24.7 C
Hyderabad
Sunday, April 19, 2026

నర్సాపూర్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: మాజీ జెడ్పీ చైర్మన్

నర్సాపూర్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: మాజీ జెడ్పీ చైర్మన్

నర్సాపూర్ యదార్థవాది ప్రతినిది 

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి, మంగల్ పర్తి గ్రామాలలో నర్సాపూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి మురళి యాదవ్ ను గెలిపించాలని శనివారం ఆయన సతీమణి మాజీ జెడ్పీ చైర్మన్ రాజమణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకున్ని సీఎం చేసేందుకు భారతీయ జనతా పార్టీ అత్యధికంగా బీసీలను పార్టీ టికెట్ ఇచ్చిందని అందులో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ  బీసీ అభ్యర్థిగా మురళి యాదవ్ కు అవకాశం ఇచ్చిదని, నర్సాపూర్ లో బీజేపీ జెండా ఎగరడం తద్యమని మొట్ట మొదటి సారిగా బీసీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలన అంతం చేసేది బిజెపి మాత్రమేనని రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ఆమె అన్నారు. కార్యక్రమంలోజిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎర్ర గొల్ల రాజమణి. జిల్లా ఉపాధ్యక్షుడు ఏ శ్రీనివాస్ గౌడ్ మండల అధ్యక్షుడు నర్సింలు మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ ఉపాధ్యక్షులు గోనేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారంలో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.

ఇంటింటి ప్రచారంలో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.

నర్సాపూర్ యదార్థవాది ప్రతినిది

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తరుపున కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కెసిఆర్  తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు  మోసం చేసిందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ లో చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపివ్వాలని తెలిపారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి సుధాకర్ గౌడ్ జలాల్ పూర్ ఎంపిటిసి భాస్కర్ సీనియర్ నాయకుడు పోతిరెడ్డి గణేష్ శేఖర్ రవితేజ వెంకటరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

మనకొండూరు యదార్ధవాది ప్రతినిది 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్లేపల్లి, పెరకబండ, బెజ్జంకి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు  శాసన సభ్యులు  రసమయి బాలకిషన్  సమక్షంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ లోకి చేరిన వారికి ఘన స్వాగతం పలికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం  సభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపు మళ్లిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సబ్బండ వర్గాలకు అందుతున్న సంక్షేమ ఫలాలను స్వాగతిస్తూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొంటున్నారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై సి.బి.ఐ చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై సి.బి.ఐ చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.

*నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ విడుదల చేసిన నివేదిక దృష్ట్యా బ్యారేజీల భద్రత, మరమ్మత్తులను కేంద్ర జల సంఘం చేపట్టాలని విజ్ఞప్తి.

*ఇకనైనా ప్రాజెక్టు నిర్మాణ డి.పి.ఆర్ ను ప్రజల ముందు ఉంచాలి.

*భూనిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించక పోవడం అసమర్థ పాలనకు నిదర్శనం.

*రీడిజైన్ పేరిట లక్ష కోట్లకు పైగా పెంచిన కాళేశ్వరం నిర్మాణ వ్యయంపై, ప్రజాధనం దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్.

*లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిది

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, అక్రమాలు తేటతెల్లం అయ్యాయని దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ సి.బి.ఐ చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీకి బుంగ పడడం, సుందిల్ల పటిష్టత, గతంలో మిడ్ మానేరు కొట్టుకు పోవడం, మల్లన్న సాగర్ కు భూకంపాల ముప్పు వున్నది అన్న నిపుణుల సూచనలను దాచి పెట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన డి.పి.ఆర్ ఈ రోజు వరకు కూడా ప్రజల ముందు ఉంచక పోవడం నేర సమానమని ఆయన అన్నారు. భూములని, ఆస్తులను, నివాసాలను, జీవనాధారాన్ని సర్వం కోల్పోయిన భూనిర్వాసితులకు ఈ రోజు వరకు కూడా చెల్లించాల్సిన పరిహారం చెల్లించక పోవడం తెరాస ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని తుమ్మనపల్లి దుయ్యపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు జరిగిన అవినీతి, అక్రమాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విడుదల చేసిన నివేదిక దృష్ట్యా మూడు బ్యారేజీల భద్రత, మరమ్మత్తులను కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కేవలం 18 వేల కోట్ల రూపాయలని చెప్పిన సంస్థను కాదని అప్పటి ప్రభుత్వం 40 వేల కోట్లకు ఖరారు చేయగా తెరాస ప్రభుత్వం రీడిజైన్ పేరిట 88 వేల కోట్లకు పెంచి తద్వారా ఒక అదనపు టి.ఎం.సి.ని తరలించడానికి సమాంతరంగా మరో కాలువను 22 వేల కోట్లతో ఎలాంటి సమగ్ర ప్రాజెక్టు డి.పి.ఆర్ ప్రజల ముందు పెట్టకుండానే లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం అసమర్థ పాలనకు, ప్రజాధనం దుర్వినియోగానికి నిదర్శనం అని దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంమే.

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంమే.

-కాలేశ్వరం ప్రాజెక్టులో దొరికిపోయిన దొర ప్రభుత్వం..

-మళ్ళీ దళిత బందు పేరుతో నాటకాలు..

-ఎమ్మెల్యే అభ్యర్థి పూజల హరికృష్ణ..

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో దాదాపు 100 మందికి పైగా దళితులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జక్కాపూర్ గ్రామంలో ఆనాడు కాంగ్రెస్ హయాంలో 7ఎకరాలు భూమి పట్టాలతో సహా ఇండ్ల స్థలాలకు కేటాయించి, అదే విధానం ఆ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయించి ఇచ్చిందని, ఎంతో మంది భూమి లేని నిరుపేదలైన ఎస్సై, ఎస్టీ, బీసీలకు వ్యవయం భూమిని పట్టాలతో అందించిందని గ్రామంలో ఏ మూలన చూసిన ఇందిరమ్మ గృహాలే కనిపిస్తున్నాయ్, దొరల ప్రభుత్వం వచ్చాక ఇండ్లు లేవు, భూమి లేదు, పట్టాలు లేవు కనీసం దళితులను పట్టించుకున్న పాపాన లేదని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలా సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. అదే విదంగా దళిత కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బొమ్మల యాదగిరి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ఎస్సి సబ్ ప్లాన్ తీసుకువచ్చి దళితుల్లో వెలుగులు నింపితే ఈనాడు దాన్ని కొల్లగొట్టి, దళిత బందు అని డ్రామాలు ఆడుతూ అందరి మధ్య చిచ్చు పెట్టి విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దొరల మాటలు విని దళితుకు, బిసిలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి దూరం కావద్దు అని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బర్మ రామచంద్రము, అర్బన్ అధ్యక్షులు భిక్షపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతల రాజ్ వీర్, మండల నాయకులు అశోక్, సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, తీగల భాస్కర్, నర్సయ్య, సారుగు హరికృష్ణ, చిన్న బాలయ్య, సారుగు కనకయ్య, జక్కుల కనకయ్య, బొడ్డు బల్ రాజు, మల్లికార్జున్, శరబందు, చంద్రం, రాములు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మానుకోవాలి.

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మానుకోవాలి.

-పొన్నంను కరీంనగర్ ప్రజలు ఇప్పటికే రెండు సార్లు ఓడించారు..

-హుస్నాబాద్ ప్రజలు కూడ ముచ్చటగా మూడోసారి పొన్నం ప్రభాకర్ తిరస్కరిస్తారు..

-దండుగుల రాజ్యలక్ష్మి..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

ఎన్నికలలో రాజకీయాలే తప్ప వ్యక్తిగత దూషణలు ఉండకూడదని నేషనల్ లేబర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం బిఅర్ఎస్ నాయకులతో కలసి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం లో ఫెడరేషన్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజాక్షేత్రం లో మీరు చేసే పనులు చెప్పుకొని ఓట్లు అడగాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమని అన్నారు. ప్రజలకు మేలు చేస్తే కరీంనగర్లో రెండుసార్లు ఎందుకు ఓడిపోయారు. ఇప్పుడు నియోజకవర్గ మారినంత మాత్రాన ప్రజలు మీకు పట్టం కడతారని అనుకోవడం అవివేకమే అవుతుందని అన్నారు. కరీంనగర్ లో ఏం అభివృద్ధి చేసినవని హుస్నాబాద్ కు వచ్చినవ్ అని ప్రశ్నించారు ఓటర్ కార్డు మార్చినంత మాత్రాన ఓటర్ మనస్సును మార్చలేవు డిల్లీ ప్రజలకు గులాం చెయ్యడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు మళ్లీ ముఖ్యమంత్రిగా కేసిఆర్ అవుతారని హుస్నాబాద్ లో మూడవసారి బిఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ గెలవడం తధ్యమని అన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి మానస, మండల అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్శరాము, చౌటపల్లి సర్పంచ్ గద్దాల రమేష్, రజిత, మాలపల్లి సర్పంచ్ బత్తుల మల్లయ్య, మాజీ మార్కెట్ ఛైర్మెన్ లింగాల సాయాన్న,మాజీ జడ్పీటిసి బిల్ నాయక్ ,మార్కెట్ డైరెక్టర్ శ్రీకాంత్ ,ప్రభాకర్ రెడ్డి, రామచంద్రం, వెంకట స్వామి, నాయకులు జనార్ధన్, ప్రేమ్ కుమార్, రవి తదతరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల చిరకాలవాంఛ నెరవేర్చిన: జగన్ మోహన్ రెడ్డి 

జర్నలిస్టుల చిరకాలవాంఛ నెరవేర్చిన: జగన్ మోహన్ రెడ్డి 

3 సెంట్లు ఇళ్ళ స్థలాలు’ కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం 

అమరావతి యదార్థవాది ప్రతినిది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మేడవరపు రంగనాయకులు మాట్లాడుతూ.. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో  ‘జర్నలిస్టులకు 3 సెంట్లు ఇళ్ళ స్థలాలు’ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆమోదించడం శుభపరిణామం అన్నారు. ఇది నిజంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగు నింపే విషయమని హర్షం వ్యక్తం చేశారు. స్వతహాగా జర్నలిస్టుల సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రిగా జర్నలిస్టుల శ్రేయస్సు కోరుతూ  తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సీఎం జగన్ కు, మంత్రులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

మానకొండూరు యదార్ధ వాది ప్రతినిది

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ శ్రీగిరి రంగారావు, గట్టుదుద్దెనపల్లి ఎంపీటీసీ ఆకుల నర్సింగ రావు, నల్లగొండ మాజీ సర్పంచ్ సురేందర్ రావు, పర్లపల్లి మాజీ సర్పంచ్ దొంత శ్రీనివాస్ ముస్కాన్ పేట గ్రామస్తులు దుదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముస్తఫా, పలువురు కార్యకర్తలు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గులాబీ మాయమైన ఆర్మూర్.

గులాబీ మాయమైన ఆర్మూర్.

-క్రిక్కిరిసిన సభాస్థలి. రోడ్లపైనే వేలాది మంది జనం..

-ఆర్మూర్ లో జనాన్ని చూసి కేసీఆర్ సంతోషం..

-ప్రజాఆశీర్వాద సభ విజయం తో గులాబీ శ్రేణుల్లో నయా జోష్..

ఆర్మూర్ యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జరిగిన ఆర్మూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పెద్ద ఎత్తున విజయవంతం అయింది. ఆర్మూర్ నియోజకవర్గాన్ని ముంచెత్తిన జన సంద్రాన్ని చూసి ఇది జనమా..గులాబీ వనమా అన్న భావన కలిగింది. మహిళలు, యువకులు, రైతులతో క్రిక్కిరిసిన సభాస్థలికి
చేరుకోలేక రోడ్లపైనే నిలిచిన వేలాది మంది ప్రజలు “జై కేసీఆర్, జై జీవనన్న,జై తెలంగాణ” అని నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు చాల ఇబ్బంది పడ్డారు. సభకు మహిళలు, యువకులు అధిక సంఖ్యలో రావడం విశేషం. సభకు సీఎం కేసీఆర్ నిర్ణీత సమయం కన్నా రెండు గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు సభాస్థలిలోనే ఉండి వేదికపైన ఉన్న పార్టీ నేతలతో కలిసి నృత్యాలు చేశారు. జై జీవనన్న నినాదాలతో సభాస్థలి మారు మోగింది. ముఖ్యమంత్రి సభా వేదిక పైకి రాగానే ప్రజలకు అభివాదం చేసి అనంతరం ప్రసంగిస్తూ
ఆర్మూర్ లో జనం, జనం ప్రభంజనం అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ జన సంద్రాన్ని చూసి జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని కేసీఆర్ అన్నారు. ఇదిలా వుండగా ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ తో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ప్రజా ఆశీర్వాద సభకు ఊహించినదాని కన్నా రెట్టింపు వచ్చి విజయవంతం చేసిన ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికలలో భాగంగా ముమ్మర తనిఖీలు చేస్తాం: సబ్ ఇన్స్పెక్టర్.

ఎన్నికలలో భాగంగా ముమ్మర తనిఖీలు చేస్తాం: సబ్ ఇన్స్పెక్టర్.

మానకొండూర్ యదార్థవాది ప్రతినిది

ఎన్నికల తనిఖీలలో బాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకీ క్రాస్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన వాహానాల తనిఖీలో కారులో రూ. 28 లక్షల 50 వేలు నగతుకు ఎలాంటి రసీదులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి. మానకొండూరు నియోజకవర్గం ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా పెద్ద మొత్తంలో అవసరమైన రూపాయలు తీసుకొని వెళ్లే క్రమంలో అట్టి రూపాయలకు సంబంధించిన పత్రాలు తమ దగ్గర ఉంచుకొని ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీలలో వాటి రసీదులు చూపెట్టలని, సరైన పత్రాలు ఉన్నచో ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ చూపించి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...