-దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్ పై ఎమర్జెన్సీ అలెర్ట్..
యదార్థవాది ప్రతినిది
భారత్ దేశంలొ ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ నిర్వహిస్తున్న టెలి కమ్యూనికేషన్స్ మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే విడుదల చేసినట్లు తెలుస్తుంది. ట్రయల్ టెస్టింగ్ లో భాగంగా టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి గురువారం టెస్టింగ్ నిర్వహించినట్లు మెసేజ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో టెస్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుండి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహణ ఊపిరి పీల్చుకున్న మొబైల్ వినియోగదారులు..
కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామ పద్మశాలిలు కులసంఘభవన నిర్మాణానికి నిధులు కావాలని కోరుతూ మంత్రి హరీష్ రావు కు వినతి పత్రం అందించిన అధ్యక్షుడు బొజ్జ మహాదేవ్. మంగళవారం మంత్రి హరీష్ రావు వెంటనే మంత్రి గడా ఛైర్మెన్ ముత్యంరెడ్డికి భవననిర్మాణానికి గాను అవసరమగునిధులు సమాకూర్చాల్సిందిగా ఆదేశించారు. అడగగానే నూతన సంఘ భవన నిర్మాణానికి నిధుల మంజూరు కోసం సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు దుద్దెడ పద్మశాలి సంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొజ్జమహదేవ్, సభ్యులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వడ్లకొండ శ్రీహరి, సంఘ సభ్యులతో దుద్దెడ గ్రామ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్, ఎంపీటీసీలు గురజాడ బాలాజీ, పిల్లి నాగరాజు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్, నూనె కుమార్ యాదవ్ గ్రామ బీఆరెస్ అధ్యక్షులు చిలుముల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె గత తొమ్మిది రోజులుగా చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు చిమకుట్టినటుగా లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మినీ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డున పడి నిరసన తెలియజేస్తుంటే రాష్ట ప్రభుత్వ పెద్దలు ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం సరైనది కాదని, కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుకై చట్టం చేస్తుంటే రాష్ట ప్రభుత్వం మాత్రం మహిళల పట్ల చిన్న చుపువుందని అయన అన్నారు. ఒకవైపు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని ప్రకటిస్తూనే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తి పోరాడుతుంటే వారిని చర్చలకు పిలిచి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే బదులు మరింత జటిలం చేయటం సరైనది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచకుండా అంత్యక్రియల ఖర్చులను ప్రకటించటం బాధ్యతారహితమని వెంటనే అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అధికారుల వేధింపులను, బెదిరింపులను మానుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం మరింత తాత్సారం చేస్తే అంగన్వాడీ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం అవుతుందని, అందుకు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. స్వర్ణ ప్రాజెక్టు నాయకులు సరిత, జరీనా సునీత, లలిత, అంజలి విజయ, శివరాజమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు ముందుగా నిన్న అనారోగ్యంతో మరణించిన మోసరా సెక్టార్ కు చెందిన మంగ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
మహిళా బిల్లు చారిత్రాత్మకమైనదని. స్వాగతించిన తెలంగాణ లోక్ సత్తపార్టి.
_ అన్ని పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి.
_ సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్.
_స్వాగతించిన తెలంగాణ లోక్ సత్తపార్టి.
హైదరాబాద్ యదార్థవాది
దేశంలో జనాభాలో సగ భాగం వున్న మహిళల ప్రాతినిధ్యం చట్ట సభలలో ఇన్నాళ్లు లేకపోవడం ప్రజాస్వామ్యానికి మాతృ దేశంగా చెప్పుకొనే మన బారత దేశంలో పెద్దలోటు. జాతీయ బి.జే.పి. ప్రభుత్వం సాహసోపేతంగా బుధవారం పార్లమెంట్ ఉభయ సభలలో మహిళలకు చట్టసభలలో 33శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రవేశ పెట్టనున్నరు. “నారీ శక్తి వందన” మహిళా బిల్లు చారిత్రాత్మకమైనదని లోక్ సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు స్వాగతించారు. చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే భూస్వామ్య పెత్తందారీ పోకడలు పోయి సేవా ధోరణి అలవడుతుంది అని ఆయన అన్నారు. అంతే కాకుండా నిత్యావసరాలు, విద్య, ఆరోగ్యం, మహిళల భద్రత, ఉపాధి వంటి అంశాలపై ప్రభుత్వ ఆలోచనలు మారుతాయని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై అటక ఎక్కిన విషయం అందరికి తెలుసని ఇకనైనా దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలియజేయాలని అన్నిపార్టిలకు లోక్ సత్తాపార్టీ పక్షాన తుమ్మనపల్లి విజ్ఞప్తి చేశారు. సమాజంలోని ఆయా సామాజిక వర్గాల జనాభా ప్రాతపదికన సామాజిక న్యాయం పాటించేలా చట్టంలోనే నియమ నిభందనలు రూపొందించాలని ఆయన కోరారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో 41వ రోజు మన ఊరు – మన ఉష కార్యక్రమంలో బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష గడపగడపకు ఏనుగు గుర్తును ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాల దోపిడీని ఎండగడుతూ, ప్రజల వద్దకెళ్లి సమస్యలను తెలుసుకుంటూ బీఎస్పీ ప్రభుత్వంలోకి వస్తే అందించే పథకాల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కొంతమంది అనుచరులతో నీచపు, దుర్మార్గపు రాజకీయాలు చేపిస్తున్నారని పోత్కపల్లి గ్రామంలో ఎంతోమంది బీఎస్పీ పార్టీకి ఆకర్షితులై వస్తుంటే డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు, బీసీ బందు, పెన్షన్లు నుంచి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, బీఎస్పీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఇలా చేస్తున్నారని, మీ బెదిరింపులకు భయపడే రోజులు పోయాయని, గత తొమ్మిది ఏళ్లలో ఒక డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని ఈ చేతగాని ప్రభుత్వానికి ప్రజలే ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ పూరెల్ల స్వప్న గౌడ్, నియోజకవర్గ కోశాధికారి ఎండి రియాజ్, బీఎస్పీ మండల కో-కన్వీనర్ మేకల శోభ, బీఎస్పి నాయకులు కళ్యాణ మహేష్, బోయ సాది, స్థానికులు ఎండి మోహిన్, సతీష్, ఎండి పాష, మానస, లక్ష్మీ, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మిల్లెట్ ల ప్రాధాన్యత ను తెలుపుతున్న నిర్వాహకులు..
సిరిసిల్ల యదార్థవాది
ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం గా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్ ల ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యతను గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి సిరిసిల్ల పట్టణంలోని హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఆసుపత్రి నిర్వాహకులు మిల్లెట్ (చిరు, తృణ ధాన్యాలు) లతో చేసిన 5 అడుగుల పరిమాణం గల పర్యావరణ అనుకూల చిరుధాన్య గణపతిని ప్రతిష్టించారు.(మిల్లెట్) గణేశుడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారని నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకూ మిల్లెట్‌తో చేసిన వివిధ వంటకాలు 9 రోజుల పాటు రోజువారీ భక్తులకు ప్రసాదంగా అందించనున్నారని తెలిపారు.
మిల్లెట్ల యొక్క పోషక ప్రయోజనాలు
మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అవసరమైన పోషకాల యొక్క అద్భుతమైన మూలం. అవి గ్లూటెన్-ఫ్రీ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, మరియు అధిక యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి, ఇది వాటిని బియ్యం లేదా గోధుమలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చేస్తుంది.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ రాజ్ ఘాట్ వద్ద లోకేష్ ఘన నివాళి.
ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టాలి.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
న్యూఢిల్లీ యదార్థవాది
ఆంధ్రప్రదేశ్ లో గాడి తప్పిన పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలని మంగళవారం ఢిల్లీలోని రాజ్ఘా ఘాట్ వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపిలు కే. రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, రాష్ట్ర మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆడారి కిషోర్ కుమార్ మత్మునికి నివాళి అర్పించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలను జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళ్లేందుకు గత ఆరు రోజులుగా దేశ రాజధాని హస్తినలో ప్రత్యక్ష నిరసనలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయాల్లో నేరుగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఢిల్లీలో ఏపి లో పరిస్థితులపై దృష్టి పెట్టి, చక్కదిద్దలని మహాత్మునికి విన్నవించామన్నారు. ఈ పర్యటనలో ఏపీ భవన్ వద్ద, జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కూడా చేయడం జరిగిందని సోమవారం పార్లమెంట్ వద్ద నేషనల్ మీడియా పాయింట్ వేదిక గా జాతీయ మీడియాలతో మాట్లాడామని తెలిపారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రోజు నుంచి ఏ ఒక్కరోజు కూడా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించలేదని, చట్టాలను తమ చట్టం గా చేసుకుని అత్యంత భయంకరమైన క్రూర చర్యలకు దిగబడ్డారని, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు నుంచి సామాన్య కార్యకర్తల వరకూ ప్రతిరోజూ. ప్రత్యక్ష నరకం అనుభవిస్తూన్నారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి లోబడి పని చెయ్యవలసిన అధికారులు రూల్స్ ను ఏనాడో తుంగలోకి తొక్కారన్నారు. ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి ను అత్యంత పాశవికంగా అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యడం పై మండిపడ్డారు. ఏమాత్రం పసలేని, సంబంధం లేని , ఆధారం లేని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ స్కీం లో చంద్ర బాబు నూ అరెస్ట్ చెయ్యడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఈయన దార్శనికత ఆధారంగా సుమారు 5 లక్షల మంది స్కిల్స్ లో శిక్షణ తీసుకుని దేశ విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. సాక్షాత్తు అభియోగం మోపబడిన సిమెన్స్ సంస్థ అధిపతులే ఈ స్కీం లో ఎటువంటి స్కాం జరగలేదని చెప్పి నా మొండి పట్టుదల తో అధికార పార్టీ వెళ్తోందని వీళ్ళ మూర్ఖపు ధోరణి వల్ల ప్రజలు చాల ఇబ్బదులకు గురవ్తున్నారని దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసులు పెట్టడం లో పెట్టిన శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెడితే బాగుంటుందన్నారు. బాబు పై జరిగిన కుట్రను ఖండిస్తూ పార్టీలకతీతంగా ముందుకు రావాలని ఢిల్లీ నుండి పిలుపునిస్తున్నామన్నారు. ఈ పర్యటన లో నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ దళిత జే ఏ సీ అధ్యక్షులు ఆలూరి రాజేష్, ఢిల్లీ తెలుగు సంఘాల ప్రతినిధులు, పాల్గొన్నారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలి
జాతీయ ఉపాధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
యదార్థవాది హైదరాబాద్
పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఒకప్రకతనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు చారిత్రక అవసరమేనని ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని, మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. మహిళలకు విస్తృత అవకాశాలు లేకపోతే దేశ ప్రగతి కూడా సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలని, సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని అయన అన్నారు. జేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమితో పాటు ఇండియా కూటమి, ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లుకు ఆమోదం తెలపడానికి కదలిరావాలని, అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయమే జరుగుతోందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించడం ద్వారా వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇచ్చే అవకాశం కలుగుతుందన్నారు.
-వ్యవసాయ అధికారులు ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో రైతులను గుర్తించాలి.
-మంత్రి తన్నీరు హరీష్ రావు.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, జిల్లా పరిపాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, మేనేజర్ సత్యజిత్, అర్ హెచ్ యుపీఐ వికాస్ ఆర్‌ఎం మాధవి, సీఎం జయంత్, ఆర్‌ఎం లక్ష్మయ్య, రజాక్, నాబార్డ్ డీడీఎం సెసిల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ తాన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో రైతులకు రుణమాఫీ కావటం లేదని ఇప్పుడు కచ్చితంగా రుణమాఫీ ప్రక్రియ జరగాలని ఈనెల 21న ఎస్ఎల్బిసి సమావేశం లోపు జిల్లాలో రుణమాఫీ పూర్తిగా కావాలని అన్నారు. రైతులకు వివిధ కారణాలతో రైతుల అకౌంటు నిలిపి వేయడంతో, ఒక బ్యాంకు ఇంకో బ్యాంకులో కావడంతో, బ్యాంకుల పేరు మారడం వలన రాష్ట్రవ్యాప్తంగా 10 వేల నుండి 12,000 రైతులు, మన జిల్లాలో 638 రైతుల అకౌంట్లు దొరుకడం లేదని, నంగునూరు మండలం పాలమాకులలో సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులో కలిసిపోవడం వలన నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ ఆగిందని, రేపటినుండే బ్యాంకర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారుల సహకారంతో సంబంధిత రైతులను గుర్తించాలని ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు రైతులకు రుణమాఫీ జరిగేలా బ్యాంక్ అధికారులు సహకరించాలని జిల్లాస్థాయి బ్యాంక్ అధికారులు ఫిర్యాదులను పరిష్కరిస్తారని అన్నారు. ఇప్పటివరకు 1 లక్ష 10 వేల రూపాయల లోపు రైతు రుణమాఫీ జరిగిందని. వారం రోజుల్లో 1 లక్ష 30 వేల రూపాయలకు రుణమాఫీ జరుగుతుందని ఎందుకు అవసరమయ్యే 1000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని రుణమాఫీ మొత్తం 30.09.2023 నాటికి రైతు ఖాతాలకు జమ చేయబడతాయని ఆయన తెలిపారు. వర్గల్, ఇర్కోడ్, చంద్లాపూర్, నర్మెట్టలో 4 బ్యాంక్ శాఖలను ప్రారంభించుకుండమని పెండింగ్‌లో ఉన్న 20 ట్రైకార్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ 118 యూనిట్లు, పీఎంఎస్‌వానిధి యూనిట్లు, మెప్మా బ్యాంక్ లింకేజీల పెండింగ్‌లను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
హబ్సిపూర్ గ్రామానికి చెందిన బాలవ్వ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే పది రోజుల క్రితం మృతి చెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన బైండ్ల బాలవ్వ(50) మృతి చెందినట్టు తెలిసింది. ఈ విషయమై సర్కిల్ ఇన్స్పెక్టర్ మున్నూరు కృష్ణ మాట్లాడుతూ గత పది రోజుల క్రితం బైండ్ల బాలవ్వ ఇంట్లో మృతి చెందిందని మరుసటి రోజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించరని. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతుళ్లు ఉన్నారని విరి అందరికీ పెళ్ళిల్లు అయ్యాయని సెప్టెంబర్ 7న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలవ్వ హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించరని, బాలవ్వ మృతి పట్ల అనుమానం ఉందని, తన తల్లిది సహజ మరణం కాదని మృతి పట్ల అనుమానం కలిగిందని, ఇంట్లో రక్తపు మరకలను గమనించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, ప్రభుత్వ అనుమతితో దుబ్బాక ఎగ్జిక్యూటివ్ మేజిస్టేట్ జయంత్ ఆదేశాల మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని తీసి ఫోరెన్సి వైద్యుల సమక్షంలో అంతక్రియలు చేసిన స్థలంలో పంచనామా నిర్వహించారు. త్వరలో పోస్టుమార్టం రిపోర్టు వివరాలను వెళ్లాడిస్తామని ఆయన తెలిపారు.