37.2 C
Hyderabad
Monday, April 20, 2026

అమరుల త్యాగాలు స్ఫూర్తివంతం: అదనపు ఎస్పీ చంద్రయ్య

అమరుల త్యాగాలు స్ఫూర్తివంతం: అదనపు ఎస్పీ చంద్రయ్య

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

పోలీస్ అమరవీరుల సంస్కరణ లో భాగంగా ఫ్లాగ్ డే సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ అమరవీరుల సంస్మరణ భాగంగా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వారిని స్మరిస్తూ శుక్రవారం అన్ని పోలీస్ స్టేషన్స్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్ విధులు పోలీసులు ఉపయోగిస్తున టెక్నాలజీ, ఆయుధలు ,పోలీస్ స్టేషన్ ఆవరణ, ఎస్హెచ్ఓ రూమ్, స్టేషన్ రైటర్, లాక్ అప్స్, రిసెప్షన్, ఇన్చార్జి రూమ్, టెక్ టీం రూమ్, తదితర పరిసరాలను విహెచ్ఎఫ్ వైర్లెస్ సెట్ లను చూపించి వారు నిర్వహిస్తున్న విధుల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. పోలీస్ స్టేషన్లో దరఖాస్తు రాగానే విచారణ చేసి ఏ విధంగా కేసు నమోదు చేయడం జరుగుతుందని, నిందితులను అరెస్టు చేయడం, కేసు పరిశోధన చేయడం తదితర అంశాల గురించి వివరించడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చాలనాలు విధించే పద్ధతి షీ టీమ్ పైన అవగాహన కల్పించారు. అదేవిధంగా పోలీస్ శాఖలో వినియోగించే ప్రతి ఆయుధం పల్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఓపెన్ హౌస్ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పలు రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగం,గురించి వివరనిచ్చారు. ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు.కార్యక్రమంలో టౌన్ సి.ఐ ఉపేందర్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ యాదవ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

పెద్దపల్లి యదార్థవాది ప్రతినిది

*ఎన్నికల వ్యయ వివరాలను పకడ్బందిగా నమోదు చేయాలి.

*అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు.

*నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలి.

*ప్రతి రాజకీయ పార్టీ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి ఒక వ్యయాన్ని నమోదు చేయాలి.

*ఎన్నికల వ్యయ వివరాలు నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి.

అసెంబ్లీ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారిణి సి.శ్రీమాలతో కలిసి ఎన్నికల వ్యయ వివరాల నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ (ఏ.ఈ.ఓ)లతో సమీక్షించారు.క లెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన తెలిపారు. జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన మేరకు నియోజకవర్గంలో ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, అక్రమ నగదు బంగారం , ఇతర ముఖ్యమైన ఆభరణాలు, ఉచితాల పంపిణీని అరికట్టేందుకు ఈ బృందాలు కట్టుదిట్టంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణిను గుర్తించడం, రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం, రికార్డు చేయడం చాలా కీలకమని, సి-విజల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే మన లక్ష్యమని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని అన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండాపాటించాలని, నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని, ప్రస్తుతం పంట దిగుబడి వచ్చే సమయం వస్తున్నందున రైతులు పంట డబ్బులు తీసుకునే అవకాశం ఉందని వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా రైతులు రసీదు దగ్గర ఉంచుకునే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. వివిధ అవసరాల కోసం బ్యాంకులో నుంచి నగదు ఉపసంహరణ చేసుకునే వారుతప్పనిసరిగా రసీదు, ఆధారాలు ఉంచుకునే విధంగా వారికి అవగాహన కల్పించాల్సిందిగా బ్యాంకర్లకు సూచిస్తామని ఆయన అన్నారు.. జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారిణి సి.శ్రీమాల మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల వ్యయ వివరాల నమోదు ఒక అంశమైతే, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మరో ఎత్తుగా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగే ప్రతి రాజకీయ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వినియోగించిన వాహనాలు, కుర్చీలు, స్టేజి, సౌండ్ ఏర్పాట్లు , భోజనం తదితర ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలని అన్నారు. అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు, మాస్టర్ ట్రైనర్ రాంమోహన్, కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

మానకొండూర్ యదార్థవాది ప్రతినిది

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఎస్సై దాస సుధాకర్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ స్టేషన్ యొక్క పనితీరును , పోలీస్ స్టేషన్లో నిర్వహించే వీధుల గురించి, పౌరులు పొందాల్సిన సేవల గురించి వివరించడం జరిగింది. విద్యార్థులకు డయల్ 100 గురించి షీ టీమ్ గురించి, సైబర్ క్రైమ్, ఆయుధాల గురించి, విహెచ్ఎఫ్ సెట్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ లు రాజు, అనిల్, లక్ష్మినారాయణ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

గులాబీ కండువా కప్పుకున్న గుండ్లపల్లి యువత.

గులాబీ కండువా కప్పుకున్న గుండ్లపల్లి యువత.

యదార్థవాది మానకొండూరు ప్రతినిది

మానకొండూరు నియోజకవర్గం లోని తిమ్మాపూర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మానకొండూరు శాసనసభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గన్నేరువరం జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, గంప వెంకన్న గునుకుల కొండాపూర్ ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. అనంతరం నూతనంగా పార్టీలో చేరే వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుండ్లపల్లి గ్రామానికి చెందిన నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సాధారణ కుటుంబాలకు సైతం న్యాయం చేసే విధంగా ఉందని, పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని రానున్న ఎన్నికల్లో రసమయి బాలకిషన్ ని ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోను ప్రజలెవరు నమ్మవద్దని పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వ సంతోష్, పొలం దేవయ్య, పుట్ట శ్రీనివాస్, సొల్లు రవి, ఎండి రఫీ, కొరివి శేఖర్, ముల్కల రాజు, పంబాల రాజు, యంసాని అనిల్, రేషవేణి రాజు, రేషవేణి సంతోష్ మరియు టిఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు చింతల రవి, గ్రామ శాఖ అధ్యక్షులు పంబాల ఎల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు ములకల లక్ష్మణ్, ములకల అశోక్, ముల్కల అజయ్, ముల్కల సంతోష్, గునుకుల కొండాపూర్ న్యాలపట్ల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర బలగాలతో మండల కేంద్రంలో కవాతు

కేంద్ర బలగాలతో మండల కేంద్రంలో కవాతు

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో గురువారం తహసిల్దార్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా అంబేద్కర్ వరకు అంబేద్కర్ నుండి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కేంద్ర బలగాలు, పోలీసులు కవాతు నిర్వహించారు ఎన్నికలవేళ కేంద్ర బలగాలతో కలిసి పోలీస్ బలగాలు కలిసి ప్రజలకు భరోసా కల్పిస్తూ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ప్రజలకు భరోసా కల్పిస్తూ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ కేంద్ర రాష్ట్ర బలగాలను వినియోగించుకొని శాంతి భద్రతలను కాపాడుటకు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలని కేంద్ర బలగాలతో కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వాసాల సతీష్, సీఐ కిరణ్, ఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కుకునూర్ పల్లి యదార్థవాది

కొడకండ్ల గ్రామశివారు లో గురువారం కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న కుకునూర్ పల్లి పోలీసులు దాడిచేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 54, 835/- రూపాయలు, 2 మోటార్ సైకిళ్ళు, 2 కార్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నమ్మన్నారు, గ్రామాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశంలో పేకాట, జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలని తెలిపారు పేకాట, జూదం, వంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడి లో అరెస్ట్ చేసిన గజ్వెల్, కొడకండ్ల ప్రాంతాలకు చెందిన పురాణం కిషన్, మాకల వెంకటేష్, కమసాని రమేష్, ప్రశాంత్, ప్రవీణ్, కృష్ణ లపైన కేసు నమోదు చేశామని కుకునూర్ పల్లి ఎసై పుష్పరాజ్ తెలిపారు.

సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్న: ఎమ్మెల్యే

సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్న: ఎమ్మెల్యే

నియోజకవర్గ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సతీష్ కుమార్..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

పూలనే దేవునిగా కొలిచి తీరోక్క పూలతో బతుకమ్మగా పేర్చి ఆడబిడ్డలు జరుపుకునే సంబురం, పోయి రావమ్మ బతుకమ్మ వచ్చే ఏడాదికి మళ్ళీ రావమ్మా.. మా పాడిపంటలు, పిల్లాజేల్లా సల్లగా చూసి సకలసౌభాగ్యాలను ఇవ్వమ్మా అని తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఇల్లు మొక్కే ప్రకృతి పండుగ సద్దులబతుకమ్మ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్-డాక్టర్ షమితమ్మ దంపతులు వారి నివాసంలో బతుకమ్మను పేర్చి, బతుకమ్మకు, దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వొడితల మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు యువకులకు పేరుపేరునా బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అందరూ సంతోషంగా ఉండాలని, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఈ అవనికే పెద్దమ్మ, భవాని యోగమాయ గంగమ్మ, ఆ దుర్గమ్మ దయ ప్రజలందరిపై ఉండి అందరూ పాడిపంటలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సౌభాగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి కోరుకున్న పనులన్నీ జరిగి విజయాలు వరించి అందరూ అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్యే సతీష్

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్యే సతీష్

అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం.

ప్రజల ప్రేమ, ఆప్యాయత, అభిమానాలకు కృతజ్ఞతలు తెలిపిన సతీష్ కుమార్.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

నియోజవర్గంలోని అక్కన్నపేట మండలం మంచినీళ్లబండ, దాని అనుబంధ గ్రామం యాటకర్లపల్లె, టేకులతండా, గొల్లపల్లి, మల్లంపల్లి, మోత్కులపల్లి, పెద్దతండ, చౌటపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సతీష్ కుమార్.. హుస్నాబాద్ నియోజక వర్గాన్ని వేలకోట్లతో అభివృద్ధి చేశానని ప్రతి గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి అని కోరారు. ప్రజలు మహిళలు యువత అడుగడుగునా సతీష్ కుమార్ కు గురువారం ఘన స్వాగతం పలికారు కోలాటాలతో డప్పుచప్పులతో మీ వెంటే మేమంతా అని జై తెలంగాణ, జై బీఆర్ఎస్, కెసిఆర్, జై సతీష్ కుమార్ అని నినదించారు..

గ్రామాలలో బీఅర్ఎస్ కు వ్యతిరేకత.!

గ్రామాలలో బీఅర్ఎస్ కు వ్యతిరేకత.!

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ నియోజకవర్గ బీఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిరసన సెగ తగిలింది..
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మొదటి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి చేదు అనుభవం..
ఈనెల 15వ తేదీన జరిగిన హుస్నాబాద్ ఆశీర్వాద భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అంతలోనే బీఆర్ఎస్ పై నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సతీష్ కు వ్యతిరేకత మొదలైంది.. తమకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ అడ్డుకున్న గ్రామస్తులు మహిళలు, మండలంలో తిరగబడుతున్న ప్రజలు..

జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్.!

జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్.!

హైద్రాబాద్ యదార్థవాది ప్రతినిది

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్టులు, 12 ఇతర విభాగాల ఉద్యోగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఎఫ్ సీఐ, ఎఎఐ, పీఐబీ, హెయిర్, విద్యుత్ శాఖ, రైల్వే, వైద్యరోగ్య శాఖ, హెయిర్ RTC, పౌరసరాఫరాల శాఖ, బీఎస్ యన్ఎల్, వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. వీరంతా నవంబర్ 7వ తేదీలోగా ఫారం-12Dకి దరఖాస్తు చేయాలి. కాగా, కొత్తఓటర్లకు నెలాఖరు నుంచి ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ జరగనుంది. ఈఏడాది రెండు విడతలుగా ఓటర్ల జాబితా ప్రకటించారు. 2023 జనవరి నుంచి కొత్తగా 40 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. జనవరి1 నుంచి 27 లక్షలా 50 వేలకు పైగా ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి తపాలా శాఖ ద్వారా ఓటర్ల చిరునామాలకే పంపిచారు. ఆ తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి సంబంధించిన గుర్తింపు కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చారు. మిగిలిన వారి కార్డుల ముద్రణ పూర్తిచేసి పంపిణీ చేయనున్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...