26.7 C
Hyderabad
Monday, April 20, 2026

విద్యార్థి దశ నుంచే ఉత్తమ పౌరులుగా ఎదగాలి.

విద్యార్థి దశ నుంచే ఉత్తమ పౌరులుగా ఎదగాలి.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు  క్రీడా వస్తువులు స్కూల్ బ్యాగులు ఆయన చెతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవలో ప్రత్యేకించి విద్యార్ధుల సర్వతోముఖాభివృద్ధికి  ఎర్త్ ఫౌండేషన్ యొక్క సామాజిక మానవతా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యార్థులు చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని చూచించారు. ఉత్తమ పౌరులుగా ఎదిగి భావి జీవితాన్ని బంగారమయం చేసుకోవాలని అభిలాషించారు అనంతరము అక్బర్ పేట భూంపల్లి మండలం లోని పిఎస్ నగరము పిఎస్ తాళ్లపల్లి పోతారెడ్డిపేట లోని రెండు ప్రాథమిక పాఠశాలలను  పిఎస్ ఎనుగుర్తిని అనంతరం దుబ్బాక మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు రగోతంపల్లి గోసాన్ పల్లి  అచ్చమాయపల్లి కమ్మరపల్లి ప్రాథమిక పాఠశాలలు టేకుల తాండ  శిలాజినగర్ హబ్సిపూర్ లను సందర్శించి  ఉపాధ్యాయులు బోధన విధానాన్ని పరిశీలించారు. బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగించాలని సూచించారు. ఉపాధ్యాయులు సిలబస్ కనుగొనంగా ఎఫ్ ఎల్ ఎన్ డైరీలు ఉన్నతి డైరీలు రాసి మంచి బోధన చేయాలని ఆదేశించారు.

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిధి

మంత్రి పొన్నం ఆదేశాలతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత. నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ సందర్భంగా ఆగిపోయి లబ్ధిదారులకు చెందవలసిన కళ్యాణ లక్ష్మి ఇతర చెక్కులను త్వరలోనే అందజేయాలని మంగళవారం  హుస్నాబాద్ నియోజకవర్గ స్థానిక మున్సిపల్ కార్యాలయం సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజక వర్గంలోని మండలాల ఎమ్మార్వోలకు మంత్రిగా నేను అందుబాటులో ఉన్న లేకున్నా చెక్కులు ఆపవద్దని సూచించిన విధంగా గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐలేని అనిత వైస్ చైర్మన్ కొంకటి నళినీ దేవి చిత్తారి పద్మ భూక్య సరోజన దొడ్డి శ్రీనివాస్ బొజ్జ హరీష్ మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న కోఆప్షన్ సభ్యులు యండి ఆయూబ్ కోమటి సత్యనారాయణ పున్న సది గడిపే మల్లేశం రాజయ్య గిర్ధవర్ కృష్ణ ఆర్ ఐ మొహమ్మద్ కరీం లబ్ధిదారులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మూన్నాళ్ళ ముచ్చటనా.. ఈ ఆధార్ సెంటర్.!

మూన్నాళ్ళ ముచ్చటనా.. ఈ ఆధార్ సెంటర్.!

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిధి

కోహెడ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ పనిచేయకపోవడం సిగ్గుచేటని బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం వ్యాఖ్యానించారు  సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం వెంకటేశం మాట్లాడుతూ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ పని చేయకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పలుమార్లు అధికారులకు తెలిపిన ఫలితం లేకపోయిందని కొత్త ఆధార్ కార్డు చిన్నపిల్లల ఆధార్ కార్డు అలాగే ఆధార్ అనుసంధానంకు కోహెడ లో ఆధార్ సెంటర్ ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యధోరనితో పనిచేయక స్థానికంగా 100 రూపాయల లోపు అయిపోయే ఆధార్ కార్డు చంటి పిల్లలతో ఇతర ప్రాంతాలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చిస్తున్న పరిస్థితి నెలకొందని గత కొన్ని నెల క్రితం కోహెడ లోని పర్మినెంట్ ఆధార్ సెంటర్ ఎక్కడ అని అధికారులను ప్రశ్నించగా జిల్లా మీసేవ అధికారులు హుటాహుటిన వచ్చి నామమాత్రంగా ప్రారంభించారు అది మూడు రోజులు కూడా నడవకపోవడం సిగ్గుచేటని  అధికారుల నిర్లక్ష్యం అలసత్వం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై ఆర్థికంగా నష్టపోతున్నారని జిల్లా అధికారులకు మా మండలంపై ఎందుకంత వివక్ష చూపుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు. ఇప్పటికైనా కోహెడలో ఆధార్ సెంటర్ రెగ్యులర్ గా నడిచేవిధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని కోహెడ ఖమ్మం వెంకటేశం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు బండ జగన్ యాదవ్, గుగ్గిళ్ల శ్రీనివాస్ బిజెపి మండల ప్రధానకార్యదర్శులు పిల్లి నర్సయ్య గౌడ్ జాలిగం రమేష్ బిజెవైఎం మండల అధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, తదితరులున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ సి బీ ఫోన్ నంబర్ల బోర్డు లు ఏర్పాటు చేయాలి.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ సి బీ ఫోన్ నంబర్ల బోర్డు లు ఏర్పాటు చేయాలి.

జిల్లా అదనపు కలెక్టర్ కి వినతిపత్రం అందించిన సీసీఆర్ బృందం.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్ టి ఐ బోర్డ్ లతో పాటు ఏ సి బి అధికారుల ఫోన్ నంబర్ లతో కూడిన బోర్డు లు ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిల్  ఫర్ సిట్జెన్ రైట్స్ ఆధ్వర్యంలో బుధవారం  సిద్దిపేట జిల్లా అదనపు  కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీసీఆర్ జిల్లా అధ్యక్షుడు గుండ్ల శివ చంద్రం మీడియా స్టేట్ కోఆర్డినేటర్ సాజిద్ మాట్లాడుతూ పారదర్శక పాలన కోసం సీసీఆర్ సంస్థ పాటుపడుతుందని అన్నారు  సీసీ ర్ జాతీయ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసిబి అధికారుల ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించామన్నారు. ప్రజలకు అంటి కర్రెప్షన్ బ్యూరో పై అవగాహన కల్పించడానికి,  తమ హక్కులను కాలరాసే ఆధికారులపై ఫిర్యాదు చేయడానికి తప్పకుండా ఏసిబి బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు, అదనపు కలెక్టర్  కూడా సానుకూలంగా స్పందించడమే కాకుండా అప్పటికప్పుడు ఫోన్ లో అధికారులతో మాట్లాడి ఏసిబి అధికారుల ఫోన్ నెంబర్ లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో సీసీ ఆర్ సభ్యులు శివ ఫారూఖ్ అలీ శ్రీనివాస్ రెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి పరీక్ష ప్యాడ్ల వితరణ 

గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి పరీక్ష ప్యాడ్ల వితరణ 

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం తెలంగాణలో పలు ప్రాంతాలలోనీ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సుమారుగా 4 లక్షల రూపాయల విలువచేసే పరీక్ష ప్యాడులను వారి తల్లి పేరు మీదుగా అందజేస్తున్నట్టు  విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి వారి భవిష్యత్తుకు మైలురాయి వేసుకోవాలని ఆశిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకుడు జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) తెలిపారు. అందులో భాగంగా 13వ తేదీ బుధవారం రోజున సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రము లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 38 జిల్లా పరిషత్ హై స్కూల్లో61 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్( బాలురు ) లో80 తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ నాగ సముద్రాలలో91  జిల్లా పరిషత్ హై స్కూల్ బస్వాపూర్ 24లో పదవ తరగతి చదువుతున్న 294 మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్ )ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తల్లి పేరున ట్రస్టు ఏర్పాటు చేసి సమాజంలోని పేదలకు సేవ చేయడము, ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు ఇవ్వడం అభినందనీయమని, అదేవిధంగా విద్యార్థులు కూడా చక్కగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయి చేరుకొని సమాజంలో మీ వంతుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెజీబివి స్పెషల్ ఆఫీసర్ వై హిమబిందు టిఎస్ డ్బ్యుఅర్ఎస్ ప్రిన్సిపాల్ కే వెంకట చలపతి టీఎస్ఎంఎస్ ప్రిన్సిపాల్ కే నరేందర్ రెడ్డి కోహెడ బస్వాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు ఎండి మహమూద్,ఆర్ పద్మయ్యలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజలతో మమేకమై పనిచేయాలి: మంత్రి పొన్నం

ప్రజలతో మమేకమై పనిచేయాలి: మంత్రి పొన్నం

• సిద్దిపేట కలెక్టరేట్లో అధికారులతో మంత్రి తొలి సమీక్ష..

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా బీసీ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశమయ్యారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలి అని అన్నారు. ప్రభుత్వం మారిందని, ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని. ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా మారాలని, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటుగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కమిషనర్ పోలీస్ శ్వేత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

వాహ్..! చాయ్..

వాహ్..! చాయ్..

సిద్దిపేటలో చాయ్ తాగిన మంత్రి పొన్నం ప్రభాకర్..

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట ఇక్బాల్ మినార్ వద్ద ఉన్న మదీన హోటల్ లో చాయ్ తాగారు. కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం ముగిసిన  తర్వాత ఆయన భారీ కాన్వాయ్ తో మదిన హోటల్ చేరుకొని అందరితో కలిసి చాయ్ తాగారు ఆయన తో పాటు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూము కుంటా నర్సారెడ్డి దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం సిపిఐ నాయకుడు మంద పవన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు మజర్ మాలిక్ సోహైల్ తదితరులు ఉన్నారు.

అభివృద్ధిలో సిద్దిపేటను మరిపిస్తా: మంత్రి పొన్నం 

అభివృద్ధిలో సిద్దిపేటను మరిపిస్తా: మంత్రి పొన్నం 

అభివృద్ధిలో ముందు ఉంచుతా.

• నియోజకవర్గ ఓటర్లు రాష్ట్రంలో తల ఎత్తుకునేలా చేస్తా.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పొన్నం ప్రభాకర్ తన సొంత నియోజకవర్గమైన హుస్నాబాద్ లో పర్యటిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం హుస్నాబాద్ పట్టణ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో మొదటిసారిగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అనేది పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే ఎన్నికైన కౌన్సిలర్లు పార్టీల తోటి సంబంధం లేకుండా ఏ సమస్య అయినా ఆ దృష్టికి వచ్చిన వెంటనే నా వంతుగా అభివృద్ధికి సహకరిస్తానని ఎన్నికల వరకే రాజకీయాలని ఎన్నిక తర్వాత ప్రజలకు సేవ చేయడానికి తన పూర్తి సమయం వెచ్చిస్తానని ఇక్కడే స్థానికంగా ఉంటానని తెలిపారు. ఇప్పటికే అకుల రజిత మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను నా దృష్టికి తెచ్చారని తను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. గౌరవెల్లి నిర్వాసితులకు ఒప్పించి మెప్పించి వారికి పునరావాసం ఏర్పాటుకు కృషి చేస్తా అలాగే స్థలం ఉండి అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని. ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులు సమస్యలు ఉండవని అన్నారు. గతంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు వరంగల్లో కూడా అందుబాటులో లేని పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని కరీంనగర్ కు తెచ్చామని అదేవిధంగా హుస్నాబాద్ కు కూడా కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఎల్లమ్మ చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేయిస్తామని సిద్దిపేట కోమటి చెరువు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కన్నా చాలా చిన్నది అని అంతకుమించి సుందరీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ నియోజకవర్గ నా ఊరు అని ఇదే నా నివాసం అని నా ఇంటిని బాగు చేసుకునే బాధ్యత నా మీద ఉందని అన్ని వర్గాల ప్రజలు అందరి అభిప్రాయాలతో అభివృద్ధిలో ముందుకు వెళ్దామని మున్సిపాలిటీ కౌన్సిలర్లను పట్టణ ప్రముఖులను ఉద్దేశించి తెలియజేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించి అక్కడే వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ అన్నదానం ప్రతిరోజు నిరంతరంగా కొనసాగాలని నా వంతుగా ఒక రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపడతానని తెలిపారు.

జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల..?

జనవరి 7న నోటిఫికేషన్..?

మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు..?

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు పై కసరత్తు..

తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం..?

 జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..?

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్.

మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్..ఉప సర్పంచ్ ఎన్నిక.

 అర్హులు వీరే..

✦ సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు.

✦ జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.

✦ ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత.

✦ ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అర్హత

రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.

✦ పోటీకి కనీస వయసు 21 ఏళ్లు.

✦ పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.

✦ వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరుగా ఉండాలి.

✦ రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు అర్హులు.

✦ స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.

✦ దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు.

✦ ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రెటరీలు పోటీకి అనర్హులు.

✦ ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులు. ఇది గవర్నమెంట్ జీవో.

మాకు మా పాత జిల్లా నే కావాలి.

మాకు మా పాత జిల్లా నే కావాలి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ కు కోహెడ మండల బిజెపి తరఫున అలాగే స్థానిక ఎంపీటీసీ ఖమ్మం స్వరూప వెంకటేశం శుభాకాంక్షలు తెలిపి కోహెడ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలంటూ కోహెడ స్థానిక ఎంపీటీసీ ఖమ్మం స్వరూప, బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న కోహెడ మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలపవద్దు అని అఖిలపక్షం నేతృత్వంలో సుమారు రెండు నెలలపాటు ఉద్యమం చేసిన అప్పటి బీఅర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టీ బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలుపడం ఈ ప్రాంత వాసులకు ఇష్టం లేదు అప్పుడు జరిగిన ఆ ఉద్యమ సమయంలో దీక్ష శిబిరం వద్దకు పొన్నం ప్రభాకర్ వచ్చి సంఘీభావం తెలిపిపరని గుర్తు చేశారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హుస్నాబాద్ కోహెడ ను తప్పకుండా కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీ ప్రకారం కోహెడ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని అన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవని జిల్లా నుండి ఇప్పటివరకు బస్సు సౌకర్యం కూడా కలిగించకుండా ఇక్కడి ప్రజలు సిద్దిపేట వెళ్లాలనుకున్న ఎడమ చేయి వాటంగా ఉందంటూ స్థానికులు ఇబ్బంది పడుతున్నారని జిల్లాలో ఏ కార్యాలయంలోకి వెళ్లిన మా మండల ప్రజలను మా అధికారులు చిన్న చూపు చూడడం మా మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు మా పూర్వీకుల నుండి కరీంనగర్ జిల్లా అని గొంతెత్తి గర్వంగా చెప్పుకొన్న ప్రజలు ఇప్పుడు సిద్దిపేట అని చెప్పుకోలేక మనోవేదనకు గురవుతున్నారని ఇప్పటికైనా మా ఆవేదనను అర్థం చేసుకొని కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...