28.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు పంపిణీ.

విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు పంపిణీ.

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

బాపూ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు పంపిణీ చేసిన దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత.. విద్యార్థిని, విద్యార్థులు కడుపునొప్పి బారిన పడకుండా ఉండేందుకు నూలు పురుగుల మందులను అందించడం జరిగిందని, గురువారం దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామంలో బాపూ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలను అందించి అమే మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉండాలని, ప్రతి విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు అందిస్తుందని కష్టించి చదవాలని ఉన్న వర్గాలకు నేడు మంచి విద్య ఆరోగ్యం అందుతున్నాయని వారు అన్నారు.. కార్యక్రమంలో ఎంపీపీ వైస్ చైర్మన్ అస్క రవి, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించిన: జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్

మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించిన: జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, బిసిగౌడ సామాజికవర్గనికి రిజర్వేషన్ ను గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య ఎస్సీ అభివృద్ధి, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రా నిర్వహించారు.. జిల్లాలో మొత్తం 93 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 9 ఎస్సీ సామాజిక వర్గానికి 16 గౌడ కులాలకు లాటరీ ద్వారా షాపులను ఎంపిక చేసి వాటి ఆమోదానికి రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కు పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాసమూర్తి, జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి కవిత, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి మురళి ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు..

కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలతోనే రైతులకు రుణమాఫీ ప్రకటన.

కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలతోనే రైతులకు రుణమాఫీ ప్రకటన.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

రైతు రుణమాఫీ చేయాలంటూ కాంగ్రెస్ చేసిన పోరాటాలు నిరసన కార్యక్రమాల పలితంగా నేడు సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటన చేశారని టీపీసీసీ సభ్యుడు ధర్పల్లి చంద్రం కిసాన్ కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి అన్నారు.. సిద్దిపేటలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన పోరాటాల వల్ల ప్రభుత్వం దిగివచ్చి రైతు రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేస్తూ టీపీసీసీ సభ్యుడు ధర్పల్లి చంద్రం కిసాన్ కాంగ్రెస్ కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని నియంతల వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం వచ్చేందుకు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగానే చేశారని అన్నారు. రుణమాఫీ చేయడంతో రైతులు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలకు రైతుల మా వెంటే ఉన్నందుకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు బాగుపడేలా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింది రైతులంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నాలుగు సంవత్సరాలుగా రైతులను సీఎం కేసీఆర్ తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు మద్దతిస్తుందని వారికోసం తమ పోరాటం ఆగదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మండల అధ్యక్షులు తప్పెట శంకర్ రాములు బర్మా రామచంద్రన్ మిట్టపల్లి గణేష్ బిక్షపతి ప్రధాన కార్యదర్శి గ్యదరీ మదు, యువజన పట్టణ అధ్యక్షుడు ఖయాజుద్దీన్ బైరి సాయి రాకేష్ ఎండి నవాజ్ నరసవ్వ రజిని అనిల్ తదితరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

పట్టణాలలో క్రయ విక్రయాలకు..మరో కొత్త జిఓ ఎంఎస్ 84తో రెగ్యులరైజ్…

పట్టణాలలో క్రయ విక్రయాలకు..మరో కొత్త జిఓ ఎంఎస్ 84తో రెగ్యులరైజ్…

సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది

సిద్ధిపేట జిల్లాలో నోటరీ ద్వారా పట్టణాలలో క్రయ విక్రయాలు కొన్న స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి జిఓ ఎంఎస్ 84 ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి స్టాంపు డ్యూటీ చెల్లించకుండానే కేవలం నోటరీ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కొన్న స్థలా క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని 125 చదరపు గజాలు అంతలోపు ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు స్టాంప్ డ్యూటీ పెనాల్టీ చెల్లించసిన అవసరం లేదని, 125 చదరపు గజాలకు పైన 3000 చదరపు గజాల లోపు ఉన్న స్థలానికి మార్కెట్ వాల్యూ ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని, జీవో ఎంఎస్ 84 ప్రకారం దరఖాస్తు చేసుకునేవారు..

దరఖాస్తుకు ఉండవలసిన పత్రాలు.

  1. నోటరీ చేసిన డాక్యుమెంట్స్
  2. లింక్ డాక్యుమెంట్స్
  3. ప్రాపర్టీ టాక్స్ రసీదు
  4. ఎలక్ట్రిసిటీ బిల్ రషీద్
  5. వాటర్ బిల్ రషీద్
  6. ఇతర ఏమైనా రసీదులు ఉంటే వాటితో ఈ ఆగస్టు నుండి నవంబర్ 2023 లోపు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు..

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.

-అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న పోకిరీలు. ఆట కట్టిస్తున్న పోలీసులు..

-జగిత్యాల పట్టణంలో 8ద్విచక్ర వాహనాలు, ఒక కారును సీజ్ చేసిన పోలీసులు..

జగిత్యాల యదార్థవాది ప్రతినిది

అర్ధరాత్రి ప్రధాన కూడళ్లలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకొన్న జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నటేష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారే లక్ష్యంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ పేరుతో జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో పోలీసులు ముమ్మర త‌నిఖీలు నిర్వహించామని, రాత్రివేళల్లో జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బంది లకు గురిచేస్తూన్న, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్ తో, హారన్లు కొడుతూ, ప్రధాన కూడళ్ల లలో వాహనాలను నిలిపి గుంపులుగా, అనుమానస్పదంగా ఉన్న 20 మంది యువకులను అదుపులోకి తీసుకొని 8ద్విచక్ర వాహనాలు, 1 కారును సీజ్ చేశాం అన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకనుండి జిల్లాలో తరచుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందని అర్ధరాత్రి ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా సంచరిస్తూ సామాన్య ప్రజానీకానికి మరి ముఖ్యంగా మహిళల ను ఇబ్బందుల కు, అభద్రత భావానికి గురి చేస్తే టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని యువత చట్టవ్యతిరేకమైన పనుల్లో పాల్గొంటే వారి యొక్క మంచి భవిష్యత్ ను కోల్పోతారని ఇప్పటికైనా మంచి మార్గాల్లో నడవాలని యువతకు సూచించారు.

ఆడపిల్ల బరువు కాదు .. ఆడపిల్ల బహుమానం ..!

ఆడపిల్ల బరువు కాదు .. ఆడపిల్ల బహుమానం ..!

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

చేగుంట మండల కేంద్రానికి చెందిన బండి సంధ్య- నరసింహులు ల దంపతులకు ఆడబిడ్డ జన్మనివడం
తెలుసుకున్న కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కత్తి కార్తిక వారిని కలిసి ఇంద్రమ్మ తో బుట్టు కార్యక్రమంలో కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆడబిడ్డకు బేబీ కిట్, బేబీ డ్రెస్, 5000/- రూపాయల పోస్టల్ పిక్సుడ్ డిపాజిట్ బాండ్ అందజేశారు.. కార్యక్రమంలో కాశబోయిన శ్రీనివాస్, చాకలి నాగరాజు రాములు కుమ్మరి రవీందర్ M.D. ఖుర్షీద్ ఖాన్, భీమగారి కిషన్, సిద్దిపేట జిల్లా కిషన్ సెల్ కార్యదర్శి టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నల్ శ్రీనివాసరావు, సత్తు అశోక్ రెడ్డి, స్వామీ, ఐరేని సాయితేజ గౌడ్, ఎల్లం, అప్సర, బర్ఖత్ ఖాన్, ఫరూక్, షారుక్, ఇలియాజ్, అదిల్ తదితరులు పాల్గొన్నారు.

సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది: ఎమ్మెల్యే సతీష్ బాబు

సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది: ఎమ్మెల్యే సతీష్ బాబు

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిది

కోహెడ మండలానికి 108 అంబులెన్స్ వాహనాన్ని అడిగినా వెంటనే అంబులెన్స్ వాహనాన్ని మంజూరు చేసిన మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్.. బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ప్రారంబించి మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం మంత్రి కోహెడకు వచ్చిన సందర్భంగా 108 అంబులెన్స్ వాహనాన్ని మండలానికి మంజూరు చేయాలని కోరామని నేడు అంబులెన్స్ కల నేడు సహకారమైందని తెలిపారు. మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో అంబులెన్స్ సేవలు అందుతాయని సామాన్య ప్రజల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో లేనటువంటి పథకాలను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని ఉచిత మందుల పంపిణీ, డయాగ్నస్టిక్ సేవలు, వివిధ పరీక్షల కోసం ల్యాబ్ లు, డాక్టర్లు సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారని, గత ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటేనే నేను రాను బిడ్డో సర్ కారు దావకానకు అంటూ వనికి పోయే జనం నేడు స్వరాష్ట్రంలో నేను సర్కారు దావకానకే వెళ్తా అనే విధంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగిందని ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వారికి ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోహెడ గ్రామపంచాయతీకి మంజూరైన 23 రకాల క్రీడా వస్తువులను స్థానిక సర్పంచ్ పేర్యాల నవ్యకు అందిస్తూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఈ క్రీడా వస్తువులు ప్రభుత్వం నుండి అందించబడతాయని తెలిపారు. యువ క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నామని క్రీడా వస్తువుల ఉపయోగించుకుని వివిధ రకాల క్రీడల్లో రాణించాలని యువతకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కోహెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి,డిజిటల్ విద్యాబోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల లను డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్ డైనింగ్ కిచెన్ రూమ్,టాయిలెట్స్,ప్రహరీ గోడలు కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తూ, ఇంగ్లీష్ మీడియంలో చదివే ఒక విద్యార్థికి రూ.1,50,000 ఖర్చు చేస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ బడులలో చదివేవారు చాలా తక్కువ అని నేడు దానికి భిన్నంగా ప్రతి పాఠశాలలో పూర్తిస్థాయి విద్యార్థులతో కలకల్లాడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి,ఎంపీపీ కొక్కుల కీర్తి,సర్పంచ్ పేర్యాల నవ్య,ప్యాక్స్ చైర్మన్ దేవేందర్ రావు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దళితబందా దళారుల బందా.!

దళితబందా దళారుల బందా.!

-జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అద్యక్షులు విజయ్..

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

ముఖ్యమంత్రి కేసిఆర్ గొప్పగా చెప్పుకుంటున్న దళిత బందు పథకం నిజమైన నిరుపేద ప్రజలకు కాకుండా
బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, దళారుల కేనా అని సిద్ధిపేట జిల్లా కాంగ్రేస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండపాక విజయ్ కుమార్ అన్నారు.. బుదవారం దుబ్బాక పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దుబ్బాక నియోజక వర్గంలోని 5 మండలాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందచేసి, ఆయన మాట్లాడుతూ పార్టిల కు అతీతంగా దళితులు అందరికి న్యాయం జరిగేలా చూడాలని లేని పక్షంలో జిల్లాలోని అన్ని దళిత కుటుంబాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని, అందరూ కష్టపడి పనిచేయాలని, కేంద్రంలో రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకోసం దళితులు పాత్ర క్రియాశీలకంగా ఉండబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన మండల అధ్యక్షులతో పాటు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, గాంధారి నరేందర్, మంద శ్రీనివాస్, బాస మదు, అనిల్, దుర్గయ్య, రామిరెడ్డి, కర్నంపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి…

మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి…

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనత అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 18, 19, 03 వ వార్డులలో ఇంటింటికి రెండు పూల మొక్కలను పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలే ప్రాణానికి జీవనాధారమని మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, స్వప్న రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ అధికారి నగేష్ వార్డు సభ్యులు బిఅర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహిళలు స్వయం ఉపాధి పొందాలి.

మహిళలు స్వయం ఉపాధి పొందాలి.

-దుబ్బాకలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం.

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

స్వశక్తితో మహిళలు ఎదగాలని దుబ్బాక నియోజకవర్గ కేంద్రమైన 13వ వార్డులో ఉచిత కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంబించిన ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి..ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మహిళా స్వయం ఉపాధి పొంది స్వశక్తి తో ఎదిగేలా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని గత రెండు మూడు సంవత్సరాల నుండి చేస్తున్నామని, నియోజకవర్గంలోని రాయపోల్ మండల కేంద్రంలో ప్రారంభించి 300 మందికి, మిరుదొడ్డిలో 50 మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేశామని, ప్రతి ఒక్క మహిళా ఈ శిక్షణ పొంది ఉపాధిని ఏర్పారుచుకోవాలని సూచించారు. 2006 నుండే ఈ ప్రజాహిత పౌండేషన్ సంస్థను స్థాపించి స్పోర్ట్స్, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాలు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అస సులోచన స్వామి, ఆర్గనైజేషన్ రజిత, ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ చారి, నరసింహారెడ్డి, స్వామి ప్రశాంత్ స్వామి, నవీన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...