28.7 C
Hyderabad
Tuesday, April 21, 2026

17వ పోలీస్ బెటాలియన్ లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

17వ పోలీస్ బెటాలియన్ లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళులర్పించిన పోలీస్ బెటాలియన్ కమాండెంట్ యస్. శ్రీనివాస రావు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర  మరువలేనిదని నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ 1952 ఎన్నికల్లో తొలిసారి ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా లక్ష్మణ, తర్వాత 1967,1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 1957-60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు అని తెలిపారు. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి అని స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ అని నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త అని కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ. జయప్రకాశ్ నారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి బి.శ్తెలజ, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి డిపిఆర్ఓ వాట్సాప్‌ ఛానెల్‌.

తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి డిపిఆర్ఓ వాట్సాప్‌ ఛానెల్‌.

-రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిపిఆర్ఓ వాట్సాప్‌ ఛానెల్‌ ప్రారంభం.

– రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి ప్రభుత్వ ఛానల్ ఇదే.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

జిల్లా మీడియా ప్రతినిధులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి ట్వీట్టర్ , వాట్సప్ , ఫేస్ బుక్ వంటి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ తాజాగా డిపిఆర్ఓ రాజన్న సిరిసిల్ల ( Dpro RajannSircilla ) పేరుతో బుధవారం ‘వాట్సాప్‌ ఛానెల్’ను ప్రారంభించింది.

ఈ ఛానెల్‌ ద్వారా జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుంచి వెలువడే ప్రకటనలను మీడియా ప్రతినిధులు, పౌరులకు చెరవేస్తుంది. ఇందుకోసం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ( డిపిఆర్ఓ రాజన్న సిరిసిల్ల ) వాట్సాప్‌ ఛానల్‌ను అనుసరించడం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కే తారక రామారావు, ఇతర VIP లు, జిల్లా కలెక్టర్ క్షేత్ర పర్యటనలు, సమావేశాలు , ప్రభుత్వ ప్రకటనల వార్తలను మీడియా ప్రతినిధులు, ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

మొట్ట మొదటి ఛానల్ ఇదే!

బుధవారం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం dpro rajannasircilla పేరుతో ప్రారంభించిన వాట్సప్ ఛానల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి ప్రభుత్వ ఛానల్ కాగా….
తెలంగాణ సమాచార ,పౌర సంబంధాల శాఖలోనూ ఇదే మొదటి ఛానల్ గా నిలిచింది.
గుడ్ మార్నింగ్ మీడియా ఫ్రెండ్స్ …
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మరింత ప్రభావంతంగా జిల్లా ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు మీ సంపూర్ణ సహకారం కోరుతున్నాను…
అంటూ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తొలి పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్ర మంత్రి కే తారక రామారావు గంభీరావు పేట పర్యటనకు సంబంధించి పోస్ట్ పెట్టారు.

ఛానెల్‌ ఇలా ఫాలో అవ్వండి!

మొదట వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌లో అయితే Updates బటన్‌ను క్లిక్‌ చేస్తే ఛానెల్స్‌ ట్యాబ్‌ కనిపిస్తుంది. ఇందులో ప్లస్‌ బటన్‌పై క్లిక్‌ చేసి Find Channels సెలెక్ట్‌ చేయాలి.

సెర్చ్‌ బాక్స్‌లో Dpro RajannSircilla అని టైపు చేయాలి. నేతన్న, మిడ్ మానేరు జలాశయం, శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం తో కూడిన ప్రొఫైల్ పిక్ తో కూడిన ఛానెల్ ను జాబితా నుంచి ఎంచుకోవాలి. ఆ తర్వాత ఫాలో బటన్‌ను క్లిక్‌ చేసి.. Dpro RajannSircilla ఛానల్‌లో చేరవచ్చు.

ఓకెసారి సెలవు కలకలం.!

ఓకెసారి సెలవు కలకలం.!

-మత్స్యశాఖలో అసలు ఏం జరుగుతుంది.!

-అధికారి వేదింపులా-సమన్వయ లోపమా.!

మెదక్ యదార్థవాది ప్రతినిది

జిల్లా మత్స్యశాఖ ఏడి వేదింపులు బరించలేక సిబ్బంది ముకుముడిగా సెలవు ప్రకటించారు. మెదక్ మత్స్యశాఖ జిల్లా కార్యాలయం ఏడి రజిని వేదింపులకు తాలలేక పోతున్నామంటూ సిబ్బంది సామూహిక  సెలవు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏడి రజిని వేదింపుల పై సిబ్బంది రాజ్ మహేష్, భారత్, డేవిడ్ లు మాట్లాడుతూ సెప్టెంబర్ 20న ఏడి తీరుపై జిల్లా కలెక్టర్ కు సామూహిక  కార్యాలయానికి రాలేమని వినతి పత్రం అందించమన్నరు. ఏడి వేధింపులతో మా మనో ధైర్యం సన్నగిల్లిందని మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని మేము ఇదే ఒత్తిడిలో ఆత్మహత్యలకు దారితీస్తుందేమోనన్న భయం నెలకొందని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి అయినా వెనకాడం.. ఈ అధికారి మాత్రం వద్దని కరాఖండిగా తేల్చిరు..

128వ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ.

128వ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ.

యదార్థవాది మెదక్ ప్రతినిధి

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మ కన్నె గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ దాతగా సత్యా గ్రూప్ ఆఫ్ బిల్డర్స్ & ఇన్ఫ్రా డెవలపర్స్ సీ ఈ వో కుమ్మరి సతీష్ నీలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయి మాట్లాడారు. వీరనారి వీరవనిత చాకలి ఐలమ్మ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువ ప్రపంచానికి చాటి చెప్పినని చాకలి ఐలమ్మ వీరనారి వీరవనిత చాకలి ఐలమ్మ అని చెప్పుకొచ్చారని అన్నారు. కార్యక్రమంలో విగ్రహ దాత కుమ్మరి సతీష్, గ్రామ సర్పంచ్ కాజీపేట రాజేందర్, వైస్ ఎంపీపీ బొడ్ల నవీన్ గుప్తా, రజక సంఘం గ్రామ అధ్యక్షుడు చాకలి మల్లేశం, సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు,అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, కాయిత లక్ష్మణ్ ముదిరాజ్, బిఆర్ఎస్ కార్యకర్తలు, చంద్రం కృష్ణ గౌడ్, చిన్నంరెడ్డి, మన్సూర్, కౌడిపల్లి మండల రజక సంఘం అధ్యక్షులు చాకలి రాములు, కుకట్లపల్లి సర్పంచ్ కాంతారావు, కొట్టాల సర్పంచ్ నరహరి, సదాశివపల్లి సర్పంచ్ నర్సింగ్ రావు, గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

హరితోత్సవంతో పల్లెలలో కొత్త శోభ నింపిన ఘనత కేసీఆర్ : ఎమ్మెల్యే సతీష్ బాబు

హరితోత్సవంతో పల్లెలలో కొత్త శోభ నింపిన ఘనత కేసీఆర్ : ఎమ్మెల్యే సతీష్ బాబు

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిధి

వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ బాబు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో సోమవారం కోహెడ మండలం నూతనంగా ఏర్పాటు జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిప్పారపు జ్యోతి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు లింగారెడ్డి, రాజేశ్వరరావు, తిరుపతి, శ్రీనివాస్, రవి, రజిత, వెంకటరెడ్డి, అంజయ్య, తిరుపతిరెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, దొంగల తిరుపతిరెడ్డి, ముంజ సంపత్ లను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో మార్కెట్ కమిటీ సేవలను అందించాలి ఇందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. నేడు మనకు అందుతున్న ఫలాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేసినా ఉద్యమంతోనే అందుతున్నాయని, పల్లెలు పట్టణాలు హరిత విప్లవంతో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని దీంతో చెరువులు కుంటలు నిండుకుండలా తలపిస్తున్నాయి రైతులలో సంతోషం వెల్లివిరిసిందని ఇందుకు మనము ముఖ్యమంత్రికి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం మార్కెట్ యార్డ్ సిద్దిపేట మార్కెట్ యార్డ్ కంటే మెరుగైన పనితీరుతో ముందు వరుసలో ఉందని కోహెడ మండలంలో గతంలో మహా అయితే లక్ష క్వింటాళ్ల ధాన్యం కూడా రాలేదని నేడు మూడు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పైనే ధాన్యం వస్తుంది రైతులు పండించిన పంట కోసి మార్కెట్ యార్డ్ లో తూకమైన వారం రోజుల్లోనే నేరుగా రైతు అకౌంట్లోకి టంగ్ టంగ్ అంటూ ధాన్యం డబ్బులు అకౌంట్ లో పడ్డటువంటి మెసేజ్లు రైతుల కళ్ళల్లో ఆనందం కనబడుతుందని, త్వరలోనే గౌరవెల్లిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి కాలువల ద్వారా నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా చేస్తామని ఇప్పటికే కోహెడ మండలంలో నీటికి కొరత లేదని తెలంగాణలో ప్రతి అంశం ప్రతి అణువు తెలిసిన వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని ఆయన పాలనలో మనం సుభిక్షంగా ఉన్నామని మూడవసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అభివృద్ధిలో ముందుందాంమని తెలిపారు.మాజీ టూరిజం శాఖ మంత్రి భూపతిరెడ్డి మాట్లాడుతూ ఎంతో నష్టపోయామని నాగార్జునసాగర్ ప్రాజెక్టు 19 కిలోమీటర్ల కట్టినట్లయితే తెలంగాణలోని ఏడెనిమిది జిల్లాల కు నీటి కాలువలు అందుతుండేదని అన్నారు. కోహెడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిప్పారపు జ్యోతి మాట్లాడుతూ నా యొక్క విధి నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరు సహకారంతో ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో సేవలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోహెడ జడ్పిటిసి నాగరాజు శ్యామల ఎంపీపీ కొక్కుల కీర్తి పాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు వెంకటేశ్వర పల్లి సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి నైస్ ఎంపిపి తడికల రాజిరెడ్డి ఎంపీటీసీ ఖమ్మం స్వరూప ఎంపీటీసీల ఫోరం అధ్యక్షు డు కుమారస్వామి భీమ్దేవరపల్లి జడ్పిటిసి వంగ రవీందర్ జడ్పిటిసి భూక్య మంగ మాజీ డైరెక్టర్ లు రైతులు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి: గడిపే మల్లేష్

ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి: గడిపే మల్లేష్

సిద్ధిపేట యదార్థవాది

ఆస్పత్రులలో బయోమెట్రిక్, సిసి కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసినా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు ప్రతి రోజూ విధులకు హాజరు కావడం లేదని ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందడం లేదంటు వైద్యులు ప్రతి రోజూ విధులకు హాజరయ్యేందు చర్యలు చేపట్టాలని దావఖనలో బయోమెట్రిక్ విధానం ఆసుపత్రిలో సిసి కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి పర్యవేక్షణ పూర్తిగా లోపించడం వల్ల ఆసుపత్రిలో ప్రతి రోజూ ఒక్కరే విధులకు హాజరవ్వడం వల్ల ఓపిలో పత్రి దినం 200 మందికిపైగా వివిధ రకాల సిజనల్ వ్యాధులతో గ్రామీణ ప్రాంతాలనుండి సర్కారు దావఖనకు పేదవాళ్లు రావడం మెరుగైన వైద్యం కరువైదని ప్రతి చిన్న కేసును సిద్దిపేట, వరంగల్ ఎంజిఎం, కరీంనగర్ వంటి దూర ప్రాంతలకు పంపించడం సర్వసాధారణం అయ్యిందని గడిపె మల్లేశ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెల్లినట్లు గడిపె మల్లేశ్ తెలిపారు. ప్రభుత్వ వైద్యులు ఉద్యోగ ధర్మాన్ని అంకితభావంతో పనిచేసి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు మరింత కృషి చేసేల చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు గడిపె మల్లేశ్ తెలిపారు.

తోటి ఫోటో, వీడియో గ్రాఫర్ కు చిరు సహాయం

తోటి ఫోటో, వీడియో గ్రాఫర్ కు చిరు సహాయం

సిద్ధిపేట యదార్థవాది

సిద్ధిపేట పట్టణంలో వీడియో గ్రాఫర్స్, ప్రీ రాజా రాణి వెడ్డింగ్ స్టూడియో తరుపున రూ.7500, 50 కిలోల బియ్యాన్ని అందించారు. సోమవారం పట్టణంలో ని ఫోటోగ్రాఫర్ వీరబత్తిని సాయికుమార్ తండ్రి మరణించడంతో తోటి వీడియో గ్రాఫర్స్ ఉడుత భక్తి సహాయంగా ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిమ్మీ శేఖర్, కొండ ప్రదీప్, లక్ష స్టూడియో శ్రీనివాస్, ప్రసాద్, గిరి, ఉషశ్రీ రవి,రాజేందర్, కిరణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

స్నూకర్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

స్నూకర్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ జిల్లా మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నూకర్స్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అద్వర్యంలో బోధన్ రోడ్డు ప్రాంతంలో గల మాలపల్లి లో స్నూకర్స్ స్థావరంపై ఆదివారం దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 20 మందిని అదుపులోకి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. విరివద్ద 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అజయ్ కుమార్ తెలిపారు.

గ్రీన్ బడ్జెట్ అక్రమాలను అడ్డుకుంటాం: బీజేపి ఆర్మూర్ కమిటీ అల్టిమేటం

గ్రీన్ బడ్జెట్ అక్రమాలను అడ్డుకుంటాం: బీజేపి ఆర్మూర్ కమిటీ అల్టిమేటం

నిజామాబాద్ యదార్ధ వాది ప్రతినిధి

మునిసిపల్ “గ్రీన్ బడ్జెట్” పేరు పెట్టి మరో అవినీతికి తెర లేపడానికి ప్రయత్నం చేస్తున్న అవినీతి అక్రమాల కు వ్యతిరేకంగా ఆదివారం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మూర్ మున్సిపల్ ఫోర్ లీడర్ నరసింహారెడ్డి, నిజాంబాద్ జిల్లా అధికార ప్రతినిధి జెంట్స్ అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలెం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా పాలెం రాజిరెడ్డి మాట్లాడుతూ సోమవారం మున్సిపల్ సమావేశంలో 18 అంశాలతో కూడిన యజెండాను ప్రవేశపెట్టబోతున్నారని, ప్రధానంగా గ్రీన్ బడ్జెట్ పెట్టి దాదాపు 25 లక్షలు దోచుకోవడానికి చూస్తున్నారని, ఈ మధ్యనే ఆర్మూర్ మార్కెట్ కమిటీలో ఉన్న 300 మొక్కల విషయం అడగడంతో అక్కడున్న ముక్కలను డంపింగ్ యార్డ్ లో పడవేసి మొక్కలకు బిల్లులు కూడా తీసుకున్నారని అన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉచితంగా మెషిన్ భగీరథ నీళ్ల కనెక్షన్స్ ఇస్తామని చెప్పి నెలకు వంద రూపాయలు వసూలు చేస్తున్నారని, పార్టీలలో బోరు మోటర్లు చెడిపోకుండా చెడిపోయినట్లు బిల్లులు చూపెట్టి డబ్బులు దండుకుంటున్నారని ఇలాంటి అక్రమాలకు మున్సిపల్ చైర్ పర్సన్ కు స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ. టీఎస్ బి పాస్ యాక్ట్ ప్రకారం ఏదైనా పని చేసిన కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారానే ఆర్మూర్ అభివృద్ధికి పాల్పడాలని. ఇస్టారీతీన వ్యవహరించడం (జిస్కే హత్ మే లాఠీ – ఉస్ కా బైస్) ఎవరి చేతిలో కట్టె ఉందో వారిదే బర్రె అనే నానుడి గా ఉందని, రాబోయే కాలంలో ఈ అవినీతి, అక్రమాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ప్రజాప్రతిథులను ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో నిర్మించే అమృతవాటికకు మట్టి సేకరణ

ఢిల్లీలో నిర్మించే అమృతవాటికకు మట్టి సేకరణ

మా వంతుగా అమృతవాటికకు మట్టి

కొండపాక యదార్థవాది

దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో అమృతవాటికను నిర్మిస్తున్నారు మోడీ పిలుపు మేరకు మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు మన్నెం శశిధర్ రెడ్డి ఆదివారం కుకునూరు పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇల్లు ఇల్లు తిరిగి కలశంలో పవిత్ర మట్టిని, బియ్యాన్ని సేకరించినవాటిని కుకునూరు పల్లి మండల కేంద్రంలోని రామాలయంలో, అలాగే కొండపాక మండలంలోని వివిధ గ్రామాలలోని ఇల్లు ఇల్లు తిరుగుతూ సేకరించిన పవిత్ర మట్టిని ,బియ్యాన్ని దుద్దేడ స్వయంభూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఇలా సేకరించిన పవిత్ర మట్టిని, బియ్యాన్ని ఢిల్లీలో ఉన్న జాతీయ యుద్ధస్మారక స్తూపం పక్కనే అమృత వాటిక పేరుతో ప్రత్యేక స్తూపాన్ని కేంద్ర ప్రభుత్వంనిర్మించే దానిలో కలుపుతామన్నారు, ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కు ప్రతీకగా ఈ అమృతవాటిక నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మిట్టదొడ్డి మురళి మోహన్ రావ్, పిస్క రవీందర్, మాధాడి నర్సింహ రెడ్డి,కాయిత బలనార్సు, బొడపట్ల కొండయ్య, వడ్లకొంద శ్రీనివాస్,ఉమ్మడి కొండపాక మండల ఇంచార్జ్ కుడిక్యాల రాములు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గడ్డమీది రామస్వామి, ఉమ్మడి కొండపాక మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గౌరారం కృష్ణ, ఉపాధ్యక్షులు ఆరేపల్లి లింగం, కోశాధికారి శ్రీహరి, కార్యవర్గ సభ్యులు దాసరి స్వామి, నాయకులు పండరి హరీష్ రావు,తిరుపతి పాండు, వునుగురి సురేష్,స్వామి యాదవ్, బూర్గుల రమేష్,మహేందర్, పాండరి, అరుకదాల కరుణాకర్, బిక్షపతి, వివిధ గ్రామాల్లోని ప్రజలు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...