26.7 C
Hyderabad
Monday, April 20, 2026

దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం

దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కణిక సాహిత్య సామాజిక సేవ విద్యారంగ వేదిక  హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సాహిత్య సేవలు అందిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చెందిన  కవి దేవులపల్లి రమేశ్ కు కణిక కుటుంబ ఆత్మీయ కలయిక చెత్త బండి పుస్తక ఆవిష్కరణ సభలో సాహిత్య పురస్కారం లభించింది. కణిక అధ్యక్షురాలు రమదేవి కులకర్ణి మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్  ఏనుగు నరసింహారెడ్డి డా. నాగేశ్వర శంకరం నేటి నిజం పత్రిక సంపాదకులు  బైసా దేవదాస్ ఐనం పూడి శ్రీ లక్ష్మి సేనధీపతి జయలక్ష్మి రవీంద్ర భారతి హైదరాబాదులో కవి దేవులపల్లి రమేశ్ ను సన్మానం చేసి అభినందించారు. దేవులపల్లి రమేశ్ మాట్లాడుతూ నా సేవను గుర్తించి  నాకు సాహిత్య పురస్కారం లభించినందుకు చాలా ఆనందంగా ఉందని సాహిత్య పురస్కారం లభించినందుకు  కుటుంబ సభ్యులు కవులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాలను వచ్చినటువంటి కవులు కళాకారులుతదితరులు పాల్గొన్నారు.

నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటా

నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటా

-నాయి బ్రాహ్మణ కులస్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్

-సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిధి

నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ కులస్తులకు మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుని వారికి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేసిందని బీఆర్ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం సదాశివపేట పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చింతా ప్రభాకర్ కు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘస్తులు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారనీ, దైవభక్తితో పాటు, సేవా గుణం ఉన్న గొప్ప వ్యక్తిత్వం గల వారు నాయి బ్రాహ్మణులు అని కొనియాడారు. వారి అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఏ పార్టీలు కూడా నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించలేదని బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ 250 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో చెప్పడం జరిగిందినీ చెప్పిన మాట ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణ షాపులో ప్రతి ఒక్కరికి 250 యూనిట్ల ఉచిత కరెంటును అందించామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు లకుడారం మాణిక్ ప్రభు మామిళ్ళ నాగభూషణం దత్తాత్రేయ శేఖర్ వీరభద్ర అంజయ్య సత్యం చేర్యాల ఆంజనేయులు వీరన్న గోపాల్ నాయి బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు చరణ్ శ్రీశైలం రాము రాజు సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

° తుమ్మనపల్లి శ్రీనివాసు

రాష్ట్ర అధ్యక్షులు

హైదరాబాద్ యదార్థవాది 

విస్తృత స్థాయిలో చర్చ జరిగిన అనంతరం  పార్లమెంట్ లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జాతీయ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును కొందరు ఆశ్రయించగా అట్టి కేసును ఈ రోజు కొట్టివేస్తూ జాతీయ ప్రభుత్వ దేశ సమైక్యతా వాదనను సమర్ధించిన సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది అని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు స్వాగతించారు.

బీఅర్ఎస్ అవినీతి పాలన అంతమైంది.

బీఅర్ఎస్ అవినీతి పాలన అంతమైంది.

కాంగ్రెస్ తోనే తెలంగాణాలో సుపరిపాలన.

అక్బర్ పేట భూంపల్లి యదార్థవాది 

తెలంగాణలో కెసిఆర్ అవినీతి కుటుంబ పాలన అంతమైందని ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎల్లన్న గారి వంశీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలని మొక్కుకు చెల్లించుకున్నారు ఆదివారం తన స్వగ్రామమైన భూంపల్లి ఎల్లమ్మ ఆలయంలో  100 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ గడీల దొరల పాలనకు బిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళా సోదరీమణులందరికీ ఉచిత బస్సు ప్రయాణం వయోభేదం లేకుండా పది లక్షల రూపాయల బీమా పథకాన్ని సోనియమ్మ జన్మదిన సందర్భంగా అమల్లోకి తీసుకురావడంతో ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో విశ్వాసం వచ్చిందన్నారు. దశాబ్దాల పాటు ప్రజల కోసం పనిచేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ సమావేశాలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

ప్రజాధనాన్ని ఫలహారం గా పంచి పెట్టద్దు 

ప్రజాధనాన్ని ఫలహారం గా పంచి పెట్టద్దు 

* రేవంత్ ప్రభుత్వానికి కేబినెట్ మంత్రులకు శుభాకాంక్షలు.

* అభివృద్ధికి సంక్షేమానికి మధ్య ప్రభుత్వం సమతూకం పాటిస్తుందని ఆశాభావం

* రాష్ట్ర అధ్యక్షులు లోక్ సత్తా పార్టీ.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

ప్రజలు నిరంతరం కష్టపడుతూ చెమటోడ్చి చెల్లించిన పన్నుల ద్వారా సమకూరిన ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం మాదిరిగా దుబారా చేయకుండా అనుయాయులకు ఫలహారంగా పంచి పెట్టకుండా అర్హులైన నిరుపేదలకు దక్కేలా సంక్షేమ పథకాలను రూపొందించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబినెట్ మంత్రులకు శుభాకాంక్షలు తెలియ జేశారు. రాష్ట్రంలో జరగవలసిన అసలైన అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి మధ్య సమతూకం పాటించి ఉత్తమ ఫలితాలు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని  ప్రభుత్వం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సత్తా పార్టీ  ప్రజా సమస్యలను  ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తుందని శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేస్తుందని ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని తుమ్మనపల్లి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి  నివేదిస్తామని ఆయన అన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపేట రవీందర్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి ప్రజా ఉద్యమాలను చేపడతామని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కార్యదర్శి మల్లాది కిషోర్ వంగాల రంగాచారి రోహిత్ శివ రామ కృష్ణ కారుమంచి గణేష్ సత్యనారాయణ ఫణీంద్ర సూర్య  తదితరులు పాల్గొన్నారు.

రెడ్ ఫ్లాగ్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

రెడ్ ఫ్లాగ్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

మహాసభలను విజయవంతం చేయండి

రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు

గాంధీనగర్ యదార్థవాది

యంయల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) 10వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. మహాసభల పోస్టర్ లను స్థానిక పూర్ణానందంపేట ఎస్ కె చాంద్ హాల్లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభలు డిసెంబర్ 14 నుండి 17 వరకు నాలుగు రోజుల పాటు విజయవాడలో జరుగుతాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు సాగుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని, బిజెపి యేతర పార్టీల ఐక్యసంఘటనకు చర్చలు నిర్వహిస్తామన్నారు. 14న ప్రారంభమౌతాయన్నారు. ఆరోజు సిపిఐ, సిపిఎం, యంయల్ పార్టీలు జాతీయ నాయకుల సందేశాలు ఉంటాయి. 15వ తేదీ వ్యవసాయ రంగం సంక్షోభం-సవాళ్లు-పరిష్కారాలు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. 16వ కమ్యూనిస్టుల ఐక్యత, కమ్యూనిస్టు పార్టీలే ప్రత్యామ్నాయం అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. 17వ తేదీ భవిష్యత్తు కర్తవ్యాలు, తీర్మానాల ఆమోదంతో మహాసభలు ముగుస్తాయన్నారు. మహాసభలకు అమరవీరుల ఆశయాలను కీర్తిస్తూ విప్లవ పాటలను కళాకారులు ఆలపిస్తారని పేర్కొన్నారు. అమర కళాకారుల వేదిక డోలక్ యాదగిరి కళా బృందం విప్లవకారుల పాటలు గానం చేస్తారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పోలవరపు కృష్ణా, సుదమల్ల భా‌స్కర్, బుజెందర్ మాన్యపు, కాగిత వెంకటేష్, తూర్పాటి సారయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిథి

సంగారెడ్డి డీసీసీ నిర్మల జగ్గారెడ్డి  ఆధ్వర్యంలో ఘనంగా శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి  సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో శనివారం సోనియాగాంధీ రెండు గ్యారెంటీ అమలు చేస్తున్నామని  మధ్యానము 2 గంటలనుండి మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అవి ఒట్టి మాటలు..అవినీతి మూటలు..!

అవి ఒట్టి మాటలు.._అవినీతి మూటలు..!_

_అహం బ్రహ్మస్మి.._

_అవినీతి ధన్యోస్మి.._

_నిర్మూలన హతోస్మి..!_

ఈ వేదభూమిలో

నీలో.. నాలో..

పనిలో… ధ్వనిలో..

ఇంట్లో.. ఒంట్లో..

టెంటులో.. పార్లమెంటులో..

కార్యాలయంలో..

దేవాలయంలో..

చివరికి మన దేహాలయంలో

నిండి.. నిభిడీకృతమైన శక్తి

నిన్ను..నన్ను 

నడిపించే బలిమి

సర్వాంతర్యామి..అవినీతి..

నిర్మూలిస్తామని చెప్పే

ప్రతివాడు ఆషాఢ భూతి..

ఇంతటి అవినీతి

నభూతో..నభవిష్యతి..!

ఒకనాడైతే 

బల్ల కింద చెయ్యి..

సాయంత్రం బార్లో కలుద్దాం…

చెయ్యి తడపడం..

ఫైలు కదలాలంటే 

ఇవన్నీ తప్పనిసరి..

అల్లు ముద్దుగా 

అడిగితే అమ్యామ్యా..

వీటన్నిటికీ ఒకే పేరు లంచం..

_ఈ దేశాన్ని నడిపించే గుడుగుడు గుంచం.._

ప్రతి అవినీతిపరుడి ఇంటా

వడ్డించిన బంగారు కంచం..!

ఆర్మీలో..జర్నీలో..

క్రికెట్ టోర్నీలో..

అవినీతి లేనిదెక్కడ..

కొందరైతే ఇష్టం 

లేకపోయినా బై ఫోర్స్..

_మరీ పెద్ద వారైతే బోఫోర్స్..

సువిశాల భారతావనిని నడిపించేది 

ఫోర్ పిల్లర్స్

_అన్నిటా అవినీతి త్రీ చీర్స్..!_

వేళ్ళూనుకుపోయిన ఊడలమర్రి.

కోట్ల కాళ్ళ జెర్రి..

అదే లేకపోతే 

ప్రతి పనికీ కొర్రి..

తన పర బేధం లేనిది..

నీ..నా.. మనందరి జీవితాల

నుంచి వేరు చేయడం వీలుకానిది..

రాజైనా..తరాజైనా..

ఉండదు మినహాయింపు..

కొనసాగింపే ముక్తాయింపు..

అవినీతి నిర్మూలన..

_వినడానికే ఇంపు.._

_ప్రపంచమంతా అదే కంపు..!

అవినీతి వ్యతిరేక దినం సందర్భంగా..

సురేష్ కుమార్ ఎలిశెట్టి

ఆక్రమార్కులపై.!

ఆక్రమార్కులపై.!

కొరడా ఝాళిపించిన ఐరన్ లేడీ

కిష్ణ జిల్లా యదార్థవాది ప్రతినిధి 

అపార్టుమెంట్ లో టెర్రస్ ని ఆక్రమించి నీరు లభ్యం కాకుండా వేధింపులకు గురిచేస్తున్న వారిని ఐరన్ లేడీ ఆటకట్టించింది..

2010లో ఒక కేసు ఆ కేసుని ఉపసంహరించుకోవాలని వేధించగా 2023లో మరో కేసు నమోదు చేయించింది.

అపార్టుమెంటులో కామన్ సమస్యలపై పోరాటం ఏకంగా కేసులు వరకు వెళ్లింది 13ఏళ్లుగా సాగుతూనే ఉంది ఆమె గూర్చి  ఆమె సమస్యలు గురించి సేకరించిన సమాచారం ప్రకారం..

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన బావినేని మాధురి(56) బందరు రోడ్డులోని టైమ్ ఆసుపత్రి ఏదుట లతా రెసిడెన్సీలో నివసిస్తున్నారు..

ఆమె అపార్టుమెంటు స్థలం అపార్టుమెంటులో ప్లాట్ లో నిర్మాణం మొత్తం వీరిదే మాధురి తండ్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ బావినేని కరుణాకర్ స్వయంగా నిర్మాణం చేసినదే..

అపార్టుమెంటులో నాలుగో ఫ్లోర్ లో  కొల్లి రామకృష్ణ నివాసం ఇతర ప్లాట్ ల్లో ఇతరులు నివాసం ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్లోని అందరూ సొసైటీ కూడా రూపొందించుకున్నారు. మాధురికి ఆధీనంలో రెండు ఫ్లాట్ లున్నాయి కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి ఒకటి ఆమె నివాసం ఉంటూ మరోకటి అద్దెకిస్తుంటారు సెల్లార్ పార్కింగ్ మొదటి ఫ్లోర్ కార్లు షోరూం అద్దెకు ఇచ్చారు. ఆమెకు  వివాహం కాలేదు తల్లిదండ్రులు పరమపదించారు..

ఆమె చెల్లెలు ఆమెరికాలో ఉంటున్నారు. ఆమె ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకుని లిఫ్ట్ ఆపేయటం ఆమె ప్లాట్ లకు నీటి సౌకర్యం పైపులైన్ నిలుపుదల 

పార్కింగ్ స్థలం టెర్రస్ కొల్లి రామకృష్ణ  ప్రధాన అక్రమణదారుడు పి. వీరభద్రరావు ఇతర అపార్టుమెంటులో నివాసితులు మద్ధతుతో మానసిక శారీరక వేధింపులకు గురిచేశారు..

ఒంటరిగానే పోరాటం చేసింది 2010లో ఒక కేసు పెట్టింది పాత కేసు ఉపసంహరించుకోవాలని ఆమెను మానసికంగా శారీరకంగా ఇబ్బందిలకు గురి చేశారు.. 

ఆమెను వ్యక్తిగతంగా పరోక్షంగా హింసపెట్టి చంపాలని మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకు పురికొల్పాలని మూడు సంవత్సరాలుగా అన్ని రూపాలలో పెట్టని పోలీసుల కు ఫిర్యాదు చేయగా సివిల్ మేటరని పట్టించుకోవటం లేదు. అప్పటికి వేధింపులు ఆగలేదు. దీంతో మరోసారి జిల్లా ఎస్పీ జాషువాని ఇటీవల ఆమె కలిసి సవివరంగా సమస్య నేపథ్యాన్ని స్వయంగా వివరించింది. ఆమె మానసిక, శారీరక స్థితిని అర్ధం చేసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఆమె ఆస్తిని ఆక్రమించి, మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేసిన కొల్లి రామకృష్ణ పి. వీరభద్రరావులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి..

ఆమె సుధీర్ఘ పోరాటానికి మహిళా లోకం జేజేలు పలుకుతు ఉన్నత వర్గం ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య ఐకమత్యం లోపించి ఆమెను ఆమె ఆస్తి అన్యాక్రాంతం కోసం హింసకు గురి చేసి హత్యాప్రయత్నం ఆత్మహత్య ప్రయత్నాన్నికి బలవంతంగా పురికొల్పాలని భావించటం సభ్యసమాజం తీవ్రంగా ఖండించాలి..

ఈరోజుకి కూడా ఆమె వసతికి నీటి సరఫరా పునరిద్ధరించలేదు ఆమెకు సమాజం నైతికంగా మద్ధతు పలకాలి పోలీసుల రక్షణ కల్పించి చట్టప్రకారం ఆమె ఆస్తిని ఆమెకు స్వాధీనం చేయాలని పోలీసులు న్యాయవ్యవస్థ చేస్తారని ఆశించుదాం సుధీర్ఘ సంవత్సరాలుగా ఆ ఐరన్ లేడీ పోరాటాన్ని సమాజంలో పౌరులందరం స్వాగతించుదాం.

ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.

ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

తెలంగాణ రాష్ట్రంలో ముందుగా అనుకున్నట్లే గడీల పాలన అంతం అయిందని చెప్పుకోవచ్చు..

ప్రతి శుక్రవారం ప్రచార దర్బార్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ఆహ్వానించారు..

అందుకు అనుగుణంగా నేడు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు భారీగా తరలివచ్చిన ప్రజలు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...