34.2 C
Hyderabad
Monday, April 20, 2026

దళిత జర్నలిస్టులకు దళిత బంధు అమలులో జాప్యమేలా.!

దళిత జర్నలిస్టులకు దళిత బంధు అమలులో జాప్యమేలా.!


సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది


రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమ ఆర్థిక స్వాలంబన కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళిత జర్నలిస్టులకు అమలు చేయడంలో జాప్యం ఎందుకని దళిత వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా నాయకులు పల్లెటూరు ప్రసాద్ దుబ్బాక నియోజకవర్గం ఉపాధ్యక్షులు ఇస్తారిగల్ల ఎల్లం అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గం దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత జర్నలిస్టులు అందరికీ దళిత బంధు అమలు చేస్తామని గతంలో జరిగిన దళిత వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా సమావేశాలు, ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ రాష్ట్రస్థాయి సమావేశంలో వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింపచేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి దళిత జర్నలిస్టుకి దళిత పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీశ్ సూచనల మేరకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గ దళిత జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎప్పుడు అడిగిన ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట దటవెస్తున్నరని జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా నాయకులు ఆలోచించి నియోజకవర్గంలో అర్హులైన దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు బాల్ నర్సయ్య, లింగాల మహేశ్, పుట్ట రాజు, గట్టు ప్రసాద్, శ్రీనివాస్, గణేష్, నాగరాజు, నాగేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆశల పల్లకిలో ప్రజలను ఊరేగించడమా.!

ఆశల పల్లకిలో ప్రజలను ఊరేగించడమా.!

– దళిత బంధు కు బ్రేక్

– గృహలక్ష్మి కి బ్రేక్

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిధి

లోకం తీరు ప్రజాతీర్పు ప్రజల్లో నుంచి పుట్టిన ప్రతి అక్షరం సాక్షిగా ఈ కథనం స్వచ్ఛం అనుకున్నదే జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే కోడ్‌ అమల్లోకి రానుంది. కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలకు బ్రేకులు పడినట్టే. కేవలం ప్రచారం చేసుకోవడమే తప్ప జనాలకు తాయిలాలు, పథకాల లబ్ది చేకూర్చేందుకు దారులు మూసుకుపోయాయి. ఇంతకు ముందే ప్రవేశ పెట్టిన పథకాలు అమలు చేయవచ్చు. కానీ అవీ అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. దీంతో ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవడం, వాటిని ఆపేయడం చేస్తుంది. దీంతో జనాలకు ఇక ఎన్నికలే తప్ప .. పథకాల అమలు ఉండబోదు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ మాత్రం అందే అవకాశం ఉంది. ఇప్పుడు చర్చలోకి వస్తున్న పథకం.. దళితబంధు. మొదటి విడతగా తూతూ మంత్రంగా కొంత మందికి ఇచ్చి దీనిపై పెద్ద ప్రచారం చేశారు. రెండో విడతకు లిస్టు రెడీ అయ్యింది. ఎంక్వైరీ పూర్తయ్యింది. కలెక్టర్‌ వద్ద ఫైనల్ లిస్టు చేరింది. కానీ ప్రభుత్వం నిధులు మాత్రం విడుదల చేయకుండా జాప్యం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలుసు. ఎందుకు మరి దీన్ని పెండింగ్‌లో పెట్టాడు. నిధుల లేమీ ఒక కారణం కాగా.. ఒకవేళ రెండో లిస్టు ఇస్తే చాలా మంది రాని వాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీంతో ఇది పెండింగ్‌లో పెట్డడమే మేలనుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దళితబంధు ఇస్తామని ప్రకటిస్తారు.
జిల్లాలో  లోకం తీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అయోమయంలో తెలంగాణ ప్రజలు కానీ దీన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికీ పది లక్షల చొప్పున దళితబంధు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పెద్దమొత్తం కావడంతో నియామవళిని ఉల్లంఘించినట్టేనని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తాయి. ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని దీన్ని అడ్డుకుంటుంది. చూశారా మేం ఇస్తామంటే వాళ్లే అడ్డుకుంటున్నారు. మేం మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే వెంటనే అందరికీ దళిత బంధు ఇచ్చేస్తామని ఓ హామీ అలా ఇచ్చేస్తారు. ఇలా తమకు ఎన్నికల్లో లబ్ది చేకూరే వ్యూహంలో భాగంగానే బీఆరెస్‌ దళితబంధు రెండో విడత ఇవ్వలేదని తెలుస్తోంది. గృహ లక్ష్మీ స్కీమ్‌ కూడా అంతే. కొందరికి కొన్ని చోట్ల ఎంపిక చేసిన తమ పార్టీ వారికి ఇచ్చారు అందులో భాగంగా ఉద్యోగులకు లకు పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు పొద్దున లేస్తే నాయకుల ఇంటి ముందు క్యూ కట్టుకొని నిలబడే నాయకులకు ఉన్నవారికి మాత్రమే ఇచ్చారు. అసలైన నిరుపేదలకు చాలా మందికి ఆశపెట్టి పెండింగ్‌లో పెట్టేశారు. పల్లెటూరి గ్రామాల్లో పార్టీల కోసం పనిచేసిన వ్యక్తులకు కూడా అందని ఆ పథకాలు అంతయో లేవో కూడా తెలియని స్థితిలో పేద ప్రజలు నాయకులను మంత్రులను అడ్డుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అసలు మళ్లీ గెలుస్తారా గెలిస్తే ఇస్తారా లేదా అని కూడా అర్థం కాలేని సందేశం ఎందుకంటే ఇందాక ఎన్నో పేర్ల నుంచి వచ్చిన పథకాలు వాళ్ల పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే కానీ పూరి గుడిసెల్లో కూలి నాలి పని చేసుకుని పొట్ట పోసుకుంటున్న పేదవారి కోసం మాత్రం ఏ పథకం అందడం లేదు ఇలా ఇంకెన్నాళ్లు అని ప్రశ్నిస్తున్న ప్రజలు నాయకులను కార్యకర్తలను గ్రామాల్లో అడ్డుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఎక్కువ మాట్లాడితే బెదిరింపులు ఉన్న పథకాలను ఊడదీస్తాం మీకు అంది ఏ ఉచిత పథకాలు కూడా రాకుండా చేస్తాం అంటూ బెదిరి బెదిరింపులే కానీ పేద ప్రజలను సంతోషపెట్టే ఏ ఒక్క నమ్మక మైన మాటలు లేవు కాంగ్రెస్‌ ఇదే పథకానికి ఐదు లక్షలు ఇస్తానంటుంది. ఇది బీఆరెస్‌కు దెబ్బ పడేలా ఉంది. అందుకే బీఆరెస్‌ మ్యానిఫెస్టోలో ఐదు లక్షలకు పెంచి.. తాము అధికారంలోకి రాగానే ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించేస్తారు. దీంతో పాత గృహలక్ష్మీ మరిచిపోతారు. కొత్తదాని కోసం వేచిచూస్తారు. ఇలా.. ఈ రెండు పథకాలు బీఆరెస్‌కు మేలు చేసేలా ‘కోడ్‌’ను తమకు అనుకూలంగా మలుచుకోనుందా.. ..

జిల్లాలో ముదిరాజ్ భవనం లేని ఊరే లేదూ: హరీష్ రావు.

జిల్లాలో ముదిరాజ్ భవనం లేని ఊరే లేదూ: హరీష్ రావు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా మండంలోని పొన్నాలలో మూడు ఎకరాలలో ముదిరాజ్ ఏసీ కన్వేన్షన్ సెంటర్ ను శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర మచ్చాశాఖ చైర్మన్ పిట్టల రవీందర్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటలో రేపటి నుండి బెస్ట్ కన్వీన్షన్ సెంటర్ ముదిరాజ్ కన్వీన్షన్ సెంటర్ ను ఏడున్నర కోట్లతో అద్భుతంగా నిర్మించామని ఇంకా పూర్తి స్థయిలో పనుల కావాలంటే మరో రూ. 50 లక్షలు ఇస్తామని తెలిపారు. దేశంలోనే అన్ని కులాలకు భవనాలను నిర్మించింది సిద్దిపేట లో మత్రమే ముదిరాజ్ కులానికి భవనం లేని ఊరు నియోజకవర్గంలో లేదని అన్నారు. కొత్తగా 2000 సొసైటీలు ఏర్పాటు చేసి 2 లక్షల కొత్తగా సభ్యత్వలు ఇచ్చామని గతంలో 2 లక్షల సభ్యత్వాలు మాత్రమే నేడు 4 లక్షలు దాటిందని, వేయి కోట్ల రూపాయలతో ముదిరాజ్ ల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలోని చెరువులను ముదిరాజ్ సొసైటీలకే సీఎం కేసీఆర్ కేటాయించారని ఆయన అన్నారు. ముదిరాజ్ లకు రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ, శాసన మండలి వైస్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చామని జాతి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ మాట్లడుతూ దేవాలయలున్న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో మంత్రి సహకారంతో సత్రాలు కట్టుకుంటున్నామని సీఎం కేసీఆర్ కొకపేటలో 5 ఎకరాలు భూమిని ముదిరాజ్ సంక్షేమ భవన్ నిర్మాణానికి కేటాయించారని అన్నారు. మచ్చాశాఖ చైర్మన్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా పథకాలను తీసుకువచ్చిందని, తెలంగాణా సాధించిన తరువాత మన రెండు కులాలకు మాత్రమే చేపలు పట్టుటకు అనుమతిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ, ఎమ్మెల్సి కూర రఘూత్తమ రెడ్డి, మిన్సిపల్ వైస్ చైర్మన్ జెంగిటి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ

మెదక్ యదార్థవాది ప్రతినిది

రామాయంపేట పురపాలక సంఘం పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్.
మెదక్ జిల్లా రామాయంపేట పురపాలక సంఘం పరిధిలో గురువారం 12 వార్డు మహిళలకు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి కమిషనర్ ఉమాదేవి, పాలకవర్గం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లడుతూ పట్టణంలో ఉన్న 18 సంవత్సరాల నిండిన ప్రతి రేషన్ కార్డులో పేరు ఉన్న వారికి చీరల పంపిణీ చేస్తామని ఇందుకు మన పట్టణానికి సుమారు 5600 చీరలు కార్యాలయానికి వచ్చాయని సంబంధిత వార్డులలో సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఆ వార్డులలో రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని లబ్ధిదారులు సెంటర్ ల వద్దకు వెళ్లి బతుకమ్మ చీరలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్సు వార్డు అధికారులు మేనేజర్ శ్రీనివాస్ మహిళలు బీ అర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

స్వచ్ఛ ఆరోగ్యమే మన లక్ష్యం.!

స్వచ్ఛ ఆరోగ్యమే మన లక్ష్యం.!

– ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ల్యాప్ ట్యాబ్స్ పంపిణీ..

– బిల్డింగ్ వర్కర్లకు కుట్టు మిషన్ల పంపిణీ..

సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది

మహిళల ఆరోగ్య రక్షణ కోసమై, మహిళ అడుగు రుతుప్రేమ యాప్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో గురువారం రుతుప్రేమ యాప్ ప్రారంభోత్సవంలో హాజరై ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, పోలీసు కమిషనర్ శ్వేత, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, మున్సిపల్ చైర్మన్ మంజుల, జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి మాట్లాడారు. మానవ మనడగకు మూల కారణం రుతుచక్రం, మానవ మనుగడను శాసించేది రుతుచక్రమని, రుతుచక్రం లేకుంటే జీవన చక్రమే లేదని, సంపూర్ణ స్వచ్ఛ ఆరోగ్య మన సిద్ధిపేట నియోజకవర్గ వర్గంలో పూర్తి చేశామని మంత్రి అన్నారు. సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషను శిక్షణ తీసుకున్న 200మందికి కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఐరన్ లోపంతో బాధపడుతున్న కౌమార బాలికలకు బలవర్థకమైన ఆహార పదార్థాలు అందజేతలో భాగంగా ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్న 54 మంది విద్యార్థినీలకు 7శాతం కంటే తక్కువ ఐరన్ కంటెంట్ ఉన్నవారికి పోషకాహార కిట్స్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు 100 మందికి ల్యాప్ ట్యాప్ లు అందిస్తున్నట్లు, రాబోయే రోజుల్లో మరో 900 మందికి అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ 2021లో రుతుప్రేమను ప్రారంభించి సిద్ధిపేటలోని అన్నీ మున్సిపాలిటీ వార్డుల్లో, నియోజకవర్గ పరిధిలోని 91 గ్రామ పంచాయతీలలో 1 లక్ష 33 వేల మందికి అవగాహన కల్పించామని తెలిపారు. అలాగే 53 వేల 067 మంది మహిళలకు రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, డీపీఓ దేవకి, బీసీ కార్పోరేషన్ ఈడీ సరోజ, సెట్విన్ అమీనా, జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించండి

ఉద్యోగ భద్రత కల్పించండి

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

రాష్వ్య్రాప్తంగా ఉన్న ఈ పంచాయతీ ప్రాజెక్ట్ మేనేజర్ల కు, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు పేస్కెల్, ఉద్యగ భద్రత కల్పించాలని సిద్దిపేట జిల్లా పంచాయతీ సంఘం అధ్యక్షుడు నవీన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నామని అలాంటి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని. వెంటనే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ప్రక్కన శాంతి యుత సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ పంచాయతీ వ్యవస్థలో 13 సంత్సరాలుగా పనీ చేస్తున్న 33మంది డి.పి. ఎం.లకు పెస్కేల్ ను అమలు చేయాలి అని అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్లు గా విధులు నిర్వర్తిస్తున్న 1619 మంది కి ఉద్యోగ భద్రత, జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పిస్తూ పే స్కేల్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గ్రామ పంచయతీ లలో అకౌంట్ లు, జనన,మరణ ధృవ పత్రాలను మంజూరీ చేయుట.ఇంటి పన్నులు అంతర్జాలం లో పొందుపరచుట , ఇంటి నిర్మాణాల అనుమతి, లే అవుట్ ల అనుమతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయ వంతం కావడానికి ఈ పంచాయతీ ఆపరేటర్ లుగా కీలక పాత్ర పోషించా మని అలాంటి మా న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించా లని అన్నారు.. ఈ కార్యక్రమం లో ఈ పంచాయతీ సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి బి. నర్సింలు, గౌరవ అధ్యక్షులు మంద లక్ష్మన్, కోషాధి కారి సంతోష్ కుమార్, మహిళ నాయకులు శాలిక, సుమలత, సాగర్, బాలకృష్ణ రెడ్డి, నర్సింలు, మహేష్, స్వామి, నవీన్ కుమార్, చౌడ లక్ష్మన్, సంపత్, బాలరాజు, మన్నన్, శ్రావణ్, సంపత్, ఏళ్లం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నో ఏండ్ల కళ నెరవేర్చిన: ప్రధాని మోదీ

ఎన్నో ఏండ్ల కళ నెరవేర్చిన: ప్రధాని మోదీ

కొండపాక యదార్థవాది


జిల్లాలో దశాబ్దాల రైల్వే ప్రయాణ కళ నెరవేర్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొండపాక మండల అధ్యక్షుడు మన్నెం శశిధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.. మంగళవారం నిజాంబాద్ లో వర్చువల్ గా సిద్ధిపేట జిల్లా పట్టణంలో సిద్దిపేట నుండి సికింద్రాబాద్ రైలు సర్వీసును నరేంద్ర మోదీ ప్రారంభించిన సందర్భంగా బిజెపి మండల నాయకులతో కలిసి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నూతనంగా ప్రారంభమైన రైలు సర్వీస్ దుద్దెడ రైల్వే స్టేషన్ లో పుష్పాలతో స్వాగతం పలికారు. అనంతరం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో అనేక రకాలుగా తోడుంటుందని మోదీ 2016లో గజ్వేల్ లోని కోమటి బండకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభం చేయడానికి వచ్చినప్పుడు సిద్దిపేట మనోహరాబాద్ రైల్వే లైన్ కి శంకుస్థాపన చేశారన్నారు. నేడు నరేంద్ర మోడీ ఈ రైల్వే లైన్ ను, సర్వీస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని. కేంద్రం అనేక రకాలుగా రాష్ట్రానికి సహకారిస్తున్న ఇక్కడ ఉన్న మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డురంగా ఉందని ఇది మంత్రి గారి దగా రాజకీయానికి నిదర్శనం అన్నారు మంత్రి చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నలగామ శ్రీనివాస్, కార్యదర్శి కూడిక్యాల రాములు, బీజేవైఎం అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్, గడ్డమీది రామస్వామి, రాశుల కిసాన్ రావు, దాసరి భానుచందర్, నీల సత్యం, శ్రీహరి, తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్, జిల్లా బి జే పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నమ్ముకుంటే ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేస్తారు: మంత్రి హరీష్

కాంగ్రెస్ నమ్ముకుంటే ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేస్తారు: మంత్రి హరీష్

గజ్వేల్ యదార్థవాది ప్రతినిది

ములుగు మండలం బండ మైలారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బండ మైలారం గ్రామ రూపురేఖలు మార్చింది సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలతో వస్తుందని ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేస్తారని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నామని ఆయన అన్నారు. గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏళ్ళ నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారని, దేశంలో గజ్వేల్ పేరు, ప్రతిష్ట నిలబెట్టిన ఘనత సాధించారని ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో మన కేసీఆర్ ను గెలిపించాలని గ్రామ ప్రజలకు మంత్రి హరీశ్ పిలుపు నిచ్చారు.

విధుల పట్ల నిర్లక్షం వహించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న : పోలీస్ కమీషనర్

విధుల పట్ల నిర్లక్షం వహించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న : పోలీస్ కమీషనర్

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎ.వరప్రసాద్ సస్సెండ్ చేసిన పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం
నిజామాబాద్ జిల్లా పర్యటన నేపద్యంలో బందోబస్తు నిర్వహణ బాగంగా శ్రీ రామ గార్డెన్స్ లో ఇతర జిల్లాల నుండి వచ్చే సిబ్బందికి లైజనింగ్ అధికారిగా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. విధులు పట్ల నిర్లక్షం వహించి దగ్గరలోని మద్యం దుకాణంలో మద్యం సేవించి కొందరితో కొట్లాట పెట్టుకోవడంపై పై అధికారుల దృష్టికి రావడంతో క్రమ శిక్షణ చర్యలలో భాగంగా ఆదివారం కానిస్టేబుల్ నస్సెండ్ చేస్తు ఉత్తర్వులు జారి చేసిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ జారీచేశాసి తదుపరి పూర్తిస్థాయి ఎంక్వయిరీ కోసం టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి రాజశేఖర్ రాజు ఏర్పాటు చేయడం జరిగింది. విధుల నిర్లక్షం సహించేదిలేదని కమీషనర్ హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన: సునిత లక్ష్మారెడ్డి.

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన: సునిత లక్ష్మారెడ్డి.

మెదక్ యదార్థవాది ప్రతినిది

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాయి పెంటయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబాన్ని సోమవారం పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి.. ప్రభుత్వ పరంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం గూలోత్ తాండ గూగుల్లోతు రాములు నాయక్ నిన్న ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రాములు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సార రామా గౌడ్, స్థానిక ఎంపీటీసీ స్వప్న కిషోర్ గౌడ్, ఎంపీటీసీ గుంజరి ప్రవీణ్ కుమార్, నాగ్ సాన్ పల్లి సర్పంచ్ ఎల్లమయ్య, రాజీపేట ఉప సర్పంచ్ శివ, రాయిలాపూర్ శ్రీనివాస్ రెడ్డి ,మూత్రాజు పల్లి సర్పంచ్ సంజీవులు, మాజీ సర్పంచ్ పట్టాయ నాయక్, మనోహర్ రెడ్డి, వెంకటాపూర్ ఉప సర్పంచ్ మహేష్, బీ అర్ ఎస్ సోషల్ మీడియా కోర్డినేటర్ రామాంజనేయులు, సార ప్రతాప్ గౌడ్ ,శేకులు ,మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...