26.7 C
Hyderabad
Monday, April 20, 2026

కేసీఆర్ తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చేరిక

కేసీఆర్ తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చేరిక

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిది

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. 

కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మంత్రిగా పొన్నం ప్రభాకర్.

మంత్రిగా పొన్నం ప్రభాకర్.

•హుస్నాబాద్ పట్టణంలో సంబరాలు..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నం గురువారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో హుస్నాబాద్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ పోతుగంటి బాలయ్య వెన్న రాజు కొత్తకొండ పోశెట్టి బోనగిరి రజిత పచ్చిమట్ల రాధా గాజుల చంద్రయ్య కాశ వేణి సాంబరాజు సంఘ కుమార్ సంఘ శ్రీధర్ హనుమాన్ల శ్రీకాంత్ రెడ్డి పెండ్రాల దాము జవహర్లాల్ బెజ్జంకి బాబు కమలహాసన్ గడిపే రమాదేవి కమలమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అంతర్మథనం లో అభివ్రుద్ది ప్రధాత 

అంతర్మథనం లో అభివ్రుద్ది ప్రధాత 

• అభివృద్ధి చేశాక ప్రజా వ్యతిరేకత ఎందుకూ..?

• నాయకులపై అతి నమ్మకం కొంప ముంచిందా..?

• మెజారిటీ తక్కువ రావడానికి రెండవ శ్రేణి నాయకుల అసలు కారణమా..?

• వాళ్ళ తల బిరుసుతనమే కొంప ముంచిదా..?

• సిద్దిపేట నియోజకవర్గం పై 

యదార్థవాది ప్రత్యేక కథనం..

యదార్థవాది తెలంగాణ బ్యూరో

పదెళ్ళ క్రితం సిద్దిపేటకు ప్రస్తుతం సిద్దిపేట ను చూస్తే నోరెళ్ళబెట్టక మానరు ప్రజలూ నీటి ఎద్దడి దగ్గరనుండి ప్రతీ రోజూ తాగు నీరు సాగు నీరు అందేవరకు అభివృద్ధి జరిగింది. అలాగె సామాజిక అభవృద్ది కూడా ఒక స్థాయిలో జరిగిందంటే అతియోషక్తి కాదు  అటు విద్య వైద్యము ఉపాధి లాంటి అనేక విషయాల్లో సిద్దిపేట పట్టణం రాష్ట్రంలో అన్ని నియోజవర్గాల్లో కంటె పది సంవత్సరాల ముందున్నది అన్నది ప్రజలనోటి మాట అలాంటప్పుడు 2023 లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడక కావాలి కాని ఈ ఎన్నికలో అలా జరగలేదు 2004 నుండీ సిద్దిపేట ఏమ్మెళ్యే గా ప్రతీ ఎన్నికల్లో మెజారిటీ పెంచుకుంటూ రికార్డు స్థాయిలో విజయ దుందుభి మోగిస్తున్న హరిష్ రావు ఈ ఎన్నికల్లో ఎందుకు ఢీలా పడ్డారు..? ఎందుకు అంతర్మథనం చెందుతున్నారు..? మెజారిటీ  అంటూ ఊపు దుంకుడు మాటలు ఎందుకూ మాట్లాడారు..? ఒక్కసారిగా అయాన పై ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు పెరిగింది…? రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దాదాపు  పథకాలు ప్రతీ కుటుంబానికి చేరాయి

మరెందుకు వ్యతిరేకత పెరిగింది….? ఈ ఎన్నికల్లో ఔర్ ఎక్ దక్క దెడ్ లాక్ పక్క అంటూ స్లోగన్ ఇచ్చినా బ్యానర్లు ఇప్పుడు 

రెండవ శ్రేణి నాయకుల మొహాలు ఎందుకు వాడిపోయాయి.? తెలుసుకోవాల్సిన అవసరము ఉంది.  అందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం సిద్దిపేట నియోజక వర్గాన్ని  రెండవ క్యాడర్ కు వదిలి మిగతా నియోజకవర్గాల్లో  హరిష్ రావు పర్యటన చెయడం అయాన చేసిన మొదటి తప్పని ప్రజలూ అనుకుంటున్నారు. వంద  ఓట్లకు ఒక ఏజెంట్ లను పేట్టి ప్రతీ ఒక్కరి దగ్గరికి వెళ్లాల్సిందిగా చెప్పి వెళ్లిన హరిష్ స్త్రాటర్గి ఫెయిల్ అయ్యిందనే చెప్పవచ్చు  కనీసం పొలింగ్ చిట్టిలు కూడా కొంత మంది దగ్గరకు అండలేదంటే నాయకులూ ఎంత ఆత్మ విశ్వాసం గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని ప్రజలూ అనుకోవడం కనిపిస్తుంది.

దెబ్బతీసిన రెండవ శ్రేణి నాయకుల తల బిరుసుతనం కూడా.. 

ఇక రెండవ శ్రేణి నాయకుల విషయానికీ వస్తె వారికి కళ్ళు నెత్తికి ఎక్కాయి అని ప్రజలూ అంటున్నరంటే ఎంతటి అరాచకం ఇక్కడ రాజ్యమేలుతుంది అన్న విషయం గ్రహించాలి అంటున్నా జనం. మాకు ఎదురే లేదూ అనుకుంటూ ప్రతీ విషయంలో వేలు పెట్టీ కాలుపెట్టి మధ్యవర్తిత్వం, దందాలు కబ్జాలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి. సైకిల్ పై తిరిగినొల్లు నేడు కార్లు ఎకరాల భూముల ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. కనీసం హరీష్ రావు ను కలసి తమా గోడు వెళ్లబోసుకుందామని అనుకుంటున్నా సామాన్యుడికి శిఖండి లాగా ఈ రెండవ స్థాయి నాయకులు  అడ్డుకుంటున్నారని ప్రధాన ఆరోపణ. హరీష్ రావు చుట్టూ ఒక 10 మంది రాజ్యం ఏలుతున్నరని వారినీ నియంత్రింపోవడం హరిష్ తప్పిడమని రాజకీయా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైనా సరే సారు ఉన్నాడు మమల్ని కాపాడటానికి అన్న ధైర్యం వారిలో పెనవేసుకుందని,ఇక ఆ పది మంది అనుచరల ఆగడాలకు అడ్డుకట్ట లేదన్నది కూడా ప్రధాన ఆరోపణ. జిల్లాకు చెందిన ప్రతీ శాఖల్లో నే కాకుండా ప్రధానంగా పోలిస్ శాఖలో వారి హవా చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు అంటున్నారు బాధితులు.. ఇక సామాన్యుడు ఎలా ఓటేస్తాడు. విసిగిపోయిన సామాన్యుడు ఈ సారీ తన ఓటుతో సమాధానం చెప్పాడని రాజకీయా విశ్లేషకుల అంచనా..ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం..

చింతా ప్రభాకర్ కు ఘన సన్మానం.

చింతా ప్రభాకర్ కు ఘన సన్మానం.

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది

  • సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో
    మంగళవారం చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గా గెలుపొందిన చింత ప్రభాకర్ కు సదాశిపేట మండల చందాపూర్ గ్రామవాసులు బీఆర్ఎస్ కార్యకర్తలు శాలువా వేసి పూలమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మానయ్య మాజీ సర్పంచ్ చంద్రన్న మాజీ ఎంపిటిసి లు సంజీవులు మానయ్య వార్డు మెంబర్ బాబు బీఆర్ ఎస్ నాయకులు ఇలియాజ్ నారాయణ అజయ్ రవి భరత్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్దా…పార్టీయా…

అభివృద్దా…పార్టీయా…

మాజీ మంత్రి హరీష్ రావు మదిలో ఏముందో.?

రాష్ట్రంలో అనూహ్య  ఫలితాల నేపథ్యంలో సిద్దిపేట ప్రజల సమాలోచనలు

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది 

అధికారంలో ఉన్నందున ఇంతకుముందు ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో సిద్దిపేట శరవేగంగా  అభివృద్ధి చెందింది. ఈ విషయాన్ని ఏ చిన్న బాలుడిని అడిగిన ఇదే విషయం చెబుతారు. రాష్ట్రంలోనే ఏ ఏ నియోజకవర్గము కూడా అభివృద్ధి చెందనంతగా సిద్దిపేట ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇది ఒకరకంగా రికార్డు స్థాయిలోనేనని భావించవచ్చు. అంతటి స్థాయిలో సిద్దిపేట అభివృద్ధి చెందడాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఇప్పుడు కూడా ఆ స్థాయిలో అభివృద్ధి నీ  సహజంగా కోరుకుంటారు.  అయితే ఆ స్థాయిలో అభివృద్ధి  చెందుతుందా అనే విషయంలో మీమాంసలో పడ్డారు. రాష్ట్రంలో రాజకీయాలు అనున్యయంగా మారిపోయాయి.. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హవా కొనసాగుతుండగా జరిగిన ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఊహించని చుక్క ఎదురైంది టిఆర్ఎస్ పార్టీ కాస్త కుప్పకూలి కాంగ్రెస్ చేతికి అధికారాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ ఫలితాలు నేపథ్యంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం మారడం అలాగే హరీష్ రావు ఎమ్మెల్యే గానే ఉండాల్సి వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి ఏ మేరకు ఉంటుందోనని ప్రజలు సంక్షేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట అభివృద్ధిని కాంక్షించి హరీష్ రావు ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారుతి బాగుండని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. కానీ మొదటి నుండి తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హరీష్ రావు పార్టీ మారుతారా లేదా అన్న విషయం పక్కన పెడితే సిద్దిపేట అభివృద్ధి మాత్రం ఇంతకుముందు జరిగినట్లుగా జరిగే అవకాశాలు తక్కువనే ఉండొచ్చు ఒకవేళ హరీష్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలోకి దూకితే మాత్రం సిద్దిపేట అభివృద్ధికి ఎలాంటి డొక్కా ఉండదు అని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా హైదరాబాదు టిఆర్ఎస్ భవన్ లో సోమవారం టిఆర్ఎస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు కనిపించకపోవడంతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు పలు రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. హరీష్ రావు సిద్దిపేట అభివృద్ధి కోసం పాటుపడతారా అని కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా హరీష్ రావు మునుపటిలా సిద్దిపేట అభివృద్ధి జరిగేలా సరేన నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు..

ఆశ నిరాశ అయిన వేళ మళ్లీ సొంతగూటికి చేరేనా?

ఆశ నిరాశ అయిన వేళ మళ్లీ సొంతగూటికి చేరేనా?

ఆశల సౌధం కకావికలం అవగా క్షణిక పాటు నిర్ణయం అంధకారానికి చిక్కేనా?

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది 

అనుకున్నదొకటి అయినది ఒకటి అన్న చందంగా మారి ఎందుకు వచ్చానా అనుకునే పరిస్థితి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిది తండ్రి కాలం నుండి పదవి కోసం ఎన్న మార్లు పోటీ చేసి విసిగి వేసారి చివరి ప్రయత్నం గా పోటీ చేసి గెలుపొంది పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించి శభాష్ అనిపించుకున్న మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ ఎంతో మంది అభిమాన గణాన్ని పెంపొందించుకొని పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటూ అప్పటి ఇందుర్తి నియోజకవర్గ ప్రజలలో చిరస్థాయిగా నిలిచిన బొమ్మ వెంకటేశ్వర్లు, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అదే దారిలో పయనించి కాంగ్రెస్ పార్టీని వెన్నుదన్నుగా నిలుపుకొని అంకితభావంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలు నాయకులు తో సహకరిస్తూ మార్క్ఫెడ్ చైర్మన్ గా పదవిని చేజెక్కించుకొని పదవికి న్యాయం చేసిన ఘనత ఆయనది అలాంటి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బంధువుల ,స్నేహితుల సలహాలేనో లేక కార్యకర్తల ప్రోత్బలమేనో ఎమ్మెల్యే పదవిని ఆశించి భారతీయ జనతా పార్టీ లోనికి మకాం మార్చిన సంగతి తెలిసిందే.ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని అతి కష్టం మీద భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కించుకున్న నిరాశనే మిగిల్చుకున్నారు మరిప్పుడు అధిష్టానం మేరకు పార్టీ కి కట్టుబడి ఉండడమా లేక సొంతగూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అంటూ కార్యకర్తల్లో గుసగుసలు వినిపించడం ప్రత్యేకతను సంతరించుకున్నది ఏది ఏమైనా వేచి చూడాల్సిందే..

ప్రజా తీర్పును శిరసావహిస్తాం

ప్రజా తీర్పును శిరసావహిస్తాం

అధైర్య పడొద్దు… ప్రజల కు అండగా నిలుద్దాం

మెదక్ యదార్థవాది ప్రతినిది

ఎన్నికల్లో గెలుపు ఓటమిలు సహజమని , ప్రజా తీర్పును శిరసా వహిస్తామని బిఆర్ఎస్  జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా బిఆర్ఎస్  పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో మాట్లాడారు 25 ఏళ్లుగా  ఉద్యమంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని అధైర్య పడకుండా  ముందుకు సాగినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు  ఆడబిడ్డగా  ఆదరించి సహకరించారని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ  చేదోడు వాదోడుగా నిలుస్తూ  కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని ఓటమిని గెలుపుగా భావిస్తూ  ముందుకు వెలుదామనీ కార్యకర్తలు నాయకులు సూచించారు బిఆర్ ఎస్ శ్రేణులు  అధైర్య పడకుండా ప్రజలకు అండగా నిలవాలి అన్నారు. ఎన్నికల్లో శ్రమించిన కార్యకర్తలు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కారు బోల్తా.2 క్వింటాళ్ల గంజాయి.

కారు బోల్తా.2 క్వింటాళ్ల గంజాయి.

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించినలో కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు.

భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు కారును గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిసింది. గంజాయిని కారును స్వాధీనం చేసుకొని చిరాగ్‌పల్లి ఠాణాకు తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంగారెడ్డి లో ఓటు హక్కు వినియోగించుకున్న: చింత ప్రభాకర్

సంగారెడ్డి లో ఓటు హక్కు వినియోగించుకున్న: చింత ప్రభాకర్

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది 

అందరితో పాటు క్యూలో నిలబడి ఓటు వేసిన సంగరెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్. సదాశివపేటలోని రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాలలో 187 పొలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన మన హక్కు, ఓటు అనేది ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతివంతమైన పాలను ఎన్నుకోవడానికి ఉపయోగ పడుతుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు మనందరి హక్కు సద్వినియోగం చేసుకుందాంఅని అన్నారు.

సోమసిల్లి పడి పోయిన కండక్టర్.

సోమసిల్లి పడి పోయిన కండక్టర్.

డిపో అధికారి వేధింపులే కారణం.

విజయవాడ యదార్థవాది ప్రతినిది

విజయవాడ ఆర్టీసీ డిపో-1కి చెందిన కండక్టర్ ఝాన్సీ విధి నిర్వహణలో సోమ్మసిల్లి పడిపోయింది. ప్రయాణీకుల సహాయంతో తక్షణమే ఆటోలో ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. సేకరించిన సమాచారం ప్రకారం ఇందుకు గల కారణం డిపో అధికారి సునీత కారణమని తెలిసింది. విధి నిర్వహణ చేయలేనని సెలవు అడుగగా నిరాకరించింది సదరు అధికారి సిఐ సునీత. నిర్ణయించిన బస్సు రూట్ కి కండక్టర్ విధి నిర్వహించలేనని, సెలవు కోరింది. ఇందుకు నిరాకరించిన డిపో సిఐ సునీత బస్సు స్టాప్ లో బస్సు నెంబర్ లో సమయం పాలన నమోదు చేయాలని ఆదేశించింది. బస్సు స్టాప్ లో బస్సు రూట్ నెంబర్ లో బస్సులు సమయ పాలన నమోదు చేస్తుండగా, ఒక్కసారిగా సోమసిల్లి కుప్పకూలిపోయింది. గమనించిన ప్రయాణీకులు ఆమెను ఆటోలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం సురక్షితమని వైద్యులు తెలిపారు. ఆర్టీసీ డిపో-1 మహిళా అధికారిని సిఐ సునీత ని బదిలీ చేయాలని లేదా సస్పెండ్ చేయాలని బాధిత మహిళ కండక్టర్ లు గగ్గోలు పెడుతున్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...