37.2 C
Hyderabad
Tuesday, April 14, 2026

బీఆర్ఎస్ బిజెపిలు రైతులకు చేసింది ఏమీ లేదు

బీఆర్ఎస్ బిజెపిలు రైతులకు చేసింది ఏమీ లేదు

-దుబ్బాకలో రైతు పక్షపాతి ముత్యం రెడ్డి కుమారుడిని గెలిపించండి.

-కాంగ్రెస్ పార్టీ కిసాల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి రావు.

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

టిఆర్ఎస్ బిజెపిలు రైతులకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి రావు, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం దుబ్బాకలో వారు మాట్లాడుతూ దివంగత నేత మాజీ మంత్రి  ముత్యంరెడ్డి దుబ్బాకలోని రైతుల కోసం అహర్నిశలు కిసాన్ సేల్ ఆధ్వర్యంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని పేర్కొన్నారు కెసిఆర్ రైతు రుణమాఫీ చేయక ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతు సంక్షేమం  జరిగిందని దుబ్బాకలో వడగళ్ల వానతో దెబ్బతిన పంటలకు నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఇప్పడికి రూపాయి సాయం చేయలేదన్నారు. 2014 రుణమాఫీ కి సంబంధించి రీ షెడ్యూల్ చేయక స్థానిక ఓ బ్యాంకులో ఇప్పడికి మిత్తితో తీసుకున్న అప్పును చెల్లించాలని రైతుల మీద ఒత్తిడి చేస్తున్న ఇక్కడ గెలిచిన నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దివంగత నేత మంత్రిగా పనిచేసిన ముత్యం రెడ్డి  అప్పడి ముఖ్యమంత్రితో కొట్లాడి దుబ్బాక ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసారని తెలిపారు.. నియోజకవర్గంలో ప్రతి మండలం ఒక్క మార్కెట్ కమిటీ టీటీడి కల్యాణ మండపలు రైతుల కోసం చెక్ డ్యామ్ లు నిర్మాణం చేసింది కేవలం ముత్యం రెడ్డి అని కొనియాడారు దుబ్బాక అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రైతు పక్షపాతి ముత్యం రెడ్డి ఆశయాలు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని ఇక్కడి ప్రజలు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గడీల గోపాల్ రెడ్డి, డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్

కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 27 వ తేదీన సంగారెడ్డిలో నిర్వహించే బీఅర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా నాయకులకు  కార్యకర్తలకు టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి రానున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త ప్రతి వార్డులో గ్రామాలలో పర్యటించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని ప్రతిపక్షాలకు కండ్లు తిరిగేలా సంగారెడ్డి గులాబీ మయం కావాలన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్థానిక నేతలతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు.

ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్

ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్

మెదక్ యదార్థవాది ప్రతినిది

మెదక్ నియోజకవర్గం మెదక్ పట్టణంలో

కాంగ్రెస్ అభ్యర్థి  మైనంపల్లి రోహిత్ గెలుపు కోసం మైనార్టీ నాయకుడు అమీరుద్దీన్ అమిరుద్దీన్ అధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ తొమ్మిది సంవత్సరాలుగా బీఅర్ఎస్ ప్రభుత్వ  వైఫల్యంను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ అరు గ్యారంటీలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 500కే సిలిండర్ అన్నందుకు, నేడు టిఆర్ఎస్ వారు నేడు 400కే ఇస్తామని ఎలా చెప్తున్నారు  కార్యక్రమంలో సురేందర్ గౌడ్ మాజీ కౌన్సిలర్ మున్నా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కే మా మద్దతు: వీరశైవ సమాజం.

బీఆర్ఎస్ కే మా మద్దతు: వీరశైవ సమాజం.

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది 

సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి సేవకుడు చింత ప్రభాకర్ కి మా మద్దతుతని జిల్లా వీరశైవ లింగాయత్ మాజీ అధ్యక్షులు ఏ సిద్దేశ్వర్, జిల్లా గౌరవ అధ్యక్షులు శివచంద్ర పాటిల్ అన్నారు. వీరశైవ లింగాయత్ సమాజం తరఫున శనివారం విలేకరుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వీరశైవ లింగాయత్  అభివృద్ధి కోసం చింత ప్రభాకర్ పట్టణంలోని బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కృషి  50 లక్షలు నిధులు ఇవ్వడం జరిగిందని ఎడ్ల బజార్ బసవేశ్వర కళ్యాణ మండపానికి 40 లక్షల రూపాలు రావడానికి కృషి చేసిన చింత ప్రభాకర్ కే మా ఓటు అని తీర్మానం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర వీర సేవా సమాజం భవనం కోసం కోక పేటలో కోట్ల విలువ విలువచేసే ఎకరం స్థలం ఇవ్వడం జరిగిందని జిల్లా సమాజ భవనం కోసం  కంది మండలంలో  సుమారు ఐదు  కోట్ల విలువ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అదేవిధంగా కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా  నిర్వహించడం హర్షినియమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవులందరూ చింత ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేయాలని సమాజం తరఫున పిలుపునిచ్చారు. సమావేశంలో సమాజం జిల్లా కోశాధికారి చంద్ర కాంత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పపల్లి నర్సింలు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  ఆత్మకూరునాగేష్ జిల్లా నాయకులు మల్లికార్జున్ గందిగేరాజు శాంత్ కుమార్త తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది: మంత్రి హరీశ్ 

కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది: మంత్రి హరీశ్ 

నారాయణ ఖేడ్‌ యదార్థవాది ప్రతినిది

నారాయణ ఖేడ్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డితో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో భూపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చిన జనాలను చూసి కాంగ్రెస్ గుండెలు జారిపోయి ఉంటాయని ఈ 30వ తేదీ పోలింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్ధం అయిపోతుంది కనీసం 50 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందని కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది ఖర్గే వచ్చి తెలంగాణ రాష్ట్రం మేం పెట్టిన భిక్ష అన్నడు. మరి దేశానికి స్వాతంత్ర్యం కూడా బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్షనా?  సొంత రాష్ట్రంలో నీళ్లు రోడ్లు లేని ఖర్గే ఇక్కడికి వచ్చి  నీతులు చెప్తున్నడని కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించిన తర్వాత రాహుల్ గాంధీ జాడ లేడు ప్రియాంకా గాంధీ పత్తా లేదు రైతు బంధు మొదట 8 వేలు ఇచ్చి తర్వాత 10 వేలు చేసి ఇప్పుడు 16 వేలు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిండు కాంగ్రెస్ వస్తే రైతు బంధు పోతది కరెంట్ పోతది హస్తానికి ఓటేసి కర్ణాటక వాళ్లలాగా ఆగం అయిదామా?కేసీఆర్ గెలిస్తే 2 వేల పింఛను 5 వేలు అయితది. సన్న సోనామసూరి బియ్యం వస్తయి రిస్క్ వద్దనుకుంటే కారుకే ఓటు వేయాలనీ అన్నారు. మళ్లీ బీ అర్ ఎస్ ప్రభుత్వం రావడం పక్కా కెసిఆర్ ముచ్చటగా మరోసారి సీఎం కాబోతున్నారు అన్నారు.

జగన్మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యం.

జగన్మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యం.

అనకాపల్లి యదార్థవాది ప్రతినిది 

అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ నియోజకవర్గంలో శుక్రవారం రావికమతం మండలం చీమలపాడు సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలి అనే కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావికమతం మండల పరిషత్ ఎంపీపీ పైలరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తయ్యాయని రైతు భరోసా అమ్మబడి ఆసరా పెన్షన్లు గృహ నిర్మాణం నాడు నేడు వంటి సంక్షేమ పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని గెలిపించుకోనే బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భవాని ప్రసాద్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు  బంటు సన్యాసినాయుడు మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి నాయుడు కన్వీనర్ కంచిపాటి జగ్గారావు కోఆప్షన్ ఎంపీటీసీ గాలి రమణ బాబు స్థానిక సర్పంచ్ వంజరి గంగరాజు ఎంపీటీసీ చిన్ని  చిన్నమ్మలు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే.

నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే.

*ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి..

*నోటుకు ఓటు అమ్ముకుంటే బ్రతికున్నా శవంతో సమానం..

సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది

ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే – మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల అన్నారు. శుక్రవారం సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో  ‘ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి’ ఓటు అమ్ముకుంటే బ్రతికున్నా శవంతో సమానం పోస్టర్లను జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల కార్యదర్శి ఖదిజ్ఞాసి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థి గువ్వల సంతోష్ కుమార్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సదర్భంగా అయన మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ప్రశ్నిస్తూ నిలువరిస్తూ జైభారత్ గత పదిహేనేళ్లుగా జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ ద్వారా విస్తృతమైన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ మాట్లాడుతూ నాయకుల డబ్బు ప్రలోభానికి లోనైతే ఓటర్లమైన మనం చిల్లరదొంగల కంటే హీనమైపోతామని అప్పుడు మన ఓట్లతో గెలిచే నాయకులు గజదొంగలై దేశాన్ని కళ్లముందే దోచుకుపోతారని నాయకులు విసిరే నోటుకు మనం ఆశపడుతున్నామంటే- భవిష్యత్తులో ఆ నాయకులు పాల్పడబోయే అవినీతికి మనమే లైసెన్స్ ఇచ్చినట్టవుతుందని అన్నారు. జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి చొడవరపు వంశీ  మాట్లాడుతూ నోటుకి ఐదేళ్ల భవిష్యత్తుని అమ్మిన మనిషి శవంతో సమానం – నాయకులు పోస్తున్న మద్యానికీ పడేస్తున్న నోటుకీ ఓటుని అమ్ముకుంటున్నందుకు సిగ్గులేదా అని ఓటర్లని పదునుగా ప్రశ్నిస్తూ లక్షలాది పోస్టర్లద్వారా ఎన్నికలు జరిగిన ప్రతిచోటా ఓటర్లను జైభారత్ జాగృతం చేస్తుందని అన్నారు. స్వతంత్ర అభ్యర్థి  గువ్వల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో వోటర్లు  తమ ఓట్లను డబ్బుకి మద్యానికి కాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం పట్టణంలో పలు చోట్ల పోస్టర్లను అతికించడం జరిగిందని తెలిపారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంట్టిటి ప్రచారం.

కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంట్టిటి ప్రచారం.

దుబ్బాక యదార్థవాది 

దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శుక్రవారం కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా టిపిఎస్ రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంట అందుతున్నాయని ప్రజలు కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డికి కారు గుర్తుకు మాత్రమే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే విజయానికి పునాది టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను నచ్చి ప్రజలు కేసిఆర్ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందవలసిన హక్కుగా పథకాలను కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సాధ్యమయిందని రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి  భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాం రామకృష్ణ ప్రభు బరిగే నర్సింలు గొడుగు మల్లేశం మహేష్ చింటు తదితరులు పాల్గొనారు.

పగటి వేశగాళ్ళ మాటలు నమ్మొద్దు.

పగటి వేశగాళ్ళ మాటలు నమ్మొద్దు.

కొండపాక యదార్థవాది 

మండల పరిధిలోని దుద్దెడ కాశవారి పల్లెలో శుక్రవారం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నూనె కుమార్ యాదవ్  మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ మాత్రమేనని పగటి వేశగాళ్ళ వలే కాంగ్రెస్ బిజెపి పార్టీల వారి మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని వాళ్ళ మాటలు విని ఓటును వృధా చేసుకోకూడదని ఇంటికి పెద్ద కొడుకు లాగా తెలంగాణ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో కే సీ ఆర్ నిలిపాడన్నరు. మన అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ ఎండి హఫీజ్ ఎండి హసన్ ఎండి. మోయిన్ ఎండి నయీమ్ ఎండి హాలీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం.

బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం.

-తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం బీసీలే.

-బీసీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రిజర్వేషన్.

-బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌. 

-జాతీయ బీసీ కమిషన్‌ వైస్‌ చైర్మన్.

మెదక్ యదార్థవాది ప్రతినిది

బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని జాతీయ బీసీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రజాపతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మాయ గార్డెన్ లో శుక్రవారం  బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో 60 శాతం పైగా  బీసీ జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రిజర్వేషన్ దక్కుతుందన్నారు. 70 ఏళ్ల  కాంగ్రెస్ పాలనలో బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్థత కల్పించలేదని,.. బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ బద్థతా కల్పించిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని దీనిపై బీసీ సమాజం ఆలోచించాలన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. బడుగులంతా ఏకమైతే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదని ఆయన స్పష్టం చేశారు. బీసీలు ఐక్యంగా తమ ఓటు హక్కుతో సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది రహస్య బ్యాలెట్‌ అని మీరు ప్రతి ఒక్కరూ మీ ఆత్మసాక్షిగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యధిక శాతానికి పైగా ఉన్న బడుగులంతా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని బీసీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు హర్యానా మేయర్ మధన్ చౌహాన్ బీసీ సంఘాల మహిళ రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయ నాగ పరిమిల వివిధ బీసీ కుల సంఘాల అధ్యక్ష  కార్యదర్శులు  బెండ వీణా మంజుల మాయ శంకర్ రమేష్ గౌడ్ బండ నరేందర్ గొల్ల పవన్ కుమార్ రవీందర్ చారి శ్రీనివాస్ చారి విప్లవ్ కుమార్ సుభాష్ గౌడ్ వినయ్ జైస్వాల్ జ్వాల సాయిబాబా ప్రసాద్ యాదవ్ నర్సింలు సోమ కృష్ణ నంగి పవన్ తోపాటు వేలాది బీసీలు  పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...