26.7 C
Hyderabad
Tuesday, April 21, 2026

సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

-ఘనంగా మోదీ 73వ జన్మదిన వేడుకలు.

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఆదివారం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వేములవాడ హరికృష్ణ, ఉట్లపల్లి సురేష్, రాందాస్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని అయన చిత్రపటానికి మిఠాయిలు పంచుతూ వేడుకలను నిర్వహించిన జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో మళ్ళీ భారత ప్రధానిగా నియమక్కమై దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మార్చి ప్రతి వ్యక్తికి భారత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు అదేవిధంగా కృషి చేయాలని ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందే ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోడీ ని అనుకోవాలని ఈ దేశాన్ని సనాతన ధర్మాన్ని రక్షించవలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి, జిల్లా నాయకులు, బిఎంఎస్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్దార్ పటేల్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

సిరిసిల్ల జిల్లా పట్టణంలో ఆదివారం జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినోత్సవన్ని విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును నిర్వహించి, విశ్వబ్రాహ్మణులకు పలుఫురిని సన్మానించి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ ఆడేపు రవీందర్ మాట్లాడుతూ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందేనని ఆనాటి వీరయోధులైన కొమరం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్థ. సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నమని అన్నారు. కార్యక్రమంలో భారత జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు ఓ బి సి కార్యాలయ కార్యదర్శి గౌడ వాసు ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనిగంటి నరేష్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెల్లో వేణు పట్టణ ఓబిసి అధ్యక్షుడు సిరిగాధ మైసయ్య ఉరగొండ రాజు మోర శ్రీహరి గాజుల వేణు కోడం ఆనంద్ బాబు తడక విజయ్ సుంచు ప్రకాష్ సిరిమల్లె మల్లేశం చొప్పదండి శ్రీనివాస్ గుడ్ల విష్ణు రాయిని ప్రతాప్ ఎల్లంకి సతీష్ వేముల పోశెట్టి బాలకిషన్ పోతు శ్రీనివాస్ మొగిలి రాజు మహేశుని అనిల్ అంకారపు రాజు రమేష్ చారి ఇంజపూరి మురళి సత్య సాయిరాం దూడం శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌హిళ‌ల‌కు వైఎస్సార్ కాపునేస్తం

మ‌హిళ‌ల‌కు వైఎస్సార్ కాపునేస్తం

జిల్లాలో 5,905 మంది మ‌హిళ‌ల‌కు రూ.8.85 కోట్ల చెక్కును అందజేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ముత్యాలనాయుడు.

యదార్థవాది విజ‌య‌న‌గ‌రం ప్రతినిది

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైఎస్సార్ కాపు నేస్తం ప‌థ‌కం ద్వారా జిల్లాకు చెందిన కాపు, తెల‌గ‌, ఒంట‌రి, బ‌లిజ కులాల‌కు చెందిన‌ 5,905 మంది మ‌హిళ‌లు రూ.8.85 కోట్ల‌ ఆర్థిక ప్ర‌యోజ‌నం పొందారు. సంబంధిత చెక్కును జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎస్. కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, డీఆర్వో ఎస్.డి. అనిత‌, బీసీ కార్పొరేష‌న్ ఈడీ పెంటోజీరావులు ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు. వైఎస్సార్ కాపు నేస్తం ప‌థ‌కం కింద వ‌రుస‌గా నాలుగో ఏట నిధుల విడుద‌ల‌లో భాగంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ‌నివారం నిడ‌ద‌వోలు నుంచి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆన్లైన్ మీట నొక్క‌టం ద్వారా ల‌బ్ధిదారుల ఖాతాల్లో నిధుల‌ను జ‌మ చేశారు. ముఖ్య‌మంత్రి కార్య‌క్ర‌మం అనంత‌రం జిల్లా నుంచి ల‌బ్ధిపొందిన మ‌హిళ‌ల‌కు రూ.8,85,75,000 చెక్కును ప్రముఖుల చేతుల మీదుగా అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌రేట్ వీసీ హాలు నుంచి డీఆర్వో ఎస్.డి. అనిత‌, బీసీ కార్పొరేష‌న్ ఈడీ పెంటోజిరావు, కాపు కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్లు, ప‌లువురు ల‌బ్ధిదారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

పేదలకు వరం లాంటిది ముఖ్యమంత్రి సహయనిధి.

పేదలకు వరం లాంటిది ముఖ్యమంత్రి సహయనిధి.

యదార్థవాది కుకునూర్ పల్లి / కొండపాక

కుకునూరుపల్లి మండల పరిధిలోని మెదనీపూర్ గ్రామానికి చెందిన పలువురికి సర్పంచ్ తాడెం దశరథం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అనారోగ్యంతో చికిత్స పొందిన మేదిన్ పూర్ గ్రామస్తులు విజయ్ కు 60000, ప్రవీణ్ రెడ్డి కి 55000, తాడం కనుకయ్య కు 60000, అక్కవ్వ 60000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంటికి పెద్దకొడుకులాగా కెసిఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని సౌకర్యాలు కల్పిస్తున్నరని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలతో సర్కారు దావఖన.!

సమస్యలతో సర్కారు దావఖన.!

-తాగునీటి కోసం తండ్లడుతున్న రోగులు.

-ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పనితీరు అద్దం పడుతుంది.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్వంత జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రికి ప్రతి రోజు వందల సంఖ్యలో వస్తున్న రోగులకు గత రెండు రోజులుగా పరిశుద్ద మైన తాగునీటి లేక రోగుల, వారి బంధువులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆసుపత్రిలో రోగులకు పరిశుద్ధమైన తాగునీటిని అందించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి పర్యవేక్షణ పనితీరు అద్దం పడుతుందని
వెంటనే ఆసుపత్రిలో పరిశుద్ధమైన తాగునీటిని అందించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి కృషి చేయాలని తాగునీటి సమస్య పరిష్కారం కోసం శనివారం సూపరింటెండెంట్ కలిసేందుకు వెళ్ళితే సూపరింటెండెంట్ ఆసుపత్రిలో అందుబాటులో లేరని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ తెలిపారు.

దేశంలోనే అతి పెద్ద ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట.

దేశంలోనే అతి పెద్ద ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట.

యదార్థవాది

మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ లో ఈ నెల 18న అవిస్కృతం కానున్న దేశంలోనే అతి పెద్దదైన 108 అడుగుల ఆది శంకరాచార్యుల బహుళ లోహ విగ్రహం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని శ్రీశ్రీశ్రీ భవాని స్వామి (ఓం అభాల సిద్ద పీఠాధిపతి శ్రీశైలం) కి ఆహ్వానం అందినట్లు ఆయన శిష్య బృందం శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతన భారతదేశంలో ధర్మ పవిత్రమైన నర్మదానది ఒడ్డున నెలకొన్న ఓం కాళేశ్వర క్షేత్రంలో ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్టకు మర్మ కళ నిపుణులు, అను వంశిక ఆయుర్వేద వైద్యులు, ఓం శ్రీ భాలసిద్ధి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భవాని స్వామి స్వామీజీకి ఆహ్వానం రావడం గొప్ప విషయమని శిష్య బృందం తెలిపారు. కావున శంకరాచార్యులు, భవానీ స్వామి భక్తులు అందరూ ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనాలని శిష్య బృందం పిలుపునిచ్చారు.

పాడి రైతులకు సబ్సిడీ రుణాలు..

పాడి రైతులకు సబ్సిడీ రుణాలు..

-గ్రామా రైతులు పశు సంపదలో ముందుండాలి..

-చైర్మన్ పేర్యాల దేవేందర్..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కోహెడ మండలంలోని అన్ని గ్రామాల పాడి రైతులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయిస్తానని చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు అన్నారు.. శనివారం మండలంలోని వరికోలు గ్రామ పాడి రైతులకు పాడి పశువుల కొనుగోలుకై సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ పాల ఉత్పత్తి దారుణ సహకార సంఘం వారు మంజూరు చేసిన రూ. 7,80,000లను ఆయన అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పాడి ఉత్పత్తులు బాగా పెరగాలని అందుకోసం రైతులు పశువులను పెంచి పోషించాలని రైతులకు సూచించారు. కరీంనగర్ పాల ఉత్పత్తి దారుణ సహకార సంఘం వారు పాడి రైతులను ప్రోత్సహిస్తున్నారని వారి సహకారంతో మండలంలోని గ్రామాలకు త్వరలో మరిన్ని రుణాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు పబ్బతి సుగుణమ్మ, జేరిపోతుల మనేమ్మ, గుండ తిరుపతి, గొంటి లక్ష్మయ్య, కొత్తూరి మనోహర్, ప్యాక్స్ సీఈఓ ముంజ మల్లికార్జున్, సిబ్బంది, వరికొలు మిల్క్ డైరీ ఛైర్మన్ సంది శ్రీనివాస్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

దిగుతున్న ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు.

దిగుతున్న ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు దిగుతుండగా మరియల భారతవ్వ అనే మహిళ కాలుజారి బస్సు కింద పడింది. ఇది గమనించకుండా బస్సును కాస్త ముందుకు తీసుకెళ్లిన ఆర్టీసీ బస్ డ్రైవర్ బస్సులో ఉన్నవారు, కింద పడ్డ మహిళా కేకలు వేయడంతో బస్సును ఆపాడు. అప్పడికే మహిళ కాలు పైకి బస్సు వెనుక టైరు ఎక్కడంతో కాలు పాదానికి తీవ్ర గాయామయ్యింది. గాయపడ్డ మహిళను చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు పోలీసులు.. వరంగల్ డిపో పల్లె వెలుగు నంబర్ TS03 UC2889 గల బస్ హనుమకొండ నుండి సిద్దిపేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని, బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ వెల్లడించారు..

రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం.

రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం.

-ఆనందోత్సవాల్లో రైతన్నలు..

-ఊరూరా రుణమాఫీ ఆనందోత్సవాలు..

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం పట్ల నియోజకవర్గంలో ఊరూరా రుణమాఫీ ఆనందోత్సవాలు నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ, రైతు సమన్వయ సమితి, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తున్నారని, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని రైతు లేనిదే రాజ్యం లేదని, దేశానికి అన్నం పెట్టేది రైతన్నలే అని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వంమే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ తో పాటు, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్న ప్రభుత్వం అని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత భూమి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు రాజమౌళి, నాయకులు గుడికందుల రాజిరెడ్డి, రాయిని పండు, ఏనుగుర్తి శ్రీనివాస్, మంతూరి శేఖర్, పెద్దపులి శ్రీకాంత్, ఫర్టిలైజర్ ప్రభాకర్, పాతూరు అంజిరెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...