32.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

గణేష్ లడ్డుకు మండల స్థాయిలో బారి డిమాండ్.

గణేష్ లడ్డుకు మండల స్థాయిలో బారి డిమాండ్.

మెదక్ యదార్థవాది ప్రతినిది

సత్యా గ్రూప్ ఆఫ్ బిల్డర్స్, ఎయిర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈవో, కుమ్మరి సతీష్ నవరాత్రులు పూజలు అందుకున్న గ్రామంలోని గణనాథుని లడ్డుని రూ. 85116 దక్కించుకున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో దొడ్డి కాడి గణేష్ మండపం లడ్డూ వేలం పాటలో మండల స్థాయిలో అత్యధిక ధర పలకడం మన సంస్కృతి సంప్రదాయాలు నిదర్శనం.. గ్రామంలోని ప్రజలు ఆటపాటలతో గణేశుని నిమజ్జన్ని ఘనంగా నిర్వహించారు. నిమర్జనం లో బాగంగా గ్రామంలోని చిన్నలు పెద్దలు యువకులు బారిగా పాల్గొన్నారు.

మంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.

మంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.

యదార్థవాది కొండపాక

ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి పెంచిన వేతనాలు ,పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రామిక, మహిళ జిల్లా కార్యదర్శి దాసరి కళావతి డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి కార్మికుల సమస్యలతో డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దాసరి కళావతి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జులై15న పత్రికసమవేశంలో చెప్పిన మాట నేటికీ అమలు కాకపోవడం శోచనీయమని అన్నారు.
పెండింగ్ బిల్లులు మూడు నాలుగు నెలల నుండి ఇవ్వకపోవడంతో, కార్మికులు లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఇబ్బందులకు గురవుతున్న్నానారని కార్మికులకు రూ. 3000 ఇస్తానని ప్రకటించి నేటికి 5 నెలలు కావస్తున్న అమలు జరపకపోవడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. కొత్త మెనూ పెట్టాలని చెప్పడం తప్ప దానికి బడ్జెట్ కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 18,000 వేలు ఇవ్వాలని, కార్మికులందరికీ ప్రమాద బీమా, ఈఎస్ఐ, పీఎఫ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కార్మికులందరికీ రెండు జాతల దుస్తులు వంట పాత్రలు ఇవ్వాలని తెలిపారు.ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి పరిష్కరించాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొండపాక మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ బాల లక్ష్మి నాయకులు బైరెడ్డి నీలారెడ్డి, భాషయ్య పోశవ్వ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి వికాసానికి గురువు మార్గదర్శి : మహిళ కమిషన్ ఛైర్పర్సన్

వ్యక్తి వికాసానికి గురువు మార్గదర్శి : మహిళ కమిషన్ ఛైర్పర్సన్

మెదక్ యదార్థవాది ప్రతినిది

వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ & చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందచేసిన సునీత లక్ష్మారెడ్డి. శుక్రవారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలో వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్, చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో విద్యా రంగంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అందచేసి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనదని, తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది మాత్రమేనని అన్నారు. ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నదంటే గురువుల పాత్ర ఎంతో ముక్యం సమాజాం జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతారని, జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతాడు అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి, తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలను… విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు, స్మరించుకునేందు గానూ సెప్టెంబర్ 5న “ఉపాధ్యాయ దినోత్సవం”గా “గురు పూజోత్సవం”గా జరుపుకుంటున్నమని అన్నారు.

చిన్నారి ఆరోగ్యానికి అండగా మంత్రి హరీష్ రావు

చిన్నారి ఆరోగ్యానికి అండగా మంత్రి హరీష్ రావు

కొండపాక యదార్థవాది

కొండపాక మండల పరిదిలోని దుద్దెడ గ్రామానికి చెందిన చిలుముల నర్సిములు కూతురు వైష్ణవి గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఈవిషయమై బీఅర్ఎస్ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుక వెళ్ళారు. వెంటనే స్పందించిన మంత్రి వైద్యానికి అయ్యే ఖర్చు నిమిత్తం
శుక్రవారం మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రెండు లక్షలయాభై వేల రూపాయలు మంజూరు లోన్ ఆఫ్ క్రెడిట్ పత్రన్ని వైష్ణవి తండ్రి నర్సిములు కు అందించారు , తన కూతురు ఆరోగ్యానికి సహాయం అందించిన ముఖ్య మంత్రికెసిఆర్ కు మంత్రి హరీష్ రావుకు, నూనె కుమార్ యాదవ్ కు ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మత్స్యకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన: ఎమ్మెల్యే వొడితల సతీష్

– ఎల్లమ్మ చెరువులో మూడు లక్షల చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మూడు లక్షల చేప పిల్లలను వదిలిన రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 49,87, 876 చేప పిల్లలను వదులుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈరొజు సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారులు నేడు తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు చేపలు పట్టుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు చెరువులకు ప్రభుత్వం హక్కు కల్పించి చేప పిల్లలను రాష్ట ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తద్వారా పెరిగిన చేపలను మత్స్యకారులు పట్టుకుని వాటిని అమ్ముకొని వారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని తద్వారా గణనీయమైన తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు. గురువారం పోతారం (ఎస్ )శుభం గార్డెన్ లో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన మత్స్యకారులకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి గుర్తింపు కార్డులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ లు అందించారు. రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ పురుషుల మత్స్యకారుల సొసైటీ ఉన్నట్లుగానే మహిళలకు కూడా మత్స్యకారుల సొసైటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, మత్స్యకారులకు టూవీలర్లు, ఆటోలు గతంలో అందించినట్లుగా త్వరలో అందిస్తామని మత్స్యకారుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం మనసున్న మహారాజు సిడి ఆవిష్కరణ కోతి దీక్షిత, ఆశ్విక్ సమర్పించు, ముక్కెర సంపత్ కుమార్ రచించిన గీతాలు సిడి మనసున్న మహారాజు మన హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ సతీష్ కుమార్ సిడీలను రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు ఇందులో ఆడియో, వీడియో పాటలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి అక్కన్నపేట ఎంపీపీ మంగ రజిత పెద్ద ఎత్తున మత్స్యకారులు మహిళలు, పురుషులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో చాగంటి ప్రవచనాలు.

సిద్దిపేటలో చాగంటి ప్రవచనాలు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

ప్రాఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు సిద్ధిపేట కు రానున్ననారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,2 తేదీల్లో మూడు రోజుల పాటు సిద్దిపేట జిల్లా పటణంలోని డిగ్రీ కళాశాల మైదానం లో ఆయన ప్రవచనాలు చెప్పనున్నారు. ఆధ్యాత్మిక రంగం లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. భారత, రామాయణ, భాగవత ఇతిహాసాలు. వేదాల సారాన్ని పురాణేతిహాసాల్ని అనేక కొణాల్లో అధ్యయనం చేసిన చాగంటి వాటి సారాన్ని పండితులకు, పామరులకు అర్థమైయ్యే రీతిలో ప్రసంగాలు చేయటంలో దిట్ట.. మానవ సమాజం లో అడుగంటు తున్న విలువలను తిరిగి ప్రతిష్టించడం కోసం, మానవ సమాజాన్ని మంచి వైపు నడిపింంచడం కోసం ఆయన ప్రవచనాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రలతో పాటు దేశవ్యాప్తంగా ఆయన ప్రవచనాలు నిర్వి రామంగా కొనసాగుతున్నాయి. తన జ్ఞాన సంపదను మానవ సమాజానికి పంచుతున్నారు. ఇలాంటి మహనీయుల సందేశాన్ని ఇప్పించాలనే సంకల్పం తో మంత్రి హరీష్ రావు చాగంటి కోటేశ్వర్ రావు ను సిద్దిపేట కు ఆహ్వానించి “మానవీయ విలువలు ” అనే అంశంగా ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పాలని ఆయనను ప్రత్యేకంగా కోరారు. మంత్రి ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,2 తేదీల్లో సిద్దిపేట కు రావడానికి అంగీకరించారు. ఈ ఏర్పాట్లను సిద్దిపేట ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు శివ్వ శ్రీనివాస్, రావిచెట్టు హనుమాన్ దేవాలయ అర్చకులు వైద్య కృష్ణమాచార్యులు డిగ్రీ కళాశాల మైదానం వేదికగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,2 తేదీల్లో  మూడురోజుల పాటు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ప్రవచనం ఉంటుందని ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయాని తెలిపారు. సుమారు 10 వేల వరకు ప్రవచనాలు వినడానికి వస్తారాని అంచనా వేస్తున్నామని అందుకనుగుణంగా సీట్లు ఏర్పాట్లు చేస్తున్నామని వచ్చే భక్తుల కోసం మంచినీటి వసతి, అత్యవసరమైతే వైద్య చికిత్స కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపు, ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రవచనాలు వినడానికి వచ్చే వారికి ప్రవచన అనంతరం ప్రసాద వితరణ చేస్తున్నామని మైదానం లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామని, మంత్రి ఆదేశం మేరకు సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది సానిటైజేషణ్ పనులను నిర్వహిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట పోలిస్ కమిషనర్ శ్వేత, అసిస్టెంట్ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. జిల్లా ప్రజలు పెద్ద సంఖ్య లో హాజరు కావాలని సిద్దిపేట ఉత్సవ సమితి పక్షాన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశం లో కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు జిల్లా శ్రీనివాస్, అనిల్ శ్రీనివాస్, టి. మధుసూదన్, గంప శ్రీనివాస్, కూర శ్రీనివాస్, శరభయ్య, క్యాస కాశినాథ్, పోశెట్టి శ్రీకాంత్, జిల్లా ఉదయ్,చింత శ్రీనివాస్, గంప నవీన్, గందే ఎల్లేశం, కూర శెషి తదితరులు పాల్గొన్నారు.

భారాస లోకి భారీగా చేరికలు

భారాస లోకి భారీగా చేరికలు

మెదక్ యదార్థవాది ప్రతినిది

మెదక్ జిల్లా మండల పరిధిలోని రాజపల్లి కి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి పార్టీలో చేరుతున్న వారుకి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పార్టి కడువ కప్పి ఆహ్వానించి మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంతిగా మన కేసిఆర్ అవుతారని అన్నారు. రాజపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మరి యేసయ్య, సంఘ బాధ్యులు నాగరాజు, నారాయణతో పాటు సుమారు 20 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ లావణ్య రెడ్డి, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, సర్పంచ్ ఎలక్షన్ రెడ్డి, ఉపసర్పంచ్ నవీన్, నాయకులు నారాయణ, లక్ష్మీనారాయణ, అనిల్, యాదగిరి పాల్గొన్నారు.

మతాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని: కమిషనర్ సత్యనారాయణ

మతాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని: కమిషనర్ సత్యనారాయణ

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది

బోధన్ లో గణేష్ నిమజ్జనం-మీలాద్ ఉన్ నబి పండుగల నేపథ్యంలో బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్.
గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లో గణేష్ నిమజ్జనం మీలాద్ ఉన్ నబి పండుగ బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, పర్యవేక్షించారు. అందులో భాగంగా బోధన్ టౌన్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదేల్లి మాస్క్, ఏక చక్రలయం, భావని పేట్ రామాలయం ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ పర్యవేక్షణలో బోధన్ ఎ. సి. పి కిరణ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజ్, ఎస్ ఎచ్ ఓ ప్రేమ్ కుమార్, ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలిసులు సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు

యదార్థవాది సిద్దిపేట ప్రతినిది

జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గ్ రాజనర్సు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు అని తెలిపారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ బాసటగా నిలిచి తన జలదృశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి ఇచ్చారని గుర్తు చేశారు. నాడు వివిధ హోదాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పరితపించారని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ అన్నారు. రాష్ట్ర సిద్ధించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారి జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పద్మశాలి సంఘం నేతలు మల్లికార్జున్, రవితేజ, భాస్కర్, కోటి, బిక్షపతి, వెంకన్న, రాము, మధు, శ్రీనివాస్, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

యదార్థవాది కొండపాక

మండల పరిధిలోని దుద్దెడలో మార్కండేయ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘ భవనంలో నిర్వహించిన వేడుకలలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాలకమండలి సభ్యులు పలువురు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజాసేవలను కొనియాడారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర అగ్ర పథాన నిలుస్తుందని కొనియాడారు. నేటితరం రాజకీయ నాయకులకు కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ జాతిపితగా గుర్తించ తగిన అన్నీ అర్హతలు కలిగిన ఏకైక వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బొజ్జ మహాదేవు, వడ్లకొండ శ్రీనివాస్, వడ్లకొండ శ్రీహరి, బొజ్జ చక్రధర్, చిలిగాని శ్రీనివాస్, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు వడ్లకొండ మల్లేశం, వడ్లకొండ శ్రీనివాస్, సభ్యులు కొంక ప్రభాకర్, రామచంద్రం, లక్ష్మీనారాయణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...