37.2 C
Hyderabad
Monday, April 20, 2026

ఆరోగ్య మంత్రి ఇలాకలోనే వైద్యం ఇంత నిర్లక్ష్యమా.?

ఆరోగ్య మంత్రి ఇలాకలోనే వైద్యం ఇంత నిర్లక్ష్యమా.?

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

ఆసుపత్రి కి వచ్చే రోగులు వారికున్న రోగాన్ని నయం కావడమేమో కానీ ఆసుపత్రికి వస్తే రోగం రెండింతలు అయ్యే అవకాశాలు లేకపోలేదు సిద్దిపేట ఏరియా ఆసుపత్రి వైద్యుల ప్రవర్తన చూస్తుంటే.

వివరాల్లోకి వెళితే…..

డాక్టర్ అంటే దేవునితో సమానమంటారు.. కానీ సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో స్వయాన ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలో అది కనబడడం లేదు… వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగం తగ్గడం దేవుడెరుగు కానీ వారి రోగం ఎక్కువై అవకాశాలు లేకపోలేదు. తనకున్న దంత సమస్యను ఆసుపత్రిలో చూపించుకోవడానికి సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తితో సిబ్బంది వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం.. నువ్వు ఎవనికి చెప్పుకుంటావో చెప్పుకో నేను ఎవ్వనికి భయపడ …కలెక్టర్ కు చెప్పుకుంటావా చెప్పుకో…కాశీనాథ్ కు చెప్పుకుంటావా చేప్పుకో… అంటూ మాట్లాడిన తీరు విస్మయపరిచింది…

మేమెంతో – మా కంత రావాలి.

మేమెంతో – మా కంత రావాలి.

హైద్రాబాద్ యదార్థవాది

జై బీ.సీ జైజై బీ.సీ రండి కదలిరండి తరలిరండి దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ అధ్యక్షులు అర్ కృష్ణయ్య బుదవారం బీసీ రాష్ట్ర మహా సభ పోస్టర్ ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసి జనగణనకై, మహిళ రిజర్వేషన్లకై, జనాభ దామాషాలో పద్ధతిలో రాజకీయంగా రావలసిన రిజర్వేషన్లు, రాష్ట్ర బడ్జెట్లో, మేమెంతో – మా కంత రావాలని, ఈనెల 15 ఆదివారం మున్నూరుకాపు సంఘం, కాచిగూడ, హైదరాబాద్ లో బిసిల రాష్ట్ర మహా సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి ఉపాధ్యక్షులు గుజ్జ సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరో కొత్త జిల్లా కోసం ఉద్యమం.!

మరో కొత్త జిల్లా కోసం ఉద్యమం.!

– మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జిల్లాగా ప్రకటించాలి..

హుజురాబాద్ యదార్థవాది ప్రతినిది

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజవర్గం సైదాపూర్ మండల కేంద్రంలోని  అఖిలపక్ష పార్టీలు జేఏసీ ఆధ్వర్యంలో హుజురాబాద్ ను మాజీ ప్రధాని పీవీ జిల్లాగా ప్రకటించాలని  జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం భారీ రాలి నిర్వహించి నిరసన తెలిపారు.. అనంతరం అఖిలపక్ష నాయకులు జేఏసీ నాయకులు మాట్లాడుతూ 13 మండలాలను కలుపుకొని హుజురాబాద్ ను పివీ జిల్లాగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సైదాపూర్, భీమదేవరపల్లి, చిగురుమామిడి, ఎలకతుర్తి, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కేశపట్నం వివిధ మండలాలను కలుపుకొని వెంటనే హుజురాబాద్ ను జిల్లాగా  ప్రకటించాలి అన్నారు. ఈనెల 15న హుస్నాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హుజరాబాద్ ను జిల్లాగా మార్చడంలో ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తుందని, అధికార పార్టీ జిల్లాను ఏర్పాటు చేయడంలో విఫలం అయిందని  2016 సంవత్సరంలో జిల్లాలు విభజన చేయడంలో 31 జిల్లాలను ఏర్పాటు చేయడంలో అప్పుడే హుజరాబాద్ జిల్లాగా ప్రకటిస్తే బాగుండేదని భౌగోళికగా చారిత్రక హుజురాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ కూడా 2018 సంవత్సరంలో ములుగు నారాయణరావుపేట జిల్లాలుగా ప్రకటించినప్పటికీ కూడా హుజరాబాద్ ను విస్మరించడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు కూడా ర్యాలీ రూపంలో ధర్నా రూపంలో నిరసనలు చేయడం జరుగుతుందని అవసరం లేని ప్రాంతాలను కూడా జిల్లాలుగా కెసిఆర్ చేశరని, తెలుగు ముందు బిడ్డ మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో హుజురాబాద్ ప్రకటించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో పివి జిల్లాగా వెంటనే ప్రకటించాలి. కార్యక్రమంలో వర్దినేని రవీందర్ రావు, పొడిచెట్టి వెంకటరాజ్యం. ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, గుండారపు  శ్రీనివాస్, కొండ గణేష్, జంపాల సంతోష్ కందుల శ్రీనివాస్ రెడ్డి, కూతురు విధ్వాన్ రెడ్డి, కామిని వీరేశం, రాయిచెట్టి చంద్రయ్య, కాయిత రాములు, గాదర్ల ఓదెలు, యాదగిరి ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామల కుల సంఘాలు ప్రజలు పాల్గొన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు కొత్త నిబంధన.!

పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు కొత్త నిబంధన.!

ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కు చెక్ పెట్టిన ఎన్నికల సంఘం..

ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలతో ఎన్నికల సంఘం కొత్త నిబంధనలు తీసుకుంది.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నికల సిబ్బంది ఇకపై తాము ఎన్నికలు నిర్వహించే పోలింగ్ స్టేషన్ లోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఈఎన్నికలలో కల్పించింది.

పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకునే ఉద్యోగులు ఒక శక్తిగా ఎదుగుతున్నారని, తమ ఓటును దుర్వినియోగం చేయడమేనని, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకొని తమ ప్రయోజనాల కోసం బేరా సరాలు చేస్తే అది మంచి పద్ధతి కాదని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు..

శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి.

శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి
అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి.

-జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

పెద్దపల్లి యదార్థ వాది ప్రతినిది

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ కోరారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, డిసిపి వైభవ్ గైక్వాడ్ లతో కలిసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని, సి-విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోలతో ఫిర్యాదు చేయవచ్చని, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు 24 గంటల పాటు నమోదు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రస్తుతం ఉన్న పనులు, పథకాలు మాత్రమే కొనసాగుతాయని కొత్త పనులు, పథకాలు ప్రారంభించడం జరగదని తెలిపారు. రాజకీయ పార్టీలకు నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, సువిధా యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని, రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించవద్దని ఎన్నికల అధికారి తెలిపారు. కుల, మతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123, ఐపిసి సెక్షన్ 171 ప్రకారం అభ్యర్థులపై 6 సంవత్సరాలు నిషేదం ఉంటుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. అక్టోబర్ 30 వరకు నూతన ఓటరు నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఓటరు జాబితాలో పేర్లు లేకుండా ఎవరైనా అర్హులైన ఓటర్లు ఉంటే వెంటనే దరఖాస్తు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని, 24 గంటల్లోగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఎక్కువమంది సమావేశాలు నిర్వహణకు పోటీ పడితే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వివిఐపి లు, విఐపి ల పర్యటన సమయంలో స్థానిక పోలీస్ అధికారులతో పార్టీ నాయకులు సమన్వయం తో పనిచేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని సామాజిక మాధ్యమాలలో విద్వేషాలను పెంచే విధంగా పోస్టులు పెట్టడం, ఇతరులను దూషించడం, బెదిరింపులకు గురి చేయడం వంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీలు ఎడ్ల మహేష్, శ్రీనివాస్ రావు, సి.ఐ. అనిల్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనంలోకి పార్టీ అధినేత : కేసీఆర్

జనంలోకి పార్టీ అధినేత : కేసీఆర్

బారి సభలతో తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న: చంద్రశేఖర రావు..

ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. అక్టోబర్ 15 ఆదివారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి బహిరంగ సభ హుస్నాబాద్ తో ప్రారంభం..

మొదటి విడతలో
15 న హుస్నాబాద్
16 న జనగాం, భువనగిరి
17 న సిరిసిల్ల, సిద్ధిపేట
18 న జడ్చర్ల, మేడ్చల్

రెండవ విడతలో
26 న అచ్చంపేట, నాగర్కర్నూల్, మునుగోడు
27 న పాలేరు, స్టేషన్ఘనపూర్
29 న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
30 న జుక్కల్, బాన్సువాడ, నారాయణ ఖేడ్
31 న హుజుర్ నగర్, మిర్యాలగూడ దేవరకొండ

నవంబర్ 1 న సత్తుపల్లి, ఇల్లందు
2 న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
3 న ముధోల్(భైన్స),ఆర్మూర్, కోరుట్ల
5 న కొత్తగూడెం, ఖమ్మం
6 న గద్వాల్, మక్తల్, నారాయణపేట్
7 న చెన్నూర్,మంథని, పెద్దపల్లి
8 న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి

నవంబర్ 9 న ఉదయం గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసి మధ్యాహ్నం కామారెడ్డి లో నామినేషన్ ధాఖలు చేస్తారు. అనంతరం కామారెడ్డి బహిరంగసభలో పాల్గొంటారని తెలుస్తోంది…

రైతులకు కొత్త రుణాల ప్రక్రియ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ గరీమ

రైతులకు కొత్త రుణాల ప్రక్రియ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ గరీమ

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్.. మంగళవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో రైతుల రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ చేయాలని సంబందిత అధికారులు, బ్యాంక్ అధికారులను అదేశించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
ముఖ్యంగా వివిద బ్యాంకులలో రైతు రుణమాఫీలు ఎపిజివిబి బ్యాంకు లో 7876 మంది రైతులకు గాను 33.26కోట్లు, ఎస్బీఐ బ్యాంకు లో 2740మంది రైతులకు గాను 21.92కోట్లు, యుబిఐ బ్యాంకు లో2762 రైతులకు గాను 15.45కోట్లు, ఇతరత్రా బ్యాంకులలో సుమారు 10272అకౌంట్లకు గాను 25కోట్ల పెండింగ్ రైతు రుణమాఫీ నగదును వేగంగా రైతులకు అందజేయ్యాలని ఇప్పటి వరకు జిల్లాలో 1,72,592 మంది రైతులకు గాను 1320.68కోట్లు మంజూరు కాగ 90,471 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ 496.4కోట్లు అకౌంట్ జమ చేయబడ్డాయి. ఇప్పటి వరకు 66,272 రైతులు 394.71కోట్ల నగదు రూపంలో రైతులు వారి ఖాత నుండి తీసుకోవడం జరిగింది. మిగత దాదాపు 11,346 మంది రైతులు క్రాప్ లోన్ రిన్యవల్ చేసుకోవాలని అమే కోరారు. డిబిటి పెల్యుర్ 199 పెండింగ్ లో ఉన్న అకౌంట్లకు రైతు రుణమాఫీ ఫోర్టల్ లో ఎస్బీఐ,ఇతర బ్యాంకు అధికారులు డ్యాక్యమెంట్ అప్లోడ్ చెయ్యాలని లేని యెడల సర్టిఫై బ్యాంకు వారు లీడ్ బ్యాంకు అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని అన్నారు. ఆధార్ నంబర్ లేని గోల్డ్ లోన్ మాఫింగ్ కానీ మరణించిన ఇతర సాంకేతిక లోపాల ద్వారా రుణమాఫీ రాని రైతుల సమస్యలను కమిషనర్ ఆప్ అగ్రికల్చర్ దృష్టికి తీసుకెళ్లలని తెలిపారు. వ్యవసాయ అధికారులు ఎడిఎ, ఎఓ లు బ్యాంకర్ల దగ్గర నుండి వివిధ గ్రామాల్లో పెండింగ్ జాబితా మాదిరి బ్యాంకు మెనెజర్లతో కుర్చీని క్రాప్ లోన్ రిన్వల్ చేసి రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరిగా సమావేశాలకు బ్యాంకర్ల ఆర్ఎంలు కచ్చితంగా హాజరుకావాలి లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవు.. కొత్త రుణాలకు అర్హత కలిగిన రైతుల వద్దకు వ్యవసాయ అధికారులు వెళ్లి రైతులకు రుణాలకు సంబంధిత విషయాల గుర్చి తెలపాలని, ఎస్బీఐ, యుబిఐ, ఎపిజివిబి కోఆపరేటివ్ బ్యాంకు రోజుకు 100చొప్పున రుణాలను అందించాలని అన్నారు. రెండవ విడత విధి వ్యాపార రుణాలను పట్టణ పరిధిలో 1329మందికి వారం రోజుల లోపల మెప్మా అధికారుల సహయంతో బ్యాంకు మెనెజర్ లు అందించాలని, సెర్ప్, మెప్మా పరిధిలో బ్యాంకు లీంకెజిలో సంబందించిన ఎంసిపిలు బ్రాంచ్ మెనెజర్ సహకారంతో మంజూరు చెయ్యాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మెనెజర్ సత్యజిత్, డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆర్యా, పీడి మెప్మా హనుమంత రెడ్డి, యుబిఐ ఆర్ఎచ్ వికాస్, ఎపిజివిబి ఆర్ఎం ఉదయ్ కిరణ్, టిజిబి ఆర్ఎం లక్షణ్, బ్యాంకు రిజనల్ అధికారులు, మెప్మా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుల మతాల ప్రజలను ప్రభావితం చేసే ప్రసంగాలు నిషేధం : జిల్లా కలెక్టర్

కుల మతాల ప్రజలను ప్రభావితం చేసే ప్రసంగాలు నిషేధం : జిల్లా కలెక్టర్

పెద్దపల్లి యదార్థవాది ప్రతినిది

భారత ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పకడ్బందీగా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు..మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ డిసిపి వైభవ్ గైక్వాడ్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ లతో కలిసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పత్రిక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ నవంబర్ 3న వస్తుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నవంబర్ 13 వరకు నామినేషన్ల స్క్రూటినీ, నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 2వ ఓటరు జాబితా సవరణ తుది ఓటరు జాబితా ప్రకారం 6 లక్షల 94 వేల 612 మంది ఓటర్లు ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరి చూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు అక్టోబర్ 30 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 837 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్ కు రెండు కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని, కుల మతాలకు ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించు కునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని, రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో 10 సర్వేలెన్స్ బృందాలను, 10 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, 5 వీడియో సర్వేలెన్సు బృందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సి -విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటారని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ మొదలైన పబ్లిక్ ప్లేస్ లలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగిస్తామని ఆయన తెలిపారు.జి ల్లాలో కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, అదేవిధంగా ఎవరు ప్రింట్ చేయమన్నారు వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని, ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు సమాచారం అందించామని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న డిసిపి వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పాత్రికేయులు, సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, డిప్యూటీ తహశీల్దార్ ప్రవీణ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంఘం భవనానికి భూమిపూజా.

సంఘం భవనానికి భూమిపూజా.

కొండపాక యదార్థవాది 

మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో సోమవారం శాలివాహన సంఘానికి భూమి పూజ చేసారు స్థానిక ఎంపిటిసి గురజాడ బాలాజీ, గ్రామ సర్పంచ్ మహాదేవ్ గౌడ్ ఆధ్వర్యంలో, గత నెల రోజుల కిందే సంఘ భావన నిర్మాణానికి గాను పది లక్షల రూపాయలు మంజూరు కాగా సోమవారం రోజు నిర్మాణపనులు చెబట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మిద్దె శివ, దోమల ఎల్లం, పిల్లి నాగరాజు శాలివాహన కులస్థులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్స్ లో మెరిసిన కేజీబివి విద్యార్థులు

జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్స్ లో మెరిసిన కేజీబివి విద్యార్థులు

కొండపాక యాదర్తవాది

ఆత్మస్థైర్యంతో పాటు ఇమ్యూనిటీ పవర్, బాడీ ఫ్లెక్సిబులిటి , వెయిట్ లాస్ శారీరకంగా, మానసికంగా ఎంతోగానో దోహదపడుతుంది కరాటే విద్యా నేర్చుకోవడం వల్ల అని అన్నారు కేజీబివి స్పెషల్ ఆఫీసర్ గౌతమి , నానాటికి పెరుగుతున్న ఆకతాయిల అకృత్యాలను ఎదుర్కోవడానికి అమ్మాయిల స్వీయ ఆత్మరక్షణకు కరాటే యుద్ద కళ ఎంతో ఉపయోగపడుతాయి అన్నారు, ఆడ పిల్లలందరు కరాటే యుద్ధ విద్యలు తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ లో పాల్గొన్న కొండపాక కేజీబివి పాఠశాలవిద్యార్థులకు మొత్తం 5 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 7 కాపర్ మెడల్స్ తో పాటు ప్రాశంసపత్రాలు వచ్చాయి అన్నరు. కార్యక్రమం లో కరాటే మాస్టర్ భాగ్యరాజ్ కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లీ తండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...