలు రూపాయలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు మహాలక్ష్మి స్కీంకు మేము వ్యతిరేకం కాదు కానీ ఈ స్కీమ్‌తో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.15 వేల జీవన భృతి కల్పించాలన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులకు ఉచిత విద్యా విధానం అమల్లోకి తీసుకురావాలన్నారు. ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలం నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని మా ప్రధాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు ఆరేళ్ల నర్సింలు, ఉపాధ్యక్షులు ఆరెపల్లి అంజి కోశాధికారి కాటపాక లింగం ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

బంధారం గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షునిగా బాల్ రెడ్డి

బంధారం గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షునిగా బాల్ రెడ్డి

కొండపాక యదార్థవాది

మండల పరిధిలోని బందారం గ్రామంలో  రెడ్డి సంఘం ఎన్నికలు నిరహించుకుని అధ్యక్షుడిగా పాలడుగు బాల్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సోమవారం గ్రామంలోని రెడ్డి కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటుచేసిన రెడ్డి సంఘ సభ్యులందరికీ కలిసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా నిమ్మ దుర్గారెడ్డి ఉపాధ్యక్షులుగా కామ్రేడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నిమ్మ మైపాల్ రెడ్డి కోశాధికారిగా పాలడుగు సురేందర్ రెడ్డి కార్యదర్శిగా నర్ర పరమేశ్వర్ రెడ్డి సలహాదారుల నర్రా నరసింహారెడ్డి కామ్రేడ్ నరసింహారెడ్డి కార్యవర్గ సభ్యులుగా గజ్వేల్ కరుణాకర్ రెడ్డి నర్ర తిరుమల్ రెడ్డి లను రెడ్డి సంఘ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రెడ్డి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నూతన అధ్యక్షులు బాల్ రెడ్డి తెలియజేసారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

ఆర్టీసీకి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద రూ. 375 కోట్ల నిధులు విడుదల చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్.

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖా మాత్యులుగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో పూజా కార్య క్రమాలు నిర్వహించారు వేద పండితులు  మంత్రి పొన్నం కు ఆశీర్వచనాలు అందించారు. మంత్రి పొన్నం మొదటగా ఆర్టీసీ ఫైల్ పై  రూ. 375 కోట్ల నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. మంత్రి తో రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ సంతకం చేయించారు. ఆర్టీసి కి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద పలు రాయితీలకై  రూ. 375 కోట్ల నిధులు మంత్రి పొన్నం విడుదల చేశారు. అలాగే కరోనా సమయంలో మృతి చెందిన రవాణా శాఖ ఉద్యోగి పండు బాబు కుటుంబానికి రూ 1 లక్ష పరిహారంకు సంబంధించిన ఫైల్ పై మంత్రి సంతకం చేశారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ తో పాటుగా ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే

మాజీ ఎంపీలు మదియాష్కి మైనంపల్లి హనుమంతరావు బలరాం నాయక్ అంజన్ కుమార్ యాదవ్ పిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎసిసి సెక్రటరీలు రోహిత్ చౌదరి విష్ణునాథ్ తదితరులు ఉన్నారు. సోమవారం సచివాలయం లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి శాలువా తో సత్కరించి పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభా కాంక్షలు తెలిపారు.

పంట వ్యర్ధాలను కాల్చొద్దు

పంట వ్యర్ధాలను కాల్చొద్దు

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

వానాకాలంలో వరి వేసిన రైతులు పంట కోసిన తర్వాత పంట వ్యర్ధాలను తగలబెడుతున్నారు పంట వ్యర్ధాలను తగలబెట్టడంపై వాటిల్లే నష్టాలు గూర్చి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రామాయంపేట మండలం గ్రామం కిషన్ అనే రైతు పొలంలో సందర్శించిన సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ మాట్లాడుతూ వానకాలంలో పండించినటువంటి వరి పంట పంట కోసే సమయంలో 30 నుండి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు కాండం ఉంచి కోయడం జరుగుతుందని ఈ విధంగా చేయడం ద్వారా పంటకు నష్టం చేసేటువంటి కాండం తోలుచు పురుగు యొక్క కోషస్థ దశలు పంటలోనే ఉండిపోయి జీవిత చక్రం పూర్తి చేసుకుని ఈ యాసంగి సీజన్లో కాండం తోలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రైతులు వరి పంట కోసేటప్పుడు నేల అడుగుభాగం వరకు వరి పంటలు కోయాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతులు పంట వ్యర్థాలను, వరిగడ్డి ని పొలంలో వదిలిపెట్టి కాల్చడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా లాభాల కన్నా చాలా ఎక్కువ నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పంటకు మేలు చేసేటువంటి క్రిమి కీటకాలు, వానపాములు చనిపోవడం ద్వారా భూమిలో సేంద్రియ కర్భన పదార్థం తగ్గి భూమి యొక్క సారం దెబ్బతింటుంది ముఖ్యంగా పంటకు ఉపయోగపడేటువంటి నత్రజని భాస్వరం పొటాషియం మూలకాలు సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింక్, ఇనుము వంటి పోషకాల లభ్యత తగ్గిపోతుంది దీనివల్ల భూసారం తగ్గి పంట దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా రైతుల యొక్క ఆదాయం పడిపోయే అవకాశం ఉంది ఇందుకోసం రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా కలియ దున్నినట్లయితే అనేక లాభాలు ఉన్నాయి ముఖ్యంగా వరి కొయ్య లను కలియ దున్నడం ద్వారా సేంద్రియ కర్భన పదార్థం పెరిగి పంట దిగుబడులను  పెంచే అవకాశం ఉంది.సేంద్రియ కర్భన పదార్థం పెరిగినప్పుడు భూమిలో పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వానపాముల జీవ సంతతి పెరిగి భూమి యొక్క సారాన్ని పెంచే అవకాశం ఉంది దీని ద్వారా రైతు యొక్క పంటల దిగుబడి పెరగడంతో పాటు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దుక్కి దున్నే సమయంలో పంట వ్యర్ధాలు కుళ్లి పోవడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడడం వల్ల పంట వ్యర్థాలు మురగడం తో పాటుగా పంటకు  బాస్వరం ఇనుము, సల్ఫర్ వంటి  మూలకల ను అందించే అవకాశం ఉంది పంట వ్యర్ధాలను భూమిలో కలియ దున్నడం ద్వారా దాదాపుగా ఒక టన్ను ఎరువును భూమికి అందించే అవకాశం వుంది, జింకు మాంగనీస్ ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులను నేలకు అందించి పంట దిగుబడి లో ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉంది నీళ్లలో కరగని మూలకాలను కరిగే విధంగా అనుకూలంగా మార్చుతుంది భూమి యొక్క నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని పెంపొందిస్తుంది మొత్తంగా కలియ దున్నడం ద్వారా పంట వ్యర్ధాలను కాల్చే విధానం కంటే కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి పంట వ్యర్ధాలు మురగడానికి వేస్ట్ డీకంపోజర్ అనే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని కూడా భూమికి అందించి నట్లయితే పంట వ్యర్ధాలు కుళ్లిపోయే ప్రక్రియ వేగవంతం చేస్తుంది కావున రైతులు పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నలని మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయి కృష్ణ రాజు రైతులు పాల్గొన్నారు.

రైమాండ్ షాపింగ్ మాల్ ప్రారంభించిన  శివరాజ్ పాటిల్.

రైమాండ్ షాపింగ్ మాల్ ప్రారంభించిన  శివరాజ్ పాటిల్.

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిధి 

సదాశివపేట పట్టణ పరిధిలోని సుభాష్ రోడ్ లో ఎస్ ఎస్ టెక్స్టైల్ వారి  రైమాండ్ షో రూమ్ ను శనివారం ప్రారంభించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైమాండ్ పేరులోని నాణ్యత కూడిన  దుస్తులని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు విక్రయించాలని  ఎస్ ఎస్.టెక్స్టైల్ అన్నం రాజేష్ సుధీర్ యజమానికి  శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ప్రారంభోత్సవంలో టిఆర్ఎస్ నాయకులు సిహెచ్ సత్యనారాయణ ప్రభు గౌడ్ ఇంద్ర కిరణ్ రామచంద్రనాయక్ రాజు తదితరులు పాల్గొన్నారు

శ్రీ రాజా వేణుగోపాల స్వామి ఆలయంలో మైనంపల్లి ప్రత్యేక పూజలు.

శ్రీ రాజా వేణుగోపాల స్వామి ఆలయంలో మైనంపల్లి ప్రత్యేక పూజలు.

దుబ్బాక యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక  చెల్లాపూర్ లో ప్రసిద్ధ పురాతనమైన ఆలయం శ్రీ రాజా వేణుగోపాలస్వామి  ఆలయాన్ని  మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే  కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి తో కలిసి శనివారం  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీసాల కృష్ణునిగా  ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉందని మైనంపల్లి  కొనియాడారు గ్రామస్తుల స్థానికుల ఆహ్వానం మేరకు  ఆలయాన్ని దర్శించుకున్నట్లు  అయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో  కాంగ్రెస్ పార్టీ హయాంలో రానున్న రోజుల్లో పురాతన ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మల్లారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

న్యూరోసర్జరీలో మారో మైలురాయిని సాధించిన యశోద హాస్పిటల్.

 విజయవంతమైన బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్

మెదక్ యదార్థవాది ప్రతినిధి

మెదక్ పట్టణంలోని సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కామటి కిషన్ రెండు నెలల క్రితం స్పృహ కోల్పోవడం వల్ల అతడిని మెదక్ హాస్పిటల్కు పంపించగా వారు సంచలనాత్మక శస్త్ర చికిత్సలో సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో డాక్టర్. కె.ఎస్. కిరణ్ అతని  బృందం విజయవంతంగా మెదడులో కణితి విచ్ఛేదనను విజయవంతంగా అమలు చేశారు  ఫోసా మెనింగియోమా సైనస్‌ను ఆక్రమించడం అసమానమైన ఖచ్చితత్వంతో అధిక-ప్రమాదకర ప్రక్రియను ఉపయోగిస్తూ శస్త్రచికిత్స బృందం కణితిని సున్నితంగా తొలగించడానికి అత్యాధునిక ఇంట్రాఆపరేటివ్ నర్వ్ మానిటరింగ్ మరియు న్యూరోనావిగేషన్ టెక్నాలజీలను ఉపయోగించింది విశేషమేమిటంటే వారు స్థూల విచ్ఛేదనాన్ని సాధించారు సంభావ్య సమస్యలను తగ్గించడానికి సైనస్ దగ్గర ఒక నిమిషం భాగాన్ని వ్యూహాత్మకంగా వదిలివేసారు. రోగి యొక్క శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం ఆపరేషన్ యొక్క విజయానికి నిదర్శనంగా పనిచేస్తుంది, రోగి-కేంద్రీకృత సంరక్షణ పట్ల డాక్టర్ కిరణ్ యొక్క తిరుగులేని నిబద్ధతను హైలైట్ చేస్తుంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శస్త్ర చికిత్సల్లోకి చేర్చేందుకు అంకితభావం యశోద హాస్పిటల్ ప్రతినిధి మాట్లాడుతూ ఈ విజయవంతమైన శస్త్రచికిత్స అత్యాధునిక వైద్య సంరక్షణను అందించాలనే మా లక్ష్యాన్ని నొక్కి చెబుతుంది డాక్టర్ కిరణ్ నైపుణ్యం మరియు అధునాతన శస్త్రచికిత్సా పద్ధతుల ఉపయోగం కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది.  న్యూరోసర్జరీ.”యశోద హాస్పిటల్ రోగి యొక్క రికవరీని పర్యవేక్షించడంలో అప్రమత్తంగా ఉంది వైద్య శ్రేష్ఠతలో ఈ ముఖ్యమైన మైలురాయిని జరుపుకుంటుంది.  ఇన్నోవేషన్ మరియు నైపుణ్యం ద్వారా ఆరోగ్య సంరక్షణ సరిహద్దులను ముందుకు తీసుకురావడానికి సంస్థ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని మీడియా సమావేశంలో మెదక్ పట్టణంలోని పల్స్ హాస్పిటల్ లో శనివారం తెలిపారు.మనుషులకు తల తిరగడం ఎక్కువగా తలనొప్పి రావడం స్పృహ కోల్పోవడం లాంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించి వారి యొక్క సూచనలు మేరకు చికిత్స తీసుకోవాలని అన్నారు.

గవర్నర్ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు.

గవర్నర్ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు.

కొండపాక యదార్థవాది 

అసెంబ్లీలో తమిలసై సౌందర్య రాజన్ గవర్నర్ ప్రసంగించిన పద్ధతి ఏమాత్రం బాగాలేదని అత్యున్నత స్థానం లో ఉండి ఇలా మాట్లాడ్డంచూసిన తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని శుక్రవారం దుద్దెడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో  కొండపాక బీఆరెస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ అన్నారు. గవర్నర్ ప్రసంగం అంటే బాధ్యతతో కూడిన సమాలోచనలు సమానత్వం నిండి ఉండాలి కాని కాంగ్రెస్ పార్టీ నాయకులో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  రాసిచ్చిన స్క్రిప్టు లాగా ఉందని గత పది సంవత్సరాల బీఆరెస్ పాలనలో అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడిన  కేసీఆర్ పాలనను గవర్నర్ తమిళసై తప్పుపట్టడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుండి ఇప్పటివరకు రైతులకు రైతుబంధు రాలేదని కెసిఆర్ సంక్షేమ పథకాలను పేర్లు మార్చడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేరే సాధించేది ఏమీ లేదని పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా కాంగ్రెస్ పాలన ఉందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ మల్లమారి రవీందర్ సోషల్ మీడియా అధ్యక్షుడు పాతకోటి లింగం ఆత్మ కమిటీ డైరెక్టర్ సున్నం భాస్కర్ వార్డ్ సభ్యులు సాదుపల్లి కనకసేన గౌడ్ యువజన విభాగం అధ్యక్షులు చిక్కుడు భాను ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె బాబు ఎస్టీ విభాగం అధ్యక్షులు కెమ్మసారం శ్యామ్ మైనార్టీ విభాగం మహమ్మద్ ముగ్ధుమ్ బసవరాజు నవీన్ చంద్ ఎండి నయుముద్దీన్ కెమ్మసారం సంతోష్ మెరుగు శివ శ్రీధర్ భరత్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

బిజేపిదే మెదక్ పార్లమెంట్ సీటు: ఈటల రాజేందర్.

బిజేపిదే మెదక్ పార్లమెంట్ సీటు: ఈటల రాజేందర్.

కొండపాక యదార్థవాది

నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గబీజేపీ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ శుక్రవారం కుకునూర్ పల్లి లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మండల అధ్యక్షుడు మన్నెం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్ డబ్బు మద్యం పంచడంతో పాటు అధికార బలం ఉపయోగించి మాత్రమే గజ్వేల్ లో గెలిచారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్ లో కేవలం ఈటల రాజేందర్ కాకుండా ప్రజలు న్యాయం ధర్మం అన్ని ఓడిపోయాయి అన్నారు. గజ్వేల్ లో ఇంతవరకు బీజేపీ నుండి సరైన పెద్ద నాయకుడు లేకున్నా  నేనిచ్చిన పిలుపుతో రేపటి మా నేత ఈటెల అంటూ 66653 ఓట్లు బిజెపికి వేశారన్నారు. అయినానప్పటికి ఓటమి చెందినప్పటికీ గజ్వేల్ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు. రేపటి పంచాయితీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కోసం  బిజెపి నాయకులకు, కార్యకర్తలకు తన వంతు సహకారం చేస్తా అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా నా బతుకంతా కొట్లాటనే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వరాష్ట్రంలో అనేకమంది ముఖ్యమంత్రులు కొట్లాడిన బిడ్డను అన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు సునామీ ఓట్లతో కేసీఆర్ ను గద్దేదించారన్నారు. కేసీఆర్ అహంకారంతోనే పదేళ్ల అధికారం కుప్పకూలిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అంటేనే మోడీ ఎన్నికలు అని దేశ ప్రజలు మాట్లాడుతున్నారు. రాబోయే మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా బిజెపి గెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ బిజేపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం గురువారెడ్డి నాయకులు మాదాడి జస్వంత్ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గడ్డమీది రామస్వామి, కొండపాక ఉప సర్పంచ్ ఆరే భాస్కర్ అంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బడేకొల్ నర్సింహులు ఉమ్మడి కొండపాక మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

• సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్ డిమాండ్.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్ అన్నారు. గురువారం రోజు సిద్దిపేట జిల్లా కేంద్రం లోని తపాలా కార్యాలయం వద్ద గ్రామీణ తపాలా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన చొప్పరి రవి కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016వ సంవత్సరంలో 7వ పే కమిషన్ న్ను అమలు చేయకుండా మరలా కమల చంద్ర కమిషన్ను వేశారని ఆ కమిషన్ చేసిన అధ్యయనంలో కార్మికుల సేవలను గుర్తించిందని కానీ ఆ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం దాచి చోద్యం చూస్తుందన్నారు. తక్షణమే ఆ రిపోర్ట్ను బహిర్గతం చేసి అమలు చేయాలని  అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత 8 గంటల పనితో పాటు అన్నీ ప్రయోజనాలు కల్పించాలని అన్నారు. కార్పొరేట్ వైద్య సదుపాయాలు కల్పించాలని 65 సంవత్సరాల ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ ఇవ్వాలని ఉద్యోగ విరమణ ప్యాకేజీ 5 లక్షలు చెల్లించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం ఐదు లక్షలు చెల్లించాలని తదితర డిమాండ్లను సత్వర పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు  కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘం జిల్లా కార్యదర్శి శంకర్, జనార్ధన్ ఆంజనేయులు తిరుపతి రెడ్డి నాంపల్లి రంగాచారి ఎల్లయ్య మీన శ్రీలత భార్గవి తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...