32.2 C
Hyderabad
Monday, April 20, 2026

తెలంగాణ పథకాల ప్లెక్సీతో వినుత ప్రచారం చేసిన వీరాభిమాని.

తెలంగాణ పథకాల ప్లెక్సీతో వినుత ప్రచారం చేసిన వీరాభిమాని.

కరీంనగర్ యదార్థవాది ప్రతినిది

కరీంనగర్ ను గొప్పగా అభివ్రుద్ది చేసిన గంగుల కమలాకర్ గెలవాలి, రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావాలని స్వచ్ఛందంగా ప్లెక్సీ దరించి మైక్ తో వినూత్న ప్రచారం చేస్తున్న సిద్దిపేట జిల్లా చేర్యాల వాస్తవ్యుడు మనోహర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పేదింట దేవుడులా వారి అవసరాల్ని అడక్కుండానే తీర్చడానికి కేసీఆర్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బీఆర్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తగా రంగంలోకి దిగి కరీంనగర్ నియోజకవర్గాన్ని మంత్రి గంగుల అభివ్రుద్ది చేస్తున్న తీరుతో నగరంలో విస్రుతంగా తిరుగుతూ బీఆర్ఎస్ చేసిన మంచిని గంగుల చేసిన అభివ్రుద్దినీ తనదైన శైలిలో వివరిస్తుననాని తెలిపారు. కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ ఇంటింటికి నీళ్లు రైతుబందు ఆరోగ్యశ్రీ కేసీఆర్ కిట్ వంటి సర్కార్ చేపట్టిన ప్రతీ సంక్షేమ కార్యక్రమం పేదలకు ఎలా ఉపయోగపడుతుందొ వివరిస్తుంటే ప్రజలు ఆసక్తిగా వింటున్నారని కరీంనగర్ కోసం కాళ్లు విరగొట్టుకున్నాడని పట్టిన పట్టు విడవడని నగరం కోసం తన సర్వస్వం దారపోస్తాడని అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడని గంగులని కొనియాడిన మనోహర్ పుట్టిన బిడ్డ నుండి  పండు ముసలి వరకూ సైతం గంగుల చేసిన మంచిని గుర్తిస్తారన్నారు తన బందువులంతా కరీంనగర్లో ఉన్నారని వారంతా గంగుల చేస్తున్న అభివ్రుద్ది గురించి చెప్పారని తను సైతం ప్రత్యక్షంగా చూసానని కరీంనగర్ బీముడని మంచిని పంచే గంగుల గెలవాలని తను విఘ్నేశ్వరున్ని ప్రార్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలియజేసాడు. తన స్వంత ఖర్చులతో కరీంనగర్ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నానని తన కుటంభ సభ్యులు సైతం గంగుల గెలుపులో పాలుపంచు కొమ్మని ఆశీర్వదించి పంపారని తెలిపారు. మనోహార్ లాంటి అభిమానిని సంపాదించుకున్న గంగుల కమలాకర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని ఇక్కడి ప్రజలు అనుకోవడం విశేషం.

ప్రభుత్వ ఉద్యోగులపట్ల బీఆర్ఎస్ పార్టీ సవతి తల్లి ప్రేమ

ప్రభుత్వ ఉద్యోగులపట్ల బీఆర్ఎస్ పార్టీ సవతి తల్లి ప్రేమ

-పీఆర్ సీ మొదలు డీఏ మంజూరు వరకు అన్నింటా ఆలస్యమే.

-కాంగ్రెస్ హయాంలోనే ఉద్యోగులకు న్యాయం.

-మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్.

మెదక్ యదార్థవాది ప్రతినిది

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల బీఆర్ ఎస్ సవతి తల్లి ప్రేమ చూపిందని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్  ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. ఉద్యోగులను తీవ్ర అన్యాయానికి గురి చేశారని మండిపడ్డారు. పీ ఆర్ సీ మంజూరులో కేసీఆర్ తీవ్ర వివక్ష ప్రదర్శించారన్నారు. మూడు సంవత్సరాలు ఆలస్యంగా పీఆర్ సీని మంజూరు చేశారని పేర్కొన్నారు. ఫలితంగా ఉద్యోగులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు భత్యం (డీఏ) మంజూరులోనూ తీవ్రమైన జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 9 శాతం డీఏ పెండింగ్ లో ఉందన్నారు. డీఏ మంజూరు చేయకుండా 5 శాతం మధ్యంతర భృతి కల్పిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగులతో సంప్రదింపులు లేకుండా మధ్యంతర భృతి ప్రకటించడం శోచనీయమన్నారు.

ఓటు హక్కు పై ఉద్యోగుల సదస్సు

ఓటు హక్కు పై ఉద్యోగుల సదస్సు

మెదక్ యదార్థవాది ప్రతినిది

వంద శాతం ఓటింగ్ లక్ష్యంలో భాగంగా కర్మ చారి కళ్యాణ్ మిషన్ పేరుతో శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ఆ సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు పై ఉద్యోగుల సంక్షేమ సదస్సు  నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా టీఎన్జీవోల కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరూ పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ పాల్గొన్నారు.

వినూత్న ప్రచారనికి శ్రీకారం చుట్టిన నాయి బ్రాహ్మణులు

వినూత్న ప్రచారనికి శ్రీకారం చుట్టిన నాయి బ్రాహ్మణులు

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది

సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్దతుగా వినూత్న ప్రచారం నిర్వహించారు. సెల్లో షాపులలో కటింగ్ షేవింగ్ చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి చింతా ప్రభాకర్ ను గెలిపియాలని షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించారు. శుక్రవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు లక్డారం మాణిక్ ప్రభు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్దతుగా రెండు, మూడు రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ బిసి ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మా మద్దతుగా గెలుపు కోసం ప్రచారం కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు లక్డారం మాణిక్ ప్రభు మాట్లాడుతూ మా నాయి బ్రాహ్మణులను మేలుకొలుపుతో ఉదయం షాప్ టు షాప్ తిరిగి, అలాగే సాయంత్రం మా కులస్తుల కుటుంబాలకు ఇంటిటికి తిరిగి అవగాహన కల్పిస్తూ బ్యాలెట్ లో రెండవ గుర్తు అయిన కారు గుర్తుపై ఓటు వేసి చింతా ప్రభాకర్ ను భారీ మెజారిటీతో గెలిపియాలని పిలుపునిచ్చారు. మా మద్దతు చింతా ప్రభాకర్ కు ఎల్లవేళలా ఉండాలని అసెంబ్లీలో మా గొంతుక వినిపించాలని, నాయి బ్రాహ్మణులను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఆయన మా తరుపున కొట్లాడి, మేలు చేయాలని దృఢసంకల్పం ఉన్నారని, మా నాయి బ్రాహ్మణులకు రాజకీయ పరంగా ఇప్పటి వరకు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు, సర్పంచ్లు ఇతర నామినేటెడ్ పోస్టులు రావాలంటే చింతా ప్రభాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయి బ్రాహ్మణులకు జిల్లా కేంద్రంలో కమిటీ హాల్ కు స్థలం కేటాయిస్తూ నిధులు రావాలంటే మా నాయిలందరినీ అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతున్నామని కారు గుర్తుకు ఓటు వేసి చింతా ప్రభాకర్ ను గెలిపించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిసి బంధు డబల్ బెడ్ రూమ్ గృహలక్ష్మి ఇళ్ల స్థలాలు అర్హులైన నాయులకు అందే విధంగా చింతా ప్రభాకర్ కృషి చేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కనీసం గుర్తించిన దాఖలలో లేవన్నారు. చింతా ప్రభాకర్ గెలిచిన తర్వాత మా వంతు సహకారంతో మా నాయి బ్రాహ్మణుల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ఆ నమ్మకంతో మేము చింతా ప్రభాకర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళ నాగభూషణం నాయి వీరన్న నాయి అంజన్న నాయి మురారి నాయి గోపాల్ నాయి చరణ్ నాయి సత్తయ్య నాయి శ్రీశైలం నాయి రాము నాయి చెర్యాల ఆంజనేయులు నాయి చీమలదరి శేఖర్ నాయి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో వంద శాతం పోలింగ్ జరగాలి.

జిల్లాలో వంద శాతం పోలింగ్ జరగాలి.

మెదక్ యదార్థవాది ప్రతినిది 

ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ జిల్లా అదనపు ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్  వేంకటేశ్వర్లు సాధారణ ఎన్నికలు 2023 నియమావళి అమలులో బాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో జిల్లా అదనపు ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు తన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పద్దతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేలుకు సిరా చుక్క చూపిస్తూ ప్రజలంతా తమ అమూల్యమైన ఓటు ను వినియోగించుకోవాలన్నారు. మెతుకు సీమ లో 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని నవంబర్ 30 న ఓటర్లు తమకు కేటయించిన పోలింగ్ కేంద్రాల్లో కి వెళ్లి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణ

సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణ

-బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు.

-హుస్నాబాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్.

-రాష్ట్ర హోం మంత్రి మెహముద్ అలీ.

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిది

హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మెహముద్ అలీ స్ధానిక ఎమ్మెల్యే  అభ్యర్థి సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ ను  హుస్నాబాద్ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ లు అందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేసిఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మైనార్టీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు మైనారిటీ గురుకుల పాఠశాలలు షాదీ ముబారక్ విదేశాలకు వెళ్లాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ పథకం మైనారిటీ రిజర్వేషన్లు ద్వారా మైనారిటీలు అభివృద్ధి చెందుతున్నారని కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ బిజెపి పార్టీలు మైనార్టీలకు చేసింది ఏమీ లేదని మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని మైనార్టీలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ రెండు పర్యాయాలు వేలకోట్లతో అభివృద్ధి చేశారు మూడోసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీకి కేసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిందని వారి తండ్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు సైనికుడిగా రాజకీయ నాయకునిగా మానవతావాదిగా ప్రజలకు సేవ చేశారని ఆయన ఆశలకు అనుగుణంగా వారసునిగా సతీష్ కుమార్ మచ్చలేని నాయకుడు ప్రజాసేవకు అంకితమైన వాడు ఆయనను హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. ముస్లింల షాదీ ఖానా కోసం రెండు కోట్లు కేటాయించానని నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలకు అవసరమైన నిధులు అందించానని సతీష్ కుమార్ తెలిపారు.

గ్రామంలో బీఆరెస్ రోడ్ షో

గ్రామంలో బీఆరెస్ రోడ్ షో

కుకునూర్ పల్లి  యదార్థవాది

గజ్వేల్ బీఆరెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా గురువారం లకుడారం గ్రామం లో  రాష్ట్ర ఎంపిటిసిల పోరం అద్యక్షులు దేవి రవీందర్ స్థానిక సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్యా  అద్వర్యం లో తొమ్మిది ఏళ్ళ నుండి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులగురించి వివరిస్తూ ఈ ఎన్నికల్లో భాగంగా బీఆరెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ని తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చెప్పే మోసపూరిత అమలుకు అనువుగాని మాటలు నమ్మొద్దని కేసీఆర్ కు ఓటు వేసి మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి లో ముందుకు పోతుందన్నారు.  కార్యక్రమంలో ప్రదీప్ యాదవ్ పత్తిరి రాము కంకణాల మల్లేశం రజక సంఘం మండల అధ్యక్షులు, రాచకొండ మైపాల్,మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ లో చేరికలు.

బీజేపీ లో చేరికలు.

కుకునూర్ పల్లి, కొండపాక యదార్థవాది 

గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక కుకునూరు పల్లి మండలాలలోని వివిధ గ్రామాల బీఅర్ఎస్ సర్పంచులు మాజీ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు బుధవారం గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అంకిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ బడేకోల్  లావణ్య, మాజీ సర్పంచ్ నర్సింలు మాట్లాడుతూ  2001 తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటివరకు కష్టపడి పని చేసిన కొంతమంది కార్యకర్తలకు నాయకులకు బిఆర్ఎస్ లో సరైన గుర్తింపు లేదు, కొంతమంది పార్టీలో పెత్తందారి పోకడలతో  డబ్బున్నోళ్ల మాటలే చెల్లుబాటు అవుతున్నాయని నిజమైన కింది స్థాయి కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు కొరవడిందని అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు అనుభవించి వార్డు మెంబర్ నుండి సర్పంచ్ దాకా ఎదిగి మొదటిసారి నేను,  రెండో పర్యాయం మా భార్య లావణ్య సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాం, గ్రామ పంచాయతీకి సంబంధించి ఖర్చులకు, గ్రామపంచాయతీ ట్రాక్టర్ డీజిల్ కావచ్చు గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలు కావచ్చు ఇతర మెయింటెనెన్స్ ఖర్చులకు గాను నెల నెల  అప్పులు చేసి నెట్టుకొస్తున్నామని 2018 జీవో ప్రకారం గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేయడం లేదని కేవలం సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన నిధులతోనే కాలం గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సర్పంచ్ గా పార్టీ కోసం కష్టపడితే ఇపుడు  కొంతమంది నాయకుల దగ్గర కనీస విలువ మర్యాదలు లేకుండా పోయాయని కేవలం ధనిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని నిజమైన ఉద్యమ కారులమైన మాకు అన్యాయమే మిగిలిందని ఈ అన్యాయాలను అరికట్టాలంటే బిజెపి ప్రభుత్వం రావాల్సి ఉందని బీసీ నాయకత్వం ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. బీఆరెస్ నుండి బీజేపీ లోకి నాతో మొదలైన ఈ చేరికలతో ఇంకా చాలామంది నాయకులు బిజెపిలో చేరడానికి సమాయత్తం అవుతున్నారని అన్నారు. అంకిరెడ్డి పల్లి గ్రామం నుండి బడే కోల్ రమేష్ తాళ్లపల్లి చంద్రయ్య చెన్న సత్తయ్య తాళ్లపల్లి యాదగిరి తాళ్లపల్లి ప్రవీణ్,  దొరకునాల మురళి చాకలి మహేష్ తో పాటు కుకునూరు పల్లి మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన పిట్ల మల్లేశం ఆధ్వర్యంలో 40 మంది యువకులు బీజేపీ పార్టీలో చేరారు.

అన్నదాతలకు దొంగల బెడద.!

అన్నదాతలకు దొంగల బెడద.!

-ఆరబెట్టిన వరి ధాన్యాన్ని దొంగలిస్తే. రైతుల బ్రతుకు ఏలా.

మెదక్ యదార్థవాది ప్రతినిది 

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలోని బైపాస్ రోడ్ లో వరి ధాన్యాన్ని పెట్టడంతో గుర్తు తెలియని వ్యక్తులు ధాన్యాన్ని ఎత్తుకెళ్లారని కన్నెం నర్సింలు మాట్లడుతూ రామంతపూర్ గ్రామంలో ఉన్నటువంటి నాలుగు ఎకరాల పొలంలో శ్రీరామ్ గోల్డ్ వరి ధాన్యాన్ని 50 క్వింటాళ్లవరకు పంట పండించగా ప్రతిసారి మాదిరిగానే మా గ్రామా సమీపంలో ఉన్నటువంటి రామంతాపూర్ బైపాస్ వద్ద రోడ్డు ప్రక్కన వరి ధాన్యాన్ని ఆరబెట్టి రోజు మాదిరిగానే బుధవారం రాత్రి వరి ధాన్యాన్ని ఒకచోట చేర్చి ఇంటికి వెళ్ళామని తెల్లవారు జామున చూస్తే  రాత్రి కుప్పగా చేసినటువంటి వరి ధాన్యం తక్కువగా ఉండడంతో చోరికి గురైనట్లు తెలిసిందన్నరు రాత్రి బవళ్లు కష్టపడి శ్రమించి పండించిన దొంగలు ఎత్తుకుపోతే మాకు రైతుల బతుకు ఏలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

గాలా ప్రీమియర్ గాంధీ టాక్స్

గాలా ప్రీమియర్ గాంధీ టాక్స్

గాంధీ టాక్స్’పై 54 స్పాట్‌లైట్ కరెన్సీ నోట్లపై గాంధీకి మరియు గాంధీకి ఆశయాలకు మధ్య ఉన్న ద్వంద్వత్వాన్ని బయటపెట్టింది: నటుడు విజయ్ సేతుపతి 

గోవా యదార్థవాది ప్రతినిది

ప్రముఖ నటులు విజయ్ సేతుపతి అదితి రావ్ హైదరీ అరవింద్ స్వామి సిద్దార్థ్‌లు పాల్గొన్న ‘గాంధీ టాక్స్’లో 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అఫ్ ఇండియా ప్రముఖంగా మారింది. జాదవ్ గోవాలో నిర్మాతలు షరీక్ పటేల్ రాజేష్ కేజ్రీవాల్‌తో కలిసి విజయ్ సేతుపతి మీడియాతో సంభాషించారు. గాంధీ టాక్స్’ IFFIలో ప్రదర్శించబడిన మొదటి నిశ్శబ్ద చిత్రం. ఇది క్లాసిక్ సైలెంట్ సినిమాల వ్యామోహాన్ని పునఃసృష్టి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రం కరెన్సీ నోట్లపై గాంధీకి మధ్య ఉన్న ద్వంద్వత్వాన్ని మరియు ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరుకునే గాంధీ ఆశయాలను బయటకు తెస్తుంది. విజయ్ అదితి అరవింద్ సిద్దార్థ్‌ల సమిష్టి నటీనటులు ముందుకు వెళ్లాలనే నమ్మకాన్ని ఇచ్చారు. “సౌండ్‌ట్రాక్‌కి ఏ ఆర్ రెహమాన్ ఉండటం చాలా గొప్ప విషయం” అని నిర్మాత అన్నారు. మొదట్లో కథానాయకుడు నోట్లపై గాంధీకి ప్రతిస్పందిస్తాడు కాని తరువాత అతను తన హృదయంలో గాంధీకి ప్రతిస్పందించడం ప్రారంభిస్తాడు (గాంధీ ఒప్పందాలు). ఇది సినిమా అన్వేషించే ద్వంద్వత్వం.” ఉండాలి. నటుడిగా విజయం గురించి మాట్లాడుతూ, “కళా రూపం మమ్మల్ని ఆశీర్వదిస్తుందని మరియు ప్రేక్షకులను మెప్పించాలని నేను ఆశిస్తున్నాను. ఏ సినిమా అయినా సక్సెస్, ఫెయిల్యూర్ అనే ప్రమాదం ఎప్పుడూ ఉంటుందన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...