37.2 C
Hyderabad
Monday, April 20, 2026

ఉద్యమాలతోనే మహిళలకు రక్షణ.

ఉద్యమాలతోనే మహిళలకు రక్షణ.

కాశీబుగ్గ యదార్థవాది

దేశంలో కీలకంగా ప్రతి ఒక గంటకు 50 మంది హత్యలు,  అత్యాచారాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని మహిళా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం కాశీబుగ్గలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉత్తరాంధ్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు సంఘాల మహిళా సంఘాల నాయకురాళ్లు మాట్లాడారు. మహిళలపై హింస పెరగడానికి కారణం మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల సాహిత్యం, వెబ్సైట్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమన్నారు. స్త్రీలు ఇంట, బయట తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తంచేశారు. అనేకమంది అన్యాయానికి గురౌతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయని పలు సంఘటనలను వివరించారు. నేరస్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక నేరస్తులు చట్టాలని, న్యాయవ్యవస్థని, డబ్బుతో, అధికారంతో ప్రభావితం చేసి, హీరోయిజంగా తిరుగుతూ కవింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇట్లాంటి అనివార్య పరిస్థితులలో స్త్రీలు సమస్యలు పరిష్కరించుకోవాలంటే బలమైన మహిళా ఉద్యమాలను నిర్మించుకోవడమే మన ముందున్న పరిష్కారం అంటూ ఉత్తరాంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పి.నాగమణి మహిళా లోకానికి పిలుపునిచ్చారు. మహిళలను చైతన్యవంతుల్ని చేసి, సంఘటిత మహిళా ఉద్యమాలు నిర్మాణం కోసం కరపత్రం రూపంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పి.కుసుమ, జిల్లా కమిటీ సభ్యులు కె.హేమమ్మ, బి.జానకి, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకురాలు యు.జ్యోతి, ఎస్.సీతమ్మ తదితరులు పాల్గొని కరపత్రాలు ఆవిష్కరణ చేసి మహిళలను ఉద్దేశించి మాట్లాడిన వారిలో ఉన్నారు.

మా ఓటు బీఅర్ఎస్ కే.

మా ఓటు బీఅర్ఎస్ కే.

కొండపాక యదార్థవాది 

కొండపాక మండల పరిధిలోని బందారం అంకిరెడ్డిపల్లి దర్గా వెలికట్ట జప్తి నాచారం కొండపాక దుద్దెడ మర్పడగ దమ్మక్క పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారన్ని నిచించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఎవరెన్ని మాటలు చెప్పినా ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడనుందని, రాష్ట్రంలో ఉన్నన్ని అభివృద్ధి సంక్షేమాలు దేశంలో ఎక్కడ భూతద్దంలో పెట్టి చూసిన కనబడటం లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పతు మనకు అందుతున్నాయని,  ముచ్చటగా మూడవసారి బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య, భారత జాగృతి కార్యదర్శి అనంతుల ప్రశాంత్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆరేపల్లి మహదేవ్ గౌడ్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చిట్టి మాధురి మాజీ ఎంపీపీ అనంతుల పద్మ నరేందర్ హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య మాజీ ప్యాక్స్ చైర్మన్ మంచాల శ్రీనివాస్ సర్పంచ్ బడెకోలు లావణ్య నర్సింలు యాదవ్ రాసుల నరేందర్ యధమ్ రావ్, దోమల ఎల్లం, ఎగుర్ల వెంకటేశం నలమసు వెంకటేశం జిర్ర రాజు మంద శ్రీనివాస్ రెడ్డి సున్నం  భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి ఘనంగా పోచమ్మకు బోనాలు. 

పద్మశాలి ఘనంగా పోచమ్మకు బోనాలు. 

కొండపాక యదార్థవాది 

మండల పరిధిలోని దుద్దెడలో  గ్రామదేవతలైన ముత్యాల పోచమ్మ, దూసకుంట నల్ల పోచమ్మ లకు మార్కండేయ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బోనాలు సమర్పించారు. అంతకుముందు ఇరువురు అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా మోగ్గంపై చీరను నేశారు. ఈ శోభాయాత్ర పార్టీలకతీతంగా ఊరేగిస్తూ భక్తిశ్రద్ధలతో నేతన్నలు చీరను నేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ అమ్మవార్లకు ఓడి బియ్యం సమర్పించారు. కాగా గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి, బారాస నేత, రాష్ట్ర ఫారెస్ట్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి శోభాయాత్రలో పాల్గొని చీరను  అమ్మవారికి ముడుపు కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి గజ్వేల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ గ్రామ నాయకులు సర్పంచ్ ఆరెపల్లి మహదేవ్ గౌడ్ ఎంపీటీసీ గురజాడ బాలాజీ ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపి, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలి. 

బీజేపి, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలి. 

పాలకుర్తి యదార్థవాది ప్రతినిది

తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీని ఓడించాలని ఎంఎల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) పిలుపునిస్తుంది ఈ మేరకు శనివారం ఆ పార్టీ ఒక ప్రత్రిక ప్రకటన విడుదల చేసింది. స్థానిక నియోజకవర్గ అభ్యర్థిగా ఎంఎల్ పిఐ (రెడ్ ఫ్లాగ్) బుజందర్ మాన్యుపుని పోటీలో నిలబెట్టిందని ఆ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విన్నవించింది. పాలకుర్తి నియోజకవర్గానికి ఎంతో పోరాట చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కలిగియున్నదని గుర్తు చేశారు. పోరాటాల గడ్డైపై అమరుల బాటలో పయనించే రెడ్ ఫ్లాగ్ అభ్యర్థి బుజెందర్ మాన్యపుని గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ, సిపిఎం, ఎంసిపిఐ(యు), ఎంఎల్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిలిచారని వారిని కూడా గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు తెలిపాయి. రెడ్ ఫ్లాగ్ నినాదం కమ్యూనిస్టులు ఐక్యత, కమ్యూనిస్టులే నిజమైన ప్రత్యామ్నాయం అనే నినాదంతో ఆలోచనతో ఆచరణతో ముందుకెళ్తున్న పార్టీ అని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం కలబడి పనిచేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీలేనని, కమ్యూనిస్టు నాయకులేనని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. భూమి కోసం భుక్తి కోసం దోపిడీ విముక్తి కోసం పనిచేసేది కమ్యూనిస్టు పార్టీలేనని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఇతర పార్టీలన్నీ ఎన్నికల సమయంలో వారంతా ప్రజా సేవకులేనని మాటల గారడీ ఒకరిని ఒకరు అసభ్య పదజాలంతో దూషణలేనని ఎన్నికల అనంతరం వారంతా ఒకటేనని ప్రజలు గుర్తించాలని కోరారు. ఎర్రజెండా పార్టీ గెలిచినా ఓడిన ప్రజాసమస్యలపై పోరాటాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మతం కులం ప్రాంతీయం ఉన్మాదాల్ని పెచ్చరిల్లేలాగా పాలించే బిజెపిని ఓడించాలని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణాన్ని భగ్నం చేసి, దొర్ల పాలన కుటుంబం పాలన కొనసాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీని కూడా ఓడించాలని ప్రజలకు రెడ్ ఫ్లాగ్ విజ్ఞప్తి చేస్తుంది.

జర్నలిస్టుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా.

జర్నలిస్టుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా.

ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ.

విజయవాడ యదార్థవాది ప్రతినిది

మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే ఏకైక  ముఖ్యమంత్రి సీఎం జగన్ అని, జర్నలిస్టులకు కూడా ఇళ్ళ స్థలాలు కేటాయించడం గొప్ప నిర్ణయం తీసుకుందని, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు సినీ నటుడు అలీ స్పష్టం అన్నారు. శనివారం విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు అధ్వర్యంలో  సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా అలీ ని కలిశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు విషయంలో అయన కృషిని ప్రశంసిస్తూ  ఘనంగా సన్మానించి సంఘం మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా అలీ తో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు సొంత ఇల్లు అనేది చిరకాలవాంఛగా మిగిలిపోయిందని జర్నలిస్టులకు 3 సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం వెనువెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామం. ఇది నిజంగా జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి తొలిమెట్టు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగు నింపారు. సగటు జర్నలిస్టుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుమారు 20ఏళ్ళుగా జర్నలిజంలో ఉంటూ నేటికి సెంటు ఇంటిస్థలం దక్కించుకోలేని జర్నలిస్టు లు ఎంతోమంది ఉన్నారు. కరోనా కాలంలో పత్రికలు ఛానల్స్ ని  వీడిపోయి బ్రతికి ఉంటే చాలనుకుని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన జర్నలిస్టులు నేడు ప్రభుత్వం ఇస్తానని చెబుతున్న ఇళ్ళ స్థలాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు వీరి ఆశలపై ప్రభుత్వం నీళ్ళు చల్లే ప్రయత్నం కాకుండా మరోసారి నిబంధనలపై పునరాలోచన చేయాలనికోరారు. ప్రభుత్వం పెట్టిన 5ఏళ్ళ అక్రిడేషన్ నిబంధన ను స్వాగతిస్తునప్పటికీ అన్ని అర్హతలు ఉండి వివిధ కారణాలతో ప్రస్తుతం అక్రిడేషన్ పొందలేనివారిని గత అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వారికి న్యాయం చేయాలన్నారు. వంశపారంపర్యంగా వచ్చే కుటుంబ ఆస్తిని జర్నలిస్టులకు ముడిపెట్టడం సరికాదని,  గతంలో ప్రభుత్వం నుండి పొందిఉంటే వారిని మినహాయించి మిగతా అందరికీ మూడు సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వాలని కోరారు. జగనన్న కాలనీలో ఒకవేళ తీసుకుని ఉంటే వారికి నచ్చినది ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని, లేదంటే సగం మంది కూడా అర్హులు ఉండరని వివరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చెవుల శ్రీనివాస రావు అవినాష్ బోడపాటి సుబ్బారావు పిల్లి యజ్ఞ నారాయణ, కాలేషావలి సాంబశివరావు విజయ్ తానంకి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఐక్యత కోసం డిజెయు కృషి

జర్నలిస్టుల ఐక్యత కోసం డిజెయు కృషి

విజయవాడ యదార్థవాది ప్రతినిది

వృత్తిపరంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఐక్య పోరాటాలు అవసరమని డిజెయు జాతీయ కోఆర్డినేటర్ బి ఎన్ చారి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని స్వాతంత్రం సమరయోధుల భవనంలో జర్నలిస్టు మిత్రులతో డిజెయు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిఎన్ చారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు అపరిషృతంగా ఉన్నాయని, ఐక్యత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని యూనియన్లు సమస్యల పరిష్కారం కోసం చేయవలసిన స్థాయిలో ఉద్యమాలు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంఖ్య పెరిగిందని, యూనియన్ల ఆవశ్యకత మరింత పెరిగిందని, సమస్యలు అధికంగా  ఉన్నాయని, అందువలన దేశవ్యాప్తంగా బలమైన యూనియన్ అవసరమని తెలిపారు. జాతీయ నాయకులు కృష్ణం రాజు మాట్లాడుతూ దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక,, ఒరిస్సా రాష్ట్రలలో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. డిజెయు రాష్ట్ర కోఆర్డినేటర్ లు మరీదు ప్రసాద్ బాబు మాట్లాడుతూ యూనియన్ల ఆవశ్యకత ఎప్పటికీ అవసరమేనని, సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలిక పోరాటం అవసరమని వివరించారు. ఐక్యత, సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం, జర్నలిస్టుల వ్యక్తిత్వ వికాసం కోసం, జీవనం కోసం యూనియన్ గా పోరాటం అవసరమని వివరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణాజిల్లా నాయకులు సత్యనారాయణ బాలకృష్ణ శ్రీహరి చలపతి వీరులు కృష్ణా కె.శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు కూడా పాల్గొని సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం అవసరమని తెలిపారు. అధిక సంఖ్యలో జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నిధుల అవకతవకలపై లోకాయుక్త సీరియస్

నిధుల అవకతవకలపై లోకాయుక్త సీరియస్

*సర్పంచ్ ఉప సర్పంచ్ లకు నోటీసులు

*కిష్టంపేట గ్రామ కార్యదర్శి నుండి  87,504 రికవరీ

* 42,17,121 నిధుల అవకతవకలపై లోకాయుక్త కు సీసీఆర్ ఫిర్యాదు

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా కోమరవేల్లి మండలం కిష్టంపేట గ్రామ పంచాయితీ లో నిధుల గోలమాల్ పై లోకాయుక్త  సీరియస్ అయ్యిందని సీసీఆర్ సంస్థ జిల్లా బాద్యులు గుండ్ల శివ చంద్రం, స్టేట్ మీడియా కో ఆర్డినటర్ సాజిద్ తెలిపారు మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినా విలేకరుల సమావేశంలో వారు. వివరాలు తెలిపారు. కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ సంస్థ సభ్యులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గత సంవత్సరం ఆర్ టి ఐ చట్టం ద్వారా గ్రామ పంచాయితీ రికార్డుల తనిఖీలు నిర్వహించామని, నిధుల అవకతవకలపై జిల్లా పంచాయితీ అధికారి, లోకాయుక్త కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయం పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని జిల్లా పంచాయితీ అధికారికి కి లోకాయుక్త నోటీసులు జారి చేయడంతో ఎంక్విరీ ప్రారంభించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ సెక్రటరీ వద్ద ఉన్న 87,504 రూపాయలను రికవరీ చెసినట్టు జిల్లా అధికారి లోకాయుక్త కు తెలిపారు. అలాగే 46,17,121 రూపాయల నిధుల వినియోగం పై గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు రెండు సార్లు నోటీసులు జారీ చేసినట్టు జిల్లా అధికారి లోకాయుక్త కు తెలిపారన్నారు. వారు స్పందించని యెడల వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు రాజు. ఇలియసుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి,రాజయ్య ,ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ అసెంబ్లీ.!

ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ అసెంబ్లీ.!

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది 

ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఖరారు చేస్తుందో అని నాయకుల కార్యకర్తల లో నెలకొన్న ఉత్కంఠ నేటితో వీడిపోయింది.. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంజులా రెడ్డి నలుగురు హుస్నాబాద్ నియోజకవర్గం తరఫున బిజెపి అభ్యర్థిత్వం కోసం పోటీ పడగా బీసీ నినాదంతో ముందుకు దూసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు బిసి అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి పచ్చ జెండా ఊపి హుస్నాబాద్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిపింది.. మిగతావారు ఎవరెవరు ఏ నిర్ణయం తీసుకొనున్నారు.. త్వరలో తెలుస్తుంది అధిష్టాన నిర్ణయం గౌరవించి పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ భవిష్యత్తుకు కృషి చేస్తారా లేక పార్టీ వీడుతారా అనే సందేహం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది దేశం కోసం ధర్మం కోసం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి హుస్నాబాద్ నియోజకవర్గం లో కృషి చేస్తే బాగుంటుందని లేనిచో బిజెపి ఓట్లు చిలే అవకాశం ఉందని పలువురు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు..

కేంద్ర నిధులతో అభివృద్ధి జరిగింది: రాణి రుద్రమ దేవి.

కేంద్ర నిధులతో అభివృద్ధి జరిగింది: రాణి రుద్రమ దేవి

-సిరిసిల్ల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా..

-ధరణితో రైతుల భూములు గుంజుకున్న కేసీఅర్ ప్రభుత్వం..

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

రాష్టం అభివృద్ధి పనులకు నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని రాణి రుద్రమదేవి అన్నారు.. సోమవారం సిరిసిల్ల పట్టణంలోనీ బివైనగర్ లో ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ దేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు, సిసి రోడ్ల నిర్మాణం, వీధిలైట్లు, రేషన్ బియ్యం, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం వీటన్నిటికీ నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు జరిగిన మోదీ ఇచ్చే నిధులవల్లే జరుగుతుందని, 40సంత్సరాల కింద ఇచ్చిన ఇళ్ల స్థలాలకు  కనీసం రిజిస్ట్రేషన్ చేయలేని  అసమర్ధ మంత్రి కేటిఆరేనని అన్నారు..తెలంగాణ లో తెరాస ప్రభుత్వం రాగానే ధరణి అని పెట్టి రైతులకు అన్యాయం చేశారని, అసైండ్ భూములు, పేద లకు ఇచ్చిన భూములు పేదల వద్ద భూములు కూడా లాక్కునెందుకు ఈ ధరణి పెట్టినరాని తెలిపారు. బీజేపీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇళ్ల స్థలాలకు, రిజిస్ట్రేషన్ ఇప్పించే బాధ్యత  నేను తీసుకుంటాని ఆమె అన్నారు. కార్యక్రమం లో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, కౌన్సిలర్ లు బోల్గం నాగరాజు, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కైలాష్, శ్రీనివాస్, ఎనగంటి నరేష్, కొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ తోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి సాధ్యం: మాజీ ఎంపి పొన్నం

కాంగ్రెస్ తోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి సాధ్యం: మాజీ ఎంపి పొన్నం

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ నియోజకవర్గంలో 

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం గోడిశాలలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో కరీంనగర్ ఎంపీగా  ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే..గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే ఇందిరమ్మ ఇల్లు కట్టించి, రోడ్లు వేయించిన ఘనత కాంగ్రెస్ మత్రమే.. పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఏనాడు కూడా అసెంబ్లీలో హుస్నాబాదు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడిన పాపాన పోలేదని, నాకు పదవి ఉంటే సరిపోతుంది లే అనే చందంగా వ్యవహరిస్తున్నాడని ఆయన తెలిపారు. నేడు కల్లబొల్లి మాటలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన చేసిన అభివృద్ధి ఏంటో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నాటి అభివృద్ధి తప్ప.. నేటి అభివృద్ధి కనబడటం లేదని అన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...