28.7 C
Hyderabad
Tuesday, April 21, 2026

రేపు జనగామ బందుకు పిలుపు

రేపు జనగామ బందుకు పిలుపు

జనగామ యదార్థవాది ప్రతినిధి

గణపతి మడపల వద్ద మహిళలపై ఓ వర్గం యువకులు అసభ్యంగా ప్రవర్తించినందుకు గణేష్ ఉత్సవా కమిటీ బందుకు పిలుపునిచ్చాయి. కాగా బంద్ కు బీ జే పీ నాయకులు మద్దతు తెలిపారు.

-నలుగురు యువకులను అరెస్టు.

జనగామలో ఓవర్గం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి వాహనాన్ని సీజ్ చేసినట్లలు ఏసిపి కొత్త దేవేందర్ రెడ్డి..

పసుపు బోర్డుతో మళ్లీ మోసం చేస్తున్నారు – పిసిసి ప్రధాన ప్రచార కార్యదర్శి కోల వెంకటేష్

పసుపు బోర్డుతో మళ్లీ మోసం చేస్తున్నారు – పిసిసి ప్రధాన ప్రచార కార్యదర్శి కోల వెంకటేష్

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిధి:

పసుపు బోర్డు అంశంతో మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారని పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలో పసుపు బోర్డు అంశం పై మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పసుపు రైతుల చిరకాల కోరిక అని, ఆ సెంటిమెంట్ ని వాడుకొని హామీ ఇచ్చి గెలిచి నాలుగన్నర సంవత్సరాలుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయక ఇప్పుడు మరొక్కసారి రైతులను మోసం చేయటానికి ఎంపీ అరవింద్ సిద్ధం అయ్యాడు అని అన్నారు, గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి మాట తప్పి రైతులను మోసం చేస్తే రైతులు ప్రతిఘటించటంతొ ముందునుండి ఉన్న స్పేసెస్ కార్యాలయంను నిజామాబాద్ కు మార్చి దీనినే పసుపు బోర్డు కంటే గొప్పది అని, మీరు అంబాసిడర్ కారు అడిగితె నేను బెంజ్ కారు లాంటిది తెచ్చాను అని చెప్పిన అరవింద్ మళ్ళీ ఇప్పుడు పసుపు బోర్డు తెస్తా అనడం ఆయన విజ్ఞతకె వదిలేస్తున్నాం అని అన్నారు. పసుపు బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని కేంద్ర ప్రభుత్వం ఏదైనా కొత్తగా సంస్థను ప్రారంభించాలి అంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాలి అని పార్లమెంట్ లో బిల్లు రూపాంలో ఆమోదం పొందాలి అని అన్నారు, కాని ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో పసుపు బోర్డుకు సంబందించి ఎటువంటి నిర్ణయం జరుగలేదు అని అన్నారు, ఇంతకు ముందు పార్లమెంట్ లో కామర్స్ శాఖ మంత్రి కొత్త బోర్డులు మేం ఏర్పాటు చేయం అని అన్నారు అని గుర్తు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అరవింద్ మరియు బిజెపి పార్టీ ఉనికి కోల్పోవటంతొ రాజకీయ ఉనికి కోసం మళ్ళీ పసుపు బోర్డు పేరు మీద రైతులను మరొక్కసారి మోసం చేయటానికి చూస్తున్నారు అని కేవలం మీడియాలో హెడ్ లైన్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు అని అన్నారు, రైతులు అప్రమత్తంగా ఉండాలి అని రానున్న ఎన్నికల్లో బీజేపీ ని అరవింద్ రాజకీయంగా సమాధి చేయాలనీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం పసుపు కు 12000 మద్దత్తు ధర మరియు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందుల పోశెట్టి, బట్టు శంకర్, మీసాల రవి, హబీబ్, బాల కిషన్, పాషా, అఖిల్, అబ్దుల్ వాసి, ముస్తాక్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు..

రెండవసారి రద్దవడం ఘోర వైఫల్యం

రెండవసారి రద్దవడం ఘోర వైఫల్యం

రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ను వెంటనే పునర్ వ్యవస్థీరణ చేయాలి.

లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు డిమాండ్

హైద్రాబాద్ యదార్థవాది ప్రతినిధి

ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగుల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించి నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడు తున్నా, ప్రశ్నా పత్రాలు లీకవుతున్నా పట్టించుకొనే నాథుడు లేక అధికారుల ఇష్టారాజ్యం అయ్యిందని ఇది ప్రభుత్వ ఘోర వైఫల్యం అని, మొదటి సారి గ్రూప్1 ప్రశ్నా పత్రం లీకేజీకి బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రెండవసారి ఆఘమేఘాల మీద ప్రతిష్టకు పోయి ఆదరాబాదరాగా నిర్వహించి ఆభాసు పాలైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ను వెంటనే పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు పత్రిక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగులను ఎంపిక చేసే సర్వీసు కమీషన్ నిర్లక్ష్యంగా బయోమెట్రిక్ లేకుండా, అదనంగా 258 ఓ.ఎం.ఆర్ షీట్లను చేర్చడం , నోటిఫికేషన్లలో పేర్కొన్న నియమాలను పబ్లిక్ సర్వీసు కమీషన్ పాటించకపోవడం, కోర్టులో తప్పుడు వివరాలతో కౌంటర్ వేయడం వంటి కార్యకలాపాలపై విస్తుపోయిన హైకోర్టు గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును లోక్ సత్తా పార్టీ స్వాగతిస్తుందని ఆయన అన్నారు. ఇకనైనా నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో , తల్లిదండ్రుల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పోటీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారిని ఉద్యోగులుగా నియామకాలు చేపడుతామని, పలు అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పబ్లిక్ సర్వీసు కమిషన్ ను వెంటనే పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరణ చేపడుతామని ప్రజల్లో నమ్మకంవిశ్వాసం కలిగేలా ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని తుమ్మనపల్లి డిమాండ్ చేశారు.

జిల్లాలో కత్తులతో దాడి. పరిస్థితి విషమం.!

జిల్లాలో కత్తులతో దాడి. పరిస్థితి విషమం.!

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిధి

నిజామాబాద్ జిల్లా బోధన్ బస్టాండ్ వద్ద ఆటో బైక్ ఢీకొనడంతో..

ఇరువురి మధ్య మాట మాట పెరిగి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది..

కత్తులతో దాడిలో ఆటో డ్రైవర్ అనిల్ కు గాయాలు పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు..

కత్తితో దాడి చేసిన బిల్లా రోడ్డుకు చెందిన ఖదీర్ తెలుస్తుంది..

ఒకరు కటకటాలు.ఇద్దరు కితకితలు..!

ఒకరు కటకటాలు.ఇద్దరు కితకితలు..!

ఇంతకీ చంద్రబాబు నాయుడు అరెస్టు సంగతి మొడీజీకి ముందుగా తెలిసినట్టే కదా..ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు.తెలియకుండా ఎందుకు ఉంటుంది..!?

అసలు ఇదంతా మోడీజీ చేసిందే కదా..కథ మొత్తం కేంద్రంలోని పెద్దలే నడిపి ఉంటారు..ఎందుకంటే మోడీ లేదా అమిత్ షా అనుమతి లేకుండా జగన్ అంతటి సాహసానికి తెగబడరు.
రేపు రాబోయే ఎన్నికల్లో
బిజెపి టిడిపితో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న వేళ..
అటు మోడీకి..
ఇటు చంద్రబాబుకు మధ్య
పవన్ కళ్యాణ్ వారధిగా ఉన్న సమయంలో మూడు పార్టీల నడుమ సయోధ్య ఖాయం అనుకుంటున్న దశలో చంద్రబాబు అరెస్టు వంటి కీలక నిర్ణయం జగన్ తీసుకున్నారంటే ఆషామాషీ కాదు.ఈ వ్యవహారంలో వ్యూహరచన ఢిల్లీ నుంచే జరిగిందని సమాచారం.
ఇక జగన్మోహనరెడ్డికి
సంబంధించి ఈ ఉదంతం రోగి కోరుకున్నదీ అదే..
వైద్యుడు చెప్పిందీ అదే చందాన కలిసి వచ్చింది.
కేంద్రం నుంచే కథ మొదలు కావడంతో ఆయన ఒక్కసారిగా జూలు విదిలించారు.

ఇక్కడ అత్యంత కీలక అంశం జి 20 సమావేశంలో తెలుగుదేశం అధినేత మాట్లాడాల్సి ఉన్న సమయంలో అంతర్జాతీయ సంస్థ అయిన సీమెన్స్ ఉదంతంలో చంద్రబాబుని దోషిగా పేర్కొంటూ అరెస్టు చెయ్యడం పకడ్బందీ ప్రణాళికతో..పటిష్టమైన వ్యూహంతో జరిగింది.
దేశదేశాల్లో మంచి పేరున్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడంపై అంతర్జాతీయ వేదికలో కూడా గుగుసగుసలు
వినిపించాయట..

ఆహా..ఢిల్లీ పెద్దలకు కర్ణప్రియమైన మాటలు కదా..ఇవి వినడానికే కదా జి 20 నడుస్తున్న సమయంలో బాబుని కటకటాల వెనక్కి నెట్టింది. ఓకే..స్కిల్ డెవలప్మెంట్ ఉదంతంలో చంద్రబాబు తప్పు ఉందేమో.
కానీ ఇన్నేళ్ల తర్వాత సరిగ్గా ఇప్పుడే అరెస్టు చెయ్యాలా.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఐటి రంగాన్ని అనూహ్య స్థాయిలో అభివృద్ధి చేసి..ఒక రకంగా
భారతదేశానికే ఐటిని తీసుకువచ్చి బిల్ క్లింటన్..బిల్ గేట్స్ వంటి ప్రపంచ దిగ్గజాల అభినందనలు పొంది విశ్వవ్యాప్తంగా
ఎందరో నాయకుల దృష్టిని
ఆకర్షించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు..ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఇప్పటివరకు దేశంలో
ఏ ముఖ్యమంత్రి కూడా సాధించని ఘనత..!

కీలకం ఏంటంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇదే నరేంద్రమోడీ కూడా సాధించని ఫీట్ ఇది.

ఒకరకంగా చెప్పాలంటే గుజరాత్ సీఎంగా ఉన్న రోజుల నుంచే బిజెపిలో మోడీ ఎలివేషన్ మొదలైంది.

ఆయన్ని అప్పటికే ఒక హీరోగా చూపిస్తూ
బిజెపిలో పెద్ద సినిమానే నడిచింది.ఆయన సీఎంగా తన ప్రస్థానం ప్రారంభించే నాటికే(2001)చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆరు సంవత్సరాల పాటు వెలుగుతూ దేశం మొత్తం మీద మోడీకి పోటీగా ఉండే ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా నిలబడి ఉన్నారు.అదే ఆయన చేసిన పాపమేమో..
అప్పటి నుంచే..అక్కడి నుంచే ఆయన్ని అణగదొక్కే వ్యూహాలు మొదలయ్యాయి.
మోడీ ప్రధాని అయ్యేపాటికి
కలిసి వచ్చిన వ్యవహారంగా
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
రెండు ముక్కలు చేసింది.దాంతో
చంద్రబాబు బలం తగ్గిపోవడమే గాక అనవసర
చర్యగా చంద్రబాబు నాయుడు బిజెపితో చెయ్యి కలిపారు.పోనీ కలిపిన వ్యక్తి అలాగే ఉండిపోయారా అంటే
2019 ఎన్నికలకి ముందు కమలానికి కటీఫ్ చెప్పి చెయ్యి కాల్చుకున్నారా.

2019 నుంచి నిన్న మొన్నటి వరకు మళ్లీ బిజెపితో చెలిమి కోసం బాబు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు.
ఇదిగో..ఇటీవల పవన్ రూపంలో ఆయనకు కాలం కలిసి వచ్చి మోడీకి చేరువయ్యే అవకాశం లభించింది.అయితే ఇంతలోనే ఇలా..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో జనసేన
అధినేత తెలుగుదేశంతో తమ పార్టీ పొత్తు గురించి అప్పటికప్పుడే ప్రకటన చేశారు.అయితే బిజెపి మాత్రం నోరు మెదపడం లేదు.పైగా చంద్రబాబు అంటే పొసగని దగ్గుబాటి పురంధేశ్వరికి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూ ఇంతకు ముందే నిర్ణయం తీసుకుని మరో నిప్పు రాజేసింది.

కథంతా ఇలా నడుస్తుండగా
చంద్రబాబు అరెస్టు వెనక బిజెపి పెద్దల హస్తం ఉందనే మాట ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.
ఈ దశలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చి జాతీయ రాజకీయాల్లో కీలకం అయ్యే అవకాశాన్ని బిజెపి ఇవ్వదలచుకోలేదని సమాచారం.అరెస్టుతో చంద్రబాబు ఖ్యాతి అంతర్జాతీయంగా కుదేలై
ఇక ఆయన జన్మలో మోడీకి ధీటుగా ఎదిగేది ఉండదు.
జగన్ సంగతి సరే..
కేసుల ఇరకాటంలో ఆయన బిజెపితో పెట్టుకునే సీన్ ఎప్పుడూ ఉండదు.ఇక దక్షిణాదిలో కేసీఆర్..స్టాలిన్..!
కవిత ఉదంతంలో టీఆరెఎస్ అధినేత ఇప్పటికే నలుగుతున్నారు.
ఉదయనిధి
వివాదం స్టాలిన్ కుటుంబాన్ని
కొంతలో కొంత ఇరకాటంలో పడేసినట్టే.

ఆ రకంగా ఉన్న పోటీదారులు అందరినీ ఏదో ఒక రకంగా బలహీనపరుస్తూ దక్షిణాదిలో బలం లేకపోయినా ప్రత్యర్థుల మెడలు వంచే వ్యూహాలను బిజెపి పటిష్టంగా అమలు చేస్తోంది.అందులో కీలకమైన అంకం మొన్న చంద్రబాబు అరెస్టుతో దిగ్విజయంగా పూర్తయినట్టేనని ఢిల్లీ వర్గాల కథనం.

ఇలా అరెస్టుల మీద అరెస్టులు..కేసుల మీద కేసులతో వచ్చే సానుభూతి ద్వారా వచ్చే ఎన్నికల్లో
తెలుగుదేశం అధికారంలోకి రావచ్చునేమో గాని చంద్రబాబు ఖేల్ ఖతం చేయాలన్నది బిజెపి వ్యూహం.ఈలోగా ఏ మాత్రం అవకాశం ఉన్నా తెలుగుదేశం పార్టీ దుకాణం మూయించి తమ చెప్పు చేతల్లో ఉండే పవన్ను కథానాయకున్ని చేసేందుకు
ప్రయత్నాలు జరగవచ్చు.
అది అంత ఈజీగా జరిగేది కాకపోయినా జస్ట్..
ఓ ప్రయత్నం..!

_సురేష్.._

నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ పోలీస్ కమిషనర్

నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ పోలీస్ కమిషనర్

-మట్కా నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు.

-బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై కేసులు.

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిధి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ 6వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కమ్యూనిటి కాన్ టాక్టు ప్రోగ్రామ్ నిర్వహించిన అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ ఎస్. జయారామ్ ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 6వ పట్టణ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా ప్రజలతో సత్సంబందాల కోసం కమ్యూనిటి కాన్ టాక్టు ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ప్రతి వాహనాదారుల వాహనాల డాక్యూమెంట్లు పరిశీలించామని, ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, సైబర్ నేరాలు చేసే వారి ఊచ్చులో పడకూడదని, ఆన్లైన్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామనీ మన బ్యాంక్ సమాచారం అడిగిన ఎవ్వరికి ఇవ్వరాదని, లక్కీడ్రా పేరుతో ఎవ్వరికి డబ్బు లు ఇవ్వరాదని, ఆ సాంఘిక కార్యక్రమాలకు అందరూ దూరంగా ఉండాలని ఎవరికైన దృష్టిలోకి వచ్చినట్టయితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, డయల్ 100 లేదా 1930 కు సంప్రదించాలని, పట్టణ పరిధిలో మట్కా నిర్వహిస్తున్న అబ్దుల్ సాజీద్, సయ్యద్ షాదుల్లా లపై, రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి 248 లిక్కర్ బాటిల్స్ స్వాదీనం చేసుకొని వారిపై కేసులునమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు వారి వారి పరిధిలో సి.సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ సి.సి కెమెరాల ఏర్పాటు వలన నేరగాళ్ల గుట్టురట్టులో ఎంతో దోహాదపడుతున్నాయని అన్నారు. ఈ తనికిలో నిజామాబాద్ ఎ.సి.పి కిరణ్ కుమార్, 8మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, నేహ్రు నగర్, రాంనగర్ సర్పంచులు అమానుల్లా, జిలానీ, ఎమ్.పి.టి.సి స్వామి కాలనీ వాసులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని సజీవ సమాధి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.

రాజ్యాంగాన్ని సజీవ సమాధి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.

-జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని విశాఖ బీచ్ లో టిడిపి వినూత్న నిరసన.

-పీక లోతు ఇసుకలో నిలిచి నిరసన తెలిపిన, నోడగల కృష్ణ, తమ్మినేని మోహన్.

విశాఖపట్నం యదార్థవాది ప్రతినిధి

టిడిపి రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ నేతృత్వంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ విశాఖ బీచ్ లో నిరసన తెలిపారు. విశాఖ ఆర్ కె బీచ్ లో రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. శుక్రవారం విశాఖ బీచ్ లో రాష్ట్రంలోరాజ్యాంగ విలువలు పాతర వేశారని నినాదిస్తూ పీక లోతు ఇసుక లో నిలిచి టిడిపి నేతలు నిరసన తెలిపారు. ఈ నిరసన లో నోడగల కృష్ణ, తమ్మినేని మోహన్ లు చంద్రబాబు అరెస్టు వ్యతిరేకిస్తూ నినాదాలు చేసి మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు కడిగిన ముత్యం లా బయటకి వస్తారని, రాష్ట్రంలో సైకో పాలన సాగుతుందని రాబోయే రోజుల్లో జగన్ కు ప్రజలే బుద్ధి చెపుతారని, వచ్చే ఎన్నికలలో టిడిపి ప్రభుత్వమే వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కు అండగా మేము సైతం ప్ల కార్డ్ పట్టి నినాదాలు చేశారు. విశాఖ టిడిపి కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వినూత్న నిరసన లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వర కుమార్, కుమార్ స్వామి, పసుపులేటి శ్రీనివాస్, కోనేటి సురేష్ ,ముక్కాశివ, సతీష్ లు, ధనజీ, తాతినేని యర్రబోలు శ్రీను ,పాల్గొన్నారు.

అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన: జేఎస్అర్

అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన: జేఎస్అర్

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

ప్రభుత్వం వెంటనే అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్లు గత 11 రోజులుగా చేస్తున్న సమ్మెకు గురువారం జన్నపురెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడి కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యలు పట్టించుకోవడంలేదని అంగన్వాడిల
కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని వారి న్యాయపరమైన సమస్యలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు అంగన్ వాడి సిబ్బంది పై బెదిరింపు దోరణి మానుకోవాలని, అంగాన్ వాడి సిబ్బంది కి భారతీయ జనతా పార్టీ ఎల్లపుడూ అండగా వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్వి రాజ్ గౌడ్, గోదాల సంపత్,శ్రీరామోజు శ్రీనివాస్, వేణు, రంజిత్, ఆంగన్ వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భూకబ్జాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం: ఏసీపీ శ్రీనివాస్

భూకబ్జాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం: ఏసీపీ శ్రీనివాస్

-క్షణికావేశంలో మాత్రమే జరిగిన హత్యలు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కాదు..

రామగుండం యదార్థవాది ప్రతినిది

భూకబ్జాలకు పాల్పడే ఎవరినైనా చట్టం ఉపేక్షించబొదని, వారిపై వారిపై పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని ఏసీపీ తులా శ్రీనివాస్ రావు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గురువారం ప్రముఖ తెలుగు దినపత్రికలో కలకలం రేపుతున్న భూమాఫియా, మళ్లీ అలజడి సృష్టిస్తున్న భూమాఫియా పేరిట వార్తా కథనాలపై వివరణ ఇస్తూ ఈ సంవత్సరంలో కోల్ బెల్ట్ ఏరియా గోదావరిఖని, రామగుండం పరిసర ప్రాంతాలలో ఒకే ఒక హత్య జరుగగా, అది కూడా జనవరి 29వ తేదీన గోదావరిఖని పట్టణంలో జరిగిన మంథని సుమన్ హత్య కేసు. ఇది వ్యక్తిగత కారణాలతో పాత కక్షలతో మాత్రమే జరిగినదని, రెండు రోజుల క్రితం ఎన్ టి పి సి లో జరిగిన మేకల లింగయ్య హత్య కూడా కేవలం తన ఎదుగుదలకు తన దూరపు బంధువైన మేకల లింగయ్య అడ్డొస్తున్నాడని వ్యక్తిగత ద్వేషం తోనే జరిగింది తప్ప ఇద్దరి మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హత్యకు దారి తీసే శత్రుత్వం లేకపోవడం గమనించలని అన్నారు. క్షణికావేశానికి పోయి ఆ క్షణికావేశంలో భౌతిక దాడులకు పాల్పడి ప్రాణాలు తీయడం వల్ల నష్టమే తప్ప ఎవరికి ఏ రకంగానూ మంచి జరగదని, ఇప్పటి వరకు జైలుకు వెళ్లిన కుటుంబాలు రోడ్డున పడ్డాయని మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు తమ గృహ అవసరాలకు భూములు కొనుగోలు చేసుకున్నరని, వరి అన్న భూములు జాలకు గురి అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడినా సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన వారి ప్రవర్తన మార్చుకోవాలని,వారు మార్చుకొని ఎడల వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడానకి
కూడా ఉపేక్షించేది లేదని ఏసీపీ హెచ్చరించారు..

ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

యదార్థవాది న్యూస్ కొండపాక

కొండపాక మండలపరిధిలోని వెలికట్ట క్రాస్ రోడ్డులో గురువారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ శాఖ భాద్రపద శుద్ధ షష్టి బలరాముని జయంతి, రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పర్శరాంలు గౌడ్ మాట్లాడుతూ రైతులు సుఖ సంతోషాలతో ఉంటేనే ప్రభుత్వాలు బాగుంటాయని ఎద్దు ఏడిస్తేరైతు , రైతుఏడిస్తే దేశము బాగుపడినదాఖలాలు లేవన్నారు. అందుకే ప్రభుత్వాలు మేలుకొని రైతువ్యతిరేకపనులు మానుకుని రైతులకు అనుకూలమైనా పాలన కొనసాగించాలని, రైతును ఆదరించి వాళ్ళను ప్రోత్సహించాలని కోరారు, రైతుల తరుపున భారతీయ కిసాన్ సంఘం ఎల్లవేళలా పనిచేస్తు రైతుల పక్షాన పోరాటముచేస్తూన్న నిస్వార్ధమైన సంస్థకేవలం భారతీయ కిసాన్ సంఘ్ మాత్రమే అన్నారు. రైతుకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ముందుండి పోరాడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు బిక్షపతి యాదవ్, మండల కార్యవర్గ సభ్యులు ఈ. హరీష్ , పి వేణు, రైతులు పాల్గొన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...