37.2 C
Hyderabad
Monday, April 20, 2026

ఇంటింటి ప్రచారం చేసిన సింగిల్ విండో చైర్మన్. పేర్యాల

ఇంటింటి ప్రచారం చేసిన సింగిల్ విండో చైర్మన్. పేర్యాల

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు కార్యకర్తలు ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో గ్రామ శాఖ అద్యక్షులు బండ వెంకటస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు కార్యకర్తలు కలిసి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని ఇదివరకు రెండుసార్లుగా ఎమ్మెల్యే గెలిచి చేసిన పలు అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పొన్నాల లక్ష్మణ్, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖదీర్, ఉప సర్పంచ్ యాద అశోక్, మాజీ ఎంపిటిసి తిప్పారపు నాగరాజు, మండల యువత అధ్యక్షులు జాలిగాం శంకర్, మంద రాజయ్య, లక్ష్మణ్ రావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శంకర్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ శాఖ యువత అధ్యక్షులు పెసరు సుధాకర్, చంద్రయ్య, రాజయ్య, బాల కొమరయ్య, యాదగిరి, సంజీవ్, నారాయణ, నర్సయ్య, రాజమౌళి, నరసయ్య, వేల్పుల రాజేశ్వరి, ఎనగందుల మంజుల, గజ్జల అమూర్తమ్మ, బందెల రాజమణి తదితరులు పాల్గొన్నారు

నాలుగు నియోజకవర్గాలలో యుగ తులిసి పార్టీ తరుపున పోటీ.

నాలుగు నియోజకవర్గాలలో యుగ తులిసి పార్టీ తరుపున పోటీ.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ జేఏసి, యుగతులసి పార్టీ ఆధ్వర్యంలో నాలుగు నియోజకవర్గాలలో
వందలాదిగా నామినేషన్లు వేయడానికి సిద్ధమైనట్లు తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమా రెడ్డి తెలిపారు.. సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్ కామారెడ్డిలో వందలాదిగా నామినేషన్లు వేయడానికి సిద్ధమైనట్లు తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమా రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేటలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేట, గజ్వేల్ సిరిసిల్ల, కామారెడ్డి రిటర్నింగ్ అధికారుల నుండి నామినేషన్ పత్రాలు తీసుకున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఅర్ నియోజకవర్గం గజ్వేల్ లో యుగ తులసి పార్టీ అభ్యర్థిగా రఘుమా రెడ్డి, సిద్దిపేట అభ్యర్థిగా కమలాకర్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే కాకుండా గోశాలకు స్థలం కేటాయిస్తామని చెప్పి మూగజీవాలను కూడా మోసం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కిందని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు యుగ తులసి పార్టీని ఆదరించాలని కోరారు. ఈ పత్రిక సమావేశంలో యుగ తులిసి పార్టీ నేత కమలాకర్ రెడ్డి, అమర వీరుల కుటుంబ సభ్యులు మమత, సునీత, పూలమ్మ, లింగమ్మ, సరిత, ఉద్యమకారులు
శంకర్ మోహన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలు రవాణా చేస్తే పీడీ యాక్టు నమోదు చేస్తాం: జిల్లా ఎస్పీ అఖిల్..

మత్తు పదార్థాలు రవాణా చేస్తే పీడీ యాక్టు నమోదు చేస్తాం: జిల్లా ఎస్పీ అఖిల్..

జిల్లా మత్తు పదార్థాలు కమిటీ ఆధ్వర్యంలో 32 కేజీల గంజాయిని ఖననం చేసిన పోలీసులు.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో పాల్గొన్న జిల్లా మత్తు పదార్థాలు కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సభ్యులు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య,కమిటీ సభ్యులు గురువారం సిరిసిల్లలోని రగుడు వద్ద గలా డంప్ యాడ్ లో జిల్లా లోని పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 41 కేసులలో స్వాదీనపరచుకున్న 32 కిలోల 754 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతిలో ఖనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహాజన్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని, జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం ఖననం జరుగుతుందని తెలిపారు. గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీ వెంట అదనపు చంద్రయ్య, డీఎస్పీ ఉదయ్ రెడ్డి, ఆర్.ఐ యాదగిరి, టౌన్ సి.ఐ ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

రేపటి నుండే నామినేషన్ లు స్వీకరణ.

రేపటి నుండే నామినేషన్ లు స్వీకరణ.

-నవంబర్ 3 నుండి నవంబర్ 10 వరకు నామినేషన్ లు స్వీకరణ..

-ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ల స్వీకరణ..

నామినేషన్ ప్రక్రియపై మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి మధుమోహన్..

పెద్దపల్లి యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30న జరగనున్న ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ మొదలై
నవంబర్ 10 వరకు నామినేషన్ లు స్వీకరించనున్నట్లు పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి మధుమోహన్ తెలిపారు..
పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో గురువారం నామినేషన్ల స్వీకరణపై పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9న విడుదల చేసిందని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టు దిట్టంగా అమలు చేస్తున్నామని, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సు, వీడియో సర్వేలెన్స్ , వీడియో వీవింగ్ బృందాలు అకౌంటింగ్ బృందాలను ఏర్పాటు చేశామని, అక్టోబర్ 31 వరకు నూతన ఓటరు దరఖాస్తుకు అవకాశం కల్పించామని, పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న ఎన్నికల నోటఫికేషన్ విడుదల అవుతుందని, నామినేషన్ పత్రాలను నవంబర్ 3 నుంచి 10 వరకు పని దినాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో స్వీకరిస్తామని, నవంబర్ 13న నామినేషన్ల స్క్రూటిని ఉంటుందని, నవంబర్ 15 వరకు నామినేషన్ పత్రాలు ఉపసంహరణ గడువు ఉంటుందని, నవంబర్ 15న సాయంత్రం స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించి పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో నామినేషన్ ఫారం నిర్ణిత నమూనా 2బి లో ఉండాలని, గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు వారి అభ్యర్థిత్వాన్ని ఒకరు బలపరచాలని, గుర్తింపు పొందని పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు అయితే పది మంది అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, పెద్దపల్లి నియోజకవర్గం ఓటర్లు మాత్రమే అభ్యర్థులను బలపరచాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థి పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన వారు కానప్పుడు, నామినేషన్ వేసే సమయంలో పేరు నమోదై ఉన్న నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఎలక్టోరల్ సర్టిఫైడ్ ప్రతిని సమర్పించాలని, స్పష్టంగా గుర్తించగలిగే రెండు ఫోటోలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ఫ్రీ గుర్తుల నుంచి 3 గుర్తులను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా ఫారం A , ఫారం B లను తప్పనిసరిగా సమర్పించాలని, నామినేషన్ తో పాటు విధిగా చెల్లించాల్సిన ధరావత్ ఎస్సీ, ఎస్టీ లు 5 వేల రూపాయలు, ఇతరులు పదివేల రూపాయలు చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రమాణం చేయాలని, నామినేషన్ పత్రాన్ని ప్రతిపాదకులచే సమర్పిస్తే స్క్రూటీని కంటే ముందు ప్రమాణం చేసినట్లు ధృవీకరణ పత్రం పొందాలని తెలిపారు. ఎన్నికల జమ ఖర్చుల నమోదు నిమిత్తం నామినేషన్ వేసే రోజు కన్నా ఒకరోజు ముందు విధిగా బ్యాంక్ ఖాతా ప్రారంభించాలని, అట్టి పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్ర సమర్పణ సమయంలో అందించాలని, అఫిడవిట్ లో ఖాళీలన్నింటినీ విధిగా పూరించాలని, 10 రూపాయల స్టాంపు పై నోటరీ చేయించాలని, ప్రతి పేజీపై నోటరీ ముద్ర సంతకం ఉండాలని, ప్రతి పేజీపై సంతకం చేయాలని , అసంపూర్తి ప్రమాణ పత్రం, నామినేషన్ తిరస్కరణకు కారణం కావచ్చని తెలిపారు. అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చని, 2 కంటే ఎక్కువ నియోజకవర్గాలలో నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడానికి వీలులేదని, నామినేషన్ వేయదల్చిన వారు, వారి అనుచరులు మూడు వాహనాలకు మించి వాడకూడదని, రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ఆపి, నామినేషన్ సమర్పించడానికి రిటర్నింగ్ అధికారి చాంబర్లో ప్రవేశించాలని అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్లో అనుమతి ఉంటుందని తెలిపారు. నామినేషన్ ఫారంతో పాటు భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మిగతా పత్రాలు విధిగా సమర్పించాలని, పత్రాలు సమర్పించలేని స్థితిలో ఉంటే వాటిని సమర్పించడానికి రిటర్నింగ్ అధికారిచే నోటీసు పొందాలని, నోటీసులో పేర్కొన్న తేదీ సమయానికి వాటిని విధిగా సమర్పించాలని, నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ఖర్చు అభ్యర్థి ఖాతాలో జమ కావడం ప్రారంభమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పేరు కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం: పోలీస్ కమిషనర్.

పేరు కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం: పోలీస్ కమిషనర్.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం పేరు కోసమే చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతా పేర్కొన్నారు. బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినా విలేకరుల సమావేశంలో కమిషనర్ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి చేసిన వ్యక్తి మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన ఘటం రాజును అదుపులోకి తీసుకొని విచారించగా, పేరు కోసమే ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చెసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. హత్యాయత్నానికి ముందు 10 రోజుల నుండే ప్రభాకర్ రెడ్డి ని ఫాలో అయ్యాడని దుబ్బాక మార్కెట్ లో ఒక కత్తిని కొనుగోలు చేసి, అవకాశం ఎదురు కోసం చూసి సూరం పల్లి గ్రామంలో తన ఆలోచనను అమలు చెశాడని, సంఘటన స్థలంలోనే నిందితున్ని అదుపులో తీసుకొన్నామని తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, హత్యాయత్నం వెనుక ఎవరైనా ఉన్నారా అన్న విషయం పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేశామని తెలిపారు. నిందితుడు ప్రెస్ రిపోర్టర్ అంటూ పలు చోట్లా వసూళ్లకు పాల్పడ్డాడని తెలిసిందని కానీ ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అన్నారు. నిండుతునికి నుండి ఫోన్, హత్యాయత్నానికి వాడిన కత్తిని అతను పని చెస్తున్న సంస్థలకు చెందిన పలు ఐడి కార్డులు కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తుచేశానన్నారు. నిందితునిపై పలు సెక్షన్ ల తో కేసులు నమోదు చేశామని బుధవారం కోర్టులో హాజరు పరిచామని నిందితునికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉనందున్న ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ లు చేయడం నిషేధం ఉందని కానీ సూరం పల్లిలో జరిగిన సంఘటనకు దుబ్బాక బంద్ పిలుపు నిచ్చిన వారిపై పలు సెక్షన్ ల క్రింద కేసులు నమోదు చేశామన్నారు..

పుకార్లను నమ్మొద్దు….

సోషన్ మీడియా లో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మొద్దని ఎవరైనా కావాలని అభ్యంతరకర పోస్ట్లు పెడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎన్నికల వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు..

అవినీతిపై వినూత్న ప్రచారనికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్ ప్రజలు

అవినీతిపై వినూత్న ప్రచారనికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్ ప్రజలు

ఈ శతాబ్దపు అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్

కాళేశ్వరం ఏటీఎంపై కాళేశ్వరం కరప్షన్ రావు కేసీఆర్ ఫొటో..

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిది

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వినూత్న ప్రచారాన్ని ప్రారంభించిన ప్రజలు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ ప్రత్యేక కాళేశ్వరం ఏటీఎంలను హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఆవిష్కరించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో తెలియజేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇటీవల పిల్లర్లు కుంగిపోయాయిన విషయం తెలిసినదే.. సుమరు లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిన నాలుగు సంవత్సరాలకే పిల్లర్లు కుంగిపోవడంపై ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్ కుటుంబం సభ్యులు అవినీతికి పాల్పడ్డారని పలు పార్టీల రాష్ట్ర, జాతీయ నేతలు అనేక సార్లు విమర్శించారు.. కోట్ల రూపాయల అవినీతిని ఎత్తిచూపేలా, ఏటీఎం నుండి లక్ష కోట్ల రూపాయల నోటు బయటికి రావడం అందరినీ ఆకర్షిస్తోంది. ఏటీఎంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావు ఫొటోలు పొందుపరిచారు ఈ ఏటీఎంలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి…

ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు ఖరారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు ఖరారు.

* ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు
గరిష్ఠంగా చేయాల్సిన వ్యయం 40 లక్షలే..

* చికెన్‌ బిర్యానీ 140, మటన్ బిర్యానీ 180లే..

• జాబితా విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి..

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రచార ఖర్చులను ఎన్నికల అధికారులు ఖరారు చేసింది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ దేనికి ఎంత వ్యయం చేయాలో సూచించింది. అభ్యర్థులు గతంలో తమ ఖర్చులను తక్కువగా చూపించే వారు. ఈ సారి ఎన్నికల అధికారులే ధరల జాబితాను రెడీ చేశారు. దాని ప్రకారం ఎన్నికల వ్యయాన్ని లెక్కించనున్నారు. నీళ్ల ప్యాకెట్‌ నుంచి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసే హోర్డింగ్స్‌, బెలూన్స్‌, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించారు. ఈసారి ఎన్నికల వ్యయాన్ని కూడా ఈసీ పెంచింది. అభ్యర్థి ఖర్చుల వ్యయం గరిష్ఠంగా రూ.28 లక్షలు ఉండగా, ఈసారి రూ.40 లక్షలు చేసింది..

పంజాబ్ ను తలదన్నేల తెలంగాణ రైతుల వ్యవస్థ: మాజీ మంత్రి పెద్దిరెడ్డి.

పంజాబ్ ను తలదన్నేల తెలంగాణ రైతుల వ్యవస్థ: మాజీ మంత్రి పెద్దిరెడ్డి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం పలు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రచారాన్ని చేశారు ఈ సందర్భంగా పలు గ్రామాల మహిళలు ఆశీర్వాదం తెలిపారు.. ఈ సందర్భంగా బీ అర్ ఎస్ అభ్యర్థి సతీష్ మాట్లాడుతూ గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్, అభ్యర్థులు లేని పార్టీ బిజెపి అని ప్రజలను మభ్యపెట్టిందుకే ఆరు గ్యారెంటీలు, బిసి ముఖ్యమంత్రి అని వస్తున్నారని ఇలాంటి మాటలతో మన బ్రతుకులు ఆగం చేసుకోవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన తెలిపారు. మాజీ మంత్రి మాట్లాడుతూ రానున్న రోజులలో మన తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఇప్పటికే కేంద్ర, ఇతర రాష్ట్రాలు, తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలను కాపీ కొట్టిందని, ఇది మన ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని, వచ్చే ఎన్నికలలో కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం, సౌమ్యుడు అభివృద్ధి దాత మన స్థానిక ఎమ్మెల్యే సతీష్ కూడ మూడోసారి ఎమ్మెల్యేగా అవ్వడం ఎవరు ఆపలేరని ఇందుకు నిదర్శనం మీ ఆదరాభిమానాలతో మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు.

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి: ఏసిపి

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి: ఏసిపి

మానకొండూర్ యదార్థవాది ప్రతినిది

నవంబర్ 30న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రంలో సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ చేరాలు, ఎస్సై నరేందర్ రెడ్డి, కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందితో కలసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. శాంతియుతంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహించడానికి జిల్లా పోలిస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏసీపి సురేందర్ రెడ్డి, మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లేద డయల్ 100 కాల్ చేయాలని చేసి సూచించారు. మద్యానికి డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేయడం జరిగినది, పోలింగ్ జరిగే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుంది, గ్రామాలలో ఏ పార్టీ వారు వచ్చి ప్రచారం చేసిన అడ్డుకోవద్దని ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తికి ఓటు వేయండి కానీ ప్రచారాన్ని మాత్రం అడ్డుకోవద్దని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశ పెట్టిన సీ-విజిల్ (CVIGIL) యాప్ ఎన్నికల పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వెయ్యమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం డబ్బులు ఓటర్లకు సరఫరా చేసిన, ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగిన, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన మరియు అల్లర్లు, గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు యువకులు స్పందించి ఈ యాప్ మొబైల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదుదారులు సంబంధిత వీడియోలు, ఫోటోలు, తీసి యాప్ లో అప్లోడ్ చేసినచో ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని అన్నారు. కావున గ్రామాలలోని ప్రజలు యువకులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఈ యాప్ ఎన్నికలకు సంబంధించిన యాప్ అని తెలిపారు.

అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో రక్తదాన శిబిరం నిర్వహించిన: జిల్లా పోలిసులు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో రక్తదాన శిబిరం నిర్వహించిన: జిల్లా పోలిసులు

జగిత్యాల యదార్థవాది ప్రతినిది

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఫ్లాగ్ డే సందర్భంగా శుక్రవారం స్థానిక విరూపాక్షి ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హాజరై పోలీస్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమరులైన పోలీసు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డిఎస్పీ లు, సీఐ లు ,ఎస్ఐలు , సిబ్బంది వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. జగిత్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తో పాటుగా కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది స్థానిక బ్లడ్ బ్యాంక్ వైద్యులు, సిబ్బంది సహకారం పట్ల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం వారికి సహాయం కోసం అమరవిరుల స్మరకర్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 300 మంది పోలీస్ అధికారులు, BSF సిబ్బంది, జిల్లాలోని యువకులు, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 60 సంవత్సరాల ASI చంద్రశేఖర్ రక్తదానం చేశారు. అదేవిధంగా ఎక్కువసార్లు రక్తదానం చేసిన యువకులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.. కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీ లు ప్రభాకర రావు, భీం రావ్, డిఎస్పీలు రవీంద్ర కుమార్, వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు నటేశ్,కోటేశ్వర్, రమణమూర్తి, ఆరిఫ్ అలీఖాన్, ఆర్.ఐ లు వేణు, రామకృష్ణ, జనిమియా ఎస్.ఐ లు, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మంచాల కృష్ణ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, పోలీస్, BSF సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...