29.7 C
Hyderabad
Sunday, April 19, 2026

బిజెపి నుండి బీఆర్ఎస్ లో చేరిన జిల్లా నాయకులు.

బిజెపి నుండి బీఆర్ఎస్ లో చేరిన జిల్లా నాయకులు.

సిద్దిపేట యదార్థవాది జిల్లా ప్రతినిది

సిద్దిపేట బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుదవారం శివనుభవణంలో జిల్లా అధికార ప్రతినిది కొండూరి మహేష్ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి వెంకట్ తదితరులు చేరారు సందర్భంగా హరీష్ మాట్లాడుతూ బీఆర్ ఎస్ పార్టీ అన్ని వర్గాల అభ్యున్నతి కి కృషి చేస్తుందని వైష్యులకు సమూచిత స్థానం కల్పించిన పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ అండదండలతో  సిద్దిపేట అభివృద్ధిలో ముందున్నామని నేడు కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తధ్యమని బిజెపి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో ఓట్లడుగుతుందని వస్తున్నాయని ఆపార్టీలకు ఈనెల 30న ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. టిఆర్ఎస్ లో చేరిన నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల అభ్యున్నతి కి కృషి చేస్తుందని వైష్యులకు సమూచిత స్థానం కల్పించిన పార్టీ ప్రభుత్వం  బీఅర్ఎస్ అని మంత్రి హరీష్ రావు  కృషి తో సిద్దిపేట అభివృద్ధి జరిగిందని హరీష్ రావు లాంటి నాయకులు సిద్దిపేట లో ఉండటం ప్రజల అదృష్టమని తెలిపారు. కొండూరి సతీష్ అజిజ్ రాజు కె అరవింద్ రమేష్ రాజేష్ సంతోష్ కాసన గొట్టు శ్రావణ్ కుమార్ సంతోష్ చెన్నోజు నరేందర్ సాయి ప్రదీప్ అజయ్ నందు గోపి తదితరులు పార్టీలో చేరారు.

మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణే: మంత్రి హరీష్

మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణే: మంత్రి హరీష్

సిద్దిపేట యదార్థవాది జిల్లా ప్రతినిది

సిద్దిపేట జిల్లా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుల ప్రాణాలు కాపాడాలని  ఉద్దేశంతో వ్యవసాయ బావుల దగ్గర మోటర్లకు మీటర్లు బిగించని ఏకైక ప్రభుత్వం బి ఆర్ఎస్ ప్రభుత్వం  సీఎం కేసీఆర్ అని  ఆయన అన్నారు బుధవారం సిద్దిపేటలోనీ శివనుభవ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్  మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెడుతామని బెదిరించిందని అయినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారని  వివరించారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మోటార్లకు మీటర్లు పెట్టనందుకు గత ఐదేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.25 వేల కోట్ల నష్టం చేసింది బీజేపీ అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలతో నిజమేదో అబద్ధమేదో తేలిపోయింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా మోటార్లకు మీటర్లు పెడుతున్నయని  నిర్మలా సీతారామన్‌ చెప్పారన్నారు  కేసీఆర్‌ రైతుల పక్షపాతి అన్నారు  కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని పొరపాటున కూడా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటు వేయవద్దని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు పడకపోవడం వాస్తవమని ఇది కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల జరిగిందని గత ప్రభుత్వాలు ఉద్యోగులను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసి గుర్రాలతో తొక్కించిన పరిస్థితులను ఉద్యోగులు గమనించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక రెండుసార్లు పి అర్ సి ఇచ్చింది 9 ఎండలో 133% జీతాలు పెంచినది ఎంప్లాయిస్ పెండ్లి ప్రభుత్వం కేసీఆర్ అని అన్నారు ఉపాధ్యాయ ఉద్యోగులు చిరుద్యోగులు  ప్రజలు రైతులు టిఆర్ఎస్ ప్రభుత్వంనీ దీవించాలన్నారు.

లారీ “డీ” విద్యార్థులకు గాయాలు.

లారీ “డీ” విద్యార్థులకు గాయాలు.

*ట్రాఫిక్ నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్.

విశాఖపట్టణం యదార్థవాది ప్రతినిది 

విశాఖనగరంలోని సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద పాఠశాల 7గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుకగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొంది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టదాంతో ఆటోలో ఉన్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందంటతో విద్యార్థులను సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొన్న లారీని సుమారు 100 మీటర్ల దూరంలో అపరు.  లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న స్థానిక ఆటో డ్రైవర్లు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇ ఎన్నికలలో పార్టీలకు తగిన గుణపాఠం చెపుతారు: పల్లెటూరి

ఇ ఎన్నికలలో పార్టీలకు తగిన గుణపాఠం చెపుతారు: పల్లెటూరి

– బర్రెలక్కపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. 

– స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోరం..

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల పక్షాన మాట్లాడి కొల్లాపూర్ నియోజక వర్గంలో ఒక షెడ్యూల్ కులానికి  చెందిన 25 సంవత్సరాల యువతీ రాజకీయాల్లో పోటీ చేస్తుంటే జీర్ణించుకోలేక  ఆధిపత్య దోపిడి కులాలు దాడులకు తెగబడుతున్నాయని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోరం కన్వీనర్ పల్లెటూరి ప్రసాద్ అన్నారు.ఈనెల 30న జరిగే పోలింగ్ లో పార్టీలకు తగిన గుణపాఠం చెపుతారని ఓటమి భయంతోనే కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్న చర్ల లో ప్రచారం చేస్తున్న సందర్భంలో అదే గ్రామానికి చెందిన రాజకీయ పార్టీల నేతలు ఎమ్మెల్యే అభ్యర్థి పై దాడి చేయడం హేమమైన చర్య అభ్యర్థితో పాటు ప్రచారంలో భాగమైన తన తమ్ముడు కుటుంబ సభ్యులపై దాడి చేయడం ఓటమి భయంతోనే దాడుల తెగబడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతుంది నిజంగానే పాలకుల చిత్తశుద్ధి ఉంటే కనుక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఉంటే  బర్రెలక్క ఎన్నికల బరిలో నిలిచేవరు కాదని అదే పాలకుల నిర్లక్ష్యాన్ని రాష్ట్రమంతా చూస్తూ వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా ఈరోజు మద్దతుగా నిలుస్తుంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం దాడులకు తెగబడడం వెనక ఉన్న కుట్రను తిప్పి కొట్టాల్సిన అవసరం  ఉన్నది దాడిని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఖండిస్తున్నాం. నిజంగానే బర్రెలక్కకు అవసరమైన రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘాన్ని పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా దారడులకు తెగబడుతూనే మరోపక్క ప్రపంచంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రమని చెప్పుకుంటున్న పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ కులాలకు చెందిన యువత  రాజకీయాల్లోకి వస్తే జీర్ణించుకోలేక ఆధిపత్య దోపిడీ కులాలు ఈ దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు. అవసరమైతే రేపు కొల్లాపూర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థులు వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పార్టీల సంగతేందో ప్రజలకు వివరిస్తామని అన్నారు.

డిజెయు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఏర్పాటు.

డిజెయు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఏర్పాటు.

విశాఖపట్నం యదార్థవాది ప్రతినిది

డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్ర రాష్ట్ర కమిటీ 9మంది సభ్యులుతో నూతన కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడుగా మరీదు ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శిగా హెచ్ సంజయ్ రెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఆర్ సూర్యనారాయణ ఉపాధ్యక్షులుగా కె.చంద్రరావు డి.అప్పారావు యువిరావులు కార్యదర్శిలుగా సుంకాలు నాగేశ్వరరావు బి.శ్రీరామమూర్తి పిళ్ళా సతీష్ బాబులు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సోమ మంగళవారం రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతుల అనంతరం నూతనంగా రాష్ట్ర కమిటీ ఎన్నిక జిల్లాల ప్రతినిధులు ప్రజాస్వామిక పద్థతిలో నాయకత్వం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారులుగా జాతీయ కో ఆర్డినేటర్ లు బిఎన్ చారి బి.మోహన్ రమేష్ కృష్ణం రాజు వ్యవహరించారు. రాబోయే రోజుల్లో యూనియన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విస్తృతమైన ప్రచారం చేసి కమిటీలు వేయాలని తీర్మానం చేశారు అర్హులేన వివిధ సంస్ధలలో పనిచేసే జర్నలిస్ట్ అందరికి అక్రెడిటేషన్ లు ఇళ్ల స్థలాలు వైద్యం పిల్లలకు ఉచిత విద్య వైద్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం నిరంతరం చేస్తుందని నూతన కమిటీ పేర్కొంది.

బర్రెలక్క పై దాడి ప్రజాస్వామ్యంపై దాడి: తుమ్మనపల్లి.

బర్రెలక్క పై దాడి ప్రజాస్వామ్యంపై దాడి: తుమ్మనపల్లి.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిది 

కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న స్వతంత్ర అభ్యర్థి అయిన బర్రెలక్క అలియాస్ శిరీష సారథ్యంలో సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ఉండగా తన సోదరుడిపై  విచక్షణా రహితంగా చేసిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి గానే పరిగణించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు ఏ పార్టీకి చెందిన వారైనా ఎంతటి వారైనా గాయ పరిచిన వారిని వెంటనే అదుపులోనికి తీసుకొని చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర  ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా పోలీసు అధికారులు స్పందించి వెంటనే   బర్రేలక్కకు రక్షణ సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకే కాకుండా బరిలో నిలిచిన అభ్యర్థులు అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ ప్రముఖులు రాజకీయాలకు  అతీతంగా జరిగిన దాడిని ఖండించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలను తుమ్మనపల్లి కోరారు.

ఉత్తేజపూరితంగా శిక్షణ తరగతులు. 

ఉత్తేజపూరితంగా శిక్షణ తరగతులు. 

విశాఖపట్నం యదార్థవాది ప్రతినిది

విశాఖపట్నం నగరంలోని విశాఖ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ హాలులో సోమవారం జర్నలిస్టుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. సుమారు 60మంది శిక్షణా తరగతులకు హాజరయ్యారు. తొలి రోజు మీడియా సవాళ్లు,జర్నలిస్టుల పాత్ర, మీడియాపై దాడులు, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రభావం డిజెయు లక్ష్యం తదితర అంశాలపై శిక్షణ తరగతులు సాగాయి తరగతులను సీనియర్ జర్నలిస్ట్ రమేష్ (కాకతీయ యూనివర్సిటీ) హిందూ మీలాప్ ఎడిటర్ ఎఫ్ ఎం సలీం, సీనియర్ జర్నలిస్ట్ మోహన్ సీనియర్ జర్నలిస్ట్ ఈఎన్ఎల్ఎ బాలభాను తదితరులు బోధించారు. తరగతులకు మరీదు ప్రసాదు బాబు అధ్యక్షత వహించారు. యూనియన్లో 250 మంది సభ్యులుగా చేరారు. 60 మంది శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రెండో రోజు శిక్షణ తరగతులు కూడా కొనసాగుతున్నాయి. శిక్షణ తరగతులను జాతీయ కోఆర్డినేటర్ బిఎన్ చారి పర్యవేక్షించారు. తొలుత శిక్షణా తరగతులకు రవికుమార్, సూర్యనారాయణ ఆహ్వానం పలికారు. సభహాల్, భోజనాలు ఏర్పాట్లును డిజెయు విశాఖపట్నం జిల్లా నాయకులు పర్యవేక్షించారు.

బీచ్ వద్ద ఇంత నిర్లక్ష్యమా.!

బీచ్ వద్ద ఇంత నిర్లక్ష్యమా.!

దుర్వాసన, ముర్కినిటి అరికట్టేవరెలేరా..

సాధారణ పౌరులు సేద తీరాలని బీచ్ కు వస్తే అధికారుల నిర్లక్షం..

విశాఖపట్టణం యదార్థవాది ప్రతినిది

ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసాని కానీ వస్టే..
రోగాలను కొని తెచ్చుకోడమే అవుతుంది.. ఇందుకు నిదర్శనం మన అర్ కే బీచ్ వద్ద కనిపిస్తోంది..
ఆదివారం ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ పైనల్ మ్యాచ్ చూడటానికి ఎల్ఇడి అర్ కే బీచ్ లో ఎర్పాటు చేయడంతో వేలాది మంది క్రికెట్ అభిమానులు, సందర్శికులు చిన్న పిల్లలతో వచ్చారు.
బీచ్ వద్ద మురికినీరు రావడం దుర్వాసనతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ అదికారులు పట్టించు కోవలని ఇక్కడికి వచ్చినా సందర్శికులు అంటున్నారు..

బీఆర్ఎస్ కు తెలంగాణ ఎంఆర్పిఎస్.

బీఆర్ఎస్ కు తెలంగాణ ఎంఆర్పిఎస్.

మంత్రి హరీశ్ రావును కలిసిన మద్దతు ప్రకటించిన ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్..

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు కేంద్రానికి పంపిన విషయం తెలిసినదే మంత్రి హరీష్ రావు.. 

సీఎం కేసీఆర్ ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రిని కలవడం జరిగింది. 

రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

కేంద్రం 9ఏళ్లు నానబెట్టి ఎన్నికల వేళ కొత్త కమిటీ అని చెబుతున్నది.

మనకు కావల్సింది కమిటీ కాదు బిల్లు పెట్టాలి. బిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా మద్దతు ఇస్తాం.

ఇన్నేళ్లు గుర్తు రాలేదు ఎన్నికలు ఉన్నాయని మాట్లాడటం మీ స్థాయికి తగదు.

ఇప్పటికైనా మాకు రాజకీయాల కంటే వర్గీకరణ ముఖ్యం. బిల్లు పెట్టాలి తక్షణమే వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. 

టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. వర్గీకరణ తప్పకుండా చేసి తీరుతాం. 

వర్గీకరణకు సంబంధించి సంపూర్ణ సహకారం మా టిఆర్ఎస్ పార్టీ అందిస్తుంది.

ఎంఆర్పిఎస్ తమ్ముళ్లకు నా పూర్తి సహకారం ఉంటుంది. నా గుండెల్లో పెట్టుకుంటా.

ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్, డప్పు శివ, రాజేందర్, సిద్దిపేట జిల్లా ఎంఆర్పిఎస్ టి ఎస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

హిందువులకు క్షమాపణ చెప్పాలి: దోనె అశోక్.

హిందువులకు క్షమాపణ చెప్పాలి: దోనె అశోక్.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది 

హిందు దేవాలయల భూములు అమ్మి..  ముస్లింలను ఆదుకుంటం అని కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడాన్ని రాష్ట హిందూ ధర్మ రక్షణ సేవా సమితి అధ్యక్షులు దోనె అశోక్ ఖండించారు. గురువారం సిద్దిపేట జిల్లా పట్టణ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రావడానకి పార్టిలు ముస్లిం కమ్యూనిటీలను ఆకట్టుకోవడానికి, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అన్నారు. ముస్లిం డిక్లరేషన్ కొరకు నిధులు ఎలా సేకరిస్తారని ఇటీవల ఓ న్యూస్ ఛానల్ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంలో బాగంగా హిందూ దేవాలయల భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలా అంటరాని, ముస్లిం లపైన మీకు ప్రేమ ఉంటే వారిని ఆదుకోండి కానీ హిందూ దేవాలయ భూములను వేలం వేయుటకు మీరు ఎవరని ఆయన ప్రశ్నించారు. మీ రాజకీయ లబ్ది కోసం హిందువులను చులకనగా చేస్తూ దేవాలయ భూములను వేలం  వేస్తాం అంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని, గతంలో కూడా హిందువుల పట్ల చులకనగా మాట్లాడిన రాజకీయ నాయకులకు పట్టిన గతే మీకు పడుతుందని ఇప్పటికైనా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి లేకుంటే రానున్న రోజులలో నీకు, మీ పార్టీకి హిందూ సమాజం తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో  న్యాయవాది శేషు కుమార్ బింగి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...