32.2 C
Hyderabad
Monday, April 20, 2026

దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న: రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్

దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న: రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్

– దేశంలో దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

– పనిచేసే ప్రభుత్వాన్ని దివ్యాంగులు ఆశీర్వదించాలి..

– హుస్నాబాద్ నియోజకవర్గం లో 11, 800ల దివ్యాంగులు..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ లో నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం పోతారం (ఎస్) శుభం గార్డెన్ లో నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్, స్ధానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ బాబు, హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో దివ్యాంగులను గుర్తించి దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ 4016 రూ. ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమని, దేశంలో బిజెపి, కాంగ్రెస్, ఇతర పార్టీలు పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఇచ్చినట్లుగా పెన్షన్లు ఇవ్వటం లేదని ఎద్దేవా చేశారు ఇది సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా వుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కేవలం సతీష్ కుమార్ తోనే సాధ్యమని మూడోసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నరు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాదని, దివ్యాంగులకు అడగకుండానే 4016 రూపాయల పెన్షన్ ఇస్తూ దివ్యాంగులకు అండగా నిలిచాడని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దివ్యాంగులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మనల్ని ఆదరించలేదన్నారు. దివ్యాంగులకు అవసరమైన వారికి వీల్ చైర్లు వాహనాలు కూడా అందిస్తున్నారని మరొకసారి రాష్ట్రంలో దివ్యాంగులు బీఆర్ఎస్ పార్టినే గెలిపించుకోవాలని ఇది మన ప్రభుత్వం అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ పిలవగానే పెద్ద ఎత్తున హాజరైన దివ్యాంగులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 11,800 మంది దివ్యాంగులు ఉన్నారని ప్రతినెల 4,73,88,800 రూపాయలు అందిస్తున్నామని మూడవసారి హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ చల్లని మనసుతో ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో నాయకులు శీలం రాజిరెడ్డి, మెడబోయిన వెంకటేష్, నవీన్ రెడ్డి,సరిత ,ఆవుల పద్మ, రాజు ,సంపత్, రాజశేఖర్ రెడ్డి, సమ్మయ్య, లింగయ్య, కనకయ్య, శ్రీనివాస్, బిక్షపతి, సత్తయ్య ,తదితరులు హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన దివ్యాంగులు.

నేడు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న వృద్ధులు: జేడ్ చైర్ పర్సన్ అరుణ

నేడు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న వృద్ధులు: జేడ్ చైర్ పర్సన్ అరుణ

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.. అదివారం తెలంగాణ ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పథకాల వివరించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విధానం అలాగే వృద్ధులు ఆత్మగౌరవం తోటి జీవిస్తున్న విషయం గురించి వివరించారు. అలాగే జిల్లాలో ఎల్లారెడ్డిపేటలో మండేపల్లిలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహణ గురించి అలాగే వయో వృద్ధులకి ఫిజియోథెరపీ సేవలు వివిధ పథకాల కింద అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వయోవృద్ధుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని దాన్లో భాగంగా వారి హక్కులను కాలరాసే పిల్లలపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం ఉందని వివరించారు. ఆకునూరి శంకరయ్య జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని అవగాహన చేసుకుని ప్రేమతో చూసుకోవాలని, తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. వాళ్లు వయసులో మాత్రమే వృద్ధులని అనుభవంలో మరింత జ్ఞానం పొందిన వారని వివరించారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఓటు హక్కు గురించి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహులు ఓటు హక్కు గురించి, ఓటు వేసే విధానం గురించి, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనందం మాట్లాడుతూ ఆస్తిపాస్తులు లాగేసుకొని నిర్లక్ష్యం వహిస్తే ఫిర్యాదు చేసి తగు న్యాయం పొందవచ్చని సూచించారు ఈ సందర్భంగా వయావృద్ధుల హెల్ప్ లైన్ సేవల గురించి, హెల్ప్ లైన్ 14567 అందిస్తున్న సేవల గురించి, వయోవృద్దుల సంక్షేమ శాఖ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మి రాజం వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య, కార్యదర్శి డా .జనపాల శంకర్, కోశాధికారి వెల్దండ దేవదాసు, డి హబ్ కో ఆర్డినేటర్ రోజా, సిడిపివోలు ఆనందిని, సుచరిత, సఖి కేంద్రం పద్మ, టీఎన్జీవో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు ఫీల్ రెస్పాన్స్ ఆఫీసర్ సంతోష్ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు.

స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్న వ్యవసాయ కళాశాల విద్యార్థులు

స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్న వ్యవసాయ కళాశాల విద్యార్థులు.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

భారత ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని 15 సెప్టెంబర్ నుండి 02 అక్టోబర్ వరకు జరుపుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ తారీఖ్ – ఏక్ గంట కార్యక్రమాన్ని 01 అక్టోబర్ 2023 తేదీన ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రమదానం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుమేరకు బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల జాతీయ సేవా పథకం యొక్క విద్యార్థి వాలంటీర్లు జిల్లెల్ల పల్లె దవాఖాన నూతన గ్రామపంచాయతీ పరిసరాల్లో చెత్తను శుభ్రం చేశారు. అంతేకాకుండా స్వచ్ఛతను ఇంటా బయటా గ్రామంలో ప్రతి చోట పాటించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవా పథక పర్యవేక్షణ అధికారులు డాక్టర్ టి అరుణ్ బాబు, కె భవ్య శ్రీ, విద్యార్థులు, జిల్లెల్ల గ్రామ సర్పంచ్ మాట్ల మధు, అంగన్ వాడి సిబ్బంది మరియు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి పనులను కేత్ర స్థాయిలో పరిశీలించిన: జిల్లా కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రి పనులను కేత్ర స్థాయిలో పరిశీలించిన: జిల్లా కలెక్టర్

– అతి త్వరలో ప్రారంబానికి సిద్ధం కావాలి..
– ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ వైద్యం..

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో ఆదివారం క్షేత్ర స్థాయిలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృడ సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టు 1000 పడకల ఆసుపత్రిని అతి త్వరలో ప్రారంభించేందుకు సిద్దం చెయ్యాలని అధికారులకు సూచించారు. చిన్న చిన్న పనులు సైతం వేగంగా పూర్తి చేయ్యాలని ఆసుపత్రిలో పడకలు, ఫర్నీచర్, మార్టిన్స్, కర్టేన్స్ అలాగే ప్రతి డిపార్ట్మెంట్ డెంటాలజి, ఈఎన్జి, పారామెడికల్, ల్యాబ్, ఆప్తామాలజి డాక్టర్ల సిబ్బంది పరికరాలు అన్ని సమకూర్చుకోవాలి ప్రజలకు మెరుగైన వైద్య అందించేందుకు సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ సులభంగా అర్థం అయ్యేలా ప్రతి రూం కి నంబర్లు, పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చెయ్యాలని బయట లాన్లో పెద్ద మొక్కలు పెట్టి గడ్డి కార్పెట్ పరచాలి. అన్ని పనులు పూర్తి చేసి పూలదండలతో అందంగా ముస్తాబు చెయ్యాలని అధికారులకు తెలిపారు. కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్, డిఎంఈ రమేష్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా. కాశీనాథ్, టిఎస్ ఎంఎస్ఐడిసి ఎండి కె. చంద్రశేఖర్ రెడ్డి, సిఈ రాజేందర్ కుమార్, ఎస్ఈ సురేందర్ రెడ్డి, డిఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్, కాంట్రక్టర్ బాపినీడు మెడికల్ కళాశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.

ప్రతీ ఒక్కరు స్వచ్ఛత వైపు నడవాలి..

ప్రతీ ఒక్కరు స్వచ్ఛత వైపు నడవాలి..

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛంజలి స్వచ్ఛభారత్ నినాదంతో స్థానిక పాత బస్టాండ్ వద్ద చెత్తను తీసి రోడ్డు వుడ్చిన జిల్లా నాయకులు కార్యకర్తలు… సిరిసిల్ల జిల్లా పట్టణంలో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛంజలి స్వచ్ఛభారత్ 2.0 కార్యక్రమం పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రెటరీ రెడ్డబోయిన గోపి, ఆడేపు రవీందర్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ నేడు గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛత వైపు పయనిస్తూ స్వచ్ఛ సర్వేక్షలో పోటీ పడుతున్నాయి.. ఎందుకు నిదర్శనమే కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తూ పోటీ తత్వాన్ని నేర్పిస్తుందని అందువల్ల ప్రజలు స్వచ్ఛత వైపు నడుస్తూ గ్రామాలను పట్టణాలను అభివృద్ధిలో మందుకు సాగుతున్నాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాజుల వేణు, సుంచు ప్రకాష్, గాజుల సదానందం, తడుక విజయ్, గుండెల్లి వేణు, చొప్పదండి శ్రీనివాస్, పోతూ శ్రీనివాస్, నరహరి, మురళి, వంశీ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు..

అభిమానులు, కార్యకర్తలే బలం.. నా బలగం: ఎమ్మెల్యే సతీష్ బాబు..

అభిమానులు, కార్యకర్తలే బలం.. నా బలగం: ఎమ్మెల్యే సతీష్ బాబు..

– పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు..

-కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నా అదృష్టం..

– హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్దే నా పరమావధి..

-ఎమ్మెల్యే వొడిదల సతీష్ కుమార్..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

పుట్టిన రోజు సందర్భంగా వేలాదిమంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే సతీష్ కుమార్.. హుస్నాబాద్ పట్టణంలో శనివారం కార్యకర్తలు, యువకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల మధ్యలో కేక్ కట్ చేశారు.. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి గజమాలతో సత్కరించారు డప్పు చప్పులతో, టపాసులు కాలుస్తూ కోలాహలంగా వేడుకలు నిర్వహించారు.. స్ధానిక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులు వొడితల సతీష్ కుమార్ – షమితమ్మ.. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ పార్టీ అన్ని మండలాల నాయకులు మున్సిపాలిటీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు వేలాదిగా తరలివచ్చి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభిమానులు బీఅర్ఎస్ కార్యకర్తలే బలం.. నా బలగం
పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ పుట్టినరోజు సందర్భంగా ఇంకా బాధ్యత పెరిగిందని హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకు ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇంకా విస్తృతంగా ప్రజలకు సేవ చేస్తానని, నియోజకవర్గంలో విద్య, వైద్యం, సంక్షేమం, ఉపాధి కల్పనల రంగంలో వేలకోట్లతో నిధులు తెచ్చి అభివృద్ధి పరిచానని, ఇటీవల హుస్నాబాద్ ఐఓసిని కూడా ప్రారంభించుకున్నామని అభివృద్ధి విషయంలో సహకరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం కీర్తికిరీటంలో కలికితురాయి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశానని ఈ ప్రాజెక్టును త్వరలో సీఎం కేసీఆర్ చేతిలో మీదుగా ప్రారంభించి గోదావరి జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ఆయన తెలిపారు.

ఘనంగా భారత తొలి పాత్రికేయులు రామానంద చటర్జీ వర్ధంతి వేడుకలు..

ఘనంగా భారత తొలి పాత్రికేయులు రామానంద చటర్జీ వర్ధంతి వేడుకలు..

మెదక్ యదార్థవాది

రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ కౌడిపల్లి వారి ఆధ్వర్యంలో భారతదేశపు తొలి పాత్రికేయులు రామానంద చటర్జీ 80వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం కేంద్రంలో రామనంద చటర్జీ పేరుతో నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ భవనంలో అధ్యక్షుడు నాగరాజు చారి ఆధ్వర్యంలో రామానంద చటర్జీ 80 వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం రామానంద చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చటర్జీ వర్జంతి సందర్భంగా జర్నలిస్టులు రెండు నిమిషాలు మౌనం పాటించి మాట్లాడుతూ రామానంద చటర్జీ పేరుతో కౌడిపల్లి లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం అని రామానంద చటర్జీ దేశంలోనే మొట్టమొదటి పాత్రికేయులు అని దేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. చాటర్జీ బడుగు బలహీన పేద ప్రజల సమస్యలను అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళే వారని మనం కూడా కౌడిపల్లి రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ పేరును నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కౌడిపల్లి జర్నలిస్టులు భరత్ గౌడ్, నాగరాజు, సత్యానందం, రాజు, సైపోద్దీన్, సత్య గౌడ్,శ్రీకాంత్, రవికుమార్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, అతిథులుగా కౌడిపల్లి యువసేన అధ్యక్షులు పోల నవీన్, సభ్యులు రాజశేఖర్, రాజు,సందీప్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీజలో చిరునవ్వులు వెళ్లువిరువాలి: మంత్రి హరీష్ రావు.

శ్రీజలో చిరునవ్వులు వెళ్లువిరువాలి: మంత్రి హరీష్ రావు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

రాష్ట్ర ఆర్థిక,వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహం ప్రారంభించారు.. ఈ సందర్భంగా శిశుగృహలో మానవీయ కోణం ఆవిష్కృతమైంది. శిశు గృహలో అనాధ శిశువులను మంత్రి హరీశ్ పరిశీలిస్తున్న క్రమంలో 3 నెలల వయస్సున్న చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడటంతో ఆ పాపను ఎత్తుకొని ఇంకా పేరు పెట్టని ముద్దులోలుకుతున్న ఆ చిన్నారికి శ్రీజ అని పేరు పెట్టి శ్రీజ ముఖంలో ఎప్పటికి చిరునవ్వులు తొలగని విదంగా తల్లిదండ్రులు లేని లోటు కనబడకుండా ఆనందంగా పెరిగి నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించేలా శిశు గృహ అధికారులు ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోని ఇలాంటి అనాధ పిల్లల సేవచేయడం ప్రజా ప్రతినిధులుగా మాకు చాలా సంతృప్తిని ఇస్తుందని అనాధ శిశువులందరినీ శిశు గృహ అధికారులు సొంత బిడ్డల లాగా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
– సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులో నిరుపేద తల్లి 3 నెలల ఈ చిన్నారిని (శ్రీజ) ను విక్రయిస్తుండగా జిల్లా బాలల సంరక్షణ అధికారులు తల్లి నుండి చిన్నారిని తీసుకొని లీగల్ గా శిశు గృహలో చేర్పించి అలనా, పాలనా చూస్తున్నారు…

మహిళా భద్రత కోసం సీఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారు: డీజీపీ అంజనీ కుమార్

మహిళా భద్రత కోసం సీఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారు: డీజీపీ అంజనీ కుమార్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా పట్టణంలో భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అడిషనల్ డిజిపి ఉమెన్ సేఫ్టీ శిఖా గోయల్ తో కలసి ప్రారంబించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. శనివారం నూతనంగా నిర్మించిన భరోసా, సఖి సెంటర్లు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ మహిళా భద్రత కోసం ఎంతో కృషి చేస్తున్నారని 2014లో ప్రారంభం చేసిన ఈ సెంటర్ లు దేశానికే ఆదర్శం నిలుస్తున్నాయని అన్నారు..

అడిషనల్ డిజిపి ఉమెన్ సేఫ్టీ శిఖా గోయల్ మాట్లాడుతూ రాష్టం మొత్తం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని దేశంలో తెలంగాణలో మాత్రమే ప్రతి పోలీస్ స్టేషన్ లో మహిళా విభాగం కలిగి ఉందని మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి రాష్టంలోని చిన్నారులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు..

రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడరు మహిళా సంరక్షణ కోసం సఖి భరోసా, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లతో పాటు బాల రక్ష భవన్ కేంద్రం కలిపి ఒకే చోట ఏర్పాటు. ఇక్కడ బాధిత మహళలకు వ్యక్తిగత గోప్యతతో పాటు కౌన్సిలింగ్ లీగల్ సపోర్ట్ తో కూడిన రక్షణ లభిస్తుందని ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందని అందరికీ తెలిసేలా చర్యలు చేపడతామని తెలిపారు. సిఎస్ఆర్ ద్వారా 1.8 కోట్ల రూపాయలతో నిర్మించిన్ గొవ్రో పెట్రో కెమికల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఆకర్షణ లైబ్రెరీని అందించినందుకు మంత్రి వారికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్రం నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల తదితరులు.

భరోసా, సఖి కేంద్రం సిద్దిపేట

మంత్రి తారక రామారావు పర్యటనకు సర్వం సిద్ధం

మంత్రి తారక రామారావు పర్యటనకు
సర్వం సిద్ధం.

రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనకు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్..

జగిత్యాల యదార్థవాది ప్రతినిది

అక్టోబర్ 3 న రాష్ట్ర ఐ.టి, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.ఆర్.ధర్మపురిలో పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా, ఎస్పి ఎగ్గడి భాస్కర్ తో కలిసి మాతా శిశు కేంద్రం, ఫైలాన్, హెలిప్యాడ్ కళాశాల మైదానాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.. నూతనంగా నిర్మాణం అవుతున్న పైలాన్ బహిరంగ సభా స్థలి, కావాల్సిన ఏర్పాట్లు, మాతా శిశు ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవాల్లో తీసుకువాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్, ఎస్పిలకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివాకర, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జెడ్పిటిసి బత్తిని అరుణ, మున్సిపాలిటి వైస్ చైర్మన్ రామన్న, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ చైర్మన్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...