34.2 C
Hyderabad
Monday, April 20, 2026

సూపర్ మార్కెట్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి.!

సూపర్ మార్కెట్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి.!

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది

ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ లో నవీపేట్ కు చెందిన చిన్నారి కరెంట్ షాక్ తో మరణించింది.. సోమవారం నిజమాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఎన్ మార్ట్ సూపర్ సరుకులకు తండ్రితో కలసి రిషిత వెళ్ళింది అక్రమంలో రిషిత చాక్లెట్స్ కోసం సూపర్ మార్కెట్లో గల ఫ్రిడ్జ్ డోర్ కు తీయడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో పక్కనే ఉన్న తండ్రి పక్కకు లాగినప్పటికీ ఆ చిన్నారి సృహ కోల్పోయింది. వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో తరలించారు. అప్పటికే మృతి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. నందిపేట్ మండల కేంద్రంలో కనీస సౌకర్యాలు ప్రజల రక్షణకు చర్యలు తీసుకోకుండా ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ ను నిర్వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్ నిర్వాహకుల అలసత్వం వల్లే చిన్నారి బలైందని, చిన్నారి మృతికి కారణమైన ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన : ఎమ్మెల్యే

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన : ఎమ్మెల్యే

మెదక్ యదార్థవాది ప్రతినిది

మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.. మెదక్ జిల్లా పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా వచ్చి స్థానిక రాందాస్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి సేవ చేశారని తన ఆశయాలకు మనం కట్టుబడి ఉండి ముందుకు తీసుకువెళ్లాలని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడని దేశంలోనే ఏనాయకుడు చేపట్టనటువంటి సంక్షేమ పథకాలు మన తెలంగాణాలో మాత్రమే వున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

154వ మహాత్మా గాంధీ జయంతి.

154వ మహాత్మా గాంధీ జయంతి

మెదక్ యదార్థవాది ప్రతినిది

154వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ మాహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ నర్సాపూర్ కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, OBC బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాపగారి పెద్ద రమేష్ గౌడ్, బిజెపి ఎస్సీ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, మాజీ సర్పంచ్ నగేష్, కంది ప్రభాకర్, మరియు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మెదక్ యదార్థవాది

మెదక్ జిల్లా మండలం తిమ్మానగర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి బండి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా 154 వ మహాత్మ గాంధీ జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు వేణుగోపాల్ రెడ్డి, గౌతమి, వార్డ్ మెంబర్లు, యువజన సంగం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం NRGS గ్రామసభ నిర్వహించారు.

మండల సమీకృత కార్యాలయం ప్రారంభించనున్న : మంత్రి హరీష్ రావు

మండల సమీకృత కార్యాలయం ప్రారంభించనున్న : మంత్రి హరీష్ రావు

కొండపాక యదార్థవాది

రాష్ట్ర ముఖ్య మంత్రి స్వంత జిల్లా నియోజక వర్గ కొండపాక మండల అన్నీ శాఖల కార్యాలయాలు ఒకే దగ్గర ఉండాలనీ సుమారు 7.82 కోట్ల వ్యయంతో అన్నీ వసతులతో నిర్మించిన సమీకృత కార్యాలయ భవన సముదాయాల ప్రారంబానికి మంగళవారం వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నరని స్థానిక కొండపాక ఎంపీపీ సుగుణ దుర్గయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరీష్ రావు, ఆధితులుగా జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారని వారు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిటిసిలు గురజాడ బాలాజీ, పత్తి ఆంజనేయులు, ఖమ్మంపల్లి యాదగిరి, ఏ ఈ తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలి.

జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని తేవాలి.

– గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తు నిరసన తెలిపిన కొండపాక జర్నలిస్టులు.

కొండపాక యదార్థవాది

మండల పరిధిలోని దుద్దెడ రోడ్డుగాంధీ చౌరస్తాలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు “సేవ్ జర్నలిజం” నినాదం తో అక్టోబర్ 2 మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని సోమవారం కొండపాక జర్నలిస్టుల గౌరవ సలహా దారులు చిలుముల వెంకటేశం, జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు నిమ్మ నరసింహ రెడ్డి, సిద్దిపేట జిల్లా టీయూడబ్లుజే కార్యవర్గ సభ్యులు నర్ర సాయి చందర్, ఆధ్వర్యంలో దుద్దెడ మహాత్మ గాంధీ విగ్రహం వద్ద కొండపాక జర్నలిస్ట్ లు అందరూ కలసి నల్ల బ్యాడ్జీ లు ధరించి మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జాతీయ మీడియా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలనీ, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనీ, అక్క్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు కేంద్రం రైల్వే పాసులతోఇవ్వడంతో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపాక జర్నలిస్టులు వడ్లకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కుసుంబ శ్రీనివాస్ రావు , గోనె రమేష్, జర్నలిస్టులు పాలడుగు బాల్ రెడ్డి, కాసాని బుచ్చిరెడ్డి, సావిలి పురుషోత్తం పటేల్, వడ్లకొండ సాగర్, పెద్దంకుల నాగరాజు,కానుగంటి సురేష్, కృష్ణారెడ్డి, అక్బర్ పాషా, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛభారత్ తోనే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.

స్వచ్ఛభారత్ తోనే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

చెత్త రహిత దేశంగా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. మాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని భారతదేశంలోని ప్రజలందరూ భాగస్వామ్యం కావాలంటూ మోదీ పిలుపుతో ఆదివారం హుస్నాబాద్ పట్టణం బిజెపి అధ్యక్షుడు బత్తుల శంకర్ ఆధ్వర్యంలో ప్రజలు యువకులు ఎంఈఓ కార్యాలయం లోని పిచ్చి మొక్కలు గడ్డి చెత్తాచెదారం తీశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హాజరై కార్యకర్తలతో పాటు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ నేడు గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛత వైపు పయనిస్తూ స్వచ్ఛ సర్వేక్షలో ముందుకు సగుడమని, మనం నివసించే ఇంల్లు గల్లిలలో పరిశుభ్రంగా ఉంచాడం వల్ల ఆరోగ్యాలు మన జీవన విధానంలో కూడా మార్పు వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, జిల్లా కోశాధికారి కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణు యాదవ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొనగిరి రవి, తోట సమ్మయ్య, గాదాసు రాంప్రసాద్, బోగా మహేష్కర్, బొప్పిశెట్టి భీమేశ్వర్, వేల్పుల నాగార్జున్, ఎగ్గోజు రాజు, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, లకవత్ శారద, పెందోట భూశంకరాచారీ, లక్ష్మయ్య, బుర్ర రాజు, నారోజు నరేష్, ఎర్రోజు సాయికృష్ణ, అశోక్, అంజి, ప్రభాస్, భగవాన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విఎస్ఎస్ కన్వెన్షన్ హల్ ప్రారంభించనున్న : మంత్రి హరీష్ రావు

విఎస్ఎస్ కన్వెన్షన్ హల్ ప్రారంభించనున్న : మంత్రి హరీష్ రావు

సిద్దిపేట యదార్థవాది 

సిద్దిపేట జిల్లా పట్టణంలో కరీంనగర్ రహదారి పైనున్న రంగనాయకుల గుట్ట పక్కన నిర్మించిన వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్ ప్రారంభోత్సవం సోమవారం ఉ.10.30 గంటలకు జరుగుతుందని విఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం కన్వెన్షన్ ఆవరణలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు కొమరవెల్లి అంజయ్య,  మురం శెట్టి రాములు, గంప శ్రీనివాస్,  కొర్తివాడ లక్ష్మణ్, ఐతరత్నాకర్, గంప రామచంద్రరావు, దుర్గాప్రసాద్, గట్టు సదానందం, కొర్తివాడ రాజేందర్ , జూలూరి సుధాకర్, జగదీశ్వర్ శ్రీనివాస్ , శివ, అశోక్ లు మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆశీస్సులతో నిర్వహించే ఈ ఉత్సవంలో జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ ,  మున్సిపల్ ఛైర్ పర్సన్ కడవేర్గు మంజుల, ఎమ్మెల్సీలు కూర రగోతం రెడ్డి , దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎమ్మెల్యే బీగాల గణేష్ , రాష్ట్ర టూరిజం శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ తదితరులు  పాల్గొంటారని తెలిపారు. ట్రస్టు ద్వారా నిర్వహించే కన్వెన్షన్ నుంచి వచ్చే ఆదాయాన్ని  పేద ఆర్య వైశ్య వర్గానికి చెందిన వారికి  విద్య , వైద్యములతో పాటు సామాజిక సేవా కార్యక్రమం కోసం వినియోగిస్తామని ప్రకటించారు.

మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు విష్వశాంతికి మార్గదర్శాకాలు

మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు విష్వశాంతికి మార్గదర్శాకాలు

* యావత్తు మానవాలికి మొహమ్మద్ చివరి ప్రవక్త .
* తోటి మానవులతో సద్భావనే నిజమైన జీవితం

* ఘనంగా మిలాద్-ఉన్-నబి

* సిద్దిపేట లో భారీ శాంతి ర్యాలీ

సిద్దిపేట యదార్థవాది

ఇస్లాం ధర్మం శాంతికి నిదర్శమని, శాంతి, సమసమాజ స్థాపనే ఇస్లాం ముఖ్య ఉద్దేశ్యం అని ఉలేమాలు, తంజీమ్ ఉల్ మసాజిద్ ఇంచార్జ్ అధ్యక్షులు నయ్యర్ పటేల్ అన్నారు. ఆయన ఒక్క ఇస్లాం ధర్మనీకె కాకుండా ఆయన మొత్తం మానవాళికి ప్రవక్త అన్నారు. మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పస్బానే మిల్లత్ మిలాద్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు జీవన విధానానికి సూచికలు అని అన్నారు. ర్యాలీ పట్టణంలోని బస్టాండ్ వద్దగల ఫిర్దౌస్ మస్జీద్ నుండి ప్రారంభమయిన ర్యాలి మెదక్ రోడ్డు గుండా మహాత్మాగాంధీ పార్క్ వద్దనుండి సాగుతూ ఇక్బాల్ మినార్ మీదుగా ముస్తాబద్ చౌరస్తా నుండి తిరిగి ఈద్గా వద్ద ఉన్న దర్గా లో ప్రార్థన చేసేవరకు కొనసాగింది..ప్రార్థనల అనంతరం సొసైటీ , ముస్లిం మత పెద్దలు మౌలానా ఖురేషి,మొహమ్మద్
రఫీ,మొహమ్మద్ గౌస్, కరీం పటేల్, మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త కారణ జన్ముడని ఆయన చూపిన బాటలో నడిస్తే జీవితం అంత సుఖ శాంతులతో నడుస్తున్నది అన్నారు. ఆయన మొత్తం మానవాళికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. మన తోటి వారు తిన్నారో లేదో తెలుసుకోకుండా మనం తినవద్దని సూచించారని …ఒక్క మానవుని అకారణంగా హతమార్చితే మొత్తం మానవాళిని హతమార్చిన పాపమ్ మూతగట్టుకున్నట్టే నని హితబోధ చేశారన్నారు… ఇప్పటికి స్త్రీలపై వివక్ష ఉందని కానీ మహిళలకు ఉన్నతమైన స్తానాన్ని కల్పించిన ఘనత మొహమ్మద్ ప్రవక్త దేనన్నారు… తండ్రి ఆస్తిలో సమాన భాగాన్ని ఆయన స్త్రీలకు అందేశారని గుర్తుచేశారు… సహనం,ఓపిక,శాంతి,ధర్మం, లాంటి నిరడంబరా జీవితం ఎవరైతే గడుపుతారో వారు భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రులు అవుతారని ఉద్ఘాటించారు.. తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని…తండ్రి స్వర్గం తెరిచే ద్వారామని ఆయన బోధించారు.తల్లి దండ్రులకు మీరు సేవిస్తే జీవితం సఫలమైనట్టేనాని తెలిపారన్నారు… ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గంగ జమున తహజీబ్ తో కలిసి ఉండాలని సూచించారు. సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి, సీఐ లు కృష్ణ రెడ్డి, రవి కుమార్,రామకృష్ణ,చేరాలు, భాను ప్రకాష్ ల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఏసీపీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రాలి శాంతియుతంగా నిర్వహించారని కొనియాడుతూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం అన్న వితరన కార్యక్రమం నిర్వహించారు.

ఆశ వర్కర్ల సమస్యపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: చాడ వెంకటరెడ్డి 

ఆశ వర్కర్ల సమస్యపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: చాడ వెంకటరెడ్డి 

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలని  18000 వేల వేతనం ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె 5వ రోజు సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్తలకు సంఘీభావంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు అనేక పని ఒత్తిడిని తట్టుకొని ప్రజలకు  నిత్యం వైద్య సేవలు అందిచటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఆశాలకు కనీస వేతన నిర్ణయం చేయాలని సమ్మె చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కనీస వేతనం18000 వేలు పెంచెంత వరకు పోరాటం సాగించాలని, ప్రభుత్వం వెంటనే ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం చర్చలకు పిలవాలని చాడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ఆశా కార్యకర్తలను దేవతలు అని పొగిడిన పాలకులు కనీస వేతనం నిర్ణయం చేయడానికి చలనం లేదని అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన మహిళ సైనికులు ఆశా కార్యకర్తలని ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కంటి వెలుగు, లెప్రసీ, మలేరియా, టిబి, షుగర్ వంటి దీర్ఘ కాలిక వ్యాధుల  గుర్తింపులో అత్యున్నత పాత్ర పోషిస్తున్నా ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు లేఖ రాస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ,సిపిఐ మండల నాయకులు ఎర్రవెల్లి తిరుపతి,ఆశా కార్యకర్తలు దుబాల రజిత, జాల వాణి, ఉమ్మపుర్ రేనుక, బొద్దుల వెన్నెల, చింతల పూజ, తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...