25.7 C
Hyderabad
Monday, April 20, 2026

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ పోలింగ్  

– హుస్నాబాద్ నియోజకవర్గం: 12.67 శాతం

– దుబ్బాక నియోజకవర్గం: 10.06 శాతం

– సిద్ధిపేట నియోజకవర్గం: 11.50 శాతం

– గజ్వేల్ నియోజకవర్గం: 11.03 శాతం

పోలింగ్ రోజే ఎందుకు ఉద్రిక్తత.!

పోలింగ్ రోజే ఎందుకు ఉద్రిక్తత.!

ఆంధ్ర, తెలంగాణ పోలీసుల దౌర్జన్యం.

ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్‌ రోజే ఎందుకు?

పల్నాడు యదార్థవాది ప్రతినిది

ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్‌ డ్యామ్‌పై ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు గేటు తీయాలని  తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదు. ఆంధ్ర వైపు ఉన్న గేటుకు ఉన్న సెన్సార్ ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఆంధ్ర ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు.

ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్‌ రోజే ఎందుకు?

సాగర్‌ డ్యామ్‌పై పోలీసుల హడావుడి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ సాగర్‌ డ్యామ్‌పై పోలీసుల డ్రామా కేసీఆర్‌ పనేనని కూటమి భయంతో కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్‌ రోజే ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ఎన్నికల కోసం వాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.

దుద్దెడ మోడల్ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా: కలెక్టర్

దుద్దెడ మోడల్ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా: కలెక్టర్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పోలీస్ కమిషనర్ శ్వేత దుద్దెడ మోడల్ పోలింగ్ నంబర్ 91లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును జిల్లాలోని ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో వంద శాతం పోలింగ్ జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఓటు హక్కును వినియోగించుకున్న. కలెక్టర్

ఓటు హక్కును వినియోగించుకున్న. కలెక్టర్

మెదక్ జిల్లా యదార్థవాది ప్రతినిది

హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండా ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన  పోలింగ్ స్టేషన్ నంబర్  211  లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లాలో అత్యధిక శాతం నమోదు కావాలని అన్నారు.

శ్రీ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట

శ్రీ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం లో శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా భక్తులు మంగళవారం శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహానికి జలాభిషేకం అఖండ దీపారాధన చేస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పూజారి శివ కోటి పంతులు మాట్లాడుతూ బుధవారం మండపారాధన యంత్ర ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత కడియాల ఈశ్వరప్ప ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ఆలయ పూజారులు పాల్గొన్నారు

పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌.

పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌.

రామగుండం యదార్థవాది ప్రతినిది 

తెలంగాణ అసెంబ్లీ -2023 ఎన్నికల సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి పత్రికా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఈనెల 30న ఎన్నికలు ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తేదీ నవంబర్ 28వ  సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కమీషనరరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఐదుగురు లేదా  అంతకంటే ఎక్కువమంది గుంపులు గుంపులుగా తిరగొద్దని రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు అభ్యర్థుల గుర్తులు ప్లకార్డులు ధరించొద్దని అన్నారు. మైకులు లౌడ్‌ స్పీకర్లు వాడరాదని రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు ఉపన్యాసాలు ఇవ్వకూడదని విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు ధర్నాలు రాస్తారోకోలు ఊరేగింపులు టపాకాయలు కాల్చడం  లాంటి కార్యక్రమాలను నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై,ఎన్నికల సంఘం నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హుస్నాబాద్ కు మెడికల్ కాలేజ్.!

హుస్నాబాద్ కు మెడికల్ కాలేజ్.!

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

కార్తీక పౌర్ణమి పర్వదినాన పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆలయంలో ప్రమాణం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ కు మెడికల్ కళాశాల నియోజకవర్గంలో పలు ప్రాంతాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కాలువల నిర్మాణాలు ద్వార రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. 2014లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని 2009లో నన్ను ఈ ప్రాంతం నుండి ఇక్కడ ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించారని వారికోసం చిత్తశుద్ధితో పనిచేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం పాస్పోర్ట్ ఆఫీస్ లాంటి ఆఫీసులను తీసుకువచ్చాని తెలంగాణ సాధన కోసం పార్లమెంటులో కొట్లాడి నా వంతు కృషి చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. రాష్ట్రంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ మార్పు పెనుమార్పుగా మారి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం లోన ప్రతి పల్లె పర్యటించానని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా స్థానిక మేనిఫెస్టోను విడుదల చేశానని తోటపల్లి రిజర్వాయర్ వరద నీటి కాలువ ద్వారా చిగురు మామిడి సైదాపూర్ మండలాల రైతులకు అలాగే దేవాదుల ప్రాజెక్టు నుండి భీమిదేవరపల్లి ఎల్కతుర్తి మండలాల రైతాంగానికి సాగునీరు అందించేలా కృషి చేస్తానని తెలిపారు. సమావేశం లో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టఫర్ తిలక్ అసెంబ్లీ పరిశీలకులు గోపీనాథ్ పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి చిత్తారి రవి నిర్మల నరసింహారెడ్డి సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కర్ర రవీందర్ రెడ్డి కల్లపల్లి కావ్య వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

మెదక్ లో కాంగ్రెస్ జెండా ఖాయం 

మెదక్ లో కాంగ్రెస్ జెండా ఖాయం 

మెదక్ యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ హవా జోరుగా సాగుతుందని మెదక్ లో మా అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని కర్ణాటక ఎమ్మెల్సీ మెదక్ పార్లమెంట్ అబ్జర్వర్ పరిశీలకులు యూపీ వెంకటేష్ అన్నారు. ఈసందర్భంగా మెదక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్  ప్రభుత్వంమే అని ఇటీవల సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం పట్ల మెదక్ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్యాక్టరీల నుండి వేల కోట్ల రూపాయల దోచుకుంటున్నారని, మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో శూన్యమని మెదక్ లో మార్పు కావాలని కాంగ్రెస్ రావాలని అవినీతి రాజ్యం పోవాలని ప్రజలు విశ్వాసంతో చెబుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుతున్నారని కాంగ్రెస్ 75 సీట్లతో అధికారంలోకి రాబోతుందని జీమ వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆరు పథకాలు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ పథకాలు ఇస్తామని వెల్లడించారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాలలో మా అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి రాజపత్రం అందుకుంటారని టిఆర్ఎస్ అభ్యర్థి ఏం పద్మ దేవేందర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఉద్యోగుల ఓటు వేయకుండా కావాలని ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను అడ్డుకుంటుందని బ్యాలెట్ పోస్టుల కోసం ఓట్లు వేయడానికి వస్తే బ్యాలెట్ పోస్టులను పంపిణీ చేయలేదని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగస్తులను వాడుకుంటుందని వారు ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్ జీవన్ రావు శ్రీనివాస్ గూడూరు ఆంజనేయులు గౌడ్ అవారి శేఖర్ రాజలింగం అనిల్ కుమార్ బొజ్జ పవన్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలి: ప్రజా ఫ్రంట్.

బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలి: ప్రజా ఫ్రంట్.

-ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న పాలకులను చెమర గీతం పాడాలి.

నల్గొండ యదార్థవాది ప్రతినిది

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మూడవసారి అధికారం కోసం మళ్లీ ఎన్నికల్లోకి  వస్తుందని బిజెపి కూడా ప్రజలకు కళ్ళ బోళ్లి మాటలు చెప్పి ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బిజెపి బిఆర్ఎస్ పాలనకు చెమర గీతం పాడాలని శనివారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు నక్రేకల్ ప్రెస్ క్లబ్ లో కరపత్రలను విడుదల చేశారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావలి యాదయ్య నల్లగొండ జిల్ల కో కన్వీనర్ గొండ్యాల సైదులు మాట్లాడుతూ నిరుద్యోగుల ఆదివాసుల రైతులు నిత్యం పడుతున్న కష్టాలను మనం చూస్తూనే ఉన్నామని ప్రజా సంఘాల నాయకులపై ప్రశ్నించే గొంతులపై నిత్యం నిర్బంధం ప్రయోగిస్తూ ఉపా కేసులు పెట్టి వేదిస్తున్నదని బంగారు తెలంగాణ అంటూ అప్పుల చేసిండు కోటి ఎగరాలకు నీరు అందించే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎత్తిపోతల పథకం అని  గొప్పలకు పోయాడు  కానీ ఇప్పుడు కాలేశ్వరం కుంగిపోయి గంగలో కలిసిపోయింది అప్పులు ఏమో ప్రజల మీద పడ్డాయి డబ్బు కేసీఆర్ కుటుంబం జేబులు నిండిందని నేటికీ బస్వాపూరం ప్రాజెక్టు ముప్పు బాధితులకు పునరావాసం కల్పించలేదు యాదాద్రి టెంపుల్ అవనితీ మాయమైందని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి స్కాం మాయమైందది కేజీ టు పీజీ ఉచిత విద్య డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుద్యోగ భృతి ఆటకి ఎక్కాయని ప్రజల చేతుల్లో ఉన్న భూమి ధరణి ద్వారా గుంజేశాడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం 5 లక్షల కోట్లు అప్పులకు పోయిందని పాలక పార్టి నాయకులు మాత్రం వేలకోట్లకు అధిపతి లయ్యారని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వ వైఖరి మరింత దారుణంగా ఉందని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా ఆశ్రితులకు కట్టబెట్టిందని ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసి బడా బాబులకు గత పదివేలలో 25 లక్షల కోట్ల రుణాలు రద్దు బిజెపి పాలనలో పారదర్శకత ఉండదని రాజ్యాంగం పట్ల గౌరవం లేదు దేశమే ఒక అసoబద్ద చిత్రంగా మారిపోతుందని మత విద్వేషాన్ని రెచ్చగొట్టి దేశాన్ని అగ్ని కీలాల్లోకి తోస్తున్న వారే దేశభక్తి అంటూ ఊరేగింపులు తీస్తారని సామాజిక వాస్తవాలు మాట్లాడుతున్నందుకు  విశ్లేషిస్తున్నందుకు విశ్వవిద్యాలయాల ఆచార్యులను స్వతంత్ర మేధావులను జర్నలిస్టులను కళాకారులను వెంటాడుతుందని అన్నారు. వాస్తవాలు మాట్లాడే వారి మెడమీద కత్తులు వేలాడుతున్నాయని భారతీయ రాష్ట్ర సమితి నిరంకుశ విధానమైతే భారతీయ జనతా పార్టీది మతోన్మాద ఫాసిస్ట్ విధానాలను అమలంబిస్తుందని పౌర ప్రజాతంత్ర హక్కుల రక్షణకు సమానత్వ సాధనకై ప్రజలు ఐక్యమే పాలకవర్గ పార్టీలను నిలదీయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్నాయకులు కావలి యాదయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నంగునూరి రాజు రవి తదితరులు పాల్గొన్నారు.

అష్టాదశ శక్తి పీఠ సహిత ఉమా రామలింగేశ్వర ప్రతిష్టోత్సవాలు.

అష్టాదశ శక్తి పీఠ సహిత ఉమా రామలింగేశ్వర ప్రతిష్టోత్సవాలు.

కొండపాక యదార్థవాది

హైదరాబాదు నుండి 80 కిలోమీటర్లు ఇటు సిద్దిపేటకు 20 కిలోమీటర్ల దూరంలో  కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి అతి సమీపాన రాజీవ్ రహదారి పక్కన తెలంగాణలో  సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ పరిసరాల్లో  కొమురవెల్లి గ్రామ పరిసర ప్రాంతం గొప్ప ఆధ్యాత్మికత తో పాటు ఆలయ ప్రాంగణముగా విరసిల్లబోతుంది. ఇంతవరకు 18 శక్తి పీఠాలు ఒకే ఆలయ ప్రాంగణంలో యావత్ భారత దేశంలోనే ఎక్కడ లేవు కానీ ఇప్పుడు ఆ 18 అమ్మవార్ల రూపంలో ఉన్న శక్తి పీఠాలు కొండపాక పరిసర ప్రాంతంలో కొలువుదీరనున్నాయి. మాజీ ఐఏఎస్ కె.వి రమణాచారి ప్రోచహంతో ఈ గొప్ప సంకల్పం నెరవేరనున్నది దీనిలో భాగంగా శనివారం ఉదయం గో పూజ తో మోదైలన కార్యక్రమాలు గురు వందనం లో శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు  జగద్గురువులు శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారు రాజగోపురం ద్వారా పూజాదిక్రాలు చేస్తూ ఆలయ ప్రవేశం చేసారు తదుపరి  అనుగ్రహ భాషణం గావించి తర్వాత యజ్ఞప్రవేశం ప్రవేశము నవగ్రహ వాస్తు కలశ స్థాపనం చండీ పారాయణం చేసాక  శ్రీ మాధవానంద సరస్వతి స్వామి,  పీఠాధిపతులు తదితరులు పూజా కార్యక్రమం లో  పాల్గొని ప్రసాదావితరణ గావించారు. అనంతరం శాస్త్రోక్తంగా వార్ల  విగ్రహాలు జలాధివాసం చేసారు. దీనిలో భాగంగా ఆదివారం గురు వందనము ప్రాతః కాల పూజలు మూల మంత్ర జపములు చండీ పారాయణము వేద పారాయణము అష్టాదశ శక్తి పీఠాల అనుస్టానములు గణపతి మంటప దేవత హోమాములు సాయంత్రం నాలుగు గంటలకు తదితర పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరుగును.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...